Black Market
-
శ్రీవారి లడ్డూలు గుటకాయ స్వాహా!
భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూలు పక్కదారి పడుతున్నాయి. ఇంటిదొంగల నిర్వాకంతో బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతున్నాయి. వారం వారం తిరుమల నుంచి వచ్చే ఈ లడ్డూ ప్రసాదాల్లో కొన్నింటినే సామాన్య భక్తులకు విక్రయించి సింహభాగం స్వాహా చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ శ్రీవారి లడ్డూల్లో కల్తీ జరిగిందంటూ తెగ గుండెలు బాదుకున్న ముఖ్యనేతలు, ఉన్నతాధికారులు ఇప్పుడీ చేతివాటం గురించి తెలీదనుకోవాలా? తెలిసీ తెలియనట్లు నటిస్తున్నారనుకోవాలా? నిఘా విభాగం కూడా ఏమీ పట్టనట్లు ఉంటోంది. లోగుట్టు శ్రీవారికే ఎరుక. తమిళనాడు రాజధాని చెన్నై టి.నగర్ సమాచార కేంద్రంగా సాగుతున్న ఈ దందాపై ‘సాక్షి’ నిఘాలో పలు విషయాలు తెలిశాయి. ఇవిగో ఆ వివరాలు..తిరుమల: శ్రీవారి ప్రసాదాలను సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకెళ్లాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంకల్పించింది. ఇందులో భాగంగా.. తిరుమల శ్రీవారి లడ్డూ పోటు నుంచి నేరుగా చెన్నై, బెంగళూరు సమాచార కేంద్రాలు.. విజయవాడ, విశాఖపట్నంలోని టీటీడీ కళ్యాణ మండపాలు.. హైదరాబాద్‌లోని టీటీడీ ఆలయాలకు వీటిని తరలించి భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. ఎంతో సత్సంకల్పంతో శ్రీకారం చుట్టిన ఈ విధానానికి కొందరు ఇంటిదొంగలు శ్రీవారి ప్రసాదాన్ని పక్కదారి పట్టిస్తూ తూట్లుపొడుస్తున్నారు. చెన్నై నడివీధుల్లో బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. చిన్నలడ్డూలు 2, ఒక పెద్ద లడ్డూ, ఒక వడ కలిపి ప్రత్యేక ప్యాకింగ్ చేసి రూ.1,500కు అమ్మేసుకుంటున్నారు.చెన్నైలో బ్లాక్మార్కెట్లోకి..తిరుమలలో ఉన్న పోటు ఏఈఓ ఏ సెంటర్‌కు ఎన్ని లడ్డూలు పంపించాలన్న ఇండెంట్, డిమాండ్ ఆధారంగా వాటిని పంపిస్తారు. చెన్నై, బెంగళూరు సమాచార కేంద్రాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్నందున చెన్నై కేంద్రానికి ప్రతీవారం 8 వేల నుంచి 10 వేల చిన్న లడ్డూలు, 300 పెద్ద లడ్డూలు, 300 వడలు పంపిస్తున్నారు. కానీ, చెన్నై టి.నగర్‌లోని టీటీడీ సమాచార కేంద్రంలో లడ్డూ ప్రసాదాలు విక్రయాలు జరిగే దగ్గరే పెద్దఎత్తున లడ్డూలు పక్కదారి పడుతున్నాయి. ఇక్కడ పదేళ్లుగా చెన్నైలో తిష్టవేసిన ఇద్దరు అసిస్టెంట్ షరాబులు ‘శ్రీనివాసుడి’ ప్రసాదాలను సామాన్య భక్తులకు అందకుండా సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తిరుమల నుంచి టీటీడీ వాహనంలో వచ్చిన స్టాక్‌ను ఇక్కడి సిబ్బంది శ్రవణం హాల్లో దించి అటునుంచి అటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో లడ్డూలను ట్రేల నుంచి బాక్స్‌లకు మార్చి ఓ ప్రైవేట్ వాహనంలో తరలించేస్తున్నారు. వచ్చిన లడ్డూల్లో కొన్నింటిని మాత్రమే విక్రయించి.. ఆ తర్వాత చిన్న లడ్డూల స్టాక్ అయిపోయిందంటూ ‘నో స్టాక్’ బోర్డు పెట్టేస్తున్నారు. 300 పెద్ద లడ్డూలు, 300 వడలు ఏనాడూ సామాన్య భక్తులకు విక్రయించిన దాఖలాల్లేవు. నిఘా వైఫల్యం..తిరుమలలో ఒక లడ్డూ ప్రసాదం అధిక ధరకు విక్రయిస్తే తీవ్రంగా పరిగణించే విజిలెన్స్ అధికారులు.. ఇక్కడ వేలకు వేలు లడ్డూలు ప్రైవేట్ వాహనంలో పక్కదారి పడుతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంలో కంచే చేను మేస్తోందా అనే సందేహాలూ తలెత్తుతున్నాయి. చెన్నై టి.నగర్ సమాచార కేంద్రం నుంచి ప్రైవేట్ వాహనాల్లో స్టాక్ తరలిపోతుంటే సెక్యూరిటీ విభాగం ఏం చేస్తోందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. లోపలికి వచ్చే ప్రతి వాహనాన్ని భద్రతా సిబ్బంది రికార్డుల్లో ఎంట్రీ చేయాలి. కానీ, అలాంటిదేమీ జరుగుతున్న దాఖలాలు కనిపించట్లేదు. వాళ్లకు ఎలాంటి సంబంధం లేదంట?ఇదిలా ఉంటే.. చెన్నైలో జరుగుతున్న ఈ అవకతవకలపై తమకెలాంటి సంబంధంలేదని సంబంధిత అధికారులు అంటున్నారు. కేవలం స్టాక్ పంపించడం వరకే తమ బాధ్యత అని చేతులెత్తేస్తున్నారు. తిరుమల నుంచి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షణలో టీటీడీ వాహనంలోనే ప్రసాదాలను పంపిస్తామని స్పష్టంచేస్తున్నారు. శ్రీవారి లడ్డూ విక్రయాలకు లెక్కా పత్రం లేదు..ఇక చెన్నైలో లడ్డూ ప్రసాదాల విక్రయాలకు లెక్కాపత్రం లేదు. సీసీ కెమెరాల నిఘా అంతకన్నాలేదు. అక్రమార్కుల ఆగడాలు చెల్లుబాటయ్యేలా సమాచార కేంద్రంలో ఉన్న శ్రవణం హాల్‌ను కేంద్రంగా చేసుకుని ఇష్టారాజ్యంగా బయటకు తరలించేస్తున్నట్లు ‘సాక్షి’ నిఘాలో బట్టబయలైంది. నిజానికి.. లడ్డూ ప్రసాదం విక్రయం సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగాలి. తిరుమలలో ఇస్తున్నట్లుగా ఆధార్ కార్డు ప్రామాణికంగా భక్తులకు రెండు లడ్డూలే ఇవ్వాలి. కానీ, ఇక్కడ అలాంటివేమీ జరుగుతున్నట్లు లేదు. సామాన్య భక్తులకు లడ్డూ ప్రసాదాలు అందకుండా ఏఈవో, అసిస్టెంట్ షరాబులు పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదేళ్లుగా ఇక్కడ తిష్టవేసిన సిబ్బందిపై లోతుగా విచారణ జరపాల్సి ఉంది. లడ్డూ ప్రసాదాలు విక్రయించే కౌంటర్ నుంచి కాకుండా.. శ్రవణం హాల్ నుంచి విక్రయాలు చేస్తుండడంపై కూడా దృష్టిపెట్టాలని భక్తులు కోరుతున్నారు. -
భగ్గుమంటున్న డీఏపీ!
సాక్షి, హైదరాబాద్: రైతులు పొలాల్లో వాడే డీఏపీ ఎరువు ధర భారీగా పెరిగింది. ఒక్కో బస్తాపై ఏకంగా రూ.300 పెరిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 50 కిలోల బస్తా డీఏపీ ధర రూ.1,350 ఉండగా.. రూ.1,650కు పెంచడం గమనార్హం. అయితే ఈ పెంపు పాత స్టాక్‌కు వర్తించదని మార్క్‌ఫెడ్ అధికా రులు చెప్తున్నా.. వ్యాపారులు మాత్రం పాత స్టాకు కు కూడా కొత్త ధర వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం దుక్కిలో వేసేందుకు డీఏపీ, యూరియా అవసరమని... ఇలాంటి తరుణంలో మార్కెట్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. మరోవైపు నానో డీఏపీ, నానో యూరియాతీసుకోవాలంటూ వ్యాపారులు ఒత్తిడి చేస్తున్నారని చెప్తున్నారు. నానో యూరియా బాటిల్ ధర రూ.252 ఉంటే.. దానికి కూడా రూ.300 వరకు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు ఇలా ధర పెంచి అమ్ముతున్నా మార్క్ఫెడ్గానీ, వ్యవసాయశాఖగానీ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. రాష్ట్రంలో డీఏపీ కొరత... యాసంగి సీజన్ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. రైతులు ఓవైపు వానాకాలం సీజన్ పంటలను మార్కెట్లో అమ్ముకుంటూ.. మరోవైపు రెండో పంటకు సిద్ధమవుతున్నారు. యాసంగి సీజన్ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 63.54 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 3.14 లక్షల ఎకరాల్లో సాగు మొదలైంది. ఇందులో ఆహార ధాన్యాలు 1.57 లక్షల ఎకరాల్లో, నూనె గింజలు 1.32 లక్షల ఎకరాల్లో వేశారు. చాలా మంది రైతులు పంటలు వేసేందుకు పొలాల్లో దుక్కులు దున్నుతున్నారు. ఈ సమయంలో డీఏపీ, ఇతర ఎరువులు వేస్తారు. దీనితో ఎరువులకు డిమాండ్ నెలకొంది. మరోవైపు రాష్ట్రంలో డీఏపీ నిల్వలు కేవలం 4 వేల టన్నులే ఉన్నాయని మార్క్‌ఫెడ్ అధికారులు చెప్తున్నారు. యాసంగి సీజన్‌కు 20వేల టన్నుల నుంచి 30వేల టన్నుల వరకు డీఏపీ అవసరమని.. వచ్చే వారం దాదాపు 9 వేల టన్నుల స్టాక్ రాష్ట్రానికి రానుందని మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్లాక్ చేసి అధిక ధరకు అమ్ముకుంటున్న వ్యాపారులు అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా దేశంలోకి డీఏపీ దిగుమతులు తగ్గాయని.. రాష్ట్రంతోపాటు పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనూ డీఏపీ కొరత ఉందని వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి. అయితే హరియాణా వంటి రాష్ట్రాల్లో రైతులు డీఏపీ కొరతపై ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారు. మన వద్ద కూడా సకాలంలో డీఏపీ అందుబాటులోకి రాకపోతే రైతులు ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. దీన్ని ఆసరాగా తీసుకుని దళారులు, కొందరు వ్యాపారులు డీఏపీని బ్లాక్ మార్కెట్‌కు తరలించి, అడ్డగోలు ధరలకు విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అమ్మేసుకుని చెప్పక.. కేంద్రం నుంచి స్టాక్ రాక.. రాష్ట్రంలో ఎరువులు పుష్కలంగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ రికార్డులు చెప్తుండగా... వాస్తవానికి క్షేత్రస్థాయిలో నిల్వలు లేవని సమాచారం. కంపెనీల నుంచి ఆయా ప్రాంతాలకు సరఫరా అయిన ఎరువులను ఎప్పుడో అమ్మేశారని... కానీ ఈ సమాచారాన్ని రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో కేంద్రం కొత్త కేటాయింపులు జరపడం లేదని తెలిసింది. దీనితో ఎరువుల కొరత ఏర్పడింది. ఇదే అదనుగా ఎరువుల కొరతను కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉన్న కొద్దిపాటి నిల్వలను బ్లాక్ మార్కెట్‌కు తరలించేసి, ఎక్కువ ధరకు అమ్ముతున్నారని రైతులు పేర్కొంటున్నారు. పాత స్టాక్‌కు పాత ధరే చెల్లించాలి.. డీఏపీ ధర బస్తాకు రూ.300 పెరిగి.. రూ.1,650 అయింది. అయితే పాత స్టాక్‌కు ఈ పెరిగిన ధర వర్తించదు. పాత ధరకే అమ్మాలి. కొత్త స్టాక్‌ను మాత్రమే పెరిగిన ధరకు అమ్మాలి. రైతులు దీనిని గమనించి వ్యాపారులకు సొమ్ము చెల్లించాలి. – శ్రీనివాసరెడ్డి, ఎండీ, మార్క్‌ఫెడ్ -
దళారులెవరు బాబూ.. తమ్ముళ్లేగా?
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే స్టాక్ యార్డుల్లో భద్రపరిచిన లక్షల టన్నుల ఇసుక నిల్వలను కరిగించేసి నాలుగు నెలల పాటు నిర్మాణ రంగాన్ని స్తంభింప చేసిన కూటమి సర్కారు తన నిర్వాకాలను కప్పిపుచ్చుకునేందుకే దళారులు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే నాటకానికి తెర తీసినట్లు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వర్షాకాలంలో అవసరాల కోసం వైఎస్సార్సీపీ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన విషయం తెలిసిందే. కూటమి సర్కారు రావడమే ఆలస్యం పచ్చ ముఠాలు సగం నిల్వలను అమ్ముకుని సొమ్ము చేసుకోగా, మిగతా ఇసుకను సైతం ఒక్క రేణువు కూడా మిగల్చకుండా ఆరగించేశాయి. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా తవ్వేసి అందినకాడికి దండుకోవడంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. 40 లక్షల మంది ఆధారపడ్డ నిర్మాణ రంగం కుదేలవడంతో భవన నిర్మాణ కార్మికులు జోవనోపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. ఈ ఇసుక దోపిడీని ప్రతిపక్షం ఎక్కడికక్కడ ఎండగట్టడం, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో చేసిన తప్పులను కప్పి పుచ్చి మభ్యపెట్టే యత్నాల్లో భాగంగానే బ్లాక్ మార్కెట్ నాటకానికి కూటమి సర్కారు తెర తీసినట్లు సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఉచిత ఇసుక పేరుతో జనం జేబులను గుల్ల చేసి గుమ్మడి కాయ దొంగలా జేబులు తడుముకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. -
నల్లబజారులో యథేచ్ఛగా
సాక్షి, అమరావతి: ఇసుకను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని, నిజంగా అవసరమైన వారికి దొరకడం లేదని, ధర బాగా ఎక్కువగా ఉందని అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. రీచ్‌ల నుంచి ఇసుక తీసుకున్నవారు తిరిగి అధిక ధరకు విక్రయిస్తుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందని తెలిపారు. రోజు, వారం కోటాల లెక్కన ఇసుక బుకింగ్ జరుగుతుండటంతో అత్యవసరంగా కావాల్సినవారికి బుకింగ్ అవకాశాలు లభించడం లేదని పేర్కొన్నారు. పరిమిత బుకింగ్‌తో ఇసుక అవసరమైన వారికి లభ్యత ఉండటం లేదని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇసుక పరిస్థితిపై అధికారులు ప్రభుత్వానికి రెండురోజుల కిందట నివేదిక సమర్పించారు. ఇసుక తీసుకున్నవారు తిరిగి విక్రయించడం, బ్లాక్ మార్కెట్‌తో ధర చాలా ఎక్కువగా ఉంటోందని తెలిపారు. ఇసుక వినియోగదారులు సొంత వాహనాల్లో తీసుకెళ్లి తిరిగి అత్యధిక ధరకు విక్రయిస్తుండటంపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు పేర్కొన్నారు. రవాణా చార్జీలతో పాటు బ్లాక్ మార్కెటింగ్, తిరిగి ఇసుకను విక్రయిస్తుండటంతో వినియోగదారులు గతంలో కన్నా ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. పేరుకు ఉచిత ఇసుక విధానమేగానీ వినియోగదారులు మాత్రం అత్యధిక ధర చెల్లించాల్సి వస్తోందని, ఇది వినియోగదారుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోందని వివరించారు. లోడింగ్, రవాణా చార్జీలనే వసూలు చేస్తున్నామని చెబుతున్నా గతంలో కన్నా ఇసుక ధర ఎక్కువగా ఉందని వినియోగదారులు చెబుతున్నారని తెలిపారు. రీచ్‌లు, స్టాక్ పాయింట్లు లేని ఏడు జిల్లాల్లో రవాణా చార్జీలతో ఇసుక ధర తడిసిమోపెడవుతోందని, ఇది ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి, ఆగ్రహానికి దారితీస్తోందని వివరించారు. రీచ్‌లు, స్టాక్ పాయింట్లు లేని విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ప్రకాశం, నంద్యాల, తిరుపతి జిల్లాలవారు ఇసుక కోసం పొరుగు జిల్లాలపై అధారపడాల్సి రావడంతో రవాణా చార్జీలు భరించలేని స్థితిలో ఉన్నాయని తెలిపారు. ఈ జిల్లాల్లో వచ్చే మార్చి వరకు 40 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ ఏడు జిల్లాల్లో ఇసుక సరఫరా, స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అధికారబలంతో ఇష్టారాజ్యం అధికారుల నివేదికనుబట్టి చూస్తే కూటమి నేతలు అధికార బలంతో ఇష్టారాజ్యంగా ఇసుక దోపిడీకి పాల్పడి, బ్లాక్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది. ఇసుక రీచ్‌ల నుంచి తీసుకువెళ్లి మళ్లీ ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోకుండా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. పేరుకు ఉచిత ఇసుక విధానం అని చెప్పి అధికార పార్టీ నేతల జేబులు నింపడమే లక్ష్యంగా రీచ్‌ల నిర్వహణ, విక్రయాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కూటమి ఎమ్మెల్యేలు, వారి అనుచరులు ఉచిత ఇసుక పేరుతో వినియోగదారుల జేబులకు భారీగా కన్నం వేస్తూ తమ జేబులు నింపుకొంటున్నట్లు అధికారుల నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. ఇంత ప్రభుత్వ యంత్రాంగం ఉన్నా ఇసుక బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారంటే.. ప్రభుత్వ పెద్దల అండతోనే జరుగుతున్నట్లు ఎవరికైనా అర్థం అవుతుంది. -
వచ్చిందే సగం ‘బ్లాక్’తో ఆగం!
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్ : వానాకాలం ముంచుకొస్తోంది. ఈసారి మంచి వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ ప్రకటనతో.. రైతులు పెద్ద ఎత్తున సాగుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పత్తి విత్తనాల కోసం భారీగా డిమాండ్ నెలకొంది. కానీ బ్రాండెడ్ పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయాయి. రైతులు కోరుకునే విత్తనాలను వ్యాపారులు ‘బ్లాక్’ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కాలం చెల్లిన, సాధారణ విత్తనాలను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో మంచి విత్తనాల కోసం రైతులు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. మరోవైపు అనుమతి లేని విత్తనాలను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి అమ్ముతున్నట్టూ ఆరోపణలు ఉన్నాయి. అధిక దిగుబడి వస్తుందనే ప్రచారంతో.. శాస్త్రీయంగా అన్నిరకాల విత్తనాలు దాదాపు ఒకే రకమైన పంట, దిగుబడిని ఇస్తాయని నిపుణులు చెప్తున్నారు. కానీ వ్యాపారులు వ్యూహాత్మకంగా కొన్ని రకాలే మంచి దిగుబడులు ఇస్తాయని అపోహలు సృష్టిస్తూ దండుకుంటున్నారు. ప్రస్తుతం కంపెనీ ఏదైనా సరే.. బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్ (475 గ్రాములు) ధర రూ.864గా నిర్ణయించారు. 30కిపైగా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న 200 రకాల విత్తనాలను ఇదే ధరపై విక్రయించాలి.కానీ మార్కెట్లో ఒక నాలుగైదు రకాలు అధిక దిగుబడులు ఇస్తాయనే ప్రచారం ఉంది. వ్యాపారులు అలాంటి వాటిని బ్లాక్ చేస్తూ రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల ఒక్కో ప్యాకెట్ విత్తనాలకు రూ.2 వేల నుంచి రూ. 2,500 వరకు వసూలు చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. నిషేధిత విత్తనాలు అంటగడుతూ.. కొందరు వ్యాపారులు, దళారులు నిషేధిత బీటీ–3 విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. బీటీ–2 కంటే తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని.. కలుపును తట్టుకుంటాయని చెప్తున్నారు. పత్తి చేన్లలో కలుపు నివారణ కోసం కూలీలు సకాలంలో దొరక్క ఇబ్బందిపడుతున్న రైతులు ఈ ప్రచారానికి ఆకర్షితులవుతున్నారు. ఇలా డిమాండ్ సృష్టిస్తున్న వ్యాపారులు బీటీ–2 విత్తనాల కంటే బీటీ–3 విత్తనాలను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు.మహారాష్ట్రలోని ఔరంగాబాద్, జాల్నా ప్రాంతాలతోపాటు గుజరాత్‌లోని వివిధ పట్టణాల నుంచి ఈ బీటీ–3 విత్తనాలు రాష్ట్రంలోకి వస్తున్నాయి. నకిలీలు, నిషేధిత విత్తనాలను నియంత్రించడం, బ్లాక్ మార్కెటింగ్‌ను అడ్డుకోవడం వంటి చర్యలు చేపట్టాల్సిన అధికారులు.. కొందరు దళారులు, వ్యాపారులతో కుమ్మక్కై చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తూతూమంత్రంగా దాడులు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటివరకు సగం వరకు సరఫరా.. నైరుతి రుతుపవనాలతో కురిసే తొలకరి వానలతోనే రైతులు పత్తి విత్తనాలు చల్లుతారు. ఈసారి రాష్ట్రంలో 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేశారు. అందుకోసం 1.26 కోట్ల విత్తన ప్యాకెట్లు సిద్ధం చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు 68.16 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయశాఖ వెల్లడించిన వివరాలే ఇవి. దీనిపై రైతులు, వ్యవసాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.‘‘ఇప్పటివరకు మొత్తం విత్తనాలను ఎందుకు జిల్లాలకు సరఫరా చేయలేదు? కొరతే లేదని చెప్తున్నప్పుడు రైతులు ఎందుకు క్యూలైన్లలో ఎందుకు ఉండాల్సి వస్తోంది? ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో అధికారులే చెప్పాలి. రైతులు కోరుకునే కంపెనీల విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడమే ఇందుకు ప్రధాన కారణం..’’ అని వారు పేర్కొంటున్నారు. మరోవైపు ఇతర కంపెనీల విత్తనాలు కూడా కొనుగోలు చేసుకోవాలని అధికారులు చెప్తున్నారని.. మరి వారు దిగుబడికి గ్యారంటీ ఇవ్వగలరా అని రైతులు ప్రశి్నస్తున్నారు. ఇంకా సేకరణలోనే యంత్రాంగం.. రాష్ట్రంలో నిర్ణయించుకున్న లక్ష్యంలో సగం వరకే పత్తి విత్తనాలు సరఫరా అయ్యాయి. సీజన్ కూడా మొదలైపోతోంది. కానీ అధికారులు ఇంకా విత్తనాలను సేకరించే పనిలోనే ఉన్నారు. కంపెనీలతో ఇప్పటికీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక రకం బ్రాండ్ విత్తనాలకు డిమాండ్ ఉందని తెలిసి.. ఇప్పుడు తమిళనాడు నుంచి ఆ రకం విత్తనాలు తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. ఉన్నతాధికారుల సమన్వయ లోపంతో.. వ్యవసాయ శాఖలోని ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోందని.. దిగువ స్థాయికి ఆదేశాలివ్వడంలో సరిగా వ్యవహరించలేక పోతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎరువుల దుకాణాలను రోజూ పరిశీలించాలని వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో)ను ఒక ఉన్నతాధికారి ఆదేశిస్తుంటే.. మరో ఉన్నతాధికారి మాత్రం అలా చేయొద్దని, తాను చెప్పినట్టుగా రైతుల వద్దకు వెళ్లి వారికి సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్తున్నట్టు తెలిసింది. ఇలాగైతే ఏఈవోలు ఎవరి మాట వినాలి, ఏం చేయాలన్న ప్రశ్నలు వస్తున్నాయి. పత్తి విత్తనాల సరఫరా విషయంలోనూ ఈ ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లేకపోవడం సమస్యగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇదీ పరిస్థితి.. ⇒ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏటా వానాకాలంలో 14 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తారు. అందులో వరి తర్వాత పత్తిసాగు రెండో స్థానంలో ఉంటుంది. దీంతో వ్యాపారులు ఇక్కడ రైతులకు కాలం చెల్లిన విత్తనాలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీటీ–3 విత్తనాలను కూడా విక్రయిస్తున్నారు. ⇒ సంగారెడ్డి జిల్లాలో ఆద్య రకం పత్తి విత్తనాలకు అధిక డిమాండ్ ఉంది. రైతుల డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని విత్తన డీలర్లు అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ విత్తన ప్యాకెట్‌ను రూ.1,800 వరకు విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో సంగారెడ్డి జిల్లాలో 3.60 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని.. ఇందుకోసం 7.20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేశారు. ఈ నెల 29వ తేదీ వరకు అందుబాటులోకి వచి్చన విత్తన ప్యాకెట్లు 3.76 లక్షలు మాత్రమే. తమకు అవసరమైన రకం లేకపోవడంతో రైతులు ఇతర విత్తనాలు కొనడం లేదు. ⇒ యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలా చోట్ల బ్రాండెడ్ పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలాయి. వ్యాపారులు లైసెన్స్ లేకుండా లూజ్ విత్తనాలు అమ్ముతున్నారు. ఈ జిల్లాలో 1.35 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని.. 2.70 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 1.45 లక్షల ప్యాకెట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అందులోనూ తమకు అవసరమైన రకాలు, కంపెనీల విత్తనాలను అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు. ⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1.10లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని, 2.20 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా. కానీ ఇప్పటివరకు 1.20 లక్షల ప్యాకెట్లు మాత్రమే జిల్లాకు వచ్చాయి. ⇒ నల్లగొండ జిల్లాలో 5.40 లక్షల ఎకరాలకుపైగా పత్తి సాగవుతుందని అంచనా వేశారు. 15 లక్షలకుపైగా విత్తన ప్యాకెట్లు అవసరమంటూ వ్యాపారులు ఇండెంట్లు పెట్టారు. అందులో ఇప్పటివరకు 4 లక్షల ప్యాకెట్లు విత్తన దుకాణాల్లో అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అందులో రైతులు కోరుకునే రకాలు, బ్రాండ్లు మాత్రం కనిపించడం లేదు. ⇒ ఖమ్మం జిల్లాలో 2 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. 4.50 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని అంచనా వేసింది. అయితే రైతులు కోరుకుంటున్న విత్తనాలు మాత్రం కనిపించడం లేదు. ఇక్కడి రైతులు యూఎస్ 7067 రకం విత్తనాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రకం విత్తనాలు గత ఏడాది మంచి దిగుబడులు ఇచ్చాయని అంటున్నారు. కానీ దుకాణాల్లో ఆ రకం విత్తనాలు దొరకడం లేదు. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈసారి 5.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందని వ్యవసాయాధికారుల అంచనా. ఇందుకోసం 11.34 లక్షలకుపైగా విత్తన ప్యాకెట్లు కావాలి. ఇప్పటివరకు డీలర్లు, వ్యాపారులకు చేరినది 8 లక్షల ప్యాకెట్లు మాత్రమే. చాలా చోట్ల రైతులకు అవసరమున్న రకాల విత్తనాలు అందుబాటులో ఉండటం లేదు. ఉన్నా ఒక్కో ప్యాకెట్‌ను రూ.864కు బదులుగా రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. యూఎస్ 7067 రకం లేవంటున్నారు యూఎస్ 7067 రకం పత్తి విత్తనాలు వేస్తే దిగుబడి బాగా వస్తుంది. ఈ కాయల నుంచి పత్తి తీయడం సులువు. గులాబీ రంగు పురుగు ఉధృతి ఉండదు. ఎకరాకు కనీసం 10 క్వింటాళ్లపైన దిగుబడి వస్తుంది. తక్కువ సమయంలో దిగుబడి వస్తుంది. దీన్ని తీసేశాక రెండో పంటగా మొక్కజొన్న వేసుకోవచ్చు. కానీ మార్కెట్లో ఈ రకం విత్తనాలు లేవంటున్నారు. – నునావత్ కిషోర్, రైతు, పీజీ తండా, దుగ్గొండి మండలం, వరంగల్ జిల్లా పోయినేడు దిగుబడి బాగా వచి్చంది.. మళ్లీ అదే వేస్తం నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. గత ఏడాది రాశి 659 రకం పత్తి విత్తనాలు సాగు చేస్తే.. ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి వచి్చంది. అందుకే ఆ రకం విత్తనాలు వచ్చే వరకు వేచి చూసిన. స్టేషన్‌ఘన్‌పూర్ ఎరువుల దుకాణంలో ఒక్కో ప్యాకెట్ రూ.864 చొప్పున 4 ప్యాకెట్లు కొన్నా. దిగుబడి ఎక్కువ రావడంతో పాటు చీడపీడల నుంచి తట్టుకునే శక్తి ఈ విత్తనాలకు ఉంది. – కత్తుల కొమురయ్య, రైతు, ఇప్పగూడెం, స్టేషన్‌ఘన్‌పూర్ మండలం, జనగాం జిల్లా -
విత్తనాలను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే పీడీయాక్ట్
సాక్షి, హైదరాబాద్: విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించి, కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై పీడీ చట్టం కింద కేసులను నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో వానాకాలం పంటలకు విత్తనాల సరఫరా, జూన్ 2వ తేదీన జరిపే రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో ఆమె గురువారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీఏడీ, వ్యవసాయ శాఖల కార్యదర్శి రఘునందన్‌రావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీఎస్ మాట్లాడుతూ వానాకాలానికి సంబంధించి గత సంవత్సరం కన్నా అధిక మొత్తంలో వివిధ రకాల పంట విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విత్తనాల విషయంలో ఆందోళన చెందవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అధిక డిమాండ్ ఉన్న పత్తి, సోయా, మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలు సరిపడా ఉన్నాయని వివరించారు. వీటితోపాటు జీలుగ విత్తనాలు కూడా కావాల్సినంతగా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. విత్తన వ్యాపారుల గోదాములు, దుకాణాలను తనికీ చేయించాలని కలెక్టర్లను ఆదేశించారు. దీనితోపాటు, గోదాములు, విత్తన విక్రయ కేంద్రాలవద్ద పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను నియమించాలని సూచించారు. రైతులతో సమావేశమై, సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వారిలో విశ్వాసం కల్పించాలన్నారు. ఇతర రాష్ట్రాలనుంచి రైతులు వచ్చి ఇక్కడి విత్తనాలు కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్లతో పతాకావిష్కరణతెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ రెండవ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో కలెక్టర్లు జాతీయ జెండాను ఆవిష్కరించాలని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. రాష్ట్ర అవతరణ కోసం అమరులైన వారికి నివాళులు అర్పించిన అనంతరం కలెక్టర్లు జాతీయ పతాకావిష్కరణ చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులను, ఇతర ప్రముఖులను, జిల్లా అధికారులను ఆహ్వానించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమంలో అమర వీరులైన వారి కుటుంబ సభ్యులకు, ఉద్యమ కారులకు జిల్లా కలెక్టర్ల ద్వారా ఆహ్వానం పంపుతున్నట్లు తెలిపారు. -
పప్పు.. నిప్పు!
సాక్షి, హైదరాబాద్: వంట నూనెల ధరలు తగ్గు ముఖం పట్టాయని సంతోషిస్తున్న సగటు జీవిపై ఇప్పుడు పప్పుల భారం భారీగా పడుతోంది. 20 రోజుల క్రితం వరకు రిటైల్ మార్కెట్లో కిలో రూ. 120 ఉన్న కందిపప్పు ధర ఇప్పుడు ఏకంగా రూ. 140 నుంచి రూ. 150కి పెరిగింది. అలాగే మినపగుండ్ల ధర రూ. 130కి చేరగా, మినపపప్పు మరింత పెరిగింది. ఎర్రపప్పు (మసూర్ దాల్) కూడా కిలో రూ. 70 నుంచి ఏకంగా రూ. 100కుపైగా పలుకుతోంది. వేరుశనగ (పల్లీలు) ధర కూడా రూ. 90 నుంచి రూ. 130కి ఎగబాకింది. కేవలం పెసరపప్పు ధరలో మాత్రమే పెద్దగా తేడా కనిపించట్లేదు. ఇక సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ షాపింగ్‌ల ద్వారా ప్యాకేజ్డ్ కందిపప్పు ధర అర కిలోకే రూ. 90 నుంచి రూ. 95 పలుకుతోంది. అంటే అటుఇటుగా కిలో రూ. 200గా ఉంటోంది. అలాగే ఆర్గానిక్ పేరుతో ప్యాక్ చేసిన కందిపప్పు ధర రూ. 250 వరకు అమ్ముడవుతోంది. ఈ కేటగిరీలో మినపపప్పు ధర కిలో రూ. 150పైగా ఉండగా ఎర్రపప్పు రూ. 120గా ఉంది. వేరుశనగ నూనెను కిలోకు రూ. 180పైగా విక్రయిస్తున్నారు. నెల వ్యవధిలోనే పప్పుధాన్యాల, పల్లీల ధరలు పెరిగిపోవడంతో వంటింట పప్పులు ఉడకని పరిస్థితి నెలకొంది. దిగుబడి తగ్గడం, డిమాండ్ పెరగడం వల్లే.. దేశంలో ఏటా సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలను వినియోగిస్తారని అంచనా. గతేడాది దేశవ్యాప్తంగా 43.4 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాల దిగుబడి రాగా మరో 15 లక్షల మెట్రిక్ టన్నుల మేర విదేశాల నుంచి కేంద్రం దిగుమతి చేసుకుంది. కానీ ఈ ఏడాది దేశంలో దిగుబడి 38.9 లక్షల మెట్రిక్ టన్నులుగానే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాతా వరణ పరిస్థితుల్లో మార్పులు, వర్షాలకుతోడు పప్పుధాన్యాలు, వేరుశనగతో పోలిస్తే తక్కువ శ్రమతో చేతికందే ఇతర పంటల సాగు వైపు రైతు లు మొగ్గుచూపడం వల్లే దిగుబడులు గణనీయంగా తగ్గినట్లు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలోనితాండూరు, జహీరాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోనూ గతేడాది పప్పుధాన్యాల దిగుబడి తగ్గినట్లు చెబుతున్నాయి. స్టాక్.. బ్లాక్ మార్కెట్‌కు? పెరిగిన పప్పుల ధరల నేపథ్యంలో హైదరాబాద్‌లోని బేగంబజార్ వంటి ప్రధాన మార్కెట్లలో కందిపప్పు నిల్వ లేదంటూ అప్పుడే ‘నో స్టాక్’బోర్డులు దర్శనస్తున్నాయి. కందిపప్పునకు ఉన్న డిమాండ్ దృష్ట్యా బడా వ్యాపారులు దాన్ని బ్లాక్ మార్కెట్లోకి తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల్లోనూ ప్రధాన మార్కెట్లలో కందిపప్పు బ్లాక్ మార్కెట్‌కు తరలే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల త్వరలోనే కందిపప్పు ధర రిటైల్ మార్కెట్లో రూ. 180 నుంచి రూ. 200 వరకు చేరొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
మెడికల్ పీజీ ‘బ్లాక్’ దందా!
