
కరోనా మరోసారి పంజా విసిరిన నేపథ్యంలో ఆస్పత్రుల్లో రోగులకు చేయూత నివ్వడానికి నేనున్నానంటూ నటుడు విజయ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. విరుదాచలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల కోసం ఆక్సిజన్ సిలిండర్లు వైద్యులకు, ఆస్పత్రిలో పని చేసే కార్మికులకు అవసరమైన మాస్కులను సాయంగా అందించారు. విజయ్ ఆదేశాలతో ఆయన కార్యదర్శి బుస్సీ ఎన్.ఆనంద్ సలహా మేరకు కడలూరు జిల్లా నిర్వాహకుడు శీను, కడలూరు పశ్చిమ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అబ్బాస్ మంగళవారం సేవల్లో నిమగ్నమయ్యారు. కార్యక్రమంలో కడలూరు తూర్పు జిల్లా విభాగం అధ్యక్షుడు రాజ్‌కుమార్, పశ్చిమ జిల్లా కార్యదర్శి రాజేష్, విరుదాచలం నగర అధ్యక్షుడు వాసు, జిల్లా నిర్వాహకుడు శక్తివేల్, నటుడు విజయ్ ప్రజా సంఘానికి చెందిన వారు పాల్గొన్నారు.
వీఓ రూ. 2 కోట్లు..
కరోనా పరిస్థితుల నేపథ్యంలో రోగులకు తమ వంతుసాయం అందించేందుకు వీఓ ఇండియా ముందుకు వచ్చింది. రూ. 2 కోట్ల విరాళాన్ని ఆ సంస్థ డైరెక్టర్ నిపున్ మరియ బుధవారం ప్రకటించారు. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సాయం ప్రకటంచడమే కాకుండా, 9 లక్షల మాస్క్‌లు, 15 వేల పీపీఈ కిట్లు, 50 వేల లీటర్ల శానిటైజర్లను పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment