
సాక్షి, హైదరాబాద్: అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలెండర్లను బ్లాక్ మార్కెట్ చేస్తూ దోచుకుంటున్న ముఠాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ముషీరాబాద్‌లోని ఇందిరానగర్ లోని బాబా ట్రేడర్స్ పై దాడులు జరిపారు. లైసెన్స్‌లు లేకుండా ఆక్సిజన్ సిలెండర్లు అమ్మకాలు చేస్తున్న షేక్ అక్బర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, 38 ఆక్సిజన్ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. కరోనా సోకిన వ్యక్తులు, క్వారంటైన్‌లో ఉన్నవారికి కొన్ని ముఠాలు అక్రమంగా అధిక ధరలకు ఆక్సిజన్ అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం వెస్ట్‌జోన్‌లో 43 సిలెండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ రూ.లక్ష!!)
Comments
Please login to add a commentAdd a comment