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యలో స్పెషలైజేషన్ చేసే పీజీ సీట్లకు ‘బ్లాక్’ దందా నడుస్తోంది. ప్రైవే టు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు కోట్లకు కోట్లు దండుకోవడానికి అక్రమ మార్గం పట్టాయి. ‘నీట్’లో మంచి ర్యాంకు వచ్చిన ఇతర రాష్ట్రాల విద్యార్థులతో ఇక్కడ దరఖాస్తు చేయించడం.. వారికి మేనేజ్మెంట్ కోటా సీటు అలాట్ అయ్యాక దానిని వదులుకుని వెళ్లిపోతున్నట్టు చెప్పించడం.. తర్వాత ఎన్నారై కోటా కింద ఆ సీటును అడ్డగోలు ‘రేటు’కు అమ్ముకుని భారీగా వెనకేసుకోవడం పరిపాటిగా మారింది. దీనివల్ల మంచి ర్యాంకు వచ్చినా స్థానికంగా సీటు దొరక్క రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విద్యార్థుల ఒత్తిడితో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. లొసుగును వాడుకుని.. మెడికల్ కాలేజీల్లో దందాలకు చెక్ పెట్టేందుకు దేశంలో ‘నీట్’ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పి స్తున్నారు. అయినా నిబంధనల్లో ఉన్న లొసుగులను వాడు కుని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మెడికల్ పీజీ సీట్లను అమ్ముకుంటున్నాయి. ఇందుకోసం పక్కా ప్లాన్‌తో వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ‘నీట్’ పరీక్ష వల్ల దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర విద్యార్థులైనా మేనేజ్మెంట్ సీట్లకు పోటీపడొచ్చు. ఈ క్రమంలో రాష్ట్రంలోని మేనేజ్మెంట్ సీట్ల కోసం తెలంగాణతోపాటు, ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా దరఖాస్తు చేశారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నీట్ ర్యాంకుల ఆధారంగా మెరిట్ జాబితాలను విడుదల చేసింది. అయితే ప్రైవేటు కాలేజీలు కొందరు విద్యార్థుల తోడ్పాటుతో ఉద్దేశపూర్వకంగా సీట్లను బ్లాక్ చేస్తున్నట్టుగా కాళోజీ వర్సిటీ గుర్తించింది. ఇప్పటివరకు జరిగిన మూడు దశల కౌన్సెలింగ్‌లో 40 మంది దరఖాస్తులు అనుమానాస్పదంగా ఉన్నట్టు తేల్చింది. ఈ 40 మందీ మంచి ర్యాంకులు సాధించినవారే. వారికి సొంత రాష్ట్రాల్లోనే సీటు పొందే అవకాశం ఉన్నా.. మన రాష్ట్రంలో, అదీ యాజమాన్య కోటాలో దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. వర్సిటీ దీనిపై వివరణ కోరుతూ వారందరికీ లేఖ రాసింది. అందులో కొందరు తదుపరి దశల కౌన్సెలింగ్ తప్పుకోగా, ఏడుగురు విద్యార్థులైతే మేనేజ్మెంట్ కోటా కింద దరఖాస్తే చేసుకోలేదని వర్సిటీకి తెలిపారు. ఈ వ్యవహారంలో అక్రమాలున్నట్టు గుర్తించిన కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్.. లోతుగా దర్యాప్తు చేయాల్సిందిగా వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషికి సోమవారం ఫిర్యాదు చేశారు. సీట్ల భర్తీ ఇలా.. ప్రైవేట్ కాలేజీల్లోని మొత్తం పీజీ సీట్లలో సగం కన్వీనర్ కోటాలో ప్రభుత్వమే నేరుగా భర్తీ చేస్తుంది. వాటికి అతితక్కువ ఫీజు ఉంటుంది. మిగతా సగం మేనేజ్మెంట్ కోటా సీట్లలో తిరిగి మూడు (1, 2, 3) కేటగిరీలు ఉంటాయి. ఇందులో కేటగిరీ–1 సీట్లు సగం (మొత్తం సీట్లలో 25శాతం) ఉంటాయి. వార్షిక ఫీజు రూ.24 లక్షలు ఉండే ఈ సీట్లను కూడా ప్రభుత్వ కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. ఇక కేటగిరీ–2 సీట్లు 30శాతం (మొత్తం సీట్లలో 15శాతం), కేటగిరీ–3 సీట్లు 20శాతం (మొత్తం సీట్లలో 10శాతం) ఉంటాయి. కేటగిరీ–2 సీట్లలో ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్ విద్యార్థులకు.. కేటగిరీ–3 సీట్లను మెడికల్ కాలేజీల యాజమాన్యాలు తమకు ఇష్టమొచ్చినవారికి కేటాయించుకోవచ్చు. ఈ రెండింటికీ అధికారికంగా రూ.72 లక్షలు ఫీజు ఉన్నా.. రూ.రెండు కోట్ల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం.. కేటగిరీ–1 సీట్లలో చేరిన ఏ విద్యార్థి అయినా తమ అడ్మిషన్‌ను వదులుకుంటే, కాలేజీలు ఆ సీటును కేటగిరీ–2 (ఎన్నారై కోటా) కింద భర్తీ చేసుకోవచ్చు. అంతమేర భారీగా ఫీజులు వసూలు చేసుకోవచ్చు. దీనినే ప్రైవేటు మెడికల్ కాలేజీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం రాష్ట్రంలో మెడికల్ పీజీ సీటు వచ్చేందుకు సరిపడా మెరిట్ ఉన్నా.. ఇతర రాష్ట్రాల ర్యాంకర్లు రావడంతో మనవాళ్లకు సీట్లు దక్కడం లేదు. ఇతర రాష్ట్రాలవారు వచ్చి వదిలేసి వెళ్లిపోతుండటం.. ఆ సీట్లను మేనేజ్మెంట్లు అమ్మేసుకుంటుండటంతో.. రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ దందాతో పలుకాలేజీలు రూ.100 కోట్ల దాకా అక్రమంగా వెనకేసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. కొందరు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు రాజకీయంగా పలుకుబడి కలిగినవారు కావడంతో అధికారులు కూడా నోరు మెదపడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. బ్లాక్ చేసేది ఎలాగంటే..? సాధారణంగా ఎక్కువ ర్యాంకు ఉన్నవారికి కౌన్సెలింగ్‌లో మొదట సీట్లు కేటాయిస్తారు. దీనితో టాప్ ర్యాంకులు వచ్చిన ఇతర రాష్ట్రాల విద్యార్థులకు మెడికల్ కాలేజీలు డబ్బులతో గాలం వేస్తున్నాయి. తమ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా (కేటగిరీ–1) సీటుకు దరఖాస్తు చేసుకుని, అలాట్మెంట్ అయ్యాక వదిలి వెళ్లిపోయేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. దీనివల్ల ఆ సీటు ఎన్నారై కోటా (కేటగిరీ–2) కిందికి మారుతుంది. దానిని కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నాయి. ► ఇక్కడ దరఖాస్తు చేయిస్తున్న ఇతర రాష్ట్రాల విద్యార్థుల్లో చాలా వరకు వారి రాష్ట్రాల్లోని మెడికల్ కోర్సుల్లో చేరినవారే ఉంటున్నారు. అయితే అక్కడి కాలేజీల యాజమాన్యాలతో కుమ్మక్కై ఒరిజినల్ సర్టిఫికెట్లు తెచ్చుకుని.. మన రాష్ట్రంలో దరఖాస్తు చేసుకుంటున్నారు. సీటు వచ్చాక క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో తమకు భారీగా లాభం వస్తుండటంతో మేనేజ్మెంట్లు వారికి ఐదారు లక్షలదాకా ముట్టజెపుతున్నట్టు సమాచారం. ► ఎవరైనా విద్యార్థి అడ్మిషన్ అయ్యాక సీటును వదులుకుంటే.. హెల్త్ వర్సిటీకి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ సొమ్మును కూడా కాలేజీల యాజమాన్యాలే వారి పేరిట కట్టేస్తున్నట్టు తెలిసింది. ► మన రాష్ట్రంలోని కొందరు టాప్ ర్యాంకర్లలో కొందరు ఇప్పటికే జాతీయ స్థాయి కాలేజీల్లో చేరినా.. ఇక్కడ మేనేజ్మెంట్ కోటా సీట్లకు దరఖాస్తులు చేసినట్టు తెలిసింది. ఇదంతా కేవలం పీజీ సీటును బ్లాక్ చేసే ఎత్తుగడలో భాగమేనని తెలుస్తోంది. -
వంటనూనెల అక్రమ నిల్వలపై విజిలెన్స్ దాడులు
-
వంటింటికి ఊరట.. రైతు బజార్లలో వంటనూనె విక్రయాలు
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ పరిణామాల కారణంగా బహిరంగ మార్కెట్లో వంట నూనెల ధరలు మండిపోతుండటంతో ఆ సెగ నుంచి ప్రజలకు ఊరట కల్పిస్తూ రైతు బజార్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విక్రయాలు చేపట్టింది. కాగుతున్న నూనెల ధరలను నియంత్రించేందుకు కృత్రిమ కొరత సృష్టించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు ప్రత్యేక బృందాల ద్వారా హోల్‌సేల్, రిటైల్ షాపుల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. సీఎస్ సమీర్‌శర్మ ఆదేశాల మేరకు మార్కెటింగ్ కార్యదర్శి వై.మధుసూదన్‌రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిత్యం మార్కెట్లో వంట నూనెల ధరలను సమీక్షిస్తోంది. మరోవైపు ధరలను అందుబాటులో ఉంచేందుకు ఏపీ ఆయిల్‌ఫెడ్‌ను ప్రభుత్వం రంగంలోకి దించింది. రైతుబజార్లలో నాణ్యమైన విజయ వంట నూనెలను విక్రయిస్తున్నారు. గతంలోనూ ఉల్లి ధరలు, టమాటాల రేట్లు భారీగా పెరిగిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతు బజార్ల ద్వారా అందుబాటు ధరల్లో విక్రయాలు చేపట్టి వినియోగదారులకు ఊరట కల్పించడం తెలిసిందే. అది మరింత ‘ప్రియ’ం ఉక్రెయిన్–రష్యా యుద్ధం ప్రభావం పలు రకాల ఉత్పత్తులతోపాటు వంట నూనెలపైనా పడింది. 40 రోజుల క్రితం లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.170–175, పామాయిల్ రూ.158–160, వేరుశనగ నూనె రూ.170–173, రైస్ బ్రాన్ ఆయిల్ రూ.170– 172 ఉన్నాయి. మార్కెట్లో డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎమ్మార్పీ ధరలపై ప్రముఖ సూపర్ మార్కెట్లలో ఐదు నుంచి పది శాతం డిస్కౌంట్‌తో విక్రయాలు నిర్వహిస్తుంటారు. మార్చి మొదటి వారంలో ప్రముఖ ఆయిల్ కంపెనీలు ప్రకటించిన ఎమ్మార్పీ ధరలను పరిశీలిస్తే పామాయిల్‌తో సహా నూనెలన్నీ లీటర్ రూ.200 పైనే పలుకుతున్నాయి. మిగిలిన కంపెనీల ధరలతో పోలిస్తే ప్రియా నూనె ధరలు తారస్థాయిలో ఉన్నాయి. రైతు బజార్లలో ‘విజయ’ నూనెలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వంట నూనెలను అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఏపీ ఆయిల్ ఫెడ్ రంగంలోకి దిగింది. రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విజయ నూనెలను విక్రయిస్తున్నారు. సరఫరాలో ఎక్కడా ఆటంకం లేకుండా విజయ డిస్ట్రిబ్యూటర్లను సమీప రైతుబజార్లతో అనుసంధానించారు. ధరల్లో వ్యత్యాసాన్ని తెలియచేస్తూ ప్రత్యేకంగా బోర్డులను ప్రదర్శిస్తున్నారు. ధర తక్కువ.. నాణ్యమైన నూనె ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.200 నుంచి రూ.265 వరకు పలుకుతున్న పామాయిల్, సన్‌ఫ్లవర్, వేరు శనగ, రైస్‌బ్రాన్ నూనెలను రైతు బజార్లలో రూ.163 నుంచి రూ.178కే అందుబాటులో ఉంచారు. ఎలాంటి కోటా లేకుండా విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు 61 ప్రధాన రైతుబజార్లలో విక్రయాలను ప్రారంభించారు. వీటిలో 27 చోట్ల విజయ ఆయిల్ అవుట్‌లెట్స్ ఉండగా మిగిలిన చోట్ల రైతుబజార్లలోని ఇతర దుకాణాల ద్వారా విక్రయిస్తు న్నారు. లీటర్ పామాయిల్ రూ.163, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.178, వేరుశనగ, రైస్‌బ్రాన్ నూనెలు రూ.170 చొప్పున విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ఆయిల్ ఫెడ్ వద్ద సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే మరిన్ని నిల్వలు సేకరించైనా ప్రజలకు వంటనూనెలు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు. మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు లభ్యం కావడంతోపాటు నాణ్యత బాగుందని వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో వంటనూనెలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతుబజార్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి వంట నూనెలు విక్రయిస్తున్నాం. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే లీటర్ రూ.37 నుంచి రూ.87 తక్కువ ధరకే విజయ నూనెలను అందుబాటులో ఉంచాం. ధరలు అదుపులోకి వచ్చేవరకు విక్రయాలు కొనసాగుతాయి. –చవల బాబూరావు, ఎండీ, ఏపీ ఆయిల్ ఫెడ్ ఇతర కంపెనీలను ప్రోత్సహిస్తే చర్యలు మార్కెట్లో ధరలను నియంత్రించేందుకు రైతు బజార్ల ద్వారా వంట నూనెల విక్రయాలను ప్రారంభించాం. ధరల్లో వ్యత్యాసం తెలియచేసేలా రైతుబజార్లలో బోర్డులు ప్రదర్శిస్తున్నాం. విజయ నూనెలను కాకుండా అధిక ధరలు కలిగిన ఇతర కంపెనీల నూనెల విక్రయాలను ప్రోత్సహిస్తే చర్యలు తీసుకుంటాం. – బి.శ్రీనివాసరావు, సీఈవో, రైతు బజార్లు నాణ్యత బాగుంది.. రోజురోజుకు పెరుగుతున్న వంట నూనెల ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతుబజార్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే విజయ నూనె విక్రయాలు చేపట్టటాన్ని స్వాగతిస్తున్నాం. భవానీపురం రైతు బజార్లో లీటర్ రూ.170 చొప్పున రెండు వేరుశనగ నూనె ప్యాకెట్లు కొనుగోలు చేశా. నాణ్యత చాలా బాగుంది. –వి.వెంకటలక్ష్మి, భవానీపురం, విజయవాడ ఎంతో ఊరట.. మార్కెట్లో నూనె ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రైతు బజార్లలో తక్కువ ధరకే అందుబాటులో ఉంచడం ఎంతో ఊరటనిస్తోంది. ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు. భవానీపురం రైతు బజార్లో ఆయిల్ చాలా బాగుంది. ఉల్లి, టమాటా ధరలు పెరిగిన ప్పుడు కూడా ఇదే రీతిలో రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించారు. –వన్నంరెడ్డి సురేష్, రామలింగేశ్వరనగర్, విజయవాడ -
ఎరువుల బ్లాక్ మార్కెట్ గురించి మా దృష్టికి రాలేదు : జగదీష్ రెడ్డి
-
బ్లాక్ మార్కెట్లోకి ఆంఫోటెరిసిన్-బి ఇంజక్షన్లు
-
యాంటీ వైరల్, ఫంగల్ డ్రగ్స్: ‘దొరికిన’వన్నీ డీఎంహెచ్‌ఓలకే!
సాక్షి, సిటీబ్యూరో: అసరమైన స్థాయిలో ఉత్పత్తి జరగట్లేదు... కేంద్రం ఇస్తున్న కోటా చాలట్లేదు... రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది... ఫలితంగా అనేక రకాలైన యాంటీ వైరల్, ఫంగల్ డ్రగ్స్‌కు భారీ డిమాండ్ వచ్చింది. దీన్ని సొమ్ము చేసుకోవడానికి అనేక మంది “బ్లాక్ దందాలు’ చేస్తున్నారు. వీరిపై నిఘా వేసి ఉంచుతున్న పోలీసులు పలువురిని అరెస్టు చేసి భారీగా ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకుంటున్నారు. వీటిని డీఎంహెచ్ఓల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి తీవ్రంగా ఉండటంతోపాటు ఇటీవల కాలంలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా యాంటీ వైరల్, ఫంగల్ డ్రగ్స్‌తో కూడిన ఇంజెక్షన్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ పెరిగింది. ఓపక్క ఇవి అవసరమైన వారిలో దాదాపు 90 శాతం మంది బ్లాక్‌లో పది నుంచి వంద రెట్లు ఎక్కువ ధరకు ఖరీదు చేస్తున్నారు. ఈ ఔషధాలను బ్లాక్ మార్కెట్ చేసే వాళ్లు మాత్రం వివిధ మార్గాల్లో తేలిగ్గా సమీకరించుకుంటున్నారు. ఇలాంటి దందా చేసే వారిపై ఇటు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, అటు సైబరాబాద్, రాచకొండకు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ (ఎస్వోటీ) నిఘా వేసి ఉంచుతున్నాయి. ఓ వైపు పక్కా సమాచారం, మరో వైపు డెకాయ్ ఆపరేషన్లు ద్వారా ఈ దందాలు చేసే వాళ్లను పట్టుకుంటున్నారు. రాజధానిలోని మూడు కమిషనరేట్లలో కలిపి సెకండ్ వేవ్ మొదలైన తర్వాత ఓ మహిళ సహా మొత్తం 86 మందిని పోలీసులు పట్టుకున్నారు. కీలక నిర్ణయం వీరి నుంచి 274 వరకు యాంటీ వైరల్, ఫంగల్ ఔషధాలతో కూడిన ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా ఏదైనా నేరానికి సంబంధించి పోలీసులు నిందితుల్ని అరెస్టు చేసినప్పుడు వారి నుంచి సొత్తు లేదా వస్తువులు స్వాధీనం చేసుకుంటారు. నిబంధన ప్రకారం వీటిని సీజ్ చేసినట్లు పంచనామా రాసి రిమాండ్ రిపోర్టుతో సహా కోర్టుకు అప్పగిస్తారు. అయితే ఈ యాంటీ వైరల్, ఫంగల్ ఇంజెక్షన్ల విషయంలో మాత్రం పోలీసు విభాగం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయ శాఖ నుంచి అనుమతి తీసుకున్న అధికారులు ఇలా స్వాధీనం చేసుకున్న ఇంజెక్షన్లు ప్రభుత్వ ఆసుపత్రులకు చేరేలా కృషి చేస్తున్నారు. బ్లాక్ దందా చేస్తూ చిక్కిన నిందితులతో పాటు ఇంజెక్షన్లను టాస్క్‌ఫోర్స్, ఎస్వోటీలు స్థానిక పోలీసుస్టేషన్లకు అప్పగిస్తున్నారు. అప్పటి ఆ ఇంజెక్షన్లు పాడు కాకుండా ఫ్రిజ్‌లలో ఉంచి కాపాడుతున్నారు. పోలీసుస్టేషన్లో ఈ సీజ్ చేసి ఇంజెక్షన్లను ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ఆ తర్వాత సదరు యాంటీ వైరల్, ఫంగల్ డ్రగ్స్‌ను స్థానికి డీఎంహెచ్ఓలకు అందించి రసీదు తీసుకుంటున్నారు. ఈ రసీదు, ఫొటోలు, వీడియోలు న్యాయమూర్తులకు అందిస్తున్నారు. ఆపై వీటిని జత చేస్తూ కోర్టుల్లో నిందితులపై అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. డీఎంహెచ్ఓలు ఈ ఇంజెక్షన్లను కోటా ప్రకారం ఆయా ప్రభుత్వ ఆసుపత్రులకు పంపి, అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు చేరుస్తున్నారు. దీనికి ముందు ఆ ఇంజెక్షన్ స్థితిగతులు, ఏ దశలో అయినా పాడైందా? తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ ఇంజెక్షన్లు నల్లబజారులోకి తరలకుండా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని, అదే సమయంలో పట్టుబడిన వాటిలో కనీసం ఒక్కటి కూడా వృథా కాకుండా జాగ్రత్త పడుతున్నామని ఓ అధికారి తెలిపారు. స్వీధీనం చేసుకున్న వెంటనే వాటిని ఫ్రిజ్‌లలో అవసరమైన ఉష్టోగ్రతలో భద్రపరుస్తున్నామని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఇంజెక్షన్లను డీఎంహెచ్ఓలకు అందించే వరకు భద్రపరచడానికి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఫ్రిజ్‌లను సమకూర్చుకున్నారు. వీటి బ్లాక్ మార్కెట్ దందాను కనిపెట్టడానికి సోషల్ మీడియా పైనా పోలీసులు నిఘా ఉంచారు. అలాంటి విక్రేతలపై సమాచారం ఉంటే తమకు తెలపాలని కోరుతున్నారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు మందుల్లేవ్... సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ మహమ్మారిని జయించి బ్లాక్ ఫంగస్ బారిన పడిన రోగుల ప్రాణాలతో పలు కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు చెలగాటమాడుతున్నాయి. పైసలకు కక్కుర్తిపడి అడ్మిట్ చేసుకుని, సర్జరీలు చేస్తున్నాయి. ఆ తర్వాత చికిత్సకు అవ సరమైన లైపోజోమల్ ఆంపోటెరిసిన్–బీ ఇంజక్షన్లు లేవని చెప్పి బయటికి పంపుతున్నాయి. విధిలేని పరిస్థితుల్లో వారంతా చివరకు కోఠి ఈఎన్టీ, గాంధీ ఆçసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. నిజానికి చేర్చుకుని చికిత్సలు చేసిన ఆస్పత్రులే ఆయా రోగులకు అవసరమైన మందులను కూడా సమకూర్చాల్సి ఉంది. కేవలం సర్జరీలు చేసి, ఆ తర్వాత మీ చావు మీరు చావండంటూ పట్టించుకోకుండా వదిలేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో వీరంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి దరఖాస్తు చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 700 మందికిపైగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. నిత్యం 50 మందికిపైగా... ఈఎన్టీ అవుట్ పేషంట్ విభాగానికి రోజుకు సగటున 250 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు వస్తున్నారు. వీరిలో 50–60 మందికి ఇన్పేషెంట్లుగా అడ్మిషన్ అవసరమవుతుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో 240 మంది ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. వీరిలో 25 మందికి సర్జరీ చేశారు. మరో 50 నుంచి 60 మంది వరకు అడ్మిషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో 102 మంది కోవిడ్ పాజిటివ్ బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. -
కొనసాగుతున్న రెమ్‌డెసివర్ ఇంజక్షన్ల బ్లాక్‌మార్కెట్ దందా
సాక్షి, హైదరాబాద్: కరోనా బాధితులకు ఉపయోగిస్తున్న రెమ్‌డెసివర్ ఇంజక్ష బ్లాక్‌మార్కెట్ దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా రెమ్‌డెసివర్‌ను బ్లాక్మార్కెట్లో విక్రయిస్తున్న వ్యక్తిని శనివారం టాస్క్‌ఫోర్స్ అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. అనిల్ కుమార్ అనే వ్యక్తి ఉప్పల్ నర్సింగ్‌హోమ్‌లో హెచ్ఆర్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రెమ్‌డెసివర్‌కు మార్కెట్లో కొరత ఉండడంతో బ్లాక్‌లో అమ్ముకుంటే డబ్బులు బాగా సంపాదించొచ్చని అనిల్ భావించాడు. ఒక్కో ఇంజక్షన్‌ను రూ.25 వేలకు కస్టమర్లకు విక్రయిస్తున్నాడు. అయితే సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ అనిల్‌ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి నాలుగు రెమ్‌డెసివర్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. -
Black Fungus: రూ.314 ఇంజెక్షన్ రూ.50 వేలకు!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు కోవిడ్ చికిత్సలో కీలకంగా వాడే రెమిడెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించిన కేటుగాళ్లు తాజాగా బ్లాక్ ఫంగస్ చికిత్సకు వాడే ఔషధాలను కూడా అదే బాట పట్టిస్తున్నారు. అయితే ఈ దందా వెనుక ఏకంగా వైద్యులు కూడా ఉండటం జోరుగా సాగుతున్న బ్లాక్ మార్కెట్ పరిస్థితికి అద్దం పడుతోంది. ముఠా సమాచారాన్ని అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఐదుగురు నిందితుల్ని వలపన్ని పట్టుకుని అరెస్టు చేశారు. ఆ ముఠా నుంచి ఐదు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలను ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు మీడియాకు వెల్లడించారు. ఇటీవల బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో దీనికి వాడే ఇంజెక్షన్లకూ డిమాండ్ వచ్చింది. దీన్ని గమనించిన లంగర్‌హౌస్‌కు చెందిన డాక్టర్ బి.రామచరణ్, మలక్‌పేటకు చెందిన డాక్టర్ గాలి సాయినాథ్, గాజులరామారం ప్రాంతానికి చెందిన బి.సురేశ్, బాలానగర్ వాసి కె.శ్రీకాంత్, కూకట్‌పల్లికి చెందిన జి.సాయి వర్ధన్‌గౌడ్ ఓ ముఠాగా ఏర్పడి నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుడిగా పని చేస్తున్న చిల్లగొల్ల రవితేజ చౌదరి ద్వారా ఆంపోటెరిసీన్ బీ ఇంజెక్షన్లను అక్రమంగా సమీకరించారు. ఒక్కో ఇంజెక్షన్ ధర రూ. 314 ఉండగా దీన్ని రూ.50 వేలకు అమ్మేందుకు ప్రయత్నించారు. దీనిపై ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావుకు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎస్సైలు కె.శ్రీకాంత్, బి.పరమేశ్వర్ తమ బృందాలతో బుధవారం లంగర్‌హౌస్ ప్రాంతంలో వలపన్ని మొత్తం ఐదుగురిని పట్టుకుని అరెస్టు చేశారు. మరో వైద్యుడు రవితేజ పరారీలో ఉన్నారు. కాగా, వీరిలో ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. -
బ్యాంకులో ఉద్యోగం .. మరి ఇదేం కక్కుర్తి బాబు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి అయిన అతగాడు తండ్రి మెడికల్ షాపును అడ్డాగా చేసుకుని రెమిడెసివిర్ (రెడీఎక్స్‌ఎల్) ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లో విక్రయించడం మొదలెట్టాడు. ఒక్కో దాన్ని రూ.35 వేలకు అమ్ముతున్న ఇతడి వ్యవహారంపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు నాలుగు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు శుక్రవారం వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని పాన్ బజార్‌కు చెందిన ఆకుల మేహుల్ కుమార్ హైటెక్ సిటీలోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో ఉద్యోగి. ఇతడి తండ్రి విజయ్‌కుమార్ పాన్ బజార్లో మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో యాంటీ వైరల్ డ్రగ్స్‌కు భారీ డిమాండ్ వచ్చింది. తన తండ్రి దుకాణంలో కూర్చున్న సమయంలో ఈ విషయం తెలుసుకున్న మేహుల్ వాటిని సమీకరించుకుని బ్లాక్ మార్కెట్లో విక్రయించాలని పథకం వేశాడు. దీన్ని అమలులో పెడుతూ వివిధ మార్గాల్లో రెమిడెసివిర్ సంబంధిత ఇంజక్షన్ అయిన రెడీఎక్స్‌ఎల్ సమీకరిస్తున్నాడు. వీటిని అవసరమున్నవారికి అధిక ధరలకు విక్రయిండం మొదలెట్టారు. గరిష్టంగా ఒక్కో ఇంజక్షన్‌ను రూ.35 వేలకు విక్రయిస్తున్నాడు. దీనిపై ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావుకు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన బృందం మేహుల్ ను పట్టుకుని నాలుగు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకుంది. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని మహంకాళి పోలీసులకు అప్పగించారు. కేపీహెచ్‌బీకాలనీ పరిధిలో.... రెమిడెసివిర్ ఇంజక్షన్‌ను అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం కేపీహెచ్‌బీ టెంపుల్ బస్టాప్ వద్ద గల ఓ మెడికల్ షాపు వద్ద రెమిడిసెవిర్ ఇంజక్షన్ కలిగి ఉన్న జోసఫ్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కరోనాతో బాధపడుతున్న ఓ వ్యక్తికి లక్ష రూపాయలకు నాలుగు ఇంజక్షన్లు విక్రయించాడు. మరో ఇంజక్షన్‌ను 25 వేలకు అమ్మకానికి పెట్టాడు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు జోసఫ్‌రెడ్డిని ఇంజక్షన్ విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. హయత్‌నగర్‌లో... రెమిడెసివిర్‌ను అధిక ధరకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. హయత్‌నగర్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేసే ల్యాబ్ అసిస్టెంట్ కొర్ర బాల్‌రాజు, భాషపంగు పరశురాములు, భాషపంగు రవీందర్‌లు పథకం ప్రకారం తమకు తెలిసిన మెడికల్ దుకాణాలు, డి్రస్టిబ్యూటర్ల ద్వారా కొనుగోలు చేసిన రెమిడెసివిర్ ఇంజక్షన్లను రూ.30 నుంచి 35 వేలకు అమ్మడం మొదలు పెట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆస్పత్రి సమీపంలో ఇంజక్షన్ అమ్మడానికి సిద్ధంగా ఉన్న బాల్రాజును అరెస్టు చేశారు. ( చదవండి: కరోనా డాక్టర్ల కాసుల దందా.. బ్లాక్ మార్కెట్లో రెమిడెసివర్ ) -
నకిలీలతో జాగ్రత్త.. మందులు కొనేముందు ‘6 పీ’ సరి చూసుకోండి
సాక్షి, సిటీబ్యూరో: సెకండ్ వేవ్‌లో కరోనా రోజు రోజుకూ పెరుగుతోందని కొత్వాల్ అంజనీకుమార్ అన్నారు. ఈ నేపథ్యంలోనే రెమిడెసివర్ వంటి ఔషధాలకు డిమాండ్ పెరగడంతో కొందరు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేరం చేస్తున్న 40 మందికి పైగా నిందితుల్ని ఇప్పటి వరకు అరెస్టు చేశామని తెలిపారు. ఈ చీకటి దందాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే తక్షణం పోలీసులకు తెలియజేయండని కోరారు. ఈ పరిస్థితుల్లో నకిలీ మందులు కూడా మార్కెట్లోకి వస్తాయన్నారు. వీటి నుంచి తప్పించుకోవడానికి అంతర్జాతీయంగా అమలులో ఉన్న ’6 పీ’ లను తెలుసుకోవాలి... వాటిని అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. అందులోని వీడియోలో ఆయన పేర్కొన్న అంశాలివి.. ‘ ’ ► పీ1: ప్లేస్... దీని ప్రకారం అపరిచిత వెబ్సైట్ల నుంచి మందుల్ని ఖరీదు చేయకూడదు.అధీకృత మెడికల్ షాపు, ఫార్మాసిస్టు నుంచే ఖరీదు చేయాలి. ► పీ2: ప్రిస్క్రిప్షన్...రిజిస్టర్డ్ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే మందులు కొనండి. ► పీ3: ప్రామిసెస్... కొందరు వైద్యులు, మందుల దుకాణం యజమానులు ఈ మందు చాలా పవర్ఫుల్ అంటూ హామీలు ఇచ్చేస్తుంటారు. ఆ మాయలో పడకుండా వాడాల్సిన మందుల్నే ఖరీదు చేయాలి. ► పీ4: ప్రైస్... ఆయా మందులపై ముద్రించిన ఎమ్మార్పీ మొత్తాన్నే చెల్లించాలి. అంతకు మించి ఎవరైనా డిమాండ్ చేస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి. ► పీ5: ప్రైవసీ... మీకు ఇంటర్నెట్లో ఏదైనా ఔషధం తదితరాలు ఖరీదు చేస్తుంటే ఎక్కడా మీ క్రెడిట్/డెబిట్ కార్డులకు సంబంధించిన రహస్య సమాచారం పొందుపర్చొద్దు. అది సైబర్ నేరాలకు దోహదం అవుతుంది. ► పీ6: ప్రొడక్ట్...ఏదైనా వస్తువును ఆన్లైన్లో ఖరీదు చేసే ముందు మీకు తెలిసిన వారిలో అప్పటికే దాన్ని ఖరీదు చేసిన వాళ్లు ఎవరైనా ఉంటే వారి సలహాలు, సూచనలు తీసుకోండి. Follow 6 Ps and be safe . Buy medicine at authorized place only. Your safety is most important for us. pic.twitter.com/AjcdezPjh1 — Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) April 28, 2021 ( చదవండి: స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఆక్సిజన్ సిలిండర్ల దందా ) -
స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఆక్సిజన్ సిలిండర్ల దందా
సాక్షి, సిటీబ్యూరో: స్వచ్ఛంద సంస్థ ముసుగులో సాగుతున్న ఆక్సిజన్ సిలిండర్ల దందాకు రాచకొండ ఎస్ఓటీ, మల్కాజిగిరి పోలీసులు చెక్ పెట్టారు. మంగళవారం ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. వీరి నుంచి వాహనం, ఆక్సిజన్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం వివరాలు.. కంచన్‌బాగ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆసిఫ్ మాస్ ఫౌండేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నాడు. కరోనా బాధితులుకు ఆక్సిజన్ సిలిండర్లు, అంబులెన్సు సేవలు ఉచితంగా అందిస్తామంటూ ప్రచారం చేసుకున్నాడు. ఉచితం అంటూ బ్లాక్మార్కెట్లో అమ్మకం ఈ ముసుగులో సల్మాన్ అనే వ్యక్తి నుంచి 150 లీటర్ల ఆక్సిజన్ సిలిండర్‌ను రూ.16 వేలకు ఖరీదు చేస్తున్నాడు. ఆపై నల్లబజారుకు తరలించి కరోనా పేషెంట్లకు రూ.25 వేలకు సరఫరా చేస్తున్నాడు. దీనిపై రాచకొండ ఎస్ఓటీ పోలీసులకు సోమవారం రాత్రి సమాచారం అందింది. ఆక్సిజన్ సిలిండర్లను అక్రమంగా తరలిస్తున్న వాహనం మౌలాలీ మీదుగా ఈసీఐఎల్ వైపు వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. మల్కాజిగిరి పోలీసుల సహకారంతో రాత్రి 10 గంటలకు జెడ్టీఎస్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. వీరికి మాస్ ఫౌండేషన్ అంటూ రాసి ఉన్న ఓమ్నీ వాహనం కనిపించింది. అనుమానంతో తనిఖీ చేయగా అందులో 150 లీటర్ల 5 ఆక్సిజన్ సిలిండర్లు బయటపడ్డాయి. వీటికి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు వాహనంలో లభించలేదు. ఓమిని వ్యాన్ డ్రైవర్ సయ్యద్ అబ్దుల్లాతో పాటు వాహనంలోని మహ్మద్ మజార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఫలితంగా ఆసిఫ్ చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని కూడా అరెస్టు చేసిన పోలీసులు ఆక్సిజన్ సిలిండర్లు, వాహనాన్ని, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యాంటీ వైరల్ డ్రగ్స్, ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఇతర అత్యవసర మందుల అక్రమ దందాలపై కన్నేసి ఉంచుతున్నామని అధికారులు పేర్కొన్నారు. ( చదవండి: కరోనా వ్యాక్సిన్ బ్లాక్ దందాకు చెక్: ముఠా అరెస్ట్ ) -
బ్లాక్‌లో రెమిడెసివర్ ఇంజక్షన్లు: ఏడుగురి అరెస్ట్
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ రోగులకు చికిత్సలో భాగంగా ఇచ్చే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు డిమాండ్ పెరగడంతో కొంతమంది అక్రమార్కులు ఇదే అదునుగా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విజయవాడలో రెమిడెసివర్‌ను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠాను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కాలం చెల్లిన ఇంజక్షన్లను విక్రయిస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2.10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఉత్పత్తికి ఊపిరి: రెండు ఆక్సిజన్ ప్లాంట్లకు జవసత్వాలు అంతా మా ఇష్టం: అక్కడ అన్నీ ‘వెలగపూడి’ ఫుడ్‌కోర్టులే.. -
మందుల మాఫియా: రెమిడెసివిర్ రూ.75 వేలు
ఆయన పేరు రమణ (పేరు మార్చాం). తన తల్లికి కరోనా రావడంతో ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉందని, రెమిడెసివిర్ ఇంజక్షన్ ఇస్తే కోలుకునే అవకాశముందని డాక్టర్లు చెప్పారు. ఇంజక్షన్ తెచ్చి ఇస్తే వేస్తామన్నారు. ఏం చేయాలో అర్థంగాక రమణ కొందరు దళారులను ఆశ్రయించాడు. వారు ఒక్కో రెమిడెసివిర్ ఇంజక్షన్‌ను రూ.75 వేల చొప్పున ఇచ్చారు. రమణ గత్యంతరం లేక అప్పుచేసి ఆరు ఇంజక్షన్లను రూ.4.5 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. ఆయన పేరు కృష్ణ (పేరు మార్చాం). వయసు 35 ఏళ్లు. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. తుసిలిజుమాబ్ ఇస్తే గట్టెక్కే సూచనలు ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. తమ వద్ద లేవని, బయట తెచ్చుకోవాలని చెప్పాయి. కృష్ణ కుటుంబ సభ్యులు ఆ ఔషధం కోసం అనేకచోట్ల ప్రయత్నించారు. ప్రభుత్వ వర్గాలను సంప్రదించినా ప్రయోజనం లేదు. చివరికి కోఠిలోని ఒక వైద్యారోగ్య శాఖ ఉద్యోగిని కలిశారు. అతడి నుంచి ఒక్కో తుసిలిజుమాబ్ ఇంజక్షన్‌కు రూ.2 లక్షల చొప్పున.. రెండు ఇంజక్షన్లు తీసుకుని ఏకంగా రూ.4 లక్షలు ఇచ్చాడు. సాక్షి, హైదరాబాద్: కరోనా పేషెంట్లకు ఉపయోగించే యాంటీ వైరల్ ఔషధాల విషయంలో రాష్ట్రంలో సాగుతున్న దందా ఇది. రెమిడిసివిర్ ఇంజక్షన్ ధరలు కంపెనీని బట్టి రూ.899 నుంచి రూ.3,490 వరకు ఉన్నాయి. తుసిలిజుమాబ్ ఇంజక్షన్ ధర రూ.30 వేల వరకు ఉంది. కానీ ఈ తరహా ఔషధాలకు కొరత ఏర్పడటంతో మందుల మాఫియా దందాకు తెరలేపింది. ఈ ముఠాలు కరోనా రోగుల అవసరాన్ని అడ్డంపెట్టుకుని విచ్చలవిడిగా దోచుకుంటున్నాయి. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, మాఫియా ముఠాలతోపాటు కొందరు వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బందికి కూడా ఈ దందాలో భాగస్వామ్యం ఉన్నట్టు సమాచారం. డిమాండ్‌ను బట్టి రెమిడిసివిర్‌ను రూ.25 వేల నుంచి రూ.75 వేల వరకు, తుసిలిజుమాబ్‌ను రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఎంతైనా ఖర్చుపెట్టేందుకు సిద్ధమనే వారి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. అత్యవసరమైతేనే వాడాలి.. రెమిడెసివిర్, తుసిలిజుమాబ్ వంటి యాంటీ వైరల్ మందులు సాధారణ మార్కెట్లో విక్రయించడం లేదు. అత్యవసర సమయంలో వాడకానికి మాత్రమే వాటికి అనుమతి ఉంది. పైగా ట్రయల్స్ జరుగుతున్నాయి. వీటికి కరోనా మరణాలను ఆపగలిగే సామర్థ్యం లేదని, రోగి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారకుండా కాపాడుతాయని డాక్టర్లు ఇప్పటికే స్పష్టం చేశారు. రక్తంలో ఆక్సిజన్ శాచురేషన్ 90 శాతం వరకు ఉండి, వెంటిలేటర్ లేదా ఆక్సిజన్‌పై చికిత్స చేస్తున్నప్పుడు, ఇన్ఫెక్షన్లు తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే రెమిడిసివిర్‌ను వాడాలి. పైగా కరోనా పాజిటివ్‌గా గుర్తించిన మొదటి 9 రోజుల్లోనే ఇవ్వాలి. అప్పుడే రోగి కోలుకునే అవకాశం ఉంటుందని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది కూడా. ఇక తుసిలిజుమాబ్‌ను కూడా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న రోగులకు అది కూడా అత్యంత జాగ్రత్తగా వాడాలి. ఇష్టమొచ్చినట్టు వాడితే రోగి పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు కూడా ఉన్నాయి. కానీ కొందరు ప్రైవేట్ ఆస్పత్రుల్లోని డాక్టర్లు డబ్బుల కోసం ఈ ఔషధాలను విరివిగా వాడేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దళారుల చేతికి ఎలా వస్తున్నాయంటే? ప్రైవేట్ ఆస్పత్రుల్లోని కరోనా కేసుల వారీగా రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ ఈ యాంటీ వైరల్ ఔషధాలను కేటాయిస్తుంది. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ప్రభుత్వ ఆస్పత్రులకు ఇదే పద్ధతిలో సరఫరా చేస్తుంది. ఈ రెండు ప్రభుత్వ సంస్థల ద్వారా మాత్రమే ఈ రెండు ఔషధాలు బయటకు వెళ్లాలి. అయినా ఇవి మాఫియా చేతికి చిక్కుతున్నాయి. దీనిలో కొందరు ప్రభుత్వ ఉద్యోగుల హస్తం ఉందని, వారే దళారులకు ఇచ్చి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వైద్యారోగ్యశాఖలో ముఖ్య స్థానంలో ఉన్న కొందరు నల్లబజారును ప్రోత్సహిస్తున్నారన్న ప్రచారం ఉంది. కొందరు అధికారులు తమకు తెలిసిన వారికి ఈ ఔషధాలు ఇచ్చుకుంటున్నారని, దళారుల ద్వారా బ్లాక్ మార్కెట్లో అమ్మించి వాటా తీసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి అవసరం ఉన్నా లేకున్నా కూడా కొన్ని ఆస్పత్రులు రోగుల బంధువులపై ఒత్తిడి తెచ్చి ఈ ఔషధాలను తెప్పిస్తున్నాయని.. వాటిని సదరు రోగికి వాడుతున్నారా లేదా కూడా తెలియడం లేదని ఒక ముఖ్య అధికారి పేర్కొనడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులకు కరోనా రోగులు పెద్దగా రావడం లేదు. వచ్చిన రోగులను బట్టి ఆయా ఆస్పత్రులకు రెమిడిసివిర్‌ను సరఫరా చేస్తున్నారు. కానీ వాటిని రోగులకు వాడేసినట్టు రాసి, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎవరికీ దొరక్కుండా.. మాఫియా ముఠాలు హైదరాబాద్ సహా జిల్లాల్లో రెమిడెసివిర్, తుసిలిజుమాబ్ మందులను అడ్డగోలు రేటుకు విక్రయించే పనిలో పడ్డాయి. ఇందులో ఎవరికీ పట్టుబడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ముఠా సభ్యుల ద్వారానే, నగదు తీసుకుని వచ్చినవారికి మాత్రమే విక్రయిస్తున్నారు. కాగా.. అసలు రాష్ట్రంలో రెమిడెసివిర్, తుసిలిజుమాబ్ మందుల కొరత ఉన్నప్పుడు.. అసలు అవి ఏ మేర రాష్ట్రానికి వచ్చాయి, వాటిని ఎలా పంపిణీ చేశారన్న విషయాన్ని వైద్యారోగ్యశాఖ బయటికి వెల్లడించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
బ్లాక్‌లో వ్యాక్సిన్ దందా: రూ.800 మందు రూ.14 వేలకు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులు, మెడికల్ ఏజెన్సీలు కోవిడ్ రోగులకు వాడే అత్యవసర మందులను బ్లాక్ చేస్తున్నాయి. మందుల కృత్రిమ కొరత సృష్టించి వాటి ధరలు అమాంతం పెంచేస్తున్నాయి. ముఖ్యంగా యాంటీ వైరల్ ఔషధమైన రెమిడెసివిర్ ఇంజక్షన్లను కొందరు మెడికల్ డిస్ట్రిబ్యూటర్లతోపాటు ఏజెన్సీలు సైతం బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ భారీగా దండుకుంటున్నాయి. ఒక్కో ఇంజక్షన్‌ను అక్రమంగా రూ.40 వేలపైనే విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 13,701 మంది చికిత్స పొందుతుండగా వారిలో 3,859 మంది వెంటిలేటర్‌పై, 6,715 మంది ఆక్సిజన్‌పై, 3,127 మంది సాధారణ పడకలపై చికిత్స పొందుతున్నారు. మరో 25,453 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వారిలో ఆక్సిజన్ లెవల్స్ 94 శాతంలోపు ఉన్న వారిని ఆస్పత్రుల్లో అడ్మిట్ చేస్తున్నారు. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో వైరస్ స్ట్రెయిన్ వేగంగా విస్తరిస్తోంది. కేవలం గంటల వ్యవధిలోనే వైరస్ లోడ్ భారీగా నమోదువుతోంది. అధిక వైరస్ లోడ్ కారణంగా రోగులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కరోనాకు ప్రత్యేక మందులంటూ ఏమీ లేకపోవడంతో వైద్యులు రెమిడెసివిర్‌ను కరోనాకు దివ్యౌషధంగా భావిస్తున్నారు. అధిక వైరస్ లోడ్‌తో బాధపడుతున్న వారికి తక్షణ ఉపశమనం కోసం ఈ ఇంజక్షన్లు వాడుతున్నారు. ఇలా ఒక్కో రోగికి 6 ఇంజక్షన్లు అవసరం అవుతుండగా ప్రస్తుతం రోగుల నిష్పత్తికి అనుగుణంగా ఉత్పత్తి జరగకపోవడంతో సమస్య తలెత్తుతోంది. బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి.. హైదరాబాద్‌లో హెటెరో ఫార్మా కంపెనీ తయారు చేస్తున్న రెమిడెసివిర్ ఇంజక్షన్లకు ఏప్రిల్‌కు ముందు వరకు దేశంలో పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. దీంతో అప్పటివరకు ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ వచ్చాయి. తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీ సహా తెలంగాణలోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర సహా సరిహద్దు రాష్ట్రాల్లో పడకలు దాదాపు నిండిపోయాయి. దీంతో ఇటీవల వారంతా హైదరాబాద్ చేరుకుంటున్నారు. ప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 30-40 శాతం మంది బాధితులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే. వారిలో చాలా మంది అధిక వైరస్ లోడ్ కారణంగా ఆస్పత్రికి చేరే లోపే కుప్పకూలుతున్నారు. తక్షణ ఉపశమనం కోసం వైద్యులు ప్రస్తుతం రెమిడెసివిర్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఆక్సిజన్/వెంటిలేటర్ పడకలపై చికిత్స పొందుతున్న బాధితులకే వాటిని వినియోగించగా తాజాగా హోం ఐసోలేషన్‌లో ఉన్న వారితోపాటు ఆర్థిక స్థోమతగల వారు ముందుజాగ్రత్తగా ఈ ఇంజక్షన్లు కొని భద్రపరుచుకుంటుండటం కూడా కృత్రిమ కొరతకు దారితీస్తోంది. డమ్మీ ప్రిస్కిప్షన్లతో ఫార్మసిస్ట్‌లు.. రోగుల బలహీనతను పలు కార్పొరేట్ ఆస్పత్రులు, మెడికల్ ఏజెన్సీలతోపాటు కొందరు ఫార్మసిస్టులు, వైద్యులు ఆసరాగా చేసుకుంటున్నారు. ఫార్మసీల్లో ఉన్న మందులను బ్లాక్ చేసి బహిరంగ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. వాటి ధరలను అమాంతం పెంచుతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు ఒక రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ధర సుమారు రూ.4,500 ఉండగా బ్లాక్‌లో రూ.10 వేలకుపైగా విక్రయించారు. అయితే కేంద్రం తాజాగా వాటిని సుమారు రూ.2,500 ధరకే విక్రయించాలని ఆదేశించడంతోపాటు విదేశీ ఎగుమతులపై నిషేధం విధించింది. కానీ రోగుల నిష్పత్తికి అనుగుణంగా తగినన్ని నిల్వలు లేకపోవడంతో సమస్య తలెత్తుతోంది. రోగులకు తక్కువ ధరకే ఇంజక్షన్లు అందజేయాలనే లక్ష్యంతో ఉత్పత్తి సంస్థ రెండు రోజుల క్రితం మూసాపేటలోని తమ కార్యాలయంలో కౌంటర్ తెరిచింది. కోవిడ్ రోగి తాలూకు రిపోర్టులు, బాధితుడి ఆధార్ కార్డు, వైద్యుడు ఇచ్చే మందుల చీటీ ఆధారంగా మందులు విక్రయిస్తోంది. దీన్ని కూడా ఏజెన్సీలు వదల్లేదు. కొందరు వైద్యుల నుంచి నకిలీ చీటీలు తీసుకొచ్చి రోగులకు దక్కాల్సిన ఇంజక్షన్లను ఫార్మసిస్ట్‌లు, మెడికల్ ఏజెన్సీలు అడ్డదారుల్లో ఎత్తుకెళ్తూ ఒక్కో ఇంజక్షన్‌ను రూ.40 వేల పైనే విక్రయిస్తున్నాయి. ఫలితంగా ఇంజక్షన్ల కోసం ఉదయం నుంచి ఎండలో క్యూలలో నిలబడిన బాధితుల తరఫు బంధువుల్లో చాలామంది మాత్రం ఖాళీ చేతులతో వెనుతిరగాల్సి వస్తోంది. కరీంనగర్లో 6 డోసులకు రూ. లక్షన్నర వసూలు! సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరోనా రోగుల పరిస్థితి విషమించినప్పుడు వాడే రెమిడెసివిర్ ఇంజక్షన్లకు కరీంనగర్లోనూ తీవ్ర కొరత నెలకొనడంతో బ్లాక్ మార్కెట్ దందా యథేచ్ఛగా సాగుతోంది. అవసరం ఉన్నా లేకున్నా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కరోనా రోగులకు రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉందని పట్టుబడుతుండటంతో ఇంజక్షన్ ఎక్కడ దొరికితే అక్కడ... ఎంత ధర చెబితే అంత చెల్లించి బాధితుల బంధువులు కొనుగోలు చేస్తున్నారు. కోవిడ్ చికిత్స అనుమతులున్న ఆస్పత్రులకే ఈ ఇంజక్షన్లు అందించాలని, మెడికల్ షాపుల్లో రోగులకు నేరుగా విక్రయించొద్దని నిబంధనలు ఉన్నప్పటికీ బ్లాక్ మార్కెట్ మొత్తం మెడికల్ షాపుల ద్వారానే జరుగుతోంది. ఫలితంగా ఒక్కో ఇంజక్షన్ ధర ఏకంగా రూ. 25 వేలు పలుకుతోంది. ఒక రోగికి ఇవ్వాల్సిన 6 డోసులకు రూ.1.50 లక్షలు వెచ్చించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ జిల్లాలో 50 ప్రైవేటు ఆస్పత్రులకు కోవిడ్ చికిత్స కోసం అనుమతులు ఉండగా ఏ ఆస్పత్రిలోనూ రెమిడెసివిర్ ఇంజక్షన్ లేకపోవడంతో బ్లాక్ మార్కెట్ హవా కొనసాగుతోంది. మరోవైపు ఆక్సిజన్ సిలిండర్ ధర గతంలో రూ.300-400 మధ్య ఉండగా ప్రస్తుతం రూ.1,500కు చేరుకుంది. అడ్డగోలుగా ధరలు పెరగడంతో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు సైతం ఫీజులను పెంచి పేషెంట్లను ఆర్థికంగా దోచుకుంటున్నాయి. ఇద్దరు హెటెరో సిబ్బంది సహా ముగ్గురు అరెస్ట్ హెటెరో సంస్థ తయారు చేస్తున్న రెమిడెసివర్ ఇంజక్షన్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ఇద్దరు సిబ్బందితోపాటు ఓ మెడికల్ రిప్రజెంటేటివ్‌ను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి 12 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. హెటెరోలో ఏరియా బిజినెస్ మేనేజర్‌గా పనిచేస్తున్న కూకట్పల్లి బాలాజీనగర్‌కు చెందిన షేక్ సలీం జాఫర్, ఫీల్డ్ సేల్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పీర్జాదిగూడవాసి బత్తుల వెంకటేశ్‌లు రెమిడెసివర్‌కు పెరిగిన డిమాండ్‌ను క్యాష్ చేసుకొనేందుకు రాంనగర్‌కు చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ జోన్నాల శ్రవణ్‌తో కలసి జట్టుకట్టారు. రూ. 3,400 పలికే ఒక్కో రెమిడెసివీర్ ఇంజక్షన్‌ను సాయికి ఒక్కో ఇంజక్షన్‌ను రూ.15 వేల చొప్పున ఆరు డోసులకు కలిపి రూ. 90 వేలకు విక్రయిస్తుండగా దీన్ని సాయి కోవిడ్ రోగుల బంధువులు, మెడికల్ షాపులకు రూ. 20 వేల చొప్పున ఆరు డోసులను 1.20 రూ. లక్షలకు విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు తన బృందంతో కలసి నిందితులను అరెస్టు చేశారు. -
కరోనా విలయం: బ్లాక్‌మార్కెట్‌కు కీలక ఔషధం
సాక్షి, ముంబై: ఒకవైపు దేశంలో కరోనా మహమ్మారి రెండో దశలో ఉగ్రరూపం దాలుస్తోంది. కేసుల నమోదులో రోజుకోకొత్త రికార్డుతో మరింత బెంబేలెత్తిస్తోంది. మరోవైపు కరోనా నివారణకు ఉపయోగించే కీలకమైన రెమ్‌డెసివర్ మందును బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతోంది. ఈ నేపథ్యంలో ముంబైలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ 284 రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. కరోనా వైరస్ చికిత్సలో కీలకమైన 12 మోతాదుల రెమ్‌డెసివిర్‌ను అక్రమంగా తరలిస్తూ సర్ఫరాజ్ హుస్సేన్ అంధేరి (తూర్పు) వద్ద పట్టుబడ్డాడని ముంబై పోలీసులు శుక్రవారం తెలిపారు. ఆ తరువాత నిర్వహించిన దాడుల్లో 272 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నా మన్నారు. మహారాష్ట్ర కేసుల తీవ్రతతో, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. నాగ్‌పూర్, నాసిక్, ముంబై, పూణేలో ఈ ఔషధానికి తీవ్ర కొరత ఏర్పడింది. ఈ కొరతను క్యాష్ చేసుకుంటున్న , కొంతమంది మందులను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను మహారాష్ట్ర ప్రభుత్వం రూ1,100 -1400 మధ్య సరఫరా చేస్తుండగా, బ్లాక్ మార్కెట్లో ఇది 5000-6000 రూపాయలు పలుకుతోంది. మరోవైపు దేశంలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం అందించిన సమాచారం ప్రకారం దేశంలో గడచిన 24 గంటల్లో 1,31,968 మంది కొత్తగా కోవిడ్ -19 వైరస్ బారిన పడ్డారు. అలాగే వరసగా మూడో రోజూ లక్షా పదిహేనువేలకిపైగా కేసులు నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్రలో 56,286 మంది వైరస్‌బారిన పడటం ఆందోళన పుట్టిస్తోంది. -
కోట్లాదిమందికి వ్యాక్సినేషన్ ఎలా?
న్యూఢిల్లీ: ఆశలు చిగురిస్తున్నాయి, ఎదురు చూపులు ఫలించనున్నాయి. 2021 వస్తూ వస్తూ మంచి శకునాలు మోసుకురాబోతోంది కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది వేసవికి ముందే వస్తుందనే అంచనాలున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వాటి పంపిణీ ఎలా ? 130 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో అందరికీ వ్యాక్సినేషన్ ఎలా జరుగుతుంది ? కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి వచ్చే ఏడాది వేసవినాటికి 10 వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని అంచనాలున్నాయి. ఈ రేసులో ఫైజర్, మోడెర్నా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు ముందున్నాయి. ఈ వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమని, సామర్థ్యంగా పని చేస్తాయని తేలితే భారత్‌లో 130 కోట్లకు పైగా ప్రజలకి వ్యాక్సినేషన్ చేయడమే కేంద్ర ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్. ఈ సవాళ్లను అధిగమించడానికి చాలా రోజులుగా కేంద్రం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. బ్లాక్ మార్కెట్లు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందాని ఎదురుచూస్తూ ఉండడంతో దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. దీంతో బ్లాక్ మార్కెట్లు విజృంభిస్తున్నాయన్న ఆందోళనలు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఇచ్చే టీకా చుట్టూ వ్యాపారం జరక్కుండా కేంద్రం చర్యలు తీసుకోవడం అతి పెద్ద సమస్య. వ్యాక్సిన్ నిల్వ, రవాణా, పంపిణీలో అవినీతికి తావు లేకుండా చూడడం అతి పెద్ద సవాలని ఆరోగ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోల్డ్ స్టోరేజీలు ప్రపంచదేశాల్లో టీకా కార్యక్రమాన్ని భారీగా నిర్వహించే దేశం మనదే. టీకా పంపిణీకి పటిష్టమైన వ్యవస్థ ఉంది. భారత్‌లో 27 వేల కోల్డ్ స్టోరేజీ చైన్లు ఉన్నాయి. కానీ కోట్లాది మందికి వ్యాక్సినేషన్ కోసం ఈ కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు సరిపోవు. అందులోనూ మోడెర్నా వ్యాక్సిన్ మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద, ఫైజర్ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల వద్ద నిల్వ చేయాలి. మన దేశంలో వ్యాక్సిన్లను 2 నుంచి 8 డిగ్రీల సెంటీ గ్రేడ్ వద్ద నిల్వ చేస్తూ ఉంటాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, దేశీయంగా తయారయ్యే భారత్ బయోటెక్ వ్యాక్సిన్లను సాధారణ రిఫ్రిజిరేటర్లలోనూ నిల్వ చేస్తే సరిపోతుంది. అందుకే ప్రభుత్వం ఈ రెండు వ్యాక్సిన్లపైనే దృష్టి సారించింది. టీకా ప్రాధాన్యాలు టీకా అందుబాటులోకి వస్తే తొలుత ఎవరికివ్వాలి అన్న సవాల్ ఎదుర్కోవడం అత్యంత సంక్లిష్టమైనది. ప్రాణాలను పణంగా పెట్టి అహరహం శ్రమిస్తున్న ఆరోగ్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు తొలి ప్రాధాన్యమని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ఆ తర్వాత 50–65 ఏళ్ల మధ్య వయసున్నవారికి, ఆ తర్వాత 50 ఏళ్లలోపు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. కానీ వీరి జాబితా తయారు చేయడం శక్తికి మించిన పని. అందుకే ఎవరికి ముందు టీకా ఇవ్వాలో ఒక ప్రణాళిక రూపొందించడానికి నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అధ్యక్షుడిగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. టీకా ఇవ్వడంలో వివక్ష చూపించారన్న విమర్శలు రాకుండా ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కరోనా వ్యాక్సినేషన్‌కి అవసరమయ్యే ఆర్థిక వనరులు మన ముందున్న అతి పెద్ద సవాల్. కరోనా వ్యాక్సిన్ ఏ సంస్థదైనా నెల రోజుల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాలి. ఈ రెండు డోసులకి కలిపి భారత్‌లో వెయ్యి రూపాయలుగా ధర నిర్ణయించినట్టుగా ఇప్పటికే ఆక్స్ఫర్డ్ –ఆస్ట్రాజెనెకా టీకాను తయారు చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మరి ప్రభుత్వమే ఈ టీకాలను కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుందా ? లేదంటే రాయితీపై అందిస్తుందా అన్నది అది పెద్ద ప్రశ్న. టీకాపై లక్ష కోట్లకు పైగా ఖర్చు చేయడం ప్రభుత్వానికి శక్తికి మించిన భారమే. అందుకే భారత్‌లో రూ.50 లోపు టీకా ధర నిర్ణయించి, ఒక్క డోసు ఇచ్చేలా వ్యాక్సిన్‌ను రూపొందిస్తే అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని ఆరోగ్యరంగ నిపుణుడు గగన్‌దీప్ అభిప్రాయపడుతున్నారు. ఆశలు రేపుతున్న వ్యాక్సిన్లు ఇవే..! ► అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్ 95% సురక్షితంగా పనిచేస్తోంది ► ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ 95% సురక్షితమని తేలింది. దీనికి బ్రిటన్ ప్రభుత్వం ఓకే చెప్పింది. ► యూకేకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వృద్ధుల్లో కూడా బాగా పని చేస్తోంది. ► రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్‌గా గుర్తింపు పొందింది. ► భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ కొవాగ్జిన్ పేరుతో అభివృద్ధి చేస్తున్న టీకా మూడో దశ ప్రయోగాల్లో ఉంది ► యూకేకి చెందిన నోవావాక్స్ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాల్లో ఉంది. వచ్చే ఏడాది మొదట్లోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికా కూడా ఈ వ్యాక్సిన్ కోసం నిధులు అందిస్తోంది. ► అమెరికాకు చెందిన ఇనోవియో ఫార్మాస్యూటికల్ వ్యాక్సిన్ కూడా ఆశాజనక ఫలితాలు ఇస్తోంది. అమెరికా రక్షణ శాఖ ఈ వ్యాక్సిన్ కోసం నిధులు సమకూరుస్తోంది. -
బ్లాక్‌లో ర్యాపిడ్ కిట్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పలుచోట్ల ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు బ్లాక్‌లో అమ్ముడవుతున్నాయి. హైదరా బాద్ నుంచే కొన్ని కంపెనీల డీలర్ల ద్వారా క్లినిక్‌లకు, ల్యాబ్‌లకు, చివరకు వ్యక్తి గతంగా కొందరి చేతుల్లోకి చేరుతు న్నాయి. ఆపై వీటిని ‘బ్లాక్’ చేస్తూ, వాస్తవ ధర కంటే రెండింతలకు అమ్ముతూ కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వా స్పత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడానికి చాలామంది భయపడుతుండటం, ఒకవేళ చేయించుకున్నా ట్రేసింగ్, వైద్య సిబ్బంది హడావుడితో నలుగురికి తెలిస్తే బాగుం డదన్న భావనతో చాలామంది యాంటిజెన్ టెస్టులకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ కిట్లకు డిమాండ్ పెరిగి బ్లాక్ అవుతున్నాయి. ఇది జిల్లా వైద్యాధికారుల దృష్టికొచ్చినా పట్టించు కోవట్లేదనే ఆరోపణలున్నాయి. ర్యాపిడ్ టెస్టులకు ప్రైవేట్‌లో అనుమతే లేదు తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులకు, లేబొరేటరీలకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేసేందుకు అనుమతి లేదు. కేవలం ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేసేందుకే 23 ప్రైవేట్ లేబొరేటరీలకు, కొన్ని ఆసుపత్రులకు అనుమతి ఉంది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో 16 చోట్ల ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు చేస్తున్నారు. అయితే ఈ పరీక్ష ఫలితాల వెల్లడికి ఒక్కోసారి వారం వరకు సమయం పడుతోంది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులు, లేబొరేటరీలకు కేంద్రం ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు అనుమతినిచ్చింది. దీనిద్వారా కరోనా నిర్ధారణ అరగంటలోపే జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కిందిస్థాయి వరకు వందలాది కేంద్రాల్లో ప్రభుత్వమే యాంటిజెన్ టెస్టులు చేస్తోంది. పైగా ఈ టెస్టు చేయడం చాలా తేలిక. గొంతు లేదా ముక్కులోంచి స్వాబ్ నమూనాలు తీసి, సంబంధిత ద్రావణంలో ముంచి కిట్టుపై పెడితే నిమిషాల్లో పాజిటివా? నెగెటివా? అనేది తెలుస్తుంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి లేకపోవడంతో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లకు కొన్ని కంపెనీలు డీలర్ల ద్వారా అక్రమంగా కిట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నాయి. జిల్లాల్లోని చాలా ప్రైవేట్ క్లినిక్‌లు, లేబొరేటరీలకు కూడా వీటిని సరఫరా చేస్తున్నారు. ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేసే కొన్ని ల్యాబ్‌లు, ఆసుపత్రులు గుట్టుగా యాంటిజెన్ టెస్టులు చేస్తూ భారీగా వసూలు చేస్తున్నాయి. ఆచితూచి యాంటిజెన్ టెస్ట్ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లో శాంపిళ్ల సేకరణ కీలకం. గొంతు/ముక్కులోంచి స్వాబ్ నమూనా సరిగా తీయకుంటే ఫలితం తారుమారవుతుంది. శిక్షణ కలిగిన టెక్నీషియన్లు మాత్రమే స్వాబ్ నమూనాలు తీయాలి. తీసిన శాంపిళ్లను గంటలోపే పరీక్షించాలి. లేదంటే ఆ శాంపిల్ పనికిరాదు. కొందరైతే ఇళ్లలో తామే స్వాబ్ తీసుకొని పరీక్షించుకుంటున్నారు. ఇదింకా ప్రమాదకరం. దీనివల్ల ఫలితం తారుమారయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఇక యాంటిజెన్ టెస్ట్‌కు ఉన్న ప్రధాన లోపం నెగెటివ్ వస్తే దాని కచ్చితత్వం 50 నుంచి 70 శాతమే. పాజిటివ్‌కు మాత్రమే కచ్చితత్వం ఉంది. నెగెటివ్ వచ్చి లక్షణాలుంటే తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయాలన్నది ఐసీఎంఆర్ కీలక నిబంధన. కానీ నెగెటివ్ వచ్చిన చాలామంది లక్షణాలున్నా కూడా తమకు వైరస్ సోకలేదంటూ జనంలో తిరిగేస్తున్నారు. దీంతో వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. వరంగల్‌కు చెందిన జయరాం.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అక్కరకొస్తుందని భావించి తనకు తెలిసిన ఓ ప్రైవేట్ ల్యాబ్ యజమాని వద్ద నాలుగు యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్లు కొన్నాడు. వాటి వాస్తవ ధర ఒక్కోటి రూ. 500 కాగా రూ. 800 చొప్పున వెచ్చించాడు. హైదరాబాద్‌లో క్లినిక్ నడిపే డాక్టర్ రఘురామయ్య (పేరు మార్చాం).. కరోనా లక్షణాలతో క్లినిక్‌కు వస్తున్న వారికి తన టెక్నీషియన్ ద్వారా స్వాబ్ శాంపిల్ తీసి పరీక్షలు చేయిస్తున్నాడు. బ్లాక్‌లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్లను కొని ఒక్కో పరీక్షకు రూ.1,500 తీసుకుంటున్నాడు. పావుగంటకే ఫలితం వస్తుండటంతో జనం ఎగబడుతున్నారు. -
బ్లాక్ మార్కెట్లో యాంటీ వైరల్ డ్రగ్స్ : ముఠా అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో యాంటీ వైరల్ డ్రగ్స్‌ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నేడు పాతబస్తీలో అంతరాష్ట్ర బ్లాక్ మార్కెట్ ముఠాను అరెస్ట్ చేశాను. కరోనా వైరస్ బారిన పడినవారికి 8 మంది బ్లాక్‌లో అక్రమంగా యాంటీ వైరల్ డ్రగ్స్ విక్రయిస్తున్నారని తెలిపారు. ముఠా సభ్యుల నుంచి 35.5 లక్షల రూపాయల విలువ చేసే మెడిసిన్ స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ ముఠాలో వెంకట సుబ్రమణ్యం కీలకంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. మెడిసన్స్ రూ. 10 వేల నుంచి రూ. 50 వేల వరకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని చెప్పారు. ముఠా సభ్యుల వద్ద నుంచి కరోనా టెస్ట్ చేసే ర్యాపిడ్ కిట్స్, ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ కేసులో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్‌కు చార్మినార్ డ్రగ్ కంట్రోల్ అధికారులు సాయం చేశారని పేర్కొన్నారు. ఫార్మ కంపెనీల డిస్టిబ్యూటర్స్, మెడికల్ రిప్రజెంటెటివ్స్, మెడికల్ షాపు యజమానులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మెడికల్ రిప్రజెంటెటివ్స్ ద్వారా ఈ మందులను మార్కెట్లో చలామణి చేస్తున్నారని చెప్పారు. ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితుడి కుటుంబ సభ్యులకు ఈ మందులు విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ మెడిసిన్‌కు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కృతిమ కోరత సృష్టించి.. లక్ష రూపాయలకు మెడిసిన్‌ను విక్రయిస్తున్నారని చెప్పారు. వైద్యులు కూడా పరిస్థితి విషమంగా ఉన్న కరోనా బాధితులకు ఫాబి ఫ్లూ ఇంజక్షన్స్‌ను వినియోగిస్తున్నారని చెప్పారు. ఇది గమనించిన ఈ ముఠా మెడిసిన్‌ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. -
బ్లాక్ మార్కెట్లో యాంటీ వైరల్ డ్రగ్స్
-
బ్లాక్‌లో ఆక్సిజన్ సిలిండర్లు.. టాస్క్‌ఫోర్స్ దాడులు
సాక్షి, హైదరాబాద్: అనుమతులు లేకుండా ఆక్సిజన్ సిలెండర్లను బ్లాక్ మార్కెట్ చేస్తూ దోచుకుంటున్న ముఠాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ముషీరాబాద్‌లోని ఇందిరానగర్ లోని బాబా ట్రేడర్స్ పై దాడులు జరిపారు. లైసెన్స్‌లు లేకుండా ఆక్సిజన్ సిలెండర్లు అమ్మకాలు చేస్తున్న షేక్ అక్బర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, 38 ఆక్సిజన్ సిలెండర్లను స్వాధీనం చేసుకున్నారు. కరోనా సోకిన వ్యక్తులు, క్వారంటైన్లో ఉన్నవారికి కొన్ని ముఠాలు అక్రమంగా అధిక ధరలకు ఆక్సిజన్ అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం వెస్ట్‌జోన్‌లో 43 సిలెండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ రూ.లక్ష!!) -
హైదరాబాద్: అమ్మకానికి ఆక్సిజన్ సిలిండర్లు
-
రేషన్ బియ్యం మాఫియా డాన్ అరెస్ట్
కోవెలకుంట్ల: కొన్నేళ్ల నుంచి గుట్టు చప్పుడు గాకుండా రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న మాఫియా డాన్‌ను ఎట్టకేలకు కోవెలకుంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వివరాలను మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్ లో కోవెలకుంట్ల సీఐ సుబ్బరాయుడు విలేకరు లకు వెల్లడించారు.బనగానపల్లెకు చెందిన శ్రీనివాసులు అలియాస్ డాన్ శ్రీను రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన రేషన్‌బియ్యాన్ని పట్టణ శివారులోని ఐటీఐ కళాశాల సమీపంలో కోవెలకుంట్లకు చెందిన స్వామిరెడ్డి, బనగానపల్లెకు చెందిన ఉసేన్‌బాషా లారీలో నుంచి మరో లారీలోకి రేషన్ బియ్యాన్ని మార్పిడి చేస్తుండగా కోవెలకుంట్ల ఎస్ఐ చంద్రశేఖర్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు. 250ప్యాకెట్ల(125 క్వింటాళ్లు) రేషన్ బియ్యం, రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యానికి సంబంధించి వివరాలు ఆరా తీయగా బనగానపల్లెకు చెందిన శ్రీనివాసులు ఆదేశాల మేరకు బియ్యాన్ని తరలించేందుకు మార్పిడి చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. వారిద్దరితోపాటు శ్రీనివాసులు, కొలిమిగుండ్ల మండలం బెలూంకు చెందిన చిన్న ప్రసాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మరోనిందితుడు చిన్న ప్రసాదు పరారీలో ఉన్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. మిగిలిన ముగ్గురిని కోవిడ్ పరీక్షల అనంతరం బనగానపల్లె మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచనున్నట్లు సీఐ వివరించారు. -
'ఆటో' కంటే 'కారు' చవక
సాక్షి, సిటీబ్యూరో: ఆటో పర్మిట్లపై విధించిన ఆంక్షలు కొందరు అక్రమార్కులకు రూ.లక్షలు కురిపిస్తున్నాయి. బ్లాక్ మార్కెట్‌కు ఊతమిస్తున్నాయి. పాత పర్మిట్లపై విక్రయించే కొత్త ఆటోలను రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆటో అమ్మకాలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. కొత్త పర్మిట్లకు ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో చాలామంది డ్రైవర్లు పాత ఆటోల స్థానంలోనే కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. దీంతో అనూహ్యంగా పెరిగిన డిమాండ్‌ను వ్యాపారులు, ఫైనాన్షియర్లు భారీఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. వాహన తయారీదారులు 3 సీట్ల ఆటో ధర రూ.1.58 లక్షలుగా నిర్ణయించగా షోరూంల్లో ఇన్వాయిస్కు భిన్నంగా ఒక్కో ఆటోను రూ.2 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు తుక్కుగా మారిన పాత ఆటో పర్మిట్ల ధరలకు సైతం రెక్కలొచ్చాయి. వేలకొద్ది పాత పర్మిట్లను గుప్పిట్లో పెట్టుకొన్న ఫైనాన్షియర్లు ఒక్కో పర్మిట్‌ను రూ.1.5 లక్షల నుంచి రూ.1.6 లక్షల వరకు విక్రయిస్తున్నారు. కొత్త ఆటో కొనుగోలు చేయాలంటే పర్మిట్ ధరతో కలిపి దాదాపు రూ.3.6 లక్షల వరకు చెల్లించాల్సివస్తుంది. కేవలం రూ.1.58 లక్షలకు లభించాల్సిన ఆటో ఏకంగా రూ.3.6 లక్షలకు చేరుకోవడం గమనార్హం. మార్కెట్లో ఇప్పుడు ఆల్టో కారు ధర రూ.4 లక్షలే ఉంది. మరికొద్ది రోజుల్లో ఆటోల ధరలు కార్ల ధరలను సైతం మించిపోయే అవకాశం ఉందని ఆటో కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నగరంలో వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆటో పర్మిట్లపై విధించిన ఆంక్షలు కేవలం కొద్దిమంది డీలర్లు, ఫైనాన్షియర్ల అక్రమార్జనకు అవకాశంగా మారడం గమనార్హం. కొరవడిన నియంత్రణ.. నగరంలో వాహన కాలుష్య తీవ్రతను దృష్టిలో ఉంచుకొని భూరేలాల్ కమిటీ సిఫార్సుల మేరకు 2002లోనే ప్రభుత్వం కొత్త ఆటోలపై ఆంక్షలు విధించింది. అప్పటికి కేవలం 80 వేల ఆటోలే ఉన్నాయి. ఇవి బాగా పాతబడిపోతే, వినియోగించేందుకు అవకాశం లేకుండా ఉంటే వాటిని తుక్కుగా మార్చి పాత పర్మిట్ల స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు మాత్రం వెసులుబాటు కల్పించారు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటోల సంఖ్య 80 వేలు దాటేందుకు వీలులేదు. కానీ ఆటోలపై నిషేధాన్ని ప్రభుత్వం తరచూ సడలించింది. దఫదఫాలుగా మరో 45 వేల కొత్త ఆటోలకు పర్మిట్లు ఇచ్చింది. దీంతో నగరంలో ఆటోల సంఖ్య 1.25 లక్షలకు చేరింది. ప్రస్తుతం కొత్త ఆటోలకు అనుమతులను నిలిపివేశారు.ఈ క్రమంలో ఆటో డ్రైవర్లు యథావిధిగా పాత పర్మిట్ల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేస్తున్నారు. నిజానికి కొత్తగా పర్మిట్లను విడుదల చేసినా, పాత పర్మిట్లపై కొత్తవి కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించినా వ్యాపారులు, ఫైనాన్షియర్ల అక్రమార్జనకే ఊతంగా మారాయి. 20వేల పర్మిట్లు విడుదల చేసిన రోజుల్లోనూ బ్లాక్ మార్కెట్ వ్యాపారం జరిగింది. ఇప్పుడు ఆంక్షలు ఉన్పప్పటికీ అదే దందా కొనసాగడం గమనార్హం. ప్రేక్షక పాత్ర... ఆటో డ్రైవర్లు ఫైనాన్షియర్ల వద్ద అప్పు చేసి కొనుగోలు చేస్తారు. తిరిగి అప్పు చెల్లించలేకపోవడంతో ఫైనాన్షియర్లు వాటిని జప్తు చేసుకుంటారు. ఇలా సుమారు లక్ష పాత ఆటోల పర్మిట్లు ఫైనాన్షియర్ల గుప్పిట్లోనే ఉన్నాయి. బినామీ పేర్లపై ఉన్న ఈ పర్మిట్లనే తిరిగి ఆటో డ్రైవర్లకు కట్టబెడుతూ అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో షోరూంల నిర్వాహకులే ఫైనాన్షియర్లు. దీంతో ఆటోడ్రైవర్లు వారివద్ద జీవిత కాలపు రుణగ్రస్తులుగా మారుతున్నారు. ఈ విష వలయాన్ని అంతమొందించడంలో రవాణా శాఖ, పోలీసు, ఆర్థిక శాఖ వంటి ప్రభుత్వ విభాగాలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. దీంతో ఉపాధి కోసం నగరానికి వచ్చి ఆటోలు కొనుగోలు చేసే పేద డ్రైవర్లు సమిధలవుతున్నారు. -
నిత్యావసరాలపై విజిలెన్స్
ఉత్పత్తి, రవాణాలో అంతరాయాన్ని అదనుగా తీసుకుని వ్యాపారులు నిత్యావసరాలను బ్లాక్ చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలో రేషన్ బియ్యం, పప్పు దినుసులతో పాటు ఉల్లిపాయలను పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రతి నిత్యావసర సరుకులను గోడౌన్లకు తరలించి కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా బ్లాక్ మార్కెట్‌పై విజిలెన్స్ సీరియస్‌గా దృష్టి సారించింది. అక్రమార్కులపై కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో ఉల్లి అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తోంది. మార్కెట్లో ధరలు దిగివచ్చి.. స్థిరీకరణ వచ్చే వరకు దాడులు కొనసాగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఉల్లిపాయల నుంచి రేషన్ బియ్యం వరకు నిత్యావసర సరుకులన్నీ నల్లబజార్‌కు చేరిపోతున్నాయి. మార్కెట్లో బడా వ్యాపారులు నిత్యావసరాలకు కృత్రిమ కొరత సృష్టించి స్టాక్‌ను బ్లాక్ చేస్తున్నారు. ధరలు భారీగా పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్న క్రమంలో జిల్లాలోని కొందరు వ్యాపారులు భారీగా నిల్వలు చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మార్కెట్‌ను శాసిస్తూ ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తూ.. అటు ప్రభుత్వాదాయానికి గండికొడుతున్న అక్రమరవాణా, అనధికార నిల్వలపై విజిలెన్స్ దృష్టి సారించింది. రేషన్‌షాపుల డీలర్లు, వ్యాపారులు కుమ్మక్కై నిత్యావసరాలను బ్లాక్ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేస్తున్నట్లు గుర్తించారు. మరికొందరు పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. వంటకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో విక్రయించడంతో పాటు వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నారు. నిత్యావసరాల్లో పప్పు దినుసులు, ఉల్లిపాయలు తదితరాలను వ్యాపారులు అక్రమంగా నిల్వలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొద్ది కాలంగా జిల్లా వ్యాప్తంగా దాడులు ముమ్మరం చేశారు. ఇదే అదనుగా నిత్యావసరాల వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఉల్లి ధరలు రోజు రోజుకు కొండెక్కుతున్నాయి. ఉల్లి దిగుబడులు తగ్గడంతో.. ప్రధానంగా ఉల్లి పంట పండించే మహారాష్ట్రలోని నాసిక్‌లో వరదల వల్ల ఉల్లి పంట సాగు గణనీయంగా తగ్గిపోయింది. దీంతో రాష్ట్రానికి నాసిక్ నుంచి ఉల్లి దిగుమతి బాగా పడిపోయింది. నెలన్నర క్రితం వరకు రూ.30 పలికిన ఉల్లి ధర ప్రస్తుతం రూ.80లకు చేరింది. రెండు వారాల క్రితం అయితే కిలో రూ.104లకు అత్యధిక ధర పలికింది. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు బ్లాక్ మార్కెట్‌పై దృష్టి సారించారు. వరుస దాడులతో ధరలు కొంతమేర దిగి వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా 30 షాపుల్లో తనిఖీలు నిర్వహించి రూ.1,03,27,910 విలువ చేసే 224.80 టన్నుల ఉల్లిని స్వాధీనం చేసుకుని మార్కెట్ కమిటీ యార్డు అధికారులకు అప్పగించారు. భారీ అక్రమ నిల్వలు స్వాధీనం నెల్లూరు నగరంలోని స్టోన్‌హౌస్‌పేటలోని పలు ఉల్లిపాయల విక్రయ దుకాణాలపై దాడులు చేశారు. కొనుగోలు, విక్రయాలు, నిల్వలకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేవని గుర్తించారు. ఆనంద్ ఆనియన్స్(12 టన్నులు), కామాక్షితాయి ఆనియన్స్ (15.75 టన్నులు), ఏవీఎస్ ఆనియన్స్(24.75 టన్నులు), కందె ఆనియన్స్ (19.75 టన్నులు) స్వాధీనం చేసుకుని దుకాణాలను సీజ్ చేశారు. కావలిలో శ్రీజయలక్ష్మి ఆనియన్ మర్చంట్స్ (9 టన్నులు), శ్రీకృష్ణ ఆనియన్స్ (17 టన్నులు) దుకాణాలను సీజ్ చేశారు. దుకాణాల్లోని కొనుగోలు, విక్రయ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి తేడాలను గుర్తించారు. కేఆర్ఆర్ ఆనియన్స్ దుకాణంలో 9.30 టన్నులు, హైమావతి అసోసియేట్స్‌లో 14.2 టన్నుల ఉల్లిపాయలను సీజ్ చేసి మార్కెటింగ్ అధికారులకు అప్పగించారు. కావలిలో మొత్తంగా ఆరు దుకాణాల్లోని రూ.42,59,650 విలువ చేసే 98.25 టన్నుల ఉల్లిపాయలను సీజ్ చేసి మార్కెటింగ్ శాఖ అధికారులకు అప్పగించారు. గూడూరు, బచ్చిరెడ్డిపాళెం ప్రాంతాల్లోని ఐదు ఉల్లిపాయల దుకాణాలపై దాడులు చేసి రూ.2.60 లక్షలు విలువచేసే 8.3 టన్నుల ఉల్లిపాయలను సీజ్ చేశారు. రేషన్ బియ్యం పక్కదారిపైనా కేసులు శ్రీకాళహస్తి నుంచి 50 బస్తాల పీడీఎస్ బియ్యం నెల్లూరు వైపు వస్తున్న బొలేరో వాహనాన్ని విజిలెన్స్ అధికారులు ïసీజ్ చేశారు. జిల్లాలోని గూడూరు, కావలి, ఓజిలి, బుచ్చిరెడ్డిపాళెం ఆరు రేషన్ షాపుల్లో తనిఖీలు చేసి నిత్యావసరాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించడంతో పాటు, స్టాక్ల్లో భారీ వ్యత్యాసాలు ఉండడాన్ని గుర్తించారు. రూ.10.20 లక్షలు విలువ చేసే నిత్యావసరాలను సీజ్ చేసి డీలర్లపై 6ఏ కింద కేసులు నమోదు చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని రేషన్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు చేశారు. ఒక రేషన్ దుకాణంలో 517 కిలోల బియ్యం, 59 కిలోల చక్కెర, 1.5 కిలోల రాగి పిండి, కంది పప్పు 12 కిలోలు తక్కువగా ఉండటంతో రేషన్ షాపు డీలరపై 6ఏ కింద కేసు నమోదు చేశారు. ఆటోలో తరలిస్తున్న 800 కిలోల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధిక లోడ్‌తో వెళ్తున్న ఐదు గ్రానైట్ లారీలు, మూడు కంకర లారీలు, 7 ఇటుక ట్రాక్టర్లు, 21 వ్యవసాయ మార్కెటింగ్‌కు సంబంధించిన వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రవాణా శాఖ రూ.6,31,845, మైనింగ్‌శాఖ రూ.30 వేలు, మార్కెటింగ్‌శాఖ రూ. 2,51,158 మొత్తంగా రూ.9,13,003 నగదును జరిమానా కింద వసూలు చేశారు. పరిమితికి మించి అధిక లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ వాహనాలు, గ్రావెల్, బొగ్గు, గ్రానైట్ లారీలు, కంటైనర్లను తనిఖీచేసి వాహనదారుల నుంచి రూ. 17 లక్షల జరిమానా వసూలు చేశారు. ధరలు తగ్గే వరకు తనిఖీలు కొనసాగిస్తాం జిల్లాలో అక్రమాలను గుర్తించి వరుస కేసులు నమోదు చేస్తాం. ప్రధానంగా నిత్యావసరాల్ని బ్లాక్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే వ్యాపారులపై సీరియస్ ఫోకస్ కొనసాగుతుంది. గత నెలల్లో ఉల్లి, నిత్యావసరాలు, రేషన్ బియ్యం, ఓవర్ లోడింగ్, బిల్లులు లేకుండా జరిగే అక్రమ రవాణాపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశాం. ముఖ్యంగా మార్కెట్లో నిత్యావసరాలు, ప్రధానంగా ఉల్లి ధరలు తగ్గే వరకు మార్కెట్‌పై నిఘా ఉంచి చర్యలు తీసుకుంటాం. – వెంకట శ్రీధర్, జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ -
ఇసుక దొంగకు మూడేళ్ల జైలు శిక్ష
సాక్షి, అమరావతి: ఇసుక దొంగతనం కేసులో ఓ వ్యక్తికి కడప కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. ప్రజల ఆస్తికి నష్టం కలిగించినందుకు ప్రజా ఆస్తి విధ్వంస నిరోధక చట్టం (పీఓపీపీడీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా కూడా విధించింది. ఈ రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కడప జిల్లా రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పి.భానుసాయి రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. ఇసుకను అక్రమంగా నిల్వ చేసినా, అక్రమంగా రవాణా చేసినా, బ్లాక్ మార్కెట్లో విక్రయించినా, ఒకరి పేరిట కొని, మరొకరికి అమ్మినా రెండేళ్ల జైలు, రూ.2 లక్షల జరిమానా విధించేలా చట్ట సవరణ చేసేందుకు ఈ నెల 13న రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసిన కొద్ది రోజులకే ఈ తీర్పు వెలువడటం విశేషం. పాపాగ్నిలో అక్రమంగా ఇసుక తవ్వకం వైఎస్సార్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గోపరాజుపల్లికి చెందిన నంద్యాల సుబ్బారాయుడు పాపాగ్ని నదిలో ఇసుకను దొంగిలిస్తున్నారంటూ ఈ ఏడాది జూలై 15న పెండ్లిమర్రి పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు సుబ్బారాయుడు ఇసుక తవ్వుతున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ట్రాక్టర్లో ఇసుకను లోడ్ చేస్తూ సుబ్బారాయుడు కనిపించాడు. అతడని పోలీసులు పట్టుకొని విచారణ చేశారు. -
నకిలీ విత్తు!
సాక్షి, గద్వాల : జిల్లావ్యాప్తంగా ఇటీవల టాస్క్‌ఫోర్స్ అధికారులు జరుపుతున్న దాడుల్లో నకిలీ విత్తనాల బాగోతం బయట పడుతోంది. ఈ నెల రోజులోనే రూ.కోట్లు విలువజేసేవి పట్టుకున్నారు. రైతు తమ పొలంలో దుక్కి దున్ని విత్తనాలు వేసినప్పటి నుంచి ధాన్యం అమ్ముకునేంత వరకు అన్ని రకాలుగా దోపిడీకి గురవుతున్నాడు. నకిలీ విత్తనాలు, ఎరువులు, ఫెస్టిసైడ్స్ ముప్పెట దాడి చేస్తున్నాయి. నకిలీ దందా నిర్వహించే వారు కోట్లకు పడుగలెత్తుతుంటే, ఆరుగాలం కష్టపడి పండించిన పంట నకిలీ విత్తనాలు, ఎరువుల వల్ల సక్రమంగా దిగుబడి రాక, వచ్చిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించక రైతులు మ రింత అప్పుల్లో కూరుకుపోతున్నారు. నడిగడ్డ కేం ద్రాంగానే ఎక్కువగా నకిలీ విత్తనాల దందా కొనసాగుతోంది. వీరిపై కఠిన చర్యలు తీసుకుం టామని, కొత్తగా ఆర్డినెన్స్ తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా అది మాటలకే పరిమితం కావడంతో అడ్డూఅదుపు లేకుండాపోయింది. అనుమతి లేకపోయినా కొందరు దళారులు బీటీ–3 విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. మభ్యపెడుతున్న వ్యాపారులు రాష్ట్రంలోనే అత్యధికంగా సీడ్ పత్తి సాగు ఈ జిల్లాలోనే ఉంటోంది. దీనిని ఆసరా చేసుకుని విత్తన కంపెనీలు ఆర్గనైజర్ల సహకారంతో గతేడాది రైతులతో బీటీ–3 విత్తనాలు సాగు చేయించినట్టు బహిర్గతమైంది. నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఎంత హె చ్చరించినా చాపకింద నీరులా వాటి విక్రయం కొ నసాగుతూనే ఉంది. డీలర్ కంటే తక్కువ రేటుకు విక్రయిస్తామంటూ రైతులను కొందరు వ్యాపారులు ఆకట్టుకుంటూ వీటిని అంటగడుతున్నారు. రైతులకు ఎలాంటి అనుమానాలు రాకుండా ఎక్కువ ప్యాకెట్లను కొంటే రేటు తక్కువగా ఇస్తామని చెబుతున్నారు. ప్రముఖ బ్రాండ్ల నకళ్లను రూపొందించి గ్రామాల్లో తిరుగుతూ వాటినే అసలివిగా చూపెడుతూ విక్రయిస్తున్నారు. అలాగే డీలర్లను సైతం కమీషన్ ఎక్కువగా ఇస్తామంటూ తమ వైపు తిప్పుకొంటున్నారు. ఇంటింటికీ తిరుగుతూ మరీ రైతులకు విత్తనాలను విక్రయిస్తున్న పరిస్థితి. జిల్లాలోని గద్వాల, అయిజ మండలాల్లో నకిలీ విత్తనాల విక్రయాలు ఎక్కువగా సాగుతున్నాయి. ఇక్కడ పండించిన విత్తనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు పట్టణంలో నిల్వ ఉంచుతూ ఏటా అక్కడి నుంచి నకిలీ విత్తనాల మాఫీయా నడిగడ్డ కేంద్రంగా నకిలీ విత్తనాల వ్యాపారం చేస్తూ రైతులను నట్టేట ముంచుతూ రూ.కోట్లు గడిస్తున్నారు. అయితే సీడ్ పత్తి పై అధికార యంత్రాంగం ఈసారి ప్రత్యేక దృష్టి సారించడంతో ఇప్పుడైనా నకిలీ విత్తనాల నుంచి రైతులు బయటపడతారా లేదా అనేది చూడాలి. వరుస దాడులు పోలీసు, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్ అధికారులు నిర్వహిస్తున్న వరుస దాడుల్లో నకిలీ విత్తనాలు పెద్ద ఎ త్తున బయటపడుతున్నాయి. గుట్టుచప్పుడు కా కుండా జర్మినేషన్లో ఫెయిల్ అయిన విత్తనాలకు రంగులు, రసాయానాలు అద్ది రైతులకు అమ్మి కొందరు వ్యక్తులు అక్రమంగా సంపాదిస్తున్నారు. ఇంతవరకు బీటీ–1, 2 రకం పత్తి విత్తనాలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి ఉంది. అయితే కొ న్నేళ్లుగా కంపెనీలు రైతులతో గుట్టుచప్పుడు కా కుండా బీటీ–3 సాగు చేయిస్తున్నారని అధికారులు దాడులు జరిపి, పరీక్షించిన వాటిలో తేలింది. గతేడాది పెద్ద ఎత్తున వివిధ కంపెనీలు రైతుల ద్వారా ఫౌండేషన్ సీడ్‌గా బీటీ–3ని ఇచ్చి సాగు చేశారు. ఇక్కడ పండించిన ఈ విత్తనాలను ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో నిల్వ ఉంచడంతో అక్కడి ప్రభుత్వం సదరు కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టేం దుకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అధి కారులు నకిలీ పత్తి విత్తనాలు, బీటీ–3ని నివారించేందుకు టాస్క్‌ఫోర్స్ బృందం ఈ సీజన్ ఆరంభంలోనే విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. అన్ని మండలాల్లో విస్తృతంగా దాడులు నిర్వహిం చి పొలాలు, ఇళ్ల వద్ద ఉన్న నకిలీ విత్తనాలను పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. ఇది తెలుసుకున్న కొందరు వ్యక్తులు తప్పని పరిస్థితుల్లో వాటిని రోడ్లపైన పారబోస్తున్నారు. తాజాగా సోమవారం జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లోనూ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అలాగే అయిజ మండలంలోని తూంకుంటలోని ఓ ఇంట్లో అనుమతి లేని పత్తి విత్తనాలు మూడు బస్తాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మచ్చుకు కొన్ని ఘటనలు గత ఏప్రిల్ 10న ధరూరు మండలం మార్లబీడులోని రాము ఇంట్లో సుమారు 3.25క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు పట్టుకున్నారు. 16న ధరూరు మండలం సోంపురంలోని గోవిందు నుంచి 4.5క్వింటాళ్ల పత్తి విత్తనాల స్వాధీనం. మే 7న ధరూరు మండలం మార్లబీడు, సోంపురంలలో 3.36క్వింటాళ్లు, గట్టు మండలం మిట్టదొడ్డిలో 150క్వింటాళ్ల విత్తనాలు పట్టుబడ్డాయి. 24న ధరూరు మండలం జాంపుల్లిలో రూ.12లక్షలు విలువ చేసే 12క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం. 25న మల్దకల్ మండలం తాటికుంటలో రూ.12లక్షలు విలువ జేసే 28.50క్వింటాళ్ల స్వాధీనం. 28న గద్వాల పట్టణ పాత హౌసింగ్‌బోర్డుకాలనీలోని సీడ్ ఆర్గనైజర్ వెంకట్‌రెడ్డి ఇంట్లో 125కిలో నకిలీ పత్తి విత్తనాలు, అందుకు సంబంధించి రంగులు స్వాధీనం చేసుకున్నారు. 28న అయిజ మండలం మేడికొండలోని నాగరాజు ఇంట్లో 10.50క్వింటాళ్లు పట్టుబడ్డాయి. ధరూరు మండలం ర్యాలంపాడు రిజర్వాయర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్వింటాల్ నకిలీ పత్తినాలు పడేశారు. వాటిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 30న అయిజ మండలం బింగిదొడ్డిలోని సబ్ ఆర్గనైజర్ తిమ్మప్ప ఇంట్లో 19.50క్వింటాళ్ల స్వాధీనం. జూన్ 1న మల్దకల్ మండలం అమరవాయిలోని డీలర్, సీడ్ ఆర్గనైజర్ తిమ్మారెడ్డి ఇంట్లో క్వింటాల్ నకిలీ పత్తి విత్తనాలు దొరికాయి. -
బ్లాక్ మార్కెటింగ్‌తో పన్నుల ఎగవేత
న్యూఢిల్లీ: పన్నుల విధానాన్ని సమర్ధంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించి జీఎస్టీ విధానం ప్రవేశపెట్టగా.. అది అమల్లోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల్లో దిగుమతిదారులు భారీ స్థాయిలో పన్ను ఎగవేతలకు కొంగొత్త మార్గాలు అనుసరిస్తున్నారు. దిగుమతుల విలువను తగ్గించి చూపడం, బ్లాక్ మార్కెట్ తదితర మార్గాల్లో దిగుమతిదారులు పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దిగుమతిదారులు జీఎస్టీ చెల్లిస్తున్నప్పటికీ, కొనుగోలుదారులకు బిల్లులు ఇవ్వకుండా విక్రయిస్తున్నట్లు గణాంకాల విశ్లేషణలో పన్నుల శాఖ గుర్తించింది. దిగుమతిదారులు చెల్లిస్తున్న జీఎస్టీకి, ఆ తర్వాత నమోదవుతున్న రీఫండ్ క్లెయిమ్‌లకు మధ్య వ్యత్యాసాలు ఉంటుండటంతో ఈ అభిప్రాయానికి వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రాథమిక విశ్లేషణ ప్రకారం 73,000 పైచిలుకు సంస్థలు రూ. 30,000 కోట్ల మేర ఐజీఎస్టీ చెల్లిస్తున్నప్పటికీ.. వాటికి సంబంధించి రీఫండ్ మాత్రం క్లెయిమ్ చేయడం లేదు. లగ్జరీ ఉత్పత్తులు, మొబైల్ ఫోన్స్ దిగుమతులకు సంబంధించి భారీ స్థాయిలో పన్నుల ఎగవేతలు ఉండవచ్చని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ పార్ట్నర్ రజత్ మోహన్ పేర్కొన్నారు. వీటి దిగుమతి విలువను తక్కువగా చూపించి, బ్లాక్మార్కెట్లో విక్రయిస్తుండవచ్చని ఆయన తెలిపారు. ఆదాయ పన్ను శాఖ గణాంకాల విశ్లేషణ చేపట్టిన నేపథ్యంలో త్వరలోనే ఎగవేతదారులను గుర్తించి, చర్యలకు సిద్ధమయ్యే అవకాశం ఉందన్నారు. -
నల్లబజారుకు రేషన్‌బియ్యం
రేషన్‌బియ్యం మాఫియా పెచ్చరిల్లుతోంది. అందినంత చౌకబియ్యాన్ని రూటు మార్చి, బియ్యం రూపు మార్చి నల్లబజారుకు తరలించి సొమ్ముచేసుకుంటోంది. అధికార పార్టీ నేతల అండదండలతో అధికారుల హెచ్చరికలను పెడచెవినపెట్టి తమ దందా కొనసాగిస్తోంది. నరసరావుపేటటౌన్: అధికారులు ఓవైపు హెచ్చరిస్తున్నా రేషన్ మాఫియా ఆగడాలను ఆపడం లేదు. పేదలకు పంచాల్సిన బియ్యాన్ని యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తంతు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ ఆలస్యంగా మేల్కొన్న అధికార యంత్రాంగం అక్రమ బియ్యం రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ అక్రమార్కులకు అధికారపార్టీ అండదండలు పుష్కలంగా ఉండటంతో తమ అక్రమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రతినెలా వేల క్వింటాళ్ల కొద్దీ ప్రజాపంపిణీ బియ్యాన్ని మాఫియా రూటుమార్చి...రూపుమార్చి పక్కదారి పట్టిస్తూనే ఉంది. వివరాల్లో కెళితే...డివిజన్ కేంద్రమైన నరసరావుపేట మండల పరిధిలో ఉన్న 115 చౌకదుకాణాల ద్వారా 49వేల మంది కార్డుదారులకు 757మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రతినెలా పంపిణీ చేయాల్సి ఉంది. అందులో కార్డుదారులకు నామమాత్రంగా పంపిణీ చేసి మిగిలిన బియ్యాన్ని డీలర్లు నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారనేది బహిరంగ రహస్యమే. ఈతంతు ఒక్క నరసరావుపేటలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. తెలుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకు ఉన్న రేషన్ డీలర్లను అకారణంగా తొలగించి వారి స్థానాల్లో పార్టీ ద్వితియశ్రేణి నాయకులను నియమించారు. దీంతో రేషన్ అక్రమాలపై అనేక ఫిర్యాదులు వచ్చినా పౌరసరఫరాల, రెవెన్యూ శాఖల అధికారులు రేషన్‌షాపుల వైపు నామమాత్రపు తనిఖీలు కూడా చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. కొంతమంది డీలర్లు ప్రతినెలా కార్డుదారుల నుంచి వేలిముద్రలు వేయించుకొని బియ్యం ఇవ్వకుండా నగదు ఇస్తున్నారు. బియ్యం పంపిణీ చేయాలని కోరినప్పటికీ వచ్చేనెల తీసుకోండి అంటూ ప్రతినెలా అదేమాట చెప్పి రేషన్ బియ్యాన్ని భోంచేస్తున్నారు. పర్యవేక్షణ లేమి... ప్రతినెలా కార్డుదారులకు పంపిణీ చేసేందుకు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి చౌకదుకాణాలకు వేలాది క్వింటాళ్ల బియ్యం దిగుమతి అవుతుంది. గతంలో రూట్ అ«ధికారైన ఆర్ఐ పర్యవేక్షణలో బియ్యం దిగుమతి జరిగేది. ప్రజాపంపిణీ బియ్యం రవాణా వాహనానికి జీపీఆర్ఎస్ సిస్టం అమర్చడంతో రూట్ అధికారులను తొలగించారు. దీంతో రేషన్ షాపుల వద్ద బియ్యం దిగుమతి సమయంలోనే అక్రమార్కులు సంచులు మార్చి నల్లబజారుకు తరలిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. దీంతోపాటు ప్రజాపంపిణీ సక్రమంగా జరుగుతుందా లే దా అనే అంశాన్ని అధికారులు విస్మరించారు. దీంతో డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించకపోవడంతో గంటల కొద్ది వేచిఉన్న కార్డుదారులు అసహనంతో వెనుదిరిగి పోవడం పరిపాటిగా మారింది. రేషన్‌సరుకుల కోసం కాళ్ళరిగేలా తిరగలేక డీలరిచ్చినంత పుచ్చుకుంటున్నారు కార్డు దారులు. ఇలా సేకరించిన బియ్యాన్ని సంచులు మార్చి బియ్యం మాఫియా రాష్ట్రాలను దాటిస్తుంది. ప్రతినెలా డీలర్ల నుంచి రెవెన్యూ, పోలీస్‌శాఖ మామూళ్ళు తీసుకుంటూ నిద్రావస్థలో నటిస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సామాజిక బృందం తనిఖీతో వెలుగు చూసిన అక్రమాలు... సామాజిక తనిఖి బృందం గతేడాది అక్టోబర్ నెలలో నకరికల్లు, రొంపిచర్ల, ఈపూరు మండలాల్లోని చౌకదుకాణాల్లో తనిఖీలు చేపట్టింది. 107చౌకదుకాణాల్లో అవకతవకలు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. వారిచ్చిన నివేదిక ఆధారంగా ఇటీవల ఆర్డీవో గంధం రవీందర్ 87రేషన్ డీలర్లను తొలగించారు. బియ్యం అక్రమ రవాణాను నివారించేందుకు పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖాధికారులను కలిపి జేఏసీగా ఏర్పాటు చేశారు. దీంతోపాటుగా బియ్యం అక్రమాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు కంట్రోల్ రూంను ఏర్పాటుచేసి పర్యవేక్షణకు ఏఎస్‌వోను అధికారిగా నియమించారు. మొదటివిడత నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గంలో పలు మండలాలను పైలెట్ మండలాలుగా గుర్తించారు. జేఏసీ బృందం ప్రతిరోజు చౌకదుకాణాలను తనిఖీ చేసి అక్రమాలకు పాల్పడిన డీలర్లపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. అక్రమ రవాణాను జేఏసీ అరికట్టేనా? ఆర్డీఓ గంధం రవీందర్ బియ్యం అక్రమ రవాణాపై జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటుచేసిన రెండో రోజే రొంపిచర్ల మండలం విప్పర్లరెడ్డిపాలెంలోని ఓ చౌకదుకాణంలో 41క్వింటాళ్ల ప్రజాపంపిణీ బియ్యం దుర్వినియోగం అయింది. దీంతోపాటు గత 20రోజుల క్రితం ప్రకాష్‌నగర్, సత్తెనపల్లి రోడ్డు రెండు ప్రాంతాల్లో రేషన్‌బియ్యం అక్రమంగా తరలిస్తున్న ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారి అధికారపార్టీ కౌన్సిలర్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం ఏంజల్ టాకీస్ ప్రాంతంలోని ఓ చౌకదుకాణ డీలరు రేషన్ బియ్యాన్ని రాత్రిపూట అక్రమంగా తరలిస్తున్నాడు. సమాచారం అందుకుని పోలీసులు అక్కడికి చేరుకునే సరికి బియ్యంలోడు ఆటో వెళ్ళిపోయింది. అధికారులు హెచ్చరిస్తున్నా...నివారణకు చర్యలు చేపడుతున్నా...బియ్యం మాఫియా మాత్రం తన ఆగడాలను ఆపడం లేదు. ఉన్నతస్థాయి అధికారులు దృష్టిసారిస్తే గానీ బియ్యం మాఫియా నియంత్రణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. -
జీఎస్టీతో జీరో దందా!
సాక్షి, హైదరాబాద్ : వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి రావడం, చెక్‌పోస్టులను ఎత్తివేయడంతో.. రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా సరుకులు రాష్ట్ర మార్కెట్లోకి వస్తున్నాయి. పన్ను ప్రసక్తే లేకుండా పెద్ద ఎత్తున జీరో దందా సాగుతోంది. ప్రభుత్వ ఖజానాకు రూ.వందల కోట్లలో చిల్లు పడుతోంది. దాదాపు ఆరు నెలలుగా జరుగుతున్న ఈ తంతు అక్టోబర్ నుంచి ఊపందుకుందని.. దీంతో పన్నులశాఖ దాడులకు ఉపక్రమించిందని చర్చ జరుగుతోంది. అడ్డదారులు.. అనేక మార్గాలు వాస్తవానికి ఏ రాష్ట్రంలోనైనా సరుకుల బ్లాక్‌మార్కెట్, జీరో దందా ఎప్పుడూ ఉండేదే. కానీ జీఎస్టీ నేపథ్యంలో పన్నుల శాఖ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటంతో ఇది విచ్చలవిడిగా మారింది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు గుజరాత్, కేరళ, రాజస్థాన్ల నుంచి చాలా రకాల సరుకులు ఎలాంటి బిల్లులు లేకుండానే రాష్ట్రానికి దిగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రం నుంచి టైల్స్, టైక్స్టైల్స్.. గుజరాత్‌లోని ఉంజా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి జీలకర్ర, జీడిపప్పు, ధనియాలు, ఖర్జూర లాంటి వస్తువులు.. రాజస్థాన్ నుంచి గ్రానైట్, మార్బుల్స్, హ్యాండ్లూమ్స్ వంటివి రాష్ట్రంలోని బ్లాక్‌మార్కెట్‌కు వెల్లువలా వస్తున్నాయి. కేరళ నుంచి ప్లైవుడ్, టింబర్... గోవా నుంచి ట్రావెల్ బస్సుల్లో గుట్కాలు, ఢిల్లీ చాందినీ మార్కెట్ నుంచి చైనా వస్తువులు, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ పరికరాలు, ప్లగ్గులు, స్విచ్‌లు, వైర్లు, ఫ్యూజ్‌లు ఇక్కడి మార్కెట్లోకి పెద్ద మొత్తంలో వస్తున్నాయి. నిత్యావసరాలు కూడా.. నిత్యావసరాలైన కందిపప్పు, శనగలు, గోధుమ పిండి, మైదా, రవ్వ వంటి సరుకులు కూడా బిల్లుల్లేకుండానే వందల టన్నులు వస్తున్నాయని.. ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. సీజన్‌ను బట్టి ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పంచదార పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి వస్తోందని పన్నుల శాఖ అధికారులే చెబుతున్నారు. ఇదంతా పన్నుల శాఖ అధికారులకు తెలియనిదేమీ కాదని.. ఉన్నతాధికారులు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే బ్లాక్ మార్కెట్ వ్యవహారం శ్రుతి మించడంతో అధికారులు ఇటీవల రెండుసార్లు దాడులు చేశారని.. స్పెషల్ డ్రైవ్‌లకు శ్రీకారం చుట్టారని అంటున్నారు. ఈ దాడుల్లో మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన సరుకులే ఎక్కువగా పట్టుబడ్డాయని చెబుతున్నారు. మన దగ్గరి నుంచి కూడా.. మన రాష్ట్రం నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఐరన్ ఉత్పత్తులు బిల్లులు లేకుండా వెళ్లిపోతున్నాయి. బళ్లారి నుంచి వచ్చే ముడిసరుకుతో శంషాబాద్, షాద్‌నగర్‌లలో ఐరన్ ఉత్పత్తులను తయారుచేసి బెంగళూరుకు తరలిస్తున్నారు. ఇలా కనీసం రోజుకు 50 లారీల ఐరన్ ఉత్పత్తులు ఎలాంటి బిల్లులు లేకుండా, పన్ను కట్టకుండా ఇతర రాష్ట్రాలకు వెళుతున్నట్టు అంచనా. ట్రాన్స్పోర్టర్లు, డీలర్లు కుమ్మక్కై పెద్ద ఎత్తున సరుకులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడం బ్లాక్ మార్కెట్ సమస్య పెరుగుతోంది. స్పెషల్ డ్రైవ్‌లు సరేగానీ.. దాదాపు ఆరు నెలలుగా సాగుతున్న జీరో దందాతో రాష్ట్ర ప్రభుత్వానికి వందల కోట్ల నష్టం జరిగిన తర్వాత మేల్కొన్న పన్నుల శాఖ అధికారులు... ఈనెల ఏడో తేదీన పెద్ద ఎత్తున దాడులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 12 బృందాలుగా ఏర్పడి 2 వేలకు పైగా వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో ఎలాంటి బిల్లులు లేకుండా 126 వాహనాల్లో రవాణా అవుతున్న సరుకులను సీజ్ చేసి.. రూ. 1.25 కోట్లు జరిమానా విధించారు. అంతకు ముందు హైదరాబాద్‌లో దాడులు చేసి రూ. 34 లక్షలు జరిమానా వసూలు చేశారు. అయితే ఈ దాడులను మరింత విస్తృతం చేయాల్సి ఉందని, అప్పుడు అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని పన్నుల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన 12 బృందాలకు షెడ్యూల్ ఇచ్చి.. తగిన శిక్షణ అందించి తనిఖీలు చేపట్టాలని చెబుతున్నారు. -
జీఎస్టీలో జీరో దందా!
సాక్షి, హైదరాబాద్: వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో జీరో (పన్ను చెల్లించకుండా విక్రయాలు) దందా విజృంభిస్తోంది. ఐరన్ అండ్ స్టీల్, మసాలా దినుసులు, డ్రైఫ్రూట్స్, సిరామిక్ టైల్స్, సిమెంటు వంటి సరుకులకు సంబంధించి జీరో దందా జోరుగా సాగుతోంది. ఏ రాష్ట్రం నుంచి ఏ సరుకు వస్తోందో తెలుసుకునే నిఘా వ్యవస్థ అయిన చెక్‌పోస్టులను ఎత్తివేయడం, మొబైల్ తనిఖీలను కూడా చేపట్టకపోవడంతో వేల కోట్ల విలువైన సరుకులు బ్లాక్‌మార్కెట్‌కు తరలివెళుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి వందల కోట్లలో ఆదాయం చేజారుతున్నా... పన్నుల శాఖలో కదలిక రావడం లేదు. ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాలు జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలి నెల నుంచే మొబైల్ తనిఖీలు చేపట్టి, పన్ను ఎగవేతలను అరికడుతున్నాయి. రాష్ట్రంలో మాత్రం అధికారులు ఇంకా మీనమేషాలు లెక్కిస్తుండటం గమనార్హం. ఒక్క రోజు తనిఖీల్లోనే రూ. 34 లక్షలు ఇటీవల రాష్ట్ర ఉన్నతాధికారులు విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనే జీరో దందా తీరును స్పష్టంగా చూపుతోంది. ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ తనిఖీలు చేపట్టి 34 వాహనాలను సీజ్ చేసి, రూ.34.36 లక్షల జరిమానా విధించామని ఆ శాఖ కమిషనర్ ప్రకటించారు. ఒక్క రోజు తనిఖీల్లోనే ఇలా ఉంటే.. ఇంతకాలంగా ఎన్ని వందల కోట్ల్ల పన్నుకు చిల్లు పడిందో అర్థమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బృందాలు తనిఖీలు నిర్వహిస్తే ఏకంగా నెలకు రూ.100 కోట్ల మేర సమకూరే అవకాశముందని అంటున్నారు. దీనివల్ల ఇటు సర్కారుకు ఆదాయంతోపాటు జీరో దందా నడవదని అటు వ్యాపారులకు సంకేతాలు ఇచ్చినట్టవుతుందని పేర్కొంటున్నారు. సానుకూల దృక్పథమంటే.. వదిలేయడం కాదు! కొత్త పన్ను విధానాన్ని తీసుకువస్తున్నందున వ్యాపారుల పట్ల కొంత సానుకూల దృక్పథా న్ని కనబర్చాలని జీఎస్టీ అమల్లోకి వచ్చిన తొలినాళ్లలో (ఆరు నెలల క్రితం) కేంద్రం చిన్న సూచన చేసింది. దీనిని సాకుగా తీసుకున్న ఉన్నతాధికారులు రాష్ట్ర పన్నుల శాఖను ఓ రకంగా నిద్రావస్థకు చేర్చారన్న విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు రవాణాదారులు, డీలర్లు కుమ్మక్కై వేల కోట్ల విలువైన సరుకులతో రాష్ట్ర మార్కెట్లో జీరో దందా చేస్తున్నా పట్టించుకో వడం లేదని... పాత బకాయిలు వసూలు చేసేందుకు, జీఎస్టీ రిజిస్ట్రేషన్ల కోసమే సిబ్బం దిని వాడుకుంటున్నారని పన్నుల శాఖ అధికా రులే పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మొబైల్ తనిఖీలు ముమ్మరం చేసి, పన్ను ఎగవేతదా రులకు చెక్ పెట్టాల్సి ఉందని అంటున్నారు. కేవలం కాగితాల మీదే.. మొబైల్ తనిఖీల విషయంలో ఇటీవలే మేల్కొన్న రాష్ట్ర పన్నుల శాఖ.. తూతూమంత్రంగా చర్యలకు ఉపక్రమిం చింది. రాష్ట్రంలోని 12 వాణిజ్య పన్నుల డివిజన్లకు గాను 24 మొబైల్ తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది. ప్రతి బృం దంలో ఉపపన్నుల అధికారి (డీసీటీవో), సహాయ పన్నుల అధికారి (ఏసీటీవో)లతో పాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు కలిపి నలుగురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు వెలువడి పది రోజులవుతున్నా.. ఒక్కరోజు కూడా మొబైల్ తనిఖీలు జరగకపోవడం గమనా ర్హం. అంతేకాదు.. అసలు ఎప్పుడు తనిఖీ లు నిర్వహించాలి, జీఎస్టీ నేపథ్యంలో తనిఖీలు ఎలా ఉండాలన్న దానిపైనా స్పష్టత లేకుండా.. కేవలం కాగితాల మీద ఉత్తర్వులిచ్చి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. -
కిరో‘సీన్’
ఏలూరు (మెట్రో) : వచ్చే నెల నుంచి రేషన్ కార్డులపై కిరోసిన్ పంపిణీని నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే అదునుగా డీలర్లు బరితెగించారు. మే నెల కోటాగా జిల్లాకు విడుదలైన కిరోసిన్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలించారు. జిల్లాలోని 2,040 రేషన్ షాపుల ద్వారా మే నెలలో 1,243 కిలోలీటర్ల కిరోసిన్‌ను కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 759 కిలోలీటర్లు మాత్రమే విడుదల చేసింది. అందరికీ దీపం గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశామంటూ ఈ నెల కిరోసిన్ కోటాలో 40 శాతం కోత విధించారు. 559 కిలోలీటర్లు బ్లాక్ మార్కెట్‌కు.. వచ్చే నెల నుంచి కిరోసిన్ పంపిణీ నిలిచిపోనుండటంతో ఇదే చివరి అవకాశంగా భావించిన డీలర్లు సుమారు 559 కిలోలీటర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించారు. కార్డుదారుకు లీటర్ రూ.19కి ఇవ్వాల్సిన ఈ కిరోసిన్‌ను రూ.40 నుంచి రూ.50 చొప్పున ధర కట్టి నల్లబజారుకు తరలించారు. జిల్లాకు 759 కిలోలీటర్లు విడుదల కాగా.. ఇందులో 200 కిలో లీటర్లు కూడా వినియోగదారులకు చేరలేదు. కార్డుదారులు రేషన్ డిపోలకు వెళ్లి కిరోసిన్ అడిగితే.. మే నెల నుంచే పంపిణీ నిలిచిపోయిందని అడ్డంగా బొంకారు. బియ్యం, పంచదార తీసుకున్న సమయంలోనే కిరోసిన్ కూడా తీసుకున్నట్టు ఈపోస్ యంత్రాల్లో నమోదు చేసి దొడ్డిదారిన నల్లబజారుకు తరలించారు. వంతపాడిన పౌర సరఫరాల శాఖ ! రేషన్ డీలర్ల వద్ద నుంచి ప్రతినెలా కాసులకు కక్కుర్తి పడుతున్న పౌర సరఫరాల శాఖ ఈ నెలలో కనీసం రేషన్ షాపుల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కిరోసిన్ ఇవ్వడం లేదని కార్డుదారులు బహిరంగంగా చెబుతున్నా చెవికెక్కించుకున్న పాపాన పోలేదు. కిరోసిన్ కోటాకు సైతం పౌర సరఫరాల అధికారులకు ముడుపులు అందిన కారణంగానే మిన్నకుండిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తనిఖీలు నిర్వహిస్తున్నాం కార్డుదారులకు రేషన్ సరుకులు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే దానిపై ప్రతినెలా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఎటువంటి అక్రమాలు లేవు. కిరోసిన్ నల్లబజారుకు తరలిందనేది అవాస్తవం. – సయ్యద్ యాసిన్, జిల్లా పౌర సరఫరాల అధికారి -
అనంతలో బాహుబలి2 బ్లాక్ టికెట్ల దందా
-
బాహుబలి2 బ్లాక్ టికెట్ల దందా
-
బ్లాక్ దందా!
పక్కదారి పట్టిన ఐపీఎల్ టికెట్లు ► బ్లాక్‌లో 4 రెట్ల ధరకు అమ్మకం ► మండిపడుతున్న అభిమానులు ► పేరుకే ఆన్లైన్.. జరిగేదంతా ఆఫ్‌లైన్ ► విక్రయ కేంద్రాల్లోనూ గోల్మాలే.. ► రెండు మ్యాచ్‌ల్లో రూ.2 కోట్లకుపైగా దందా ► ఇప్పటిదాకా 40 మంది అరెస్టు.. బెట్టింగ్‌కూ రెక్కలు.. కోట్లలో లావాదేవీలు జోరుగా బెట్టింగ్ ఐపీఎల్ ఫీవర్‌ను క్యాష్ చేసుకునేందుకు ఓవైపు బ్లాక్ టికెట్ ముఠాలు దందాకు తెరలేపగా.. మరోవైపు ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఒక్క హైదరాబాద్‌లోనే ఒక్కో మ్యాచ్‌కు కోట్లలో బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్‌పై కన్నేసిన సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు జీడిమెట్ల హెచ్ఎంటీ సొసైటీకి చెందిన మహేందర్తాక్ (32)ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ ట్వంట్వీ–20 టికెట్లు పక్కదారి పట్టాయి. క్రికెట్ అభిమానులకు టికెట్ దొరకడమే గగనమవుతోంది. భారీ డిమాండ్, అభిమానుల్లో క్రికెట్ క్రేజ్‌ను సొమ్ము చేసుకుంటూ అక్రమార్కులు బ్లాక్ దందాకు తెరలేపారు. ఆన్‌లైన్‌తోపాటు హైదరాబాద్‌లో 12, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌లో మూడు టికెట్ విక్రయ కేంద్రాలున్నా అభిమానులకు అందడం లేదు. తమ అభిమాన క్రికెటర్ల ఆట చూసేందుకు.. చేసేది లేక బ్లాక్‌లో టికెట్ ధరకు నాలుగింతలు ఎక్కువ చెల్లించి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి క్యూ కడుతున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో రూ.2 కోట్లకు పైనే బ్లాక్ టికెట్ల వ్యాపారం జరిగిందని సమాచారం. పేరుకే ఆన్లైన్.. ఐపీఎల్ టికెట్లను www.sunrisershyderabad.in, ఈవెంట్స్ నౌ సైట్ల ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు యత్నిస్తున్న అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. కొందరు వ్యక్తులు ఆన్లైన్లో ముందుగానే పెద్దమొత్తం(బల్క్)గా టికెట్లను బుక్ చేసుకొని మ్యాచ్ సమయానికల్లా వాటిని బ్లాక్‌లో విక్రయిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. బ్లాక్ టికెట్లను అమ్మేందుకు కొందరు ఏజెంట్లను నియమించుకొని మరీ దందా నడుపుతున్నారని పేర్కొంటున్నారు. నగరంలోని టికెట్ విక్రయ కేంద్రాల వద్దే కొందరు బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్నారని అభిమానులు చెబుతున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద భారీ క్యూ పెరిగే వరకు చూసి, ఆ తర్వాత కొందరికే టికెట్లు ఇచ్చి మిగతా వారికి లేవని చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. విక్రయ కేంద్రాల్లో టికెట్లేవీ? సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్, బషీర్‌బాగ్‌లోని ఎల్బీ స్టేడియం, ఉప్పల్‌లోని జీహెచ్ఎంసీ గ్రౌండ్, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా, జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్ షాపింగ్ మాల్‌తోపాటు నగరంలోని పలు ’జస్ట్ బేక్’ఔట్లెట్లలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టిక్కెట్లను అమ్ముతున్నామని హెచ్‌సీఏ అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. టికెట్లన్నీ అమ్ముడు పోయాయని చెబుతుండడంతో చాలా మంది వెనుదిరుగుతున్నారు. కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్, వరంగల్‌లోని గ్రీన్ స్క్వేర్ ప్లాజా, నిజామాబాద్‌లోని ఉషా మయూరి మల్టిప్లెక్స్‌లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉప్పల్ స్టేడియంలో ఇప్పటికే రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇక్కడే మరో ఐదు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లకైనా బ్లాక్ టికెట్ దందాను అరికట్టాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. 40 మంది అరెస్టు మ్యాచ్ జరిగే రోజున ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ విక్రేతలు వాలిపోతున్నారు. రోడ్లపై నిలబడి ప్రేక్షకులతో బేరసారాలు నడుపుతున్నారు. రూ.500 టికెట్‌ను రూ.2,000కు, రూ.750 టికెట్‌ను రూ.3,000కు అమ్ముతున్నారు. తొలి మ్యాచ్ జరిగిన రోజున (ఏప్రిల్ 5న) 13 మందిని, ఆదివారం మరో 27 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 68 టిక్కెట్లు, రూ.32 వేలు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ దందా నడిపితే కఠిన చర్యలు బ్లాక్ టికెట్ దందా నడిపేందుకు కొన్ని ముఠాలు రంగంలోకి దిగినట్టు మాకు సమాచారం ఉంది. వారు గంపగుత్తగా టికెట్లు కొని బ్లాక్‌లో భారీ ధరలకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే వీరిపై కన్నేశాం. ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ గట్టి నిఘా పెట్టాం. బ్లాక్ దందా చేసే వారిపై కఠిన చర్యలుంటాయి. – మహేష్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్ సీరియస్‌గా తీసుకోవాలి ఐపీఎల్ టికెట్ల విక్రయాలకు సంబంధించి ఐపీఎల్, సన్‌రైజర్స్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో హైదరాబాద్ క్రికెట్ సంఘానికి ఎలాంటి పాత్ర లేదు. ఐపీఎల్ టికెట్లను పారదర్శక విధానంలో విక్రయించి అభిమానులకు అసౌకర్యం కలగకుండా చూడాలి. బ్లాక్ టికెట్ల అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలి. – గడ్డం వినోద్, హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు నిరాశే మిగిలింది.. ఆదివారం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూడాలని ఆశతో వస్తే టికెట్ దొరకకపోవడంతో నిరాశగా వెళ్లాల్సి వచ్చింది. టిక్కెట్ల జారీలో పారదర్శకత లోపించింది. రత్నాకర్, అల్వాల్. ఎక్కడికి వెళ్లినా దొరకడం లేదు ఆన్లైన్లో సెర్చ్ చేశా. కౌంటర్ల వద్దకు పరుగులు తీశా. ఎక్కడ వెళ్లినా టికెట్లు దొరకడం లేదు. స్నేహితులతో కలసి మ్యాచ్ చూడాలని వస్తే మనశ్శాంతి లేకుండా పోయింది. మేక విశ్వంత్, ఆనంద్‌భాగ్ -
బ్లాక్ మార్కెట్‌కు తరలిన టూవీలర్లు
-
బ్లాక్ మార్కెట్‌కు తరలిన టూవీలర్లు
టూ వీలర్ల అమ్మకాల మీద భారీ డిస్కౌంటులు ప్రకటించడంతో ఒక్కసారిగా ద్విచక్ర వాహనాలు చాలావరకు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయాయి. జంట నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ద్విచక్ర వాహనాలు దొరకడం లేదు. ఒక్కోవాహనం మీద పది వేల నుంచి రూ. 22 వేల వరకు భారీ డిస్కౌంట్లు ప్రకటించడంతో ఎప్పటి నుంచో బైకులు కొందామని ఆలోచనలో ఉన్న వినియోగదారులు షోరూంలకు పోటెత్తారు. పత్రికలలో కూడా ఈ డిస్కౌంట్లకు సంబంధించిన కథనాలు రావడంతో అవి చూసి అంతా వెళ్లారు. కానీ, అప్పటికే చాలా వరకు షోరూంలలో నో స్టాక్ బోర్డులు పెట్టారు. దాంతో వినియోగదారులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. బీఎస్-3 తరహా వాహనాల అమ్మకాలకు మార్చి 31 చివరి తేదీ అని సుప్రీంకోర్టు ప్రకటించడంతో తమ వద్ద పెద్దమొత్తంలో పేరుకుపోయిన వాహనాలను వదిలించుకోడానికి ఆటోమొబైల్ కంపెనీలు ఈ తరహాలో డిస్కౌంట్లు ప్రకటించగా, దాన్ని కొందరు వ్యాపారులు అవకాశంగా మార్చుకున్నారు. ముందుగానే మార్చి 31వ తేదీతో ఇన్వాయిస్లు తయారుచేసి, వాటి మీద వాహనాల వివరాలన్నీ రాసేస్తున్నారు. ఆ తర్వాత తీరిగ్గా డిస్కౌంట్లు అయిపోయిన తర్వాత వాటిని అమ్ముకుని డిస్కౌంట్ మార్జిన్ జేబులో వేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇన్వాయిస్ తేదీ మార్చి 31 లేదా ఆలోపు ఉంటే తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేసుకోడానికి వీలుంటుంది కాబట్టి ఈ కొత్త టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. -
తిరుమల: బ్లాక్‌లో బ్రేక్ దర్శనం టికెట్లు
- దళారి అరెస్టు తిరుమల: తిరుమలలో బ్లాక్‌లో దర్శన టికెట్లను అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరుకు చెందిన భక్తులకు అధిక మొత్తానికి రెండు వీఐపీ టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్న ఓ వ్యక్తిని సోమవారం ఉదయం విజిలెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాళహస్తికి చెందిన రవికిరణ్ తిరుమలలో దళారీగా పని చేస్తూ శ్రీవారి దర్శన టికెట్లను బ్లాక్‌లో అమ్మేవాడు. సోమవారం ఉదయం రెండు వీఐపీ టికెట్లను రూ.11,400 లకు విక్రయిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
‘నిఘా’లోనూ అవినీతే!
విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో భారీగా అవినీతి అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న కొందరు అధికారులు ఏళ్లకేళ్లుగా పాతుకుపోయి దందాలు పోస్టింగ్ కోసం లక్షలు కుమ్మరిస్తున్న వైనం విజిలెన్స్ విభాగంపై దృష్టి పెట్టిన ఏసీబీ ఇటీవలే రూ.లక్ష లంచం తీసుకుంటూ చిక్కిన ఆర్వీవో సాక్షి, హైదరాబాద్: అన్ని విభాగాలపై నిఘా పెట్టాల్సిన విజిలెన్స్ విభాగమే అవినీతికి ఆలవాలంగా మారుతోంది. కొందరు అధికారులు నిబంధనలు తుంగలో తొక్కుతూ అక్రమార్కులకు కొమ్ముకాస్తూ జేబులు నింపుకొంటున్నారు. దీనికి ఉదాహరణే నల్లగొండ రీజినల్ విజిలెన్స్ ఆఫీసర్ (ఆర్వీవో)భాస్కర్‌రావు ఏసీబీకి పట్టుబడడం. ఏళ్లకేళ్లుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పాతుకుపోతున్న ఇలాంటి అధికారులు.. ఇతర విభాగాల అధికారులతో కుమ్మక్కై దందాలు నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. కష్టపడకుండానే సొమ్ములు: రైస్ మిల్లులు, తయారీ పరిశ్రమలు, చెక్‌పోస్టులు, అంతర్రాష్ట్ర సరిహద్దులు.. ఇలాంటి పన్నులు చెల్లించాల్సిన ప్రాంతాలు, సంస్థలపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందించాల్సిన బాధ్యత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానిది. అంతేగాకుండా ప్రభుత్వం ఆదేశించే విచారణలను నిష్పక్షపాతంగా నిర్వహించి.. చర్యలకు సిఫార్సు చేయాలి. కానీ చాలా వరకు ఇందుకు భిన్నంగా జరుగుతోంది. విజిలెన్స్ విభాగం అంటేనే అవినీతి, అక్రమాలకు పాల్పడే సంస్థలు, వ్యక్తులు మోకరిల్లిపోతారు. దీనిని ఆసరాగా తీసుకున్న కొందరు అధికారులు పెద్దగా కష్టపడకుండానే నెలవారీ మామూళ్లు దండుకుంటున్నారు. సాధారణంగా పన్ను వసూలు విషయంలో ప్రభుత్వం ఒక్కో ఆర్వీవోకు రూ.కోటి వరకు టార్గెట్ విధిస్తుంది. ఆయా రీజినల్ అధికారులు అందులో సగానికి పైగా రాబట్టగలిగినా ఆ అధికారి సమర్థుడని కితాబిస్తుంది. అయితే కొందరు అధికారులు.. ప్రభుత్వ టార్గెట్ పూర్తి చేయడంతోపాటు తమ ‘టార్గెట్’నూ పూర్తి చేసుకుంటున్నారు. వివిధ విభాగాల్లో అధికారులపై వచ్చే ఫిర్యాదులను అడ్డుపెట్టుకుని రూ.లక్షల్లో వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. గతంలో ఇలాంటి ఓ అధికారి ఏసీబీకి చిక్కాడు కూడా. పోస్టింగ్ కోసం రూ.లక్షల్లో.. సాధారణంగా విజిలెన్స్ అనగానే పెద్దగా ప్రాచుర్యం లేని పోస్టింగని భావిస్తుంటారు. కానీ ఈ విభాగంలో పనిచేస్తున్న అధికారులు రూ.కోట్లు వెనకేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న రేషన్ బియ్యాన్ని సైబరాబాద్ కమిషనర్ పట్టుకున్న సమయంలో.. విజిలెన్స్ అధికారుల బండారం బయటపడింది. రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా చర్యలు తీసుకోవాల్సిన అధికారులే డీలర్లు, పౌర సరఫరాల అధికారులతో కుమ్మక్కైనట్లు తేలింది. ఇలా అన్ని బ్లాక్ మార్కెట్ దందాల వెనుక కొంత మంది విజిలెన్స్ అధికారులు ఉన్నారని... నాలుగైదేళ్లుగా అదే విభాగంలో పాతుకుపోయారని తెలిసింది. వీరిలో నలుగురు డీఎస్పీలు, ఒక అదనపు ఎస్పీ ర్యాంకు అధికారి ఏకంగా ప్రభుత్వ పెద్దల వద్ద లక్షలు కుమ్మరించి పోస్టింగులు పొందినట్టు ఆరోపణలున్నాయి. ఏసీబీ దూకుడు.. వ్యవస్థలపై పటిష్టమైన నిఘా పెట్టాల్సిన విభాగం విజిలెన్స్ కాగా.. అవినీతిపై యుద్ధం చేసే విభాగం ఏసీబీ. నిఘా విభాగంలోనే అవినీతి రాజ్యమేలితే వ్యవస్థలన్నీ దెబ్బతింటాయనే అభిప్రాయముంది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ బాగోతంపై ఏసీబీ మరింత దూకుడుగా వ్యవరించనున్నట్టు తెలిసింది. నెలరోజులుగా విజిలెన్స్ విభాగంపై దృష్టి కేంద్రీకరించిన ఏసీబీ... మరికొంత మంది అధికారుల అవినీతిపై కొరడా ఝళిపించనున్నట్టు తెలిసింది. -
బార్వాద్ టు ముంబై.. వయా వికారాబాద్
► యథేచ్ఛగా గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్లు ► రైతులను పావులుగా వాడుకుంటూ సాగు ► రైల్వే పోలీసుల కళ్లుగప్పి బోగీల్లో తరలింపు ► ముంబై, సూరత్, పుణెల్లో అమ్మకాలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గంజాయి రవాణాకు వికారాబాద్ అడ్డాగా మారుతోంది. గుట్టుగా సాగుతున్న ఈ దందా వెనుక బడా ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. కోట్‌పల్లి, బంట్వారం మండలంలో వాణిజ్య పంటల మాటున సాగు చేస్తున్న గంజాయి రైలు మార్గాన ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. రైళ్లలో నిఘా, చెక్‌పోస్టులు లేకపోవడంతో మత్తు పదార్థాల రవాణా యథేచ్ఛగా సాగు తోంది. మహారాష్ట్ర లాతూరు కేంద్రంగా పని చేస్తున్న స్మగ్లర్లు ఇక్కడి రైతులను పావులుగా చేసుకొని ఈ అక్రమ దందాను సాగిస్తున్నట్లు ఇటీవల అధికారుల దాడిలో బయటపడింది. నల్లబజారులో గంజాయికి డిమాండ్ నిషేధిత మత్తు పదార్థం కావడంతో నల్లబజారులో గంజాయికి భారీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే లాతూరుకు చెందిన స్మగ్లర్లు అమాయక రైతాంగానికి ఆశ చూపి.. తమ పొలాల్లో గంజాయి సేద్యం చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఈ క్రమం లోనే కర్ణాటక సరిహద్దులోని కోట్‌పల్లి మం డల పరిధిలోని గ్రామాల్లో గంజాయి పంట సాగవుతోంది. పసుపు, కంది పంటల మధ్య లో ఎకరాకు 25 గంజాయి మొక్కలను పెంచు తారు. ఒక్కో మొక్క నుంచి సుమారు అరకేజీ వరకు గంజాయి ఉత్పత్తి అవుతుంది. ఇలా పండించిన గంజాయిని ఎండపెట్టి ఇంట్లో నిల్వ చేసిన తర్వాత లాతూరుకు చెందిన స్మగ్లర్లు గ్రామాలకు వచ్చి.. కిలోకు రూ.2 వేల చొప్పున ఖరీదు చేస్తారు. నేరుగా మధ్యవర్తు లో.. స్మగ్లర్లో ఇంటికే వచ్చి సేకరిస్తున్నందున ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు రైతులు గంజాయి ఉచ్చులో పడ్డారు. ఇదే అదనుగా గతంలో కేవలం బార్వాద్కే పరిమితమైన ఈ దందా ఇతర గ్రామాలకూ పాకింది. తరలింపు ఇలా.. బార్వాద్ నుంచి వికా>రాబాద్ రైల్వేస్టేషన్ మార్గమధ్యంలో చెక్ పోస్టులు లేకపోవడం స్మగ్లర్లకు అనుకూలంగా మారింది. ఈ ప్రాం తం రాష్ట్ర సరిహద్దులో ఉండడం.. చుట్టూ అటవీ ప్రాంతం ఉండడంతో ఎవరూ పసి గట్టరని భావిస్తున్న అక్రమార్కులు గంజాయి సాగుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు కనిపి స్తోంది. వికారాబాద్ నుంచి రాకపోకలు సాగించే రామేశ్వరం –ఓకా ఎక్స్‌ప్రెస్, విశాఖ పట్నం –ముం బై ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్, కాచి గూడ ప్యాసింజర్, కోణార్క్ ఎక్స్‌ప్రెస్, గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ లలో గంజాయిని ముంబై, లాతూరు ప్రాంతాలకు తరలుతున్నట్లు విచారణలో తేలిందని తాండూరు ఎక్సైజ్ ఇన్్స క్టర్ భరత్‌భూషణ్ ‘సాక్షి’కి తెలిపారు. కనిపెట్టకుండా... గంజాయి రవాణాలో ముఠా సభ్యులు పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన మత్తు పదార్థాన్ని లగేజీ బ్యాగుల్లో భద్ర పరిచి.. దాన్ని ప్రయాణికుల బోగీల సీట్ల కింది భాగంలో దాచిపెడతారు. ఈ సంచు లపై అనుమానం రాకుండా మరో బోగీలో ముఠాసభ్యులు ప్రయాణిస్తారు. ఎవరైనా సంచులను పసిగట్టినా ఏమి మట్టి అంటకుం డా బయటపడాలనే ఆలోచనతోనే ఈ ఎత్తు గడ వేస్తున్నట్లు తెలిసింది. రైల్వే పోలీసులు గుర్తించకపోతే ముంబై, సూరత్, పుణెలకు చేరవేస్తారు. కిలో గంజాయిని రూ.7 వేల వర కు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టు వెలుగులోకి వచ్చిందిలా..? వికారాబాద్ జిల్లాలో నెల రోజుల క్రితం తాండూరు ఎక్సైజ్ సీఐ భరత్‌భూషణ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. దాం తో బార్వాద్ కేంద్రంగా కొన‘సాగు’ తోన్న గంజాయి గుట్టు రట్టైంది. వ్యవసాయ పొలా ల్లో సాధారణ పంటల మధ్యలో గంజాయి మొక్కల పెంపకం బహిర్గతమైంది. అధికా రులు రైతులుగా భావిస్తున్న లక్ష్మారెడ్డి, వెంక టయ్య, రాచయ్య, శ్రీశైలం, పాండయ్య ఇళ్ల లో తనిఖీలు నిర్వహించగా బ్యాగుల్లో ఉన్న 43 కిలోల ఎండబెట్టిన గంజాయి లభిం చింది. లక్ష్మారెడ్డి, వెంకటయ్య సాగుచేస్తున్న పసుపు, పత్తి పొలాల్లోనూ అధికారులు తని ఖీలు నిర్వహించారు. పత్తి, పసుపు పొలాల మధ్య గంజాయిసాగు చేసినట్టు తనిఖీల్లో తేలింది. పొలాల్లో 50 కిలోల మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. బార్వాద్ నుంచి వికారాబాద్ రైల్వేస్టేషన్ వరకు చెక్‌పోస్టులు లేకపోవడం.. రైళ్లలో కూడా నిఘా తక్కువగా ఉండడంతో గంజాయి రవాణా సులువుగా సాగుతుండడంతో ఈ ప్రాంతం తమకు అనువుగా స్మగ్లర్లు మలుచుకున్నారు. -
రూటుమారిన సబ్సిడీ శనగలు
ఆటోతో సహా పట్టుబడిన వైనం కురిచేడు: కరువు కాలంలో ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు విడుదల చేసిన సబ్సిడీ శనగ విత్తనాలు రంగుమారి, రూటుమార్చి నల్లబజారుకు తరలి వెళుతుండగా అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పాత్రికేయుల కెమేరాకు దొరికిపోరుున సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రం కురిచేడులోని గ్రోమోర్ కేంద్రం సిబ్బంది అధికార పార్టీకి చెందిన ఒక అపరాల వ్యాపారితో కుమ్మకై ్క మంగళవారం సాయంత్రం సబ్సిడీ శనగల బస్తాలు మార్చి బయటకు తరలిస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 19నుంచి ప్రభుత్వం రైతులకు సరఫరా చేసే శనగల ఆన్లైన్ నిలుపుదల చేసింది. అంతకు ముందు రైతులు కొనుగోలు చేసిన సబ్సిడీ శనగలు వర్షాలు లేక విత్తకుండా ఇళ్లలోనే నిల్వ చేసుకున్నారు. ఈ దశలో గ్రోమోర్లో మిగిలిన శనగలను స్థానిక అపరాల వ్యాపారితో కు మ్మక్కై గ్రోమోర్ సిబ్బంది పక్కదారి పట్టిం చేందుకు సిద్ధమయ్యారు. వ్యవసాయ శాఖాధికారు లు ఎకరాకు 25 కిలోల ప్రకారం గరిష్టంగా ఐదెకరాలకు 125 కిలోలకు మించకుండా ఆన్లైన్ పర్మిట్లు జారీ చేశారు. అరుుతే ఇటీవల నల్లబజారులో శనగల ధరలు అమాంతంగా పెరగడంతో వ్యాపారుల కళ్లు సబ్సిడీ శనగలపై పడ్డారుు. ఆ అపరాల వ్యాపారి తన హవా సాగించి గ్రోమోర్ ప్రతినిధులతో కుమ్మకై ్క ఈ ఉదంతానికి ఒడిగట్టారు. గ్రోమోర్ గోడౌన్లోనే సబ్సిడీ శనగల సంచులు తొలగించి సాధారణ గోతాల్లోకి మార్చివేశారు. అక్కడ నుంచి నేరుగా ఆటోల ద్వారా నల్లబజారుకు తరలిస్తుండగా పట్టుబడ్డారు. వ్యవసాయశాఖ సిబ్బంది సరుకుతో సహా ఆటోను స్వాధీన పరచుకున్నారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసి, బాధ్యులపై తగిన కఠిన చర్యలు తీసుకుంటామని దర్శి ఇన్చార్జి ఏడీఏ సంగమేశ్వరెడ్డి, కురిచేడు ఏవో జ్యోత్సానాదేవి తెలిపారు -
విత్తనాలను నల్ల బజారుకు తరలిస్తే అరెస్టులే
‘సాక్షి’ కథనంపై స్పందించిన మంత్రి పోచారం సాక్షి, హైదరాబాద్: శనగ విత్తనాలను ఎవరైనా నల్ల బజారుకు తరలిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో విత్తనాలను పక్కదారి పట్టించిన ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేశామని వెల్లడించారు. ‘సాక్షి’లో శుక్రవారం ‘సబ్సిడీ శనగకు.. అవినీతి చీడ’ శీర్షికతో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన ఆయన ఎక్కడైనా, ఎవరైనా విత్తనాలను నల్ల బజారుకు తరలిస్తే ఊరుకోబోమని అన్నారు. విత్తనాలకు కొరత లేదని స్పష్టం చేశారు. తాజా లెక్కల ప్రకారం 77,703 క్వింటాళ్ల శనగ విత్తనాలను జిల్లాలకు పంపిణీ చేశామని తెలిపారు. అందులో 57 వేల క్వింటాళ్లు రైతులకు సరఫరా చేశామని, ఇంకా 20 వేల క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో శనగ విత్తనాల సరఫరాకు సంబంధించి ‘సాక్షి’ కథనం నేపథ్యంలో ఆ జిల్లా వ్యవసాయాధికారి నుంచి నివేదిక కోరినట్లు ఆ శాఖ కమిషనర్ జగన్మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. -
నల్ల బజారుకు విత్తనాలు
- బయోమెట్రిక్ అంతా ఉత్తిదే - అధికారుల సహకారంతోనే బ్లాక్‌మార్కెట్‌కు ఖాజీపేట: రైతులకు సబ్సిడీ ద్వారా అందాల్సిన విత్తనాలు అధికారుల సహకారంతో దర్జాగా నల్ల బజారుకు తరలివెళ్లాయి. ఈ విషయం సాక్షి నిఘాలో బట్టబయలైంది. సబ్సిడీ విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నా అధికారులు తమకేమి తెలియదన్నట్లు వ్యవహరించడం గమనార్హం. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలన్న లక్ష్యంతో రైతులకు సబ్సిడీతో శనగ విత్తనాలను శుక్రవారం అధికారికంగా పంపిణీ చేపట్టారు. మొదటి రోజే ప్రభుత్వ లక్ష్యానికి దళారులు తూట్లు పొడిచారు. ఖాజీపేట మండలంలో రబీ సీజన్ కు 200 క్వింటాళ్ల శనగ విత్తనాలు మంజూరయ్యయి. శుక్రవాం ఏటూరు గ్రామంలో విత్తన పంపిణీ చేపట్టారు. అధికారుల ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం ఒక్క రోజు 112 మందికి 25 కేజీల శనగల బ్యాగులు 400 వరకు పంపిణీ చేశారు. ఇందులో సుమారు 150కి పైగా నల్లబజారుకు తరలివెళ్లాయి. అధికారుల మాటలు నీటిమూటలు అక్రమాలను అరికట్టేందుకే బయోమెట్రిక్ విధానం తీసుకు వచ్చామని అధికారులు ప్రకటించారు. ఖాజీపేట మండలంలో బయోమెట్రిక్ పద్ధతిలో విత్తన పంపిణీ చేపడుతున్నాం అని చెప్పారు. కానీ కేవలం మాటలకే పరిమితమయ్యాయి. అధికారికంగానే దర్జాగా విత్తన బస్తాలను ట్రాక్టర్లో కమలాపురాని తరలించారు. వాస్తవానికి విత్తనాలు కావాల్సిన రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ ఆధార్‌కార్డు, పాసుపుస్తకం నమోదు చేసుకోవాలి. వేలి ముద్రలు వేయించుకుని స్లిప్‌లు తీసుకుని మన గ్రోమోర్ దగ్గరకు వెళ్లాలి.అప్పుడే విత్తనాలు రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మన గ్రోమోర్‌కు చెందిన వారు రైతులకు సంభందించిన అన్ని బస్తాలను ఒకే ట్రాక్టర్లో వేశారు. ఆ ట్రాక్టర్ ఏటూరు గ్రామంలోకి వెళ్లి్లంది అక్కడ సుమారు 40నుంచి 50 బస్తాలు దించి మిగిలిన వాటిని కమలాపురానికి తీసుకెళ్లారు.విత్తనాలు దర్జాగా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అధికారులు కూడా తమ వంతుగా సహకరించినట్లు తెలుస్తోంది. సమస్య నుంచి బయట పడేందుకు ఏర్పాట్లు సబ్సిడీ విత్తనాలు నల్లబజారుకు తరలి వెళ్లిన విషయం బయట పడడంతో అప్పడే అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాగోలా ఈవిషం నుంచి బయట పడాలని తమకు కావాల్సిన విధంగా ఇటు ఉన్నతాధికారులను అటు రాజకీయంగా ఉన్న పలుకు బడిన ఉపయోగించి గట్టెక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లు రైతులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. -
రేషన్ దందా
యథేచ్ఛగా రేషన్ బియ్యం పక్కదారి రీ-సైక్లింగ్ లేదా కోళ్ల దాణాకు సరఫరా దండుకుంటున్న వ్యాపారులు దాడులు జరిగినా తగ్గని అక్రమాలు మెదక్/గజ్వేల్/జగదేవ్‌పూర్: ‘కంచే చేను మేసినట్టు’రేషన్ డీలర్ల అక్రమార్జన కొనసాగుతోంది. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని రైస్ మిల్లులకు తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. బియ్యాన్ని నూకలుగా మార్చుతూ కోళ్లదాణాగానూ అమ్మేసుకుంటున్నారు. చర్యలు అంతంతమాత్రంగా ఉండటంతో దందా కట్టడి కావడం లేదు. గజ్వేల్, మెదక్ ప్రాంతాల్లో సాగుతోన్న ఈ దందా పౌరసరఫరాల అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అడ్డాగా గజ్వేల్, మెదక్.. రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరిస్తున్న వ్యాపారులు రీ-సైక్లింగ్ లేదా కోళ్లదాణాకు సరఫరా చేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం ఈ దందాకు అడ్డాగా మారింది. ప్రధానంగా జగదేవ్‌పూర్, గజ్వేల్ మండలాల్లో రేషన్ బియ్యం దందా జోరుగా కొనసాగుతోంది. తాజాగా ఆదివారం 150 క్వింటాళ్ల రేషన్ బియ్యం జగదేవ్‌పూర్‌లో పట్టుబడటమే ఇందుకు నిదర్శనం. నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్, మెదక్ జిల్లాల చిరు వ్యాపారులు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి జగదేవ్‌పూర్‌లో విక్రయిస్తున్నారు. గజ్వేల్‌కు సైతం వివిధ ప్రాంతాల నుంచి అక్రమంగా బియ్యం వస్తున్నాయి. అలాగే మెదక్ ప్రాంతంలో సైతం అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు వ్యవహారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నియోజకవర్గంలోని దాదాపు అన్ని రేషన్ దుకాణాల నుంచి సరుకు నేరుగా రైస్ మిల్లులకు చేరుతోంది. కలిసివచ్చిన సరిహద్దు ప్రాంతం జగదేవ్‌పూర్ మండలం జిల్లా సరిహద్దు ప్రాంతం. అధికారుల పర్యవేక్షణ కూడా ఇక్కడ అంతంతే. దీంతో కొందరు వ్యాపారులు ‘రింగ్’గా ఏర్పడి రేషన్ బియ్యం దందా ప్రారంభించారు. చిరు వ్యాపారుల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ లక్షలు గడిస్తున్నారు. అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో వారి దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. గత ఏడాది నవంబర్‌లో అప్పటి జగదేవ్‌పూర్ తహసీల్దార్ పరమేశం స్థానికంగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న బుద్ద సత్యం దుకాణంపై దాడి చేసి 15 టన్నుల సరుకు పట్టుకున్నారు. ఈ ఏడాది మార్చి 10న తహసీల్దార్ అనిల్.. డీసీఎంలో తరలిస్తున్న బియాన్ని పట్టుకున్నారు. అందులో 60 కిలోల బస్తాలు 120 ఉన్నాయి. ఇదిలాఉండగా గజ్వేల్‌లో గతేడాది జూన్‌లో ఓ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. నెల రోజుల క్రితం గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లోని ఓ రైస్‌మిల్లులో రీ-సైక్లింగ్‌కు యత్నించిన 130 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. బియ్యం సేకరణ ఇలా.. చిరు వ్యాపారులు ఊరురా తిరుగుతూ రేషన్ బియ్యాన్ని సేకరించి ఇంటి వద్ద నీళ్లలో నానబెట్టి నూకలుగా తయారుచేస్తున్నారు. అదేవిధంగా మరికొందరు పసుపు కలిపి అమ్ముతున్నారు. కిలోకు చిరు వ్యాపారులకు రూ.12 నుంచి రూ.14 వరకు ధర అందుతోంది. సేకరించిన సరుకును ప్రతి శనివారం జగదేవ్‌పూర్‌లో వ్యాపారులకు అమ్ముతున్నారు. నల్లగొండ జిల్లా రాజాపేట మండలంలోని కొన్ని ప్రాంతాల నుంచి రేషన్‌బియ్యం దందా జరుగుతోంది. మహిళలు సైతం రంగారెడ్డి జిల్లా మదాపూర్, చీకటిమామిడి, లక్షామపూర్, ముడిచింతలపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి రేషన్‌బియ్యాన్ని రూ.10 కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని వివిధ గ్రామాల బియ్యం ఇక్కడి వస్తున్నాయి. బియ్యాన్ని వ్యాపారులు ఓ గదిలో నిల్వ చేసి పైన నీళ్లు చల్లుతున్నారు. వాటినే రెండు రోజుల్లో నూకలుగా మార్చుతారు. వీటిని కోళ్ల దాణాగా విక్రయిస్తున్నట్టు సమాచారం. రైస్‌మిల్లులకు రేషన్ బియ్యం గతంలో వందల క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పాపన్నపేట మండలంలోని ఓ రైస్‌మిల్లులో విజిలెన్స్ అధికారులు పట్టుకొని సీజ్ చేసిన విషయం విదితమే. అదేవిధంగా మెదక్ మండల పరిధిలోని హవేళిఘణాపూర్‌లోని ఓ రైస్‌మిల్లుకు ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. రెండేళ్ల క్రితం మెదక్ మండలం సర్ధన నుంచి టాటా ఏ ఆటోలో రేషన్ బియ్యం, కిరోసిన్ తరలిస్తుండగా అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు. చిన్నశంకరంపేట మండలం జంగరాయి వాగులో చక్కెరకు సంబంధించిన ఖాళీ బస్తాలను పెద్ద మొత్తంలో పడేశారు. ఇటీవల మెదక్ పట్టణంలోని ఓ రైస్‌మిల్‌లోకి ఆటోలో అక్రమంగా రేషన్‌బియ్యం తరలించినట్లు సమాచారం. ఇలా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రేషన్ సరుకుల అక్రమ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. -
విత్తనాలు, ఎరువులపై నిఘా
♦ పక్కదారి పట్టకుండా చెక్ ♦ ప్రతి దుకాణానికి అధికారి నియామకం ♦ కొనుగోళ్లపై పర్యవేక్షణ బాధ్యత వారిదే ♦ సబ్ డివిజన్ల వారీగా జాబితాలు సిద్ధం ♦ 15 తర్వాత పకడ్బందీగా అమలు ఎట్టకేలకు అధికారులు మేల్కొన్నారు. విత్తనాలు, ఎరువుల పంపిణీలో జిల్లాలో ఏటా ఎదురవుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టడానికి జిల్లా అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. బ్లాక్ మార్కెట్‌కు అవకాశం లేకుండా ప్రతి రైతు అవసరాలు తీరేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం ప్రతి దుకాణంపై నిఘా కొనసాగించే క్రమంలో ఇన్చార్జీలను నియమించనున్నారు. సదరు అధికారి క్రయవిక్రయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఈ రకంగా రైతులకు కొంతవరకైనా మేలు జరిగే అవకాశం ఉంది. గజ్వేల్: జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 5.40 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా. ఇందులో భాగంగానే పత్తి, వరి 90వేల హెక్టార్లు, మొక్కజొన్న 1.30 లక్షల హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉంది. ఏటా 1.25 లక్షల హెక్టార్లలో సాగయ్యే పత్తి ఈసారి తగ్గనుందని భావిస్తున్నారు. మిగతా విస్తీర్ణంలో కూరగాయలు, ఇతర పంటలు సాగవుతాయని అంచనా. ఇందుకోసం అన్ని విత్తనాలు కలుపుకొని 80 వేల క్వింటాళ్లు, సీజన్ ముగిసే సరికి కాంప్లెక్స్, యూరియా తదితర ఎరువులు కలుపుకొని 1.70 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమని గుర్తించారు. సరైన కేటాయింపులు లేక ఏటా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యాపారులు తమ ఇష్టానుసారంగా పంపిణీ చేయడం వల్ల విత్తనాలు, కాంప్లెక్స్, యూరియా దొరక్క రైతులు రోడ్డెక్కే పరిస్థితులు తలెత్తేవి. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితికి అడ్డుకట్ట వేసే క్రమంలో జిల్లా అధికారులు ఈసారి పకడ్బందీగా విత్తనాలు, ఎరువులను పంపిణీ చేయడానికి చర్యలకు ఉపక్రమించారు. నిత్యం పర్యవేక్షణ.. ఇందులో భాగంగా విత్తనాలు, ఎరువుల దుకాణాలపై నిఘా పెంచే క్రమంలో మూడు నుంచి ఆరు దుకాణాలకో అధికారిని ఇన్చార్జిగా నియమించనున్నారు. వ్యవసాయశాఖకు చెందిన వారు కాకుండా రెవెన్యూ అధికారులను ఇన్చార్జిలుగా నియమించనున్నారు. వీరు ఆయా దుకాణాల్లో నిత్యం క్రయవ్రియాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. విత్తనాలు, ఎరువుల పంపిణీ సందర్భంగా ప్రతి రైతు పట్టెదారు పాసుపుస్తకం నెంబర్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రైతుకున్న భూవిస్తీర్ణాన్ని బట్టి విత్తనాలు, ఎరువుల పంపిణీ చేస్తారు. నిబంధనలు పాటించని దుకాణదారునిపై సంబంధిత ఏఓకు లేదా ఏడీఏకు ఇన్చార్జి అధికారులు రిపోర్ట్ చేయగానే తక్షణ చర్యల తీసుకునేలా ఆదేశాలివ్వనున్నారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే లెసైన్స్ సస్పెండ్ చేయడమో లేదా క్రిమినల్ చర్యలకు వెనకాడవద్దని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలోని వ్యవసాయ సబ్ డివిజన్ల నుంచి ఏడీఏలు, రెవెన్యూఅధికారులతో కలుపుకొని జాబితాను తయారు చేసి జేడీఏ కార్యాలయానికి అందజేశారు. దీని ప్రకారం 15వ తేదీ తరువాత ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పక్రియను సమర్థంగా అమలు చేసి తమ ఇక్కట్లు తీర్చాలని రైతులు వేడుకుంటున్నారు. -
రాష్ట్రంలో యథేచ్ఛగా పప్పు ధాన్యాల బ్లాక్ దందా!
కమీషన్ ఏజెంట్లు, బ్రోకర్ల ద్వారా సాగుతున్న అక్రమ రవాణా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల విలువైన పప్పు ధాన్యాలు యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయి. వాణిజ్యపన్నుల శాఖకు నిర్దేశిత 5 శాతం పన్ను చెల్లించకుండా ఇతర రాష్ట్రాల నుంచి జీరో దందా రూపంలో పప్పులను రాష్ట్రానికి తరలిస్తున్నారు. కమీషన్ ఏజెంట్లు, కాన్వాసింగ్ ఏజెంట్లు, బ్రోకర్లుగా వ్యవహరించే కొందరు వ్యక్తుల ద్వారా రాష్ట్రానికి ఏటా రూ.10వేల కోట్ల విలువైన పప్పులు దిగుమతి అవుతుండగా, అందులో 30% సరుకుకే పన్ను వసూలవుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలలోని వాంఖిడి, భైంసా, మద్నూర్, చిరాగ్పల్లి చెక్‌పోస్టుల ద్వారానే అక్రమ రవాణా సాగుతోంది. ఇతర రాష్ట్రాల్లో పప్పులపై పన్ను (వ్యాట్) లేకపోవడం, మన రాష్ట్రంలో 5 శాతం పన్ను విధిస్తుండడంతో చెక్‌పోస్టుల వద్ద సిబ్బందిని మేనేజ్ చేసుకుంటూ వేల కోట్ల రూపాయల విలువైన పప్పులను రాష్ట్రానికి తరలిస్తుండడం గమనార్హం. ఆయా రాష్ట్రాల నుంచి తెలంగాణకు తరలివస్తున్న పప్పుల అక్రమ రవాణా వెనుక ప్రధాన హస్తం కమీషన్ ఏజెంట్లదేనని అధికారులు గుర్తించారు. ఏపీ, కర్ణాటక రాష్ట్రాల దొంగ వేబిల్లులు, ట్రాన్సిట్ పాస్‌లతో రాష్ట్రంలోకి ప్రవేశించే ట్రక్కులు కొన్నైతే, ఎలాంటి కాగితాలు లేకుండానే కంది, మినప, పెసర తదితర పప్పులను రవాణా చేయడం ద్వారా ఏజెంట్లు కోట్లకు పడగలెత్తారు. అక్రమ వ్యాపారంపై అధికారుల కన్ను రాష్ట్రానికి తరలివస్తున్న పప్పు ధాన్యాలకు, మార్కెట్లలోని నిల్వలకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉండడంతో పౌరసరఫరాల శాఖ ఈ ఏడాది మార్చిలో వాణిజ్యపన్నుల శాఖను అప్రమత్తం చేసింది. ఏకంగా మంత్రి ఈట ల రాజేందర్, పరిస్థితిని సమీక్షించాలని ఆదేశాలు జారీ చేయడంతో వాణిజ్యపన్నుల శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో వినియోగమయ్యే పప్పులకు 5 శాతం పన్ను కింద కనీసం రూ.500 కోట్ల వరకు రావలసి ఉండగా, 2015-16లో కేవలం రూ.163 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో ఇటీవ ల ఒకేరోజు 60 బృందాలను ఏర్పాటు చేసి, హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, వరంగల్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లోని ప్రధాన కమీషన్ ఏజెంట్లు, బ్రోకర్లపై దాడికి దిగారు. వారి రికార్డులను పరిశీలిస్తే రూ.10వేల కోట్లకు పైగా విలువైన పప్పు ధాన్యాలు రాష్ట్రానికి తరలివచ్చినట్లు ప్రాథమికంగా తేలింది. -
తినేటోళ్లకు తిన్నంత!
♦ ప్రజా పంపిణీలో ఇష్టారాజ్యం ♦ తప్పుడు తూకాలతో బియ్యం ♦ నొక్కేస్తున్న పలువురు డీలర్లు ♦ ఇతర వస్తువులను బలవంతంగా అంటగడుతున్న వైనం ♦ కిరోసిన్ పంపిణీ చేయకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలింపు ♦ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో బలవంతపు వసూళ్లు ♦ నేడు విజిలెన్స్ కమిటీ సమావేశం కడప సెవెన్‌రోడ్స్ : ప్రజా పంపిణీ వ్యవస్థ జిల్లాలో గాడి తప్పింది. కింది స్థాయిలో డీలర్లది ఇష్టారాజ్యంగా మారింది. పేదలకు అందాల్సిన బియ్యం, చక్కెర, కిరోసిన్ వంటి నిత్యావసరాలను దారి మళ్లిస్తూ జేబులు నింపుకుంటున్నారు. డబ్బాలతో బియ్యం వేస్తూ తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. కడపలో కొన్ని ఎఫ్పీ షాపులు మాల్స్‌ను తలపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఇతర సరుకులను వినియోగదారులకు బలవంతంగా అంటగడుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. డబ్బాలతో తూకాలు తూకాల్లో మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం డీలర్లకు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను ఇచ్చింది. కానీ జిల్లాలో పలుచోట్ల ఇప్పటికి డబ్బాలతో తూకాలు వేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. సాక్షాత్తు జిల్లా కేంద్రంలోనే డీలర్లు డబ్బాలతో తూకాలు వేస్తున్నారు. శుక్రవారం ‘సాక్షి’ నగరంలోని సాయిపేటలో ఉన్న 117వ ఎఫ్పీ షాపును సందర్శించగా అక్కడ డబ్బాలు దర్శనమిచ్చాయి. ఒక్కో డబ్బా కనీసం కిలో బరువు ఉంటుందని తెలుస్తోంది. ఎంతలేదన్నా ఒక క్వింటాలుకు 10 కిలోల బియ్యాన్ని తూకాల ద్వారా డీలర్లు కాజేస్తున్నారు. కిలో రూ.10 చొప్పున బయట విక్రయించుకున్నా రూ.100 వస్తుంది. ఒక్కొ డీలర్ కనీసం వంద క్వింటాళ్లు బియ్యం పంపిణీ చేసినా 10 వేల రూపాయలు జేబులో వేసుకుంటున్నారు. లీగల్ మెట్రాలజీ అధికారులు అడపా దడపా తనిఖీలు నిర్వహిస్తూ చేతులు దులుపుకోవడం వల్ల పరిస్థితిలో మార్పు రావడం లేదు. కిరోసిన్‌లో.... ప్రభుత్వం బియ్యంతోపాటు కిరోసిన్ కూడా ఒకే సమయంలో సరఫరా చేయకపోవడం డీలర్లకు వరంగా మారింది. బియ్యం పంపిణీ అయిపోయిన తర్వాత కిరోసిన్ కేటాయిస్తున్నారు. దీపం, జనరల్ కనెక్షన్ ఉన్న కార్డు దారులకు ఒక లీటరు చొప్పున కిరోసిన్ ఇస్తున్నారు. ఈ-పాస్ యంత్రాలు సక్రమంగా పనిచేయక గంటల తరబడి క్యూలో నిలబడి బియ్యం తీసుకెళ్లిన చాలామంది వినియోగదారులు లీటరు కిరోసిన్ కోసం పనులు వదులుకొని మళ్లీ ఎఫ్పీ షాపులకు రావడం లేదు. మరుసటి నెల బియ్యానికి వచ్చినపుడు డీలర్లు వినియోగదారుల వేలి ముద్రలు తీసుకుని కిరోసిన్ కాజేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రీటైల్ షాపు డీలర్ల గురించి చెప్పాల్సిన పనేలేదు. అలా కాజేసిన కిరోసిన్ బ్లాకులో లీటరు రూ. 30 చొప్పున అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. నేడు విజిలెన్స్ కమిటీ సమావేశం ఎట్టకేలకు సుమారు రెండు సంవత్సరాల తర్వాత పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ కమిటీ సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహిస్తున్నారు. ఇంతకు మునుపు జిల్లా ఆహార సలహా సంఘం అన్న పేరును తొలగించి విజిలెన్స్ కమిటీ పేరుతో సభ్యులను నియమించారు. వంట గ్యాస్‌లో బలవంతపు వసూళ్లు గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారులకు సిలిండర్ డోర్ డెలివరీ కింద రూ.40 చొప్పున వసూలు చేస్తున్నారు. అయిదు కిలోమీటర్ల పరిధి వరకు ఎలాంటి చార్జీ వసూలు చేయకుండా ఉచితంగా డోర్ డెలివరీ చేయాలన్న నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోలేదు. ఇటీవల నిర్వహించిన గ్యాస్ డీలర్ల సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. సిలిండర్లు తీసుకెళ్లే బాయిస్ డబ్బులు వసూలు చేయకుండా కట్టడి చేయాలంటూ జిల్లా పౌరసరఫరాల అధికారి జి.వెంకటేశ్వరరావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. పలువురు వంట గ్యాస్ డీలర్లు దొంగ కనెక్షన్లు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. మాల్స్‌ను తలపిస్తున్న వైనం కడప నగరంలో కొన్ని ఎఫ్పీ షాపులు మాల్స్‌ను తలపిస్తున్నాయి. కొబ్బెర, బెల్లం, ఉప్పు, ఆవాలు, సబ్బులు, వంట నూనెలు, కూల్ డ్రింక్స్ ఇలా అనేక రకాల వస్తువులను విక్రయిస్తున్నారు. వీటిని వినియోగదారులకు బలవంతంగా అంటగడుతున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రభుత్వమే తక్కువ ధరకు ఇస్తోందని, నాసిరకం వస్తువులు అండగడుతున్నారు. తీసుకోకపోతే ఆ తర్వాత వస్తువులు ఇవ్వడంలో ఇబ్బందులు ఉంటాయని పరోక్షంగా భయపెడుతున్నారు. చౌక దుకాణాలకు వెళ్లి తమకు కావాల్సిన వస్తువులు మాత్రమే కొనుగోలు చేసే వెసలుబాటు వినియోగదారులకు ఉంది. అయితే అన్ని వస్తువులు కొనకపోతే తర్వాత నెలల్లో ఏమీ ఇవ్వరన్న భయం వినియోగదారుల్లో నెలకొంది. ప్రభుత్వం సబ్సిడీతో సరఫరా చేస్తున్న సరుకులను కూడా బయటి నుంచి తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కడప బెల్లం మండివీధిలోని 34వ నెంబరు ఎఫ్పీ షాపును ‘సాక్షి’ సందర్శించినపుడు అది ఓ చిన్నపాటి సూపర్బజారులా కనిపించడం గమనార్హం. ‘జీతాలు ఇస్తామని, కమీషన్ పెంచుతామని ప్రభుత్వం చెప్పిన హామిలు అమలు కాలేదు. క్వింటాలు బియ్యానికి రూ. 20 కమీషన్ ప్రభుత్వం ఇస్తోంది. గోడౌన్ వద్ద లోడు చేసినందుకు రూ. 2, స్టోరు వద్ద బియ్యం దించుకోవడానికి రూ.6 చొప్పున చెల్లిస్తున్నాం.. దీంతో క్వింటాలుకు ఖర్చులుపోను మాకు మిగులుతోంది రూ.12 మాత్రమే. వంద క్వింటాళ్ల బియ్యం మేము పంపిణీ చేసినా రూ.1200లే దక్కుతోంది. రూము అద్దె, కరెంటు చార్జి, ఇతర ఖర్చులు తీసేస్తే నష్టం తప్ప ఏమి ఉండదు. అందుకే ఇతర సరుకులు అమ్ముకుంటున్నాం’ అని డీలర్లు చెబుతున్నారు. -
బియ్యం మాఫియాకే ‘ప్రజా పంపిణీ’
► కొరవడిన అధికారుల నిఘా ► బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న రేషన్ బియ్యం ► అరకొర పంపిణీతో పేదల పాట్లు నరసరావుపేట టౌన్ : పౌర సరఫరాల శాఖాధికారుల నిర్లక్ష్యానికి చౌకదుకాణ డీలర్ల అక్రమాలు తోడు కావడంతో పేదలకు అందాల్సిన నిత్యావసర సరుకులు పక్కదారి పడుతున్నాయి. ఎంఎల్ఎస్ గోడౌన్ నుంచి ఎగుమతైన నిత్యావసరాలు అధికారుల పర్యవేక్షణ లోపించడంతో రూటుమారి నల్లబజారుకు తరలిపోతున్నాయి. పేరుకే నిబంధనలు నరసరావుపేట ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ప్రతి నెలా తెల్ల రేషన్ కార్డు దారులకు పంపిణీ కోసం నిత్యావసరాలు రేషన్ షాపులకు దిగుమతి అవుతుంటాయి. నరసరావుపేట పట్టణ పరిధిలో 238 టన్నుల బియ్యం, రూరల్ పరిధిలో 248, రొంపిచర్ల 228, నకరికల్లు 235, ఫిరంగిపురం 264 టన్నులు చౌక దుకాణాలకు చేరతాయి. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఎగుమతై రేషన్ దుకాణంలో నిత్యావసరాలు దిగుమతయ్యే వరకూ రూట్ అధికారి వీఆర్వో పర్యవేక్షణ తప్పనిసరి. చౌక దుకాణంలో రేషన్ దించాక సంబంధిత డీలర్, రూట్ అధికారి ఈపాస్ మిషన్‌పై వేలిముద్రలు వేసి సరుకు అందినట్లు నిర్ధారించాలి. అయితే ప్రజాపంపిణీ దిగుమతి, ఎగుమతిలో రూట్ అధికారి, రేషన్ డీలర్ కుమ్మక్కైన కారణంగా నిత్యావసరాలు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎగరేసుకుపోతున్న బియ్యం మాఫియా ముందుగా కుదిరిన ఒప్పందం మేరకు రూట్ అధికారి ఆ పరిసరాల్లోనే కనిపించడంలేదు. ఈ పాస్ మిషన్‌పై వేలిముద్రలు ఎక్కడ వేస్తున్నారన్న విషయం అంతు చిక్కకుండా ఉంది. దుకాణానికి సరుకు చేరినరోజే వాటిని అధికార పార్టీకి చెందిన బియ్యం మాఫియా ఎగరేసుకు పోతున్నారని ఆరోపణలు లేకపోలేదు. గతంలో ప్రతి నెలా ఒకటి నుంచి 15వ తేదీ వరకూ రేషన్ షాపుల్లో ప్రజా పంపిణీ కొనసాగేది. ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకు వచ్చి ఐదో తేదీలోపే పంపిణీ పూర్తిచేసి ముగించాలన్న ఆదేశాలు డీలర్లకు కనకవర్షం కురిపిస్తున్నాయి. ఈపాస్ మిషన్ మొరాయిస్తుందన్న సాకు చూపి రేషన్ డీలర్లు అసలు దుకాణాలే తెరవడం లేదు. పంపిణీ అవుతున్న సరుకులు నాసిరకంగా ఉంటున్నాయి. దీంతో విసుగెత్తుతున్న కార్డుదారులు డీలర్లు ఇచ్చినంత పుచ్చుకుని వేలిముద్రలు వేస్తుండటంతో పేదలకు పంచాల్సిన రేషన్‌ను నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. డీలర్ల అక్రమాలపై ఎన్ని ఫిర్యాదులు అందుతున్నా అసలు చౌక దుకాణాలపై అధికారులు తనిఖీలు చేయడానికి ధైర్యం చేయలేక పోతున్నారు. దీనికి ముఖ్య కారణం డీలర్లంతా అధికార పార్టీకి చెందినవారు కావడమనేది జగమెరిగిన సత్యం. బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ ప్రజా పంపిణీ ద్వారా ప్రతి నెలా తెల్ల కార్డుదారులకు బియ్యం, పంచదార మాత్రమే ప్రభుత్వం ద్వారా అందుతోంది. గత ప్రభుత్వం అమ్మహస్తం పేరుతో బియ్యం, పంచదార, గోధుమపిండి, పామాయిల్, పసుపు, కారం, గోధుమలు, చింతపండు, కందిపప్పు ఇలా 9 రకాల సరుకులు పంపిణీ చేసేది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ ప్రజా పంపిణీగా పేరు మార్చి బియ్యం, కందిపప్పు, పంచదార, గోధుమ పిండి పంపిణీ చేస్తోంది. అయితే ఐదు నెలల నుంచి వాటిలో బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ అవుతున్నాయి. మిగిలిన సరుకుల గురించి కార్డుదారులు ఎవ్వరైనా డీలర్లను ప్రశ్నిస్తే పైనుంచి సరఫరా లేదని చెబుతున్నారు. దీంతో పేదలు కడుపునిండా ఆహారానికి నోచుకోవడంలేదు. ఇప్పటికైనా రేషన్‌షాపు ద్వారా అందించే సరుకులు పూర్తి స్థాయిలో పంపిణీ అయ్యేలా చూడాల్సి ఉంది. -
365 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు భారీగా బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా చంద్రలపాడు మండలం బొబిళ్లపాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బియ్యం అక్రమంగా లోడ్ చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు 365 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
ఈ- పాస్‌తో అక్రమాలకు చెక్
జిల్లాలో 2,930 చౌక దుకాణాల్లో అమలు నెలసరి 550 టన్నుల మిగులు అనంతపురం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఈ పాస్ విధానం అమలు చేయడంతో చౌక దుకాణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. గతంలో జిల్లాలో ప్రతినెలా 400 నుంచి 500 టన్నుల సబ్సిడీ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు తరిలేది. ప్రస్తుతం నూతన విధానం వల్ల ఆ మేరకు బియ్యం మిగులుతోంది. ఆన్‌లైన్‌తో కట్టుదిట్టం.. గతంలో చౌక దుకాణాలకు సరఫరా అయిన బియ్యం వంద శాతం పంపిణీ చేసినట్లు డీలర్లు తప్పుడు లెక్కలు చూపించేవారు. బోగస్ కార్డులు, గ్రామాల్లో లేనివారి కార్డులకు బియ్యాన్ని పంపిణీ చేసినట్లు లెక్కల చూపి స్వాహా చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పంపిణీ చేసిన బియ్యం వివరాలు ఈ-పాస్ యంత్రంలో నమోదవుతాయి. ఆ లెక్కలు నేరుగా ఆన్లైన్లో అప్లోడ్ అవుతాయి. పంపిణీ చేయని బియ్యం లెక్క రికార్డు అవుతుంది. ఆన్లైన్లో మిగులు బియ్యం నమోదును గుర్తించి మరుసటి నెల కోటాలో ఆ మొత్తం తగ్గించి బియ్యం సరఫరా చేస్తారు. డీలర్ ఎలాంటి అవకతవకలకు పాల్పడే వీలుండదు. 32 షాపులకు ‘ఈ- పాస్’ లేదు జిల్లాలో 2962 చౌకదుకాణాలు ఉండగా ప్రస్తుతం 2930 దుకాణాల్లో ఈ పాస్ విధానం అమలవుతోంది. 32 దుకాణాలకు ఈ యంత్రాలు ఇంకా అందాల్సి ఉంది. ఇక జిల్లావ్యాప్తంగా ఏడు చౌక దుకాణాల్లో ఈ-పాస్ యంత్రాలకు సిగ్నల్ సమస్య ఉంది. దీన్ని కూడా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మరింత పటిష్టం చేస్తాం ప్రజా పంపిణీ వ్యవస్థలో ఈ-పాస్ విధానాన్ని మరింత పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకున్నాం. డీలర్లు సక్రమంగా యంత్రాలను ఉపయోగించకపోవడంతో అవి పాడవుతున్నాయి. యంత్రాలను ఎలా ఉపయోగించాలనే అంశంపై ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్లకు అవగాహన కల్పించి, వారి ద్వారా వీఏఓ, వీఆర్ఓ, ఆర్ఐ, సీఎస్డీటీకు శిక్షణ ఇప్పిస్తున్నాం. వీరు మాస్టర్ ట్రైనీలుగా వారి పరిధిలోని డీలర్లకు ఈ నెల 23 నుంచి శిక్షణ ఇస్తున్నారు. - బి.లక్ష్మీకాంతం, జాయింట్ కలెక్టర్ -
బ్లాకులో బంగారం బిస్కెట్లు
రూ.కోట్లలో పన్ను ఎగనామం వినూత్న పద్ధతులను ఆశ్రయిస్తున్న స్మగ్లర్లు విజయవాడలో సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయం ఏర్పాటు చేసి ఏడాది దాటింది. ఈ సంవత్సర కాలంలో సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు మూడు కేసులు నమోదు చేశారు. 2015 ఫిబ్రవరిలో కిలో బంగారం, రూ.39 లక్షల నగదు పట్టుకున్నారు. 2015 సెప్టెంబర్‌లో జరిపిన దాడుల్లో 739 గ్రాముల బంగారం, రూ.6.38 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్‌లో 300 గ్రాముల బంగారం, రూ.3లక్షల నగదు బిల్లులు లేకుండా వస్తుండగా ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు మంగళవారం గుళికల రూపంలో ఉన్న ఐదు కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. కోల్కత్తా నుంచి చెన్నై వెళ్తుండగా రాజమండ్రి రైల్వే స్టేషన్లో దీనిని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విజయవాడ మీదుగా చెన్నై జ్యూయలరీ దుకాణానికి వెళ్తోందని కస్టమ్స్ అధికారుల విచారణలో తేలింది. ఈ బంగారాన్ని విజయవాడలో దించి చెన్నైకు తరిచేందుకు స్మగ్లర్లు పథకం రచించారని సమాచారం. బెజవాడ బీసెంట్ రోడ్డులో వే బిల్లులు లేకుండా అక్రమంగా తరలించిన బంగారాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. విశాఖలోని ముత్తూట్ ఫైనాన్స్ వేలంలో 3.70 కిలోల బంగారం కొనుగోలు చేసిన కొందరు ప్రభుత్వానికి చెల్లించాల్సిన అమ్మకం పన్ను జమచేయలేదు. నగరంలోకి ఈ తరహా బంగారం దిగుమతి అయినట్టు వచ్చిన సమాచారంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. విజయవాడ : ప్రధాన రవాణా కేంద్రంగా, ప్రముఖ వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతున్న బెజవాడకు ముంబాయ్, చెన్నయ్ నుంచి నిత్యం బంగారం బిస్కెట్లు బిల్లులు లేకుండా దిగుమతవుతున్నాయి. రైళ్లు, విమానాలు, కొరియర్ సర్వీసుల ద్వారా బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినం టన్నుల్లో దిగుమతవుతోందని సమాచారం. విదేశీ వస్తువులు కూడా అడ్డూ అదుపు లేకుండా బిల్లులు లేకుండా రహస్యంగా చేరుకుంటున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి రూ.కోట్లలో పన్నుల ఎగనామం పడుతోంది. రైళ్లు, బస్సులు, కొరియర్స్, విమానాల్లో సైతం బిల్లులులేని బంగారం బిస్కెట్ల రూపంలో యథేచ్ఛగా నగరానికి చేరుతోంది. ఈ చీకటి వ్యాపారంలో కొందరు బంగారు నగల వ్యాపారులు, కొరియర్ సంస్థల నిర్వాహకులు భాగస్వామ్యులన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి విజయవాడ రైల్వే స్టేషన్‌కు దొంగతనంగా బంగారం రవాణా అవుతోందని కస్టమ్స్, పోలీసు, వాణిజ్యపన్నుల శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే పినాకిని ఎక్స్‌ప్రెస్ వంటి సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఈ తరహా దొంగ బంగారం రవాణా జరుగుతోందని భావిస్తున్నారు. అక్రమంగా దిగుమతి అయ్యే బంగారాన్ని కొందరు వ్యాపారులు లాకర్లలో భద్రపరుస్తున్నట్లు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. కిలోకు రూ.6 లక్షల లాభం విజయవాడలో 500 వరకూ బంగారు నగల దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల్లో సాధారణ రోజుల్లో సగటున రోజుకు రూ.25 కోట్ల వ్యాపారం జరగుతుంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో రూ.50 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని అంచనా. ఈ లావాదేవీల్లో బిల్లులు లేకుండా రెండో అకౌంట్ ద్వారా జీరో వ్యాపారం చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే బంగారానికి కస్టమ్స్ సుంకం 5 శాతం, వాణిజ్య సుంకం ఒక శాతం ఎగనామం పెట్టడం వల్ల కిలో బంగారానికి రూ.6 లక్షల వరకూ వ్యాపారులకు లాభం వస్తుందని సమాచారం. -
రూ. 100 కోట్ల దొంగ దందా
నల్లబజారుకు తరలుతున్న బొగ్గు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నల్లబంగారం నల్లబజారు పాలవుతోంది. అంతాఇంతా కాదు. రోజుకు రెండొందల టన్నులను దొంగలు కొల్లగొడుతున్నారు. ఏటా వంద కోట్ల రూపాయల దందా చేస్తున్నారు. కదిలే రైలులోంచే బొగ్గును కాజేస్తున్నారు. కాసులకు కక్కర్తి పడిన ఇంటిదొంగలు బొగ్గు దొంగలకు సహకరిస్తున్నట్లు సమాచారం. ఇదీ సిరులు కురిపించే సింగరేణి బొగ్గును బుక్కుతున్న తీరు. కరీంనగర్ జిల్లా రామగుండం రీజియన్ పరిధిలో కొన్నేళ్లుగా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు(ఓసీపీ)-1 కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(సీహెచ్‌పీ), ఓసీపీ-3 గనుల నుంచి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ)కి రోజూ సగటున 8 నుంచి 12 రేకుల బొగ్గు సరఫరా అవుతోంది. అయితే, బొగ్గులోడుతో రైలు నెమ్మదిగా ఎన్టీపీసీకి వెళుతుండగా మార్గమధ్యంలోనే సుమారు 40 మంది దొంగలు యైటింక్లరుున్ కాలనీ, లక్ష్మీపూర్ ప్రాంతాల్లో రెండు బృందాలుగా విడిపోయి బొగ్గును చోరీ చేస్తుంటారు. వీరు రైలు వ్యాగన్లలోకి ఎక్కి బొగ్గుపెళ్లను లోపలి భాగంలో చుట్టూ అమరుస్తారు. అల్లూరు నుంచి న్యూమారెడుపాక, లక్ష్మీపురం వరకు దారి మధ్యలోనున్న చెట్లపొదల వద్దకు(బొగ్గు నిల్వ చేసే పాయింట్లు) రాగానే ఆ బొగ్గును కింద పడేస్తారు. ఆ వెంటనే ఆయా ప్రాంతాల్లో మరో 20 మంది యువకులు కింద పడిన బొగ్గును బస్తాల్లోకి నింపుతారు. కొద్దిసేపటికే వాటిని లారీల్లోకి ఎక్కించి ఎల్కల్‌పల్లి, రాణాపూర్, కన్నాల మీదుగా పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌కు తరలిస్తారు. రోజూ 200 టన్నులకుపైగా దందా రోజూ సుమారు 200 టన్నులకుపైగా బొగ్గును పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది బహిరంగ మార్కెట్లో టన్ను బొగ్గు రూ.20 వేలకుపైగా పలుకుతోంది. ఈ లెక్కన ప్రతినెలా రూ.10 కోట్లు చొప్పున ఏటా రూ.100 కోట్లకు పైగా బొగ్గు దందా నడుస్తోంది. సిరామిక్, ఇనుప పరిశ్రమలు, ఇటుక బట్టీలకు పెద్ద ఎత్తున బొగ్గు అవసరం. సింగరేణి బొగ్గుకు బాగా డిమాండ్ ఉండటంతో ఆయా సంస్థలు బొగ్గు మాఫియాకు పెద్దమొత్తంలో అడ్వాన్స్‌గా సొమ్ము చెల్లించి సరుకును కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాణాలకు తెగించి... నడుస్తున్న రైలును ఎక్కుతున్న యువకుల్లో ఎక్కువ మంది గోదావరిఖని సమీపంలోని ల క్ష్మీపూర్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులే. ఒక్కో యువకుడికి మధ్యాహ్నం భోజనం, క్వార్టర్ మందుతోపాటు రూ.200 చెల్లిస్తున్నారు. రెండు గంటలు కష్టపడితే రోజుకు సరిపడా డబ్బులొస్తాయనే ఉద్దేశంతో ప్రాణాలకు తెగించి యువకులు బొగ్గు మాఫియాకు సహకరిస్తున్నారు. వచ్చిన డబ్బుతో వ్యసనాలకు లోనవుతున్నారు. నడుస్తున్న రెలైక్కబోయి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్నవారూ ఉన్నారు. గత ఏడాది ఓ యువకుడు ప్రాణాలను సైతం పోగొట్టుకున్నాడు. కేసులు, అరెస్టులు అంతంతమాత్రమే ఏటా రూ.కోట్లలో బొగ్గు దందా జరుగుతున్నా పోలీసులు, సింగరేణి, ఎన్టీపీసీ బీట్ అధికారులు ఏం చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. 2015లో బొగ్గు దొంగలపై పోలీసులు 10 కేసులు నమోదు చేసి 35 మంది అరెస్టు చేశారు. అయితే, సింగరేణి, ఎన్టీపీసీలోని కొందరు ఇంటిదొంగలు ఈ దందాకు సహకరిస్తున్నట్లు తెలిసింది. వీరికి నెలనెలా మామూళ్లు అందుతున్నందుకే చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పుడు, టార్గెట్ల కోసమే అప్పుడప్పుడు బొగ్గు లారీలను పట్టుకుని కేసు నమోదు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. బొగ్గు దందా వెనుక రాజకీయ పలుకుబడి గల వ్యక్తులు, మాజీ, తాజా ప్రజాప్రతినిధులున్నట్లు తెలుస్తోంది. ఈ దందా ద్వారా వచ్చిన ఆదాయంలో 50 శాతం ముఠా నాయకుడికి, మరో 20 శాతం బొగ్గును దొంగలకు, మిగతా 30 శాతం సింగరేణిలోని ఇంటిదొంగలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. -
బ్లాక్ మార్కెట్లో పప్పులు, పెట్రోల్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలు బంకులు గురువారం మూతపడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదనుగా భావించిన పలువురు వ్యాపారులు పెట్రోల్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలించారు. లీటర్ పెట్రోల్‌పై అదనంగా రూ. 20 వసూలు చేస్తున్నారు. అలాగే సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా లారీలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దాంతో వ్యాపారులు నిత్యవసరల రేట్లు పెంచేశారు. పప్పులు ధరలు అసలు ధర కంటే రూ. 30 అధికంగా ఆ విక్రయిస్తున్నారు. -
బ్లాక్‌లో.. బిగ్ సినిమా!
-
నల్లబజారుకు.. రాయితీ ఉల్లి
ఉల్లి.. తల్లివంటిదని అంటారు. ఓ కవి ‘ఉల్లుండవలయు లేదా తల్లుండవలయు భోజనోత్సవ వేళన్!’ అన్నాడు. ఎవరెలా అన్నా ప్రతి రోజూ వంటకాల్లో ఉల్లిపాయకు ఎంతో ప్రాధాన్యం ఉంది. తగ్గిన దిగుబడితో ప్రస్తుతం మార్కెట్లో దాని ధర రెక్కలు కట్టుకు విహరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాయితీపై ఉల్లిపాయలు సరఫరా చేయాలని నిర్ణయించింది. దీనిని కూడా కొంతమంది అక్రమార్కులు అవకాశంగా పయోగించుకుంటున్నారు. రాయితీపై వస్తున్న సరుకును అధిక ధరకు నల్లబజారుకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తుని : దిగుబడి తగ్గిపోవడంతో ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయి. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.35 నుంచి రూ.45 వరకూ ఉంది. దాదాపు ప్రతి కుటుంబంలోనూ ఉల్లి వినియోగం రోజువారీ అధికంగానే ఉంటుంది. ధర పెరగడంతో నెలవారీ బడ్జెట్లో దీనికే రూ.500 వరకూ వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాయితీపై ఉల్లిపాయలు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌కంటే తక్కువ ధరకు ఉల్లిపాయలు సరఫరా చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం తూతూమంత్రంగానే దీనిని విక్రయిస్తున్నారు. రాయితీపై విక్రయించేందుకు పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రతి నియోజకవర్గానికి 10 టన్నుల చొప్పున ఉల్లిపాయలు సరఫరా చేశారు. వీటి అమ్మకం బాధ్యతను రేషన్ డీలర్లకు అప్పగించారు. తెల్లకార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కిలో రూ.20 చొప్పున 2 కిలోలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల ఒకటిన అట్టహాసంగా మార్కెట్ యార్డుల్లో, రైతుబజార్లలో వీటి అమ్మకాలు ప్రారంభించారు. దీంతో ఉల్లికోసం జనం బారులు తీరడం మొదలుపెట్టారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. కొన్నిచోట్ల పంపిణీ సక్రమంగానే జరుగుతున్నా.. కొంతమంది ప్రభుత్వం సరఫరా చేసిన ఉల్లిపాయలను గుట్టు చప్పుడు కాకుండా నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. క్వింటాల్ ఉల్లిని రూ.2600కు అమ్ముకుంటున్నారు. బయట మార్కెట్లో క్వింటాల్ ధర రూ.3వేలు పైగానే ఉంది. మొత్తంగా జిల్లాలో సుమారు 250 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను రాయితీపై అందించాల్సి ఉండగా, ఈ సరుకును నల్లబజారుకు తరలించి, టన్నుకు రూ.6 వేల చొప్పున అడ్డదారిలో సంపాదిస్తున్నారు. ఒక్క తుని నియోజకవర్గంలోనే ఒక టన్ను ఉల్లిపాయలను రాయితీపై కౌంటర్ల ద్వారా విక్రయించారు. మిగిలిన తొమ్మిది టన్నులను బయటి వ్యాపారులకు ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఇలా ఒక్క తునిలోనే రూ.50 వేలు అడ్డదారిన సంపాదించారు. ఇతర నియోజవకర్గాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్టు సమాచారం. అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించినందువల్లనే రాయితీ ఉల్లి నల్లబజారుకు తరలిపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం ఫలితంగా తమకు ఉల్లి ధరల ఘాటు తప్పడంలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. -
ఈ-పాస్ ‘దేశం’ బ్రేక్ ?
- అమలు విధానం వాయిదాకు అవకాశం - కొంత కాలం గడువు ఇవ్వాలని టీడీపీ డీలర్ల ఒత్తిళ్లు - అన్ని దుకాణాలకు అందని ఎలక్ట్రానిక్ కాటాలు వినుకొండ: నిత్యావసర సరుకుల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు రేషన్ దుకాణాల్లో ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ (ఈ-పాస్)విధానానికి తెలుగు తమ్ముళ్లు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి చెందిన డీలర్లు తెచ్చిన ఒత్తిడి మేరకే ఈ విధానం అమలును కొంతకాలంపాటు వాయిదా వేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం పట్టణాల్లోని రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానం అమలవుతోంది. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రతి గ్రామంలోని చౌకధరల దుకాణాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నట్టు అధికారులు ముందుగానే ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లోని షాపులకు దాదాపుగా బయోమెట్రిక్ మిషన్లు పంపిణీ చేశారు. వీటితో పాటు ఎలక్ట్రానిక్ కాటాలను సరఫరా చేయాల్సి ఉండగా కొన్ని షాపులకు ఇంకా రావాల్సివుందని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ కాటాలు అన్ని షాపులకు అందజేయక పోవడాన్ని సాకుగా చూపి విధానం అమలును తాత్కాలికంగా వాయిదా వేయనున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు బయోమెట్రిక్ విధానాన్ని వాయిదా వేస్తున్నట్టు సమాచారం. ప్రతి నెలా ఒకటవ తేదీ నుంచి కార్డుదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నెలలో ఇప్పటి వరకు రూరల్ ప్రాంతంలోని ఏ ఒక్క షాపు నుంచి కూడా కార్డుదారులకు సరుకుల పంపిణీ జరగలేదు. పాతపద్ధతి ప్రకారమే రేషన్ దుకాణాల నుంచి సరుకుల పంపిణీ జరుగుతుందని అంటున్నారు. రేషన్ దుకాణాల డీలర్లకు సరుకుల పంపిణీకి సంబంధించి ఇంకా రెవెన్యూ అధికారులు కీ రిజిస్టర్లు ఇవ్వలేదు. జిల్లాలో 2,713 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. అర్బన్ ప్రాంతాల్లో 567 దుకాణాల్లో ఈ-పాస్ విధానంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. తెనాలి డివిజన్లో ఇంకా 604 బయోమెట్రిక్ మెషీన్లు పంపిణీ చేయాల్సి ఉందని అధికారులు అంటున్నారు. కిరోసిన్ పంపిణీలో అమలు కాని ఈ-పాస్ విధానం.... కిరోసిన్ హాకర్లు ప్రతి నెల 10 నుంచి 20వ తేదీ వరకు రేషన్ షాపులకు కిరోసిన్ సరఫరా చేస్తారు. 20 నుంచి 28 వరకు డీలర్లు కార్డుదారులకు కిరోసిన్ సరఫరా చేయాల్సి ఉంది. అయితే నిత్యావసర సరుకుల కోసం కార్డుదారులు వెళ్లి వేలు ముద్ర వేస్తే (ఈ-పాస్ విధానం) బియ్యం, కందిపప్పు, పంచదార, కిరోసిన్ తీసుకున్నట్లు వస్తుంది. కానీ కార్డుదారులకు ఆ సమయంలో కిరోసిన్ పంపిణీ జరగదు. దీంతో ప్రతి నెలా బ్లూకిరోసిన్ను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇది కిరోసిన్ హాకర్లకు, డీలర్లకు కాసులు కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తాం ... జిల్లాలో ప్రధానంగా నరసరావుపేట, గురజాల డివిజన్ల పరిధిలో బయోమెట్రిక్ విధానాన్ని యుద్ధప్రాతిపదికన అమలు చేసేం దుకు ప్రయత్నిస్తున్నాం. ఎలక్ట్రానిక్ కాటాలు రాష్ట్రంలోని అన్ని షాపులకు ఒక్కరే సరఫరా చేయాల్సి ఉంది. అందువల్ల కొంత జాప్యం జరుగుతోంది. అంతేతప్ప మరొక కారణం కాదు. త్వరలో ప్రతి చోటా ఈ పాస్ విధానం అమల్లో ఉంటుంది. - చిట్టిబాబు, డీఎస్వో -
గోలీమాల్
చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో 10 వేల మాత్రలు మాయం! స్టాకు రిజిస్టర్లో దిద్దుబాట్లు సిబ్బంది చేతివాటమా..? పొరపాట్లా? ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన పెద్దాస్పత్రికి అవినీతి జబ్బు సోకింది. కంచే చేను మేసిన చందంగా ఆస్పత్రిలో పనిచేసే కొందరు ఉద్యోగులే అక్రమాలకు పాల్పడుతున్నారు. రోగులకు అందాల్సిన మందులు, మాత్రలను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. వైద్యాధికారుల బాధ్యతా రాహిత్యం.. అధికారుల పర్యవేక్షణ లేమి వారికి కలిసొస్తోంది. చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో మాత్రల గోల్‌మాల్‌పై స్పెషల్ ఫోకస్.. ఇదంతా నాణేనికి ఒకవైపు... జిల్లాలోనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రి పెద్దది. ఇక్కడ 320 పడకలున్నాయి. రోజుకు వెయ్యి మందికిపైగా ఔట్ పేషెంట్లు వస్తుంటారు. కోట్ల రూపాయల విలువచేసే పరికరాలతో వైద్యం.. నిత్యం రూ.లక్షల విలువచేసే మందుల పంపిణీ.. అబ్బో ఇదంతా చూస్తుంటే కార్పొరేట్ తరహా సేవలే గుర్తుకొస్తుంటాయి. మరి రెండో వైపు.. ఆస్పత్రిలో జవాబుదారీతనం లేదు. కొందరు వైద్యులు ప్రైవేటు సేవలకే పెద్దపీట వేస్తున్నారు. ఉన్నతాధికారులు సొంత క్లినిక్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకున్న కొందరు ఫార్మాసిస్ట్లు ప్రభుత్వం ఇచ్చే మాత్రలు, మందులను మాయం చేస్తున్నారు. దీని వెనుక ఇక్కడ పనిచేసే కొందరి సిబ్బంది హస్తం ఉందని బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తుండగా.. తిరుపతి నుంచి మాత్రలు ఇచ్చేటప్పుడే స్టాకు తక్కువగా వస్తోందని సిబ్బంది చెబుతున్నారు. చిత్తూరు (అర్బన్): జిల్లాలోని పీహెచ్‌సీలు, ఆరోగ్య ఉప కేంద్రాలతో పాటు ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులకు తిరుపతిలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి మందులు, మాత్రలు సరఫరా అవుతుంటాయి. ప్రతి ఆస్పత్రికి కావాల్సిన మందులు అక్కడి అధికారులు ఇచ్చే ఇండెంట్ ప్రకారం పంపిణీ చేస్తుంటారు. ఈ లెక్కన చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి కూడా మాత్రలు అందుతాయి. ఈ మందుల్లో అమాక్సలిన్, కాల్షియం, బీ-కాంప్లెక్స్ తదితర ఖరీదైన మాత్రలు ఉంటాయి. రోగిలో రోగ నిరోధక శక్తిని అంచనా వేసి వైద్యులు యాంటిబయాటిక్ మాత్రలు రాస్తుంటారు. వీటిని తీసుకెళ్లి ఆస్పత్రిలో ఉన్న మందుల డిస్పెన్సరీ(మందుల పంపిణీ కేంద్రం)లో చూపిస్తే మాత్రలు ఇవ్వడం ఆనవాయితీ. అయితే వైద్యులు రాసిచ్చే చీటీల్లో కొన్ని ఖరీదైన మాత్రలు కూడా ఉంటాయి. ఒక్కో రోగికి ఈ మాత్రలను 10 కూడా ఇవ్వాలని చీటీల్లో రాస్తుంటారు. అయితే వీటిని డిస్పెన్సరీకి తీసుకెళితే ఇక్కడున్న కొందరు సిబ్బంది 10 మాత్రలకు బదులుగా 4, 6 మాత్రమే ఇస్తున్నారు. రోగులు దీనిని పట్టించుకోవకపోవడంతో ఆస్పత్రిలో భారీ ఎత్తున మాత్రలు పోగేశారు. ఇలా దాదాపు 10 వేలకు పైగా మాత్రలు ఆస్పత్రిలో కనిపించకుండా పోయాయి. ఇటీవల ఈ-ఔషధిని ప్రవేశపెట్టడం, ప్రతి రోగికీ ఇచ్చే మాత్రలు, మందులు ఆన్లైన్లో పొందుపరచాలనే నిబంధన రావడంతో అసలు విషయం బయటపడింది. దీనికి తోడు మాత్రల స్టాకు పుస్తుకాల్లో సైతం దిద్దుబాట్లు, కొట్టి వేతలు ఉండడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. ఒక్కోరోజు అమాక్సలిన్ మాత్రలు 400 పంపిణీ చేస్తే, మరుసటి రోజు ఏకంగా 2500 మాత్రలు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫార్మసీ విభాగంలో ఇప్పటికే రెండు గ్రూపులుగా ఉన్న సిబ్బందిలో.. ఓ వర్గం నిత్యం అధికార పార్టీ నాయకుల పేరు చెప్పి మాత్రలను బయటకు తరలిస్తున్నట్లు ఇక్కడున్న సిబ్బంది చెబుతున్నారు. తిరుపతి నుంచి తమకు మందులు వచ్చేటప్పుడే స్టాకు తక్కువగా ఇస్తున్నారని, దాని ఫలితంగా రోగులకు మాత్రలను తక్కువ ఇవ్వాల్సి వస్తోందని మరికొందరు సిబ్బంది చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వాస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ జయరాజ్ మాట్లాడుతూ.. ఈ విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. మాత్రల స్టాకు వివరాలు, పంపిణీపై విచారణ జరిపిస్తామన్నారు. మాత్రలు పక్కదారి పట్టినట్లు తేలితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు ఈ వ్యవహారంపై లోతుగా విచారణ చేస్తే వాస్తవ విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. -
తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి బ్లాక్ దందా!
-
బాహుబలి... పోలీస్గిరి...
బంజారాహిల్స్: శుక్రవారం విడుదల కానున్న బాహుబలి చిత్ర టికెట్ల విషయంలో పోలీసులదే పైచేయి అయింది. పోలీసులను ప్రసన్నం చేసుకున్న వెస్ట్‌జోన్‌లోని థియేటర్ల యాజమాన్యాలు ప్రేక్షకులకు మాత్రం రిక్తహస్తాలను చూపించాయి. పశ్చిమ మండలం పరిధిలోని వీవీఐపీ జోన్లో ఉన్న రెండు ఠాణా పరిధిలో బాహుబలి టికెట్లను పోలీసులు పంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. థియేటర్ల మేనేజర్లను హైజాక్ చేసి తలాకొన్ని టికెట్లు దక్కించుకున్నారు. ముఖ్యంగా వీవీఐపీ పోలీస్స్టేషన్లలో ఎస్ఐలంతా థియేటర్ల మేనేజర్లను ఊపిరాడకుండా చేసి తలా 20 టికెట్ల మేర లాక్కున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక కానిస్టేబుళ్ల అరాచకాలకు హద్దు లేకుండా పోయింది. అసలే పెద్ద సినిమా కావడం, భారీ అంచనాలు ఉండటంతో సామాన్యులు పెద్ద సంఖ్యలో ఆయా థియేటర్ల వద్ద రెండు రోజుల ముందునుంచే బారులు తీరినా ఫలితం లేకుండా పోయింది. దొడ్డిదారుల్లో వచ్చిన పోలీసుబాసులు టికెట్లను గద్దల్లా తన్నుకుపోయారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు కూడా టికెట్ల కోసం పైరవీలు చేయడం గమనార్హం. ఇక తమను అడిగేవారు ఎవరూ లేరన్న ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, కానిస్టేబుళ్లు రెండు రోజుల నుంచే దాదాగిరితో టికెట్లను జేబుల్లో వేసుకున్నారు. అమాయక ప్రేక్షకులంతా ఏం జరిగిందో తెలుసుకునే సరికి థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. పోలీసులది ఒక దారి అయితే బ్లాక్ మార్కెట్ చేసే వారిది మరో దారి... ఒక్కో టికెట్‌ను రూ. 3 వేలకు విక్రయించారు. దీంతో కొన్ని థియేటర్ల వద్ద అభిమానులు ఆందోళనలు కూడా చేశారు. కానీ ఒక్క చోట కూడా ఒక్క కేసు కూడా బుక్ కాకపోవడం విశేషం. ఒక వైపు బ్లాక్టికెట్ల విక్రయాలను అడ్డుకోవాల్సిన పోలీసులు అటుగా చూడకుండా టికెట్ల కోసం పైరవీలు చేస్తుండటంతో సాధారణ ప్రేక్షకులకు టికెట్లు దొరకకుండా పోయాయి. బ్లాక్ టికెట్ల విక్రేత అరెస్ట్... మల్కాజిగిరి : బాహుబలి చిత్రం టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న వ్యక్తిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ హఫీజ్ కథనం ప్రకారం.. మల్కాజిగిరి రాఘవేంద్ర థియేటర్ వద్ద బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్నారని ప్రేక్షకులు ఫిర్యాదు చేశారు. దీనితో థియేటర్ వద్ద ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్న రమేష్‌ను అదుపులోకి తీసుకుని అతని వద్ద 123 టికెట్లు రూ.19,140 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురి పట్టివేత... జీడిమెట్ల: బ్లాక్‌లో బాహుబలి టికెట్లను విక్రయిస్తున్న నలుగురిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. ఏఎస్సై మాణిక్యం కథనం ప్రకారం.. జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని రంగా థియేటర్, చింతల్‌లోని షా థియేటర్ వద్ద ఆటో డ్రైవర్ రాజు(33), నూర్ మహ్మద్(57), రాంబాబు(30), దుర్గేష్(32) బాహుబలి టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తుండగా అరెస్టు చేశారు. వారి నుంచి వంద టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒక్కో టికెట్‌ను రూ. వెయ్యికి విక్రయిస్తున్నట్లు పో లీసులు తెలిపారు. కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించారు. మెగా, మహాలక్ష్మి థియేటర్లపై ఎస్ఓటీ దాడి.. చైతన్యపురి: సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గురువారం సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్‌లోని మెగా, కొత్తపేటలోని మహాలక్ష్మి థియేటర్లపై దాడి చేశార. ఇన్స్పెక్టర్ నర్సింగ్‌రావు కథనం ప్రకారం... మెగా థియేటర్ ఆవరణలో బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్న పి.ఆంజనేయులు (37), ఎల్.కృష్ణ (30)లను అదుపులోకి తీసుకుని 66 టికెట్లు, రూ.2820 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే థియేటర్ మేనేజర్ సత్యనారాయణగౌడ్‌తో పాటు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం సరూర్‌నగర్ పోలీసులకు అప్పగించారు. కొత్తపేట మహాలక్ష్మి థియేటర్‌పై కూడా దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు మొత్తం 1275 టికెట్లు, రూ.95,500 స్వాధీనం చేసుకున్నారు. థియేటర్ మేనేజర్ విక్రంను చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. థియేటర్ నిర్వాహకుడు సాంబశివరావు పరారీలో ఉన్నాడు. థియేటర్లపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రికి వినతి సాక్షి, సిటీబ్యూరో: బాహుబలి సినిమా విడుదల నేపథ్యంలో రూ. వంద విలువ గల టికెట్‌ను బ్లాక్‌లో రూ. 1000 నుంచి రూ. 3000ల వరకు విక్రయించి సినీ అభిమానులను దోచుకుంటున్న థియేటర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేత సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి హోంమత్రి నాయిని నర్సింహారెడ్డిని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన హోంమంత్రికి వినతి పత్రం అందజేశారు. -
రైతులపై నిందలా?
పెనుకొండ : ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న విత్తన వేరుశనగను రైతులు అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రైతులపై నిందలు వేయడం తగదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ హితవు పలికారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలీచాలని విత్తనాలతో రైతులు కన్నీరు పెడుతుంటే రైతులు విత్తనాన్ని అమ్ముకుంటున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే అనడం అతని అవివేకానికి నిదర్శనమన్నారు. టీడీపీ నాయకులే బ్లాక్ మార్కెట్‌కు తరలించి అక్రమంగా సొమ్ము చేసుకుంటుంటే దానిని పట్టించుకోని జేసీ రైతులపై నిందలు వేయడం తగదన్నారు. వెంటనే ఆయన జిల్లా రైతులకు క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు గురువారం జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ధర్నాకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సర్పంచులు సుధాకరరెడ్డి, చలపతి, రాజగోపాల్‌రెడ్డి, శ్రీకాంతరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ నాగలూరుబాబు, లాయర్ భాస్కరరెడ్డి, ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, మురళి, ఖాజాపీర్, జాఫర్, దిల్దార్, వెంకటరత్నం, ఇర్షాద్, యస్‌బీ శీనా, శ్యాంనాయక్, శ్రీరాములు, మునిమడుగు శ్రీనివాసులు, రాష్ట్ర, జిల్లా నాయకులు రొద్దం నరశింహులు, చంద్రశేఖర్, కొండలరాయుడు, సుబ్బిరెడ్డి, అశ్వర్థమ్మ, నాగభూషణ్‌రెడ్డి, నాయుడు, ఆదినారాయణరెడ్డి, నాయని శ్రీనివాసులు, నారాయణరెడ్డి, ప్రసాద్, పాల్గొన్నారు. -
పాత ధరే!
- బీటీ పత్తి విత్తనాల ధర పెంచడానికి సర్కార్ విముఖత - రెండు మూడు రోజుల్లో అధికారిక నిర్ణయం - ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం - జిల్లాలో విత్తనాల అమ్మకాలు షురూ - పొంచివున్న ‘బ్లాక్ మార్కెట్’ ముప్పు - వ్యవసాయశాఖ అప్రమత్తమైతేనే ఫలితం బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల ధరపై ప్రతిష్టంభన తొలగిపోనుంది... కంపెనీల ఎత్తుగడను సర్కార్ చిత్తు చేసింది. ధర పెంచాలని కంపెనీలు కొన్ని రోజులుగా ఒత్తిడి చేస్తున్నా అందుకు ససేమిరా అంటోంది. ఇక పాత ధరకే విత్తనాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక నిర్ణయం వెలువడే అవకాశముంది. ఈ మేరకు పాత ధరకే జిల్లాకు నిల్వలు వస్తున్నట్టు సమాచారం. గజ్వేల్: జిల్లాలో ప్రధాన పంటల్లో పత్తి ఒకటి. గతేడాది ఇక్కడ 1.26 లక్షల హెక్టార్లకు పైగా పత్తి సాగవగా ఈసారి కూడా అదేస్థాయిలో విస్తీర్ణం ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా. ఇందుకోసం 5 లక్షల విత్తనాల ప్యాకెట్లు అవసరమవుతాయని భావించి ఉన్నతాధికారులకు ఇండెంట్ పంపారు. 30 రకాల కంపెనీలకుపైగా విక్రయాలకు సంబంధించి వ్యవసాయ శాఖ అనుమతిచ్చింది. కంపెనీలు కొన్ని రోజులుగా విత్త ప్యాకెట్ ధరను పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న సంగతి తెల్సిందే. ఫలితంగా ఈ వ్యవహారంపై కొన్ని రోజులుగా ప్రతిష్టంభన నెల కొంది. ఈ క్రమంలో పాత ధరకే (450 గ్రాముల పరిమాణం గల విత్తన ప్యాకెట్‌ను రూ.930కే) విక్రయించాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారిక ఆదేశాలు వెలువడనున్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. పొంచివున్న ‘బ్లాక్ మార్కెట్’ ముప్పు.... ఎప్పటిలాగే ఈసారికూడా ఇక్కడ ఓ ప్రధాన కంపెనీకి చెందిన ప్యాకెట్‌పై రైతుల్లో పోటీని కలిగించడానికి వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు. అలాచేస్తే యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు పాల్పడి లక్షలాది రూపాయలను సంపాదించవచ్చనే ఆలోచనతో ముందుకుసాగుతున్నారు. బీటీ పత్తి విత్తనాలన్నీ ఒకే రకమైన ఫలితాలనిస్తాయని మూడేళ్లుగా వ్యవసాయ, ‘ఆత్మ’ శాఖలు పలు గ్రామాల్లో ఐదు రకాల బీటీ విత్తనాలను సాగుచేసిన పంటలపై పరిశీలన జరి పింది. ప్రయోగాత్మకంగా కూడా నిరూపించిన విషయం తెల్సిందే. దీనిపై విస్తృతంగా కరపత్రాల ద్వారా ప్రచారం నిర్వహించినా ఫలితం లేకుండా పోతుంది. వ్యాపారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం జిమ్మిక్కులకు పాల్పడుతున్నారు. ఒకటి రెండు రకాల విత్తనాలతోనే అధిక దిగుబడులు సాధ్యమనే విషయాన్ని చెబుతూ ఈ రకాలవైపే రైతులను తిప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అప్రమత్తమేతై ఈ పరిస్థితికి అడ్డుకట్ట పడే అవకాశముంది. -
టీడీపీ ‘చౌక’ రాజకీయం !
నా పేరు దొరైరాజ్ గౌడ్, శ్రీకాళహస్తి మండలం మంగళపురి పంచాయతీలో పది సంవత్సరాల పాటు చౌకదుకాణ డీలర్‌గా పని చేశాను. సరుకుల పంపిణీలో పారదర్శకత పాటిస్తూ ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉన్నాను. నాపై ఎలాంటి ఫిర్యాదులు లేవు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సహకరించాననే నెపంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి అన్యాయుంగా తొలగించారు. అధికార పార్టీ నేతలకు కొందరు అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తూ డీలర్లను వేధింపులకు గురిచేస్తున్నారు. రాజకీయుంగా తొలగిస్తున్నారు. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ⇒ కార్యకర్తలకు రేషన్‌షాపుల అప్పగింత ⇒ వందల సంఖ్యలో డీలర్ల మార్పు ⇒ జిల్లాలో మొత్తం దుకాణాలు 2,831 ⇒ ఇన్‌చార్జ్‌లతో నడుస్తున్నవి 390 ⇒ అస్తవ్యస్తంగా పౌరసరఫరాల వ్యవస్థ ⇒ పేదలకు అందని నిత్యావసర సరుకులు ⇒ బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న వైనం సాక్షి, చిత్తూరు: ప్రభుత్వ చౌకదుకాణాల్లో పేదలకు నిత్యావసర సరుకులు సక్రమంగా అందడం లేదు. టీడీపీ అధికారం చేపట్టిన తరువాత పౌరసరఫరాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అధికార పార్టీ నేతలు తమ కార్యకర్తలను ఇన్చార్జ్ డీలర్లుగా నియమించడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. ప్రస్తుత ప్రభుత్వం బియ్యం, చక్కెర, కిరోసిన్ మాత్రమే చౌక దుకాణాల ద్వారా అందిస్తోంది. గత ప్రభుత్వ హయంలో బియ్యం, చక్కెర, కందిపప్పు, పామాయిల్, పసుపు, కారంపొడి, గోధుమపిండి తదితర వస్తువులను సరఫరా చేసే వారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అన్నీ కనుమరుగైపోయాయి. బియ్యం, చక్కెర,అప్పుడప్పుడు కిరోసిన్ మాత్రమే సరఫరా చేస్తున్నారు. అధిక శాతం చౌకదుకాణాల్లో డీలర్లు కిరోసిన్ సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. కొందరు డీలర్లు రెండు మూడు నెలలకొకసారి కిరోసిన్ సరఫరా చేస్తున్నారు. చక్కెర సైతం పండుగ సమయాల్లో మాత్రమే అందిస్తున్నారు. కొంతమంది డీలర్లు డీడీలు ఆలస్యంగా చెల్లించి నెల చివరన బియ్యం తెచ్చి ఆ తరువాత నెలలో రెండు మూడు రోజులు మాత్రమే పంపిణీ చేసి మధ్యన ఒక నెల సరుకులు ఇవ్వకుండా ఎగనామం పెడుతున్నారు. మరికొందరు నెలమార్చి నెల బియ్యం పంపిణీ చేస్తూ మిగిలిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని డీలర్లందరూ దాదాపుగా మూడు రోజులకు మించి సరుకులు పంపిణీ చేయడం లేదు. పట్టణ ప్రాంతాల్లో వారానికి మించి పంపిణీ చేయడం లేదు. అది కూడా రోజులో గంటో అరగంట సమయంలో మాత్రమే సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఆ సమయంలో సరుకులు తీసుకెళ్లకపోతే తరువాత వెళ్లినా ఇవ్వడం లేదు. ఎక్కువ మంది డీలర్లు ప్రభుత్వ గోడౌన్లలోనే అమ్మకానికి పెడుతున్నారు. డీలర్ల వద్ద సేకరించిన చౌకబియ్యాన్ని వ్యాపారులు పాలిష్ చేసి కర్ణాటకకు ఎగుమతి చేస్తున్నారు. కిరోసిన్, చక్కెర సైతం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో అర్హులైన పేదలకు నిత్యావసరసరుకులు సక్రమంగా అందడం లేదు. సరుకులు సక్రమంగా చూడాల్సిన జిల్లా పౌరసరఫరాల శాఖ విభాగం, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు డీలర్ల వద్ద మామూళ్లు పుచ్చుకుంటూ తమకేమీ పట్టనట్లు మిన్నకుండిపోతున్నారు. మొక్కుబడిగా మాత్రమే 6 (ఏ) కేసులు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారం చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అధికార పార్టీ నేతల మితిమీరిన జోక్యంతో పౌరసరఫరాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. గతంలో ఉన్న చౌకదుకాణాల డీలర్లలో చాలా మందిని తొలగించి వారి స్థానంలో అధికార పార్టీ కార్యకర్తలను ఇన్చార్జ్ డీలర్లుగా నియమించారు. జిల్లాలో మొత్తం రేషన్‌షాపులు 2831, ఇన్‌చార్జ్‌లతో కొనసాగుతున్నవి 390. తిరుపతి డివిజన్లో మొత్తం చౌకదుకాణాలు 703 ఉండగా, 113 ఇన్‌చార్జ్‌లతో కొనసాగుతోంది. చిత్తూరు డివిజన్లో 911 చౌకదుకాణాలుండగా, 91 షాపులు ఇన్‌చార్జ్‌లతో కొనసాగుతోంది. మదనపల్లె డివిజన్లో 1217 షాపులకు గాను 186 ఇన్‌చార్జ్‌లతో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని చౌకదుకాణాలకు పర్మినెంట్ డీలర్లు నియమించాల్సిన అధికారులు నేతల ఒత్తిళ్లతో ఇన్చార్జ్ డీలర్లనే కొనసాగిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా చౌకదుకాణాల పరిస్థితి ⇒ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మొత్తం షాపులు 216, రెగ్యులర్ 143, ఇన్‌చార్జ్‌లు 63, టీడీపీ అధికారంలోకి వచ్చాక 37 చౌకదుకాణాలలో డీలర్లను మార్చి తన కార్యకర్తలకు అప్పగించారు. ⇒ నగరి నియోజకవర్గంలో ఐదు మండలాల పరిధిలో 200 చౌకదుకాణాలున్నాయి. 107 రెగ్యులర్ డీలర్లుండగా, 93 షాపులు ఇన్‌చార్జ్‌లతో కొనసాగుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిండ్ర మండలంలో 28 షాపులను టీడీపీ కార్యకర్తలకు అప్పగించారు. ⇒ మదనపల్లె నియోజకవర్గ పరిధిలో 171 షాపులుండగా, ఇన్‌చార్జ్‌లతో కొనసాగుతోంది 25. టీడీపీ అధికారంలోకి వచ్చాక 7 షాపులకు డీలర్లను మార్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు రోజులు మాత్రమే సరుకులు ఇస్తున్నారు. పట్టణాల్లో 12 రోజులు మాత్రం సరుకులను ఇస్తున్నారు. కిరోసిన్ సక్రమంగా ఇవ్వడం లేదు. ⇒ పుంగనూరు నియోజకవర్గంలో మొత్తం షాపులు 233. ఇన్‌చార్జ్‌లతో ఉన్నవి 24 షాపులు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పులిచెర్ల మండలంలో 10 చౌకదుకాణ డీలర్లను మార్చారు. ⇒ సత్యవేడు నియోజకవర్గంలో 261 షాపులుండగా, ఇన్‌చార్జ్‌లతో 28 కొనసాగుతోంది. సరుకులు పంపిణీ సక్రమంగా జరగడం లేదు. ⇒ పలమనేరు నియోజకవర్గంలో 181 షాపులుండగా, 26 ఇన్‌చార్జ్‌లతో కొనసాగుతోంది. ⇒ గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో 250 షాపులుండగా, 69 ఇన్‌చార్జ్‌లతో కొనసాగుతోంది. ⇒ కుప్పం నియోజకవర్గంలో 178 షాపులకు గాను 69 షాపులకు ఇన్‌చార్జ్‌లు కొనసాగుతున్నారు. ⇒ పూతలపట్టు నియోజకవర్గంలో 235 షాపులకు గాను 189 రెగ్యులర్ డీలర్లుండగా, 35 ఇన్‌చార్జ్‌లతో కొనసాగుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక 11 షాపులను అధికార పార్టీ కార్యకర్తలకు అప్పగించారు. ⇒ పీలేరు నియోజకవర్గంలో ఆరు మండలాల పరిధిలో 265 చౌకుదుకాణాలున్నాయి. వీటిలో 60 దుకాణాలు ఇన్‌చార్జ్‌లతో కొనసాగుతోంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక 10 చౌకదుకాణాల పరిధిలో గతంలో ఉన్న వారిని తొలగించి టీడీపీ కార్యకర్తలకు అప్పగించారు. నియోజకవర్గంలో ప్రజాపంపిణీ వ్యవస్థ సక్రమంగా లేదు. చంద్రగిరి, తంబళ్లపల్లె, చిత్తూరు, తిరుపతి నియోజకవర్గాల్లోనూ పౌరసరఫరా వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంది. -
సిలెండర్ కావాలా నాయనా!
-
నల్లబజారుకు సబ్సిడీ ఎరువులు
ధర్మవరం : ఆరుగాలం శ్రమించి అష్టకష్టాలు పడుతున్న రైతన్నలకు సబ్సిడి ఎరువుల సైతం అందుబాటులోకి రాకుండా ఫెర్టిలైజర్ వ్యాపారులు గద్దలా తన్నుకుపోతున్నారు. అరికట్టాల్సిన అధికారులు కుమ్మక్కై వ్యాపారులకే వంత పాడుతున్నారు. ప్రభుత్వం డీసీఎంఎస్ సొసైటి నుండి సబ్సిడితో అందిస్తున్న ఎరువులను బినామీ రైతుల పేరుతో తరలించి అధిక ధరలకు విక్రయించి ఫెర్టిలైజర్స్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ బ్లాక్ మార్కెట్ దందాను సాక్షి బట్టబయలు చేసింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని డీసీఎంఎస్ సొసైటిలో రెండు కంపెనీలకు చెందిన ఎరువులను సబ్సిడితో రైతులకు అందిస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున, ఇప్కో కంపెనీల యూరియాలను మార్కెట్ ధర కంటే తక్కువగా రైతులకు అందిస్తున్నారు. ఒక్కో రైతుకు పాసుపుస్తకానికి మూడు బస్తాల చొప్పున అందిస్తారు. ఇదే అదునుగా చేసుకున్న వ్యాపారులు బినామీ పాసు పుస్తకాలతో ప్రతి రోజు వంద నుండి రెండు వందల బస్తాలు నల్లబజారుకు తరలిస్తున్నారు. అక్రమ దందా సాగుతోంది ఇలా.. పట్టణంలో దాదాపు పదికి పైగా ఫెర్టిలైజర్స్ దుకాణాలు ఉన్నాయి. వీరు కొంత మంది రైతులు పాసు పుస్తకాల జీరాక్స్‌లను సేకరించుకుని బినామీ పేర్లతో ప్రతి రోజు 50 నుండి వంద బస్తాలు యూరియాను ఫెర్టిలైజర్స్ దుకాణాలకు చేరవేస్తున్నారు. డీసీఎంఎస్ ఉన్నతాధికారులు అండ పుష్కలంగా ఉండటంతో వీరి దందాకు అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. సాధారణ రైతులకు సవాలక్ష ఆంక్షలు పెట్టి ఎరువులను అందించే అధికారులు వ్యాపారులకు మాత్రం అడిగిందే తడవుగా బస్తాలకు బస్తాలు సరఫరా చేస్తున్నారు. ఈ దందాపై పక్కా సమాచారం అందుకున్న ‘సాక్షి’ వీరి బండారాన్ని బయట పెట్టింది. పట్టణానికి చెందిన చిలమకూరి శంకరయ్య ఫెర్టిలైజర్ నిర్వాహకుడు డీసీఎంఎస్ ఆవరణంలో ఒక ఎడ్లబండిపై దాదాపు 50కి పైగా యూరియా బస్తాలు నింపుకుని డీసీఎంఎస్ నుండి ఫెర్టిలైజర్స్ షాపుకు తీసుకువెళ్లారు. అక్కడి నుండి ఫెర్టిలైజర్స్ షాపుకు వెళ్లిన ఎడ్లబండి నుంచి షాపులోకి అన్లోడ్ చేశారు. ఈ విషయాన్ని స్థానిక ఏవో శ్రావణ్ కుమార్‌కు దృష్టికి సాక్షి తీసుకు వెళ్లగా విచారణ చేయిస్తామని తెలిపారు. అనంతరం షాపు యజమానిని ఎరువులు ఎక్కడి నుండి తెచ్చారని సాక్షి ప్రతినిధులు ప్రశ్నించగా సదరు షాపు యజమాని ఎదో కరువు కాలం వ్యాపారాలు లేవు. డీలర్ వద్ద కొనుగోలు చేస్తే లాభం ఉండదని జవాబిచ్చాడు. తాను మాత్రమే ఈ ఎరువులను కొనడం లేదని అందరూ చేస్తున్న వ్యాపారమే తాను చేస్తున్నానని జవాబిచ్చాడు. అంతలోనే వ్యవసాయ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి నుండి ఫోన్ రావడంతో హుటాహుటిన షాపుకు తాళం వేసి అన్లోడ్ చేసిన బస్తాలను తిరిగి డీసీఎంఎస్ కార్యాలయానికి పంపించి వేశారు. ఈ దందా ద్వారా లక్షల రూపాయలు వ్యాపారులు గడిస్తున్నారని రైతు సంఘం నాయకులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీసీఎంఎస్ ద్వారా వ్యాపారులు ఓక్కో బస్తా రూ.284కు కొనుగోలు చేసి ఫెర్టిలైజర్ షాపుల ద్వారా బహిరంగ మార్కెట్లో ఒక్కో బస్తా డిమాండ్‌ను బట్టి రూ.350 నుండి 370వరకు విక్రయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టడి చేయాల్సిన అధికారులు మాత్రం వ్యాపారుల ప్రలోభాలకు లొంగి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు చిత్తశుద్దితో పనిచేస్తే దుకాణాలు తనిఖీ చేసేటప్పుడు స్టాక్ రిజిష్టర్‌లో కూలంకషంగా పరిశీలిస్తే వీరి దందా బట్టబయలవుతుంది. పట్టణంలో ఇంత వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ ఒక్క దుకాణాదారుడిపైన వ్యవసాయ శాఖాధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ దందాను అరికట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది. -
ఆగని దందా
‘రూపాయి’పై రాబందులు పక్కదారి పడుతున్న పేదోళ్ల బియ్యం యథేచ్ఛగా సాగుతున్న అక్రమ రవాణా సంచులు మార్చి, రీసైక్లింగ్ చేసి లెవీకి పక్క రాష్ట్రాలకూ లారీల్లో తరలింపు పర్యవేక్షణ లోపంతో అక్రమాలు నిజామాబాద్: బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం రూ.38 నుం చి రూ.52కు లభిస్తున్నాయి. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యం సరఫరా చేస్తోంది. బజారులో ఆ నాణ్యత ఉన్న బియ్యం ధర రూ.30కి పైనే పలుకుతోంది. అక్రమాలను అడ్డుకునే వ్యవస్థ లేకపోవడంతో రేషన్‌బియ్యం పథకం కొందరు అవినీతిపరులకు వరంగా మారింది. బియ్యం అక్రమ రవాణాకు దళారులు తహతహలాడుతుండగా, అధికారులు మాత్రం చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ఫలితంగా ఉత్తర తెలంగాణ లో ‘రేషన్ దందా’ జోరుగా సాగుతుం డగా, నామమాత్రం గా రోజుకో కేసు నమోదు అవుతోంది. కరీంనగర్ జిల్లా కోరుట్ల నుంచి నిజామాబాద్‌కు రెండు డీసీఎం వ్యాన్ల లో తరలిస్తున్న 204 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని జిల్లాకు చెందిన టాస్క్‌ఫోర్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. ‘దొరికితే దొంగలు లేదంటే దొరలు’ అన్నట్టుగా సాగుతున్న ఈ దందాలో కొందరు రేషన్ డీలర్లు, మండల స్థాయి స్టాక్ పాయింట్ (ఎంఎల్ఎస్) నిర్వాహకులే భాగస్వాములు కావడంపై విమర్శలు వస్తున్నాయి. నిత్యకృత్యంగా మారిన దందా రేషన్ బియ్యం దందా నిత్యకృత్యంగా మారింది. చూడడానికి చిన్న విషయంగానే కనిపిస్తున్నా, అక్రమార్కులు దీనితో ఏటా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. బో గస్ రేషన్ కార్డులు డీల్లర్లు, మండల లెవెల్ స్టాక్ పాయింట్ అధికారులకు ‘కాసులు’ కురిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం బియ్యాన్ని నేరుగా ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్సపల్లి రామకష్ట ఆగ్రో ఇండస్ట్రీస్‌కి తరలించి రీ-సైక్లింగ్ చేస్తుండగా పౌరసరఫరాలశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ బియ్యం విలువ సుమారుగా రూ. 28 లక్షలని వెల్లడించారు. అదే నెలలో గాంధారికి చెందిన డీలర్ 13.85 క్వింటాళ్ల బియ్యాన్ని ముందస్తుగా ఎంఎల్ఎస్ పాయింట్ నిర్వాహకుడికి అప్పగించగా, డీఎస్ఓ కొండల్రావు తనిఖీ చేసి కేసు నమోదు చేశారు. తాజాగా కరీంనగర్ జిల్లా కోరుట్ల నుంచి ఎపీ15-టీబీ 8966 , ఏపీ 15-టీఏ 9128 నంబర్లు గల రెండు డీసీఎం వ్యాన్లలో తరలిస్తున్న 204 క్వింటాళ్ల బియ్యాన్ని రెవెన్యూ టాస్క్‌ఫోర్స్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.ఆ బియ్యాన్ని త్రివేణి రైసుమిల్లుకు తరలించిన అధికారులు నిజామాబాద్ నాల్గవ టౌన్లో కేసు నమో దు చేసి, వాహనాలను అక్కడికి తరలించారు. దయామా కార్పొరేషన్ పేరిట సరఫరా అవుతున్న ఈ బియ్యం మొత్తం కూడ పీడీఎస్ (ప్రజా పంపిణీ వ్యవస్థ)కు చెందినవి కావడమే విశేషం.అక్కడక్కడా కొందరు నిజాయితీ గల అధికారుల దాడులతో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం దష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. దందా సాగుతుందిలా రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న వైనంలో అందరికీ వాటాలేనన్న ప్రచా రం ఉంది. పౌరసరఫరాల శాఖలోని ‘నిఘా’ అధికారులు కొందరికీ ఇది ‘మామూలే’నన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. నిత్యావసర సరుకులు నల్ల బజారుకు తరలుతున్నాయని బహిరంగంగా చర్చ జరుగుతున్నా, సదరు అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా వుండగా కిలో బియ్యం రెండు రూపాయలున్న తరుణం లో నాలుగో వంతు నల్లబజారుకు తరలించిన వ్యాపారులకు ఇప్పుడు కిలో పై ఇంకో రూపాయి అదనంగా లభించనుంది. సాధారణంగా ప్రభుత్వం లబ్ధిదారుడికి రూపాయికి కిలో బియ్యం ఇస్తుండగా,వారి నుంచి స్థానికంగా ఉండే వ్యాపారులు తొమ్మిది రూపాయలకు కిలో చొప్పున ఖరీదు చేస్తున్నా రు. వారు టోకు వ్యాపారికి పది రూపాయలకు విక్రయిస్తున్నారు. అక్కడి నుంచి సిండి కేట్కు రూ.13కు అమ్ముతున్నట్లు సమాచారం. ఇక్కడే మిల్లర్లు, దళారులు ప్రవేశించి రీమిల్లింగ్, రీ సైక్లింగ్‌లాంటి ప్రక్రియ ద్వారా ఎఫ్‌సీఐకి పంపిస్తున్నారు. భూమి గుండ్రంగా ఉందన్న రీతిలో సాగుతున్న ఈ అక్రమ దందా ద్వారా బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయో, వివిధ మార్గాల ద్వారా మళ్లీ అక్కడికే వెళ్తున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. 190 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత ప్రగతినగర్ : కరీంనగర్ జిల్లా కోరుట్ల నుంచి మహారాష్ట్ర వైపునకు రెండు డీసీఎం వ్యాన్లలో రవాణా అవుతున్న 190 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు మంగళవారం ఉదయం నగరంలోని కంఠేశ్వర్‌లో పట్టుకొన్నారు. పక్కా సమాచారం రావడంతో డీఎస్ఓ కొండల్రావు దాడులకు ఆదేశించారు. దీంతో డీటీలు బాల్‌రాజ్, సుభాష్, సురేష్, పుడ్ ఇన్స్పెక్టర్ విజయ్‌కాంత్‌రావు బైపాస్ రహదారిపై మాటువేసి వ్యాన్లను పట్టున్నారు. వాహనాలను ఠాణాకు తరలించి, నిందితులపై కేసు నమోదు చేశారు. బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి తరులుతున్నాయనేది తెలియాల్సి ఉంది. -
నిషేధం ‘గుట్కా’య స్వాహా
నగరంలో విచ్చలవిడిగా గుట్కా విక్రయాలు రెట్టింపు ధరలతో సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు కొరవడిన సర్కార్ పర్యవేక్షణ పట్టించుకోని అధికారులు విశాఖ రూరల్ : తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్టుగా గుట్కా నిషేధం ప్రకటన చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. దీంతో నగరంలో ఎక్కడికక్కడ గుట్కాలు విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం, నిషేధ ఉత్తర్వులను అమలు చేయాల్సిన అధికారులు నిద్రమత్తులో జోగుతుండడంతో వ్యాపారులు మరింత రెచ్చిపోతున్నారు. బ్లాక్ మార్కెట్ పేరుతో రెట్టింపు ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. వీరి ప్రయోజనాల కోసమే సర్కార్ నిషేధ ప్రకటన చేసిందేమో అనే పరిస్థితి దాపురించింది. విశాఖ కేంద్రంగా గుట్కా రవాణా రాష్ట్ర ప్రభుత్వం నిషేధం అమలు చేసిన తర్వాత గుట్కాలకు విశాఖ కేంద్రమైంది. అంతకుముందు జిల్లాల వారీగా గుట్కాల ఉత్పత్తుల కేంద్రాల నుంచి సరకును నేరుగా దిగుమతి చేసుకునేవారు. కానీ నిషేధం అమలు చేసిన తర్వాత గుట్కాల ఎగుమతులు, దిగుమతులకు విశాఖే కేంద్రమైంది. ముఖ్యంగా ఒడిశా నుంచి విచ్చల విడిగా రైళ్ల ద్వారా సరుకును విశాఖకు దిగుమతి చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు ఎగుమతి చేస్తున్నారు. గుట్కాల వ్యాపారంలో ఓ కాంగ్రెస్ నేత విశాఖను కేంద్రంగా చేసుకుని ఎగుమతులు దిగుమతులు చేస్తున్నారు. వారికి పూర్ణా మార్కెట్లో ఉన్న ఓ బడా వ్యాపారి సహకరిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిషేధాన్ని సాకుగా చూపి, రిస్క్ చేసుకుని వ్యాపారం చేస్తున్నామంటూ మరింత ఎక్కువ రేట్లుకు విక్రయాలు చేస్తున్నారు. సొమ్ము చేసుకుంటున్న రిటైల్, చిల్లర వర్తకులు బ్లాక్ మార్కెట్ పేరుతో హోల్‌సేల్ వ్యాపారులు రేట్లు పెంచేయడంతో తామేమి తక్కువ కాదన్నట్టు చిల్లర వర్తకులు రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. మూడు రూపాయల ఖైనీని రూ.5కు, రెండు రూపాయల పాన్ పరాగ్‌ను రూ.4కు, రూపాయి ఉండే డీలక్స్, సపారీలు రూ.2కు, రెండు రూపాయలుండే ఫైవ్ థౌజండ్ను రూ.4కు విక్రయిస్తున్నారు. ఈ విధంగా మొత్తం రేటులో 50 శాతాన్ని మధ్యవర్తులే తింటున్నారు. నిషేధం అమల్లో ఉన్నా వ్యాపారమేమి తగ్గలేదు. గతంలో రోజుకి రూ.5 కోట్ల టర్నోవర్ జరగగా ఇప్పుడు కూడా అదే స్థాయిలో వ్యాపారమవుతోంది. పట్టించుకోని అధికారులు నగరంలో ప్రతీ చిల్లర దుకాణంలో గుట్కాలు వేలాడుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. సంబంధిత శాఖలన్నీ తమకేమి పట్టదన్నట్టు వ్యవహరిస్తున్నాయి. సర్కార్ పర్యవేక్షణ కూడా ఎక్కడా కనిపించడంలేదు. అసలు గుట్కాల నిషేధం అమలవుతుందా అనే దానిపై కనీసం సమీక్ష చేసిన దాఖలాలు లేవు. అధికారులకు సైతం ఆ దిశగా ఆదేశాలు జారీ చేయడం లేదు. దీంతో ఏ ఒక్క అధికారి సీరియస్‌గా తీసుకోవడం లేదు. సుప్రీంకోర్టు నిషేధించినా.. పొగాకు సంబంధిత ఉత్పత్తుల ద్వారా నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల తదితర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉందని సుప్రీంకోర్టు గుట్కాలపై నిషేధం విధించింది. పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది జనవరి 5వ తేదీన నిషేధాన్ని అమలు చేస్తున్నట్టు సర్కార్ ప్రకటించింది. అయితే సర్కా ర్ ఆదేశాలను వ్యాపారులు పట్టించుకోలేదు. ఎప్పటిలాగే వ్యాపారం చేసుకుంటున్నారు. నిషేధం పేరుతో బ్లాక్ మార్కెట్లో మరింత ఎక్కువ రేట్లుకు విక్రయిస్తున్నారు. -
రీచ్ కాలేదు!
సాక్షి, కర్నూలు : ఇసుక బ్లాక్ మార్కెట్ విక్రయాల నుంచి నిర్మాణదారులకు విముక్తి కలిగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం ఆదిలో కష్టాలను తెచ్చిపెడుతోంది. గతంలో ఇసుక మాఫియా వెనకున్న పెద్దలు, చిన్నపాటి దళారులు ఇప్పుడు ఈ విధానాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటుండడంతో కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. అధికారులకు అవగాహన కలిగి, ఈ విధానంలో ఇసుక విక్రయాలను గాడిలో పెట్టేలోపే కొత్త దళారులు పుట్టుకొస్తున్నారు. అందినకాడికి దోచుకోవడానికి కొత్త అవతారాలెత్తుతున్నారు. ఫలితంగా కారుచౌకగా వినియోగదారునికి చేరుతుందనుకున్న ఇసుక ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. ప్రభుత్వ ఆశయం ఆచరణలో నిర్మాణదారులకు ‘రీచ్’ కాకపోవడంతో ప్రయోజనం కన్పించడంలేదు. అక్రమార్కులు నల్లబజారులో అమ్మకాలు జరిపినప్పుడున్న ధరకంటే ఇప్పటి ధర మూడు రెట్లు అధికంగా ఉంటోంది. అటు డ్వాక్రా సంఘాల పర్యవేక్షణలో నడుస్తున్న రీచ్‌ల్లోనూ కష్టాలు తప్పడం లేదు. రీచ్‌ల నుంచి ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు కూలీలు ముందుకురావడం లేదు. ఇతరులను ఆ పనికి రానివ్వడం లేదు. ధర గిట్టుబాటు కావడం లేదని పేర్కొంటున్నారు. ఫలితంగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేతుల మీదుగా ఆర్భాటంగా ప్రారంభించిన నిడ్జూరు-బావాపురం రీచ్‌లో ఇసుక తవ్వకాలు ఆగిపోవడంతో విక్రయాలు నిలిచిపోయాయి. అలాగే ఈ ఇసుకను తరలించడానికి వినియోగించే లారీలు, ట్రాక్టర్ల వివరాలను ఆన్లైన్ ద్వారా మీ-సేవా కేంద్రాల్లో రిజిస్టర్ అయ్యే ప్రక్రియ కూడా ఇంకా పూర్తికాలేదు. ఇక్కడా ఒక స్పష్టమైన విధానం లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికితోడు నిన్నటి వరకు దొంగ రవాణాపై కొరడా ఝళిపించిన మైనింగ్, రెవెన్యూ, విజిలెన్స్, రవాణా, పోలీసు శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో మళ్లీ ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. కొత్త విధానం బాలారిష్టాలతో చివరికి నిర్మాణదారునికి కష్టాలు మాత్రం రెట్టింపవుతున్నాయి. ఇసుక ఒక్కదానికే భారీ ధర చెల్లించలేక నిర్మాణాలను మధ్యలోనే ఆపేస్తున్నారు. కొత్త విధానం వినియోగదారునికి మేలుచేసేదే అయినా ఈ చిన్నపాటి ఇబ్బందులను పట్టించుకోకపోవడంతో అదికాస్త గుదిబండలా మారుతోంది. కొరత సృష్టించి.. కోట్లు గడిస్తున్నారు.. జిల్లాలో ఒకటి, రెండు, మూడు రీచ్‌లలో తవ్వకాలు పరిమితమవడంతో ఇసుకకు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఇసుక మాఫియా కన్ను దీనిపై పడింది. ప్రస్తుతం కృత్రిమ కొరత తీసుకొచ్చి భారీగా దండుకుంటున్నారు. జిల్లాలో డ్వాక్రా మహిళలు నిర్వహించే మంత్రాలయం, నిడ్జూరు-బావాపురం, జి.సింగవరం-ఎదూరు రీచ్‌లు నడుస్తున్నాయి. అయితే వీటిలో ఎక్కడా పూర్తిస్థాయిలో ఇసుక విక్రయాలు జరగకపోవడంతో అవసరాలకు తగినంత ఇసుక అందని పరిస్థితి. ఇదే అదనుగా ఇసుక మాఫియా, దళారులు ఇసుక కొరత ఆసరా చేసుకుని అధిక ధరలకు విక్రయాలు జరుపుతున్నారు. అధికారపార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో కొందరు నేతలు కలిసి కర్నూలు శివార్లలోని పంచలింగాల నుంచి రోజూ వందల లారీల్లో ఇసుకను హైదరాబాద్‌కు అక్రమంగా తరలించి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. డ్వాక్రా సంఘాలకు ఇసుక రీచ్‌లను అప్పగించినా.. వారి అక్రమ దందా మాత్రం యథేచ్ఛగా సాగుతోంది. అధికారులు మాత్రమే చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వారు చెలరేగిపోతున్నారు. కొత్త దళారుల ఇష్టారాజ్యం.. ‘ఇసుక కొనుగోలు చేయాలంటే వినియోగదారులు వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు. ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో చెల్లింపులు చేస్తే మీ ఇంటికే వస్తుంది’... ఇదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ. దీనికి తగ్గట్టుగానే మహిళలను దీనిలో భాగస్వాములను చేసి, అక్రమార్కుల ప్రాధాన్యాన్ని తగ్గించాలనే దిశగా ప్రయత్నాలు చేశారు. అయితే డ్వాక్రా మహిళల మాటున దళారులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నారు. డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న మూడు రీచ్‌లలో ఇద్దరు నాయకులు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం దృష్టిపెడితేనే.. ప్రభుత్వం చెబుతున్న ప్రకారం డ్వాక్రా సంఘాల పరిధిలో నడిచే రీచ్‌ల నుంచి ఇసుకను నిర్మాణదారుని ఇంటికి చేర్చగలిగితే నల్ల బజారు విక్రయాలు నియంత్రణ చేసినట్టే. అయితే రవాణాకు అవసరమైన లారీలు, ట్రాక్టర్లు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కాకపోవడంతో కొంత ఇబ్బందులు తప్పటం లేదు. మరిన్ని రీచ్‌లకు అనుమతులిస్తే తప్ప సామాన్యుడికి అందుబాటు ధరలో ఇసుక లభించదు. -
బుకింగే.. డెలివరీ లేదు
‘ఇసుక కష్టాలకు ఇక కాలం చెల్లింది. మీ సేవా కేంద్రంలో సొమ్ము చెల్లించడమే ఆలస్యం. క్షణాల్లో ఇసుక మీ ముందు ప్రత్యక్షం. సరసమైన ధరకు.. నాణ్యమైన ఇసుకను సొంతం చేసుకోవచ్చు. భవనాలు, ఇతర నిర్మాణాలను చకచకా పూర్తి చేసేయొచ్చు. ఇదిగో ఇక్కడ ర్యాంపు తెరిచేశాం. ఇసుక కష్టాలకుమంగళం పాడేశాం’ కొవ్వూరు మండలం గోంగూరదిబ్బలో ఇసుక ర్యాంపును ప్రారంభించిన సందర్భంగా వెలువడిన అధికారిక ప్రకటన ఇది. ఇది తెలిసి ఇసుక అవసరమైన వారంతా తెగ సంబరపడ్డారు. ఇసుక కోసం మీ సేవా కేంద్రాల్లో సొమ్ము చెల్లించేందుకు క్యూ కట్టారు. తీరా అక్కడ చెబుతున్న విషయూలను విని, పరిస్థితులను చూసి నివ్వెరపోతున్నారు. తాడేపల్లిగూడెం/తణుకు అర్బన్/ద్వారకాతిరుమల : ఎట్టకేలకు కొవ్వూరు మండలంలోని గోంగూరదిబ్బలో ఇసుక ర్యాంపు తెరుచుకుంది. అధికారికంగా ఇసుక విక్రయూలు ప్రారంభమయ్యూయని రాష్ట్ర గనుల, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రకటించారు. ఇసుక ర్యాంపులను మహిళా సంఘాలకు కేటారుుం చడం ద్వారా ఆ సంఘాల్లోని వారికి ఆర్థిక పరిపుష్టి చేకూరుతుందని, అవసరమైన వారికి తక్కువ ధరకే ఇసుకు లభిస్తుందని పేర్కొన్నారు. ఇసుక కోసం ఇన్నాళ్లూ నిరీక్షించిన వారంతా ఇది నిజమనుకుని మీ సేవా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఇసుక కోసం సొమ్ములు చెల్లిస్తున్నారు. కానీ.. ఇసుక మాత్రం డెలివరీ కావడం లేదు. పైగా రవాణా చార్జీలు, మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే కమీషన్ లేదా ప్రోత్సాహ కాల భారం కొనుగోలుదారులపైనే వేస్తుండటంతో ఇసుక కోసం సొమ్ము కట్టేందుకు వెళ్తున్న వారంతా నివ్వెరపోతున్నారు. బ్లాక్ మార్కెట్ ధరకే.. ఇప్పటివరకూ ఇసుక మొత్తం బ్లాక్ మార్కెట్లోనే దొరికింది. ధరలు 10నుంచి 20 రెట్లు పెరిగిపోయూరుు. ప్రభుత్వమే అధికారికంగా ఇసుక విక్రయూలకు ఏర్పాట్లు చేయడంతో ధరలు దిగివస్తాయని అంతా భావించారు. తీరాచూస్తే బ్లాక్ మార్కెట్ ధరకే ఇసుక కొనాల్సి వస్తోంది. ఇసుకను రవాణా చేసేందుకు దూరాన్ని బట్టి ఇంత అని వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఇసుకను రవాణా చేసే వాహన యజమానులకు కిలోమీటరుకు రూ.60 చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ.. కిలోమీటరుకు రూ.80 చొప్పున వసూలు చేస్తున్నారు. క్యూబిక్ మీటరు ఇసుక ధర రూ.650గా ప్రభుత్వం నిర్ణరుుంచింది. మూడు క్యూబిక్ మీటర్ల ఇసుకను కలిపితే ఒక యూనిట్ అవుతుంది. ఈ లెక్కన చూస్తే యూనిట్ ఇసుక ధర రూ.1,950 అవుతోంది. కిలోమీటరుకు రూ.80 చొప్పున రవాణా చార్జీలను కలుపుకుంటే తడిసి మోపెడు అవుతోంది. అధికారికంగా ర్యాంప్‌ను ప్రారంభించినా.. సొమ్ము కట్టిన వారిలో ఒక్కొరికైనా ఇప్పటివరకూ ఇసుక డెలివరీ కాలేదు. దారి దోపిడీ ఇలా కొవ్వూరు సమీపంలోని ఔరంగాబాద్ ర్యాంప్ నుంచి తాడేపల్లిగూడెంకు ఇసుక తెచ్చుకోవాలంటే తొమ్మిది క్యూబిక్ మీటర్ల (మూడు యూనిట్లు) కోసం రూ.5,850 చెల్లించాలి. ఔరంగాబాద్‌కు తాడేపల్లిగూడెం 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. కిలోమీటరుకు రూ.80 చొప్పున రవాణా ఛార్జీల రూపంలో రూ.3,680 వెచ్చించాల్సి వస్తోంది. మీ సేవా కేంద్రంలో సర్వీస్ చార్జి రూ.25 చెల్లించాలి. అంటే మూడు యూనిట్ల ఇసుకను తాడేపల్లిగూడెం తెచ్చుకోవాలంటే రూ.9,555 వెచ్చించాలి. బ్లాక్ మార్కెట్లో ఇంతకంటే తక్కువ ధరకే లభిస్తోంది. వాత ఇలా... కిలో మీటరుకు రూ.60 చొప్పున చెల్లించేలా వాహన యజమానులతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం వినియోగదారుల నుంచి రూ.80 చొప్పున వసూలు చేస్తోంది. రవాణా ఛార్జీల రూపంలో కిలోమీటరుకు రూ.20 చొప్పున అదనంగా వసూలు చేస్తున్న మొత్తాన్నే ర్యాంపులను నిర్వహించే మహిళా సంఘాలకు ప్రోత్సాహకంగా అందించేందుకు ప్రభుత్వం పథకం వేసింది. ర్యాంపుల నిర్వహణలో మహిళా సంఘాల సేవలను వినియోగించుకుంటున్న ప్రభుత్వం నేరుగా ఒక్క పైసా కూడా వారికి చెల్లించకుండా, వారికి అందించే ప్రోత్సాహకాల మొత్తాన్ని రవాణా ఛార్జీల రూపంలో వినియోగదారుడి నెత్తిన వేస్తోంది. సొమ్ము పోతే పోయింది.. కనీసం ఇసుక అరుునా రావడం లేదని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. గోంగూర దిబ్బ, తాడిపూడి, ఔరంగాబాద్, పందలపర్రు ర్యాంప్‌ల నుంచి ఇసుక తెచ్చుకునేందుకు వేలాది మంది సొమ్ము చెల్లించినా, వారిలో ఒక్కరికి కూడా సరఫరా కాలేదని చెబుతున్నారు. -
బ్లాక్‌లో రేషన్ బియ్యం
సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పేదలకు అందాల్సిన రూపాయికి కిలో బియ్యం పక్కదారి పడుతోంది. వేల కోట్ల సబ్సిడీని భరిస్తూ, ప్రభుత్వం అందిస్తున్న బియ్యం డీలర్ల కక్కుర్తి కారణంగా బ్లాక్‌మార్కెట్‌కు తరలుతోంది. మూడు నెలల కాలంలోనే అధికారులు 10 వేల క్వింటాళ్ల అక్రమ బియ్యాన్ని పట్టుకున్నారు. కేవలం పదుల సంఖ్యలో నిర్వహించిన తనిఖీల్లోనే ఇంత మొత్తం పట్టుబడిందంటే అనధికారికంగా ఏ స్థాయిలో బియ్యం పక్కదారి పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక సబ్సిడీపై అందిస్తున్న కిరోసిన్ అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అధికారుల తనిఖీల్లో ఇప్పటి వరకు సుమారు లక్ష లీటర్ల కిరోసిన్ పట్టుబడగా.. దొరకని కిరోసిన్ మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మేల్కొన్న తెలంగాణ ప్రభుత్వం బియ్యం, కిరోసిన్ అక్రమాలకు కళ్లెం వేసే చర్యలకు దిగాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించింది. అవసరమైతే ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా ఆన్లైన్ చేసే విధానాలను పరిశీలించాలని సూచించింది. రూ. కోట్లలో బియ్యం అక్రమాలు తెలంగాణలో జూన్-ఆగస్టు మధ్య 6,025 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, 3,893 క్వింటాళ్ల లెవీ బియ్యం పట్టుబడినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. దీనికి సెప్టెంబర్ గణాంకాలను కలుపుకుంటే మరో 2 వేల క్వింటాళ్ల పీడీఎస్, మరో వెయ్యి క్వింటాళ్ల లెవీ బియ్యం ఉన్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. కేవలం 103 చౌక ధరల దుకాణాలు, 22 ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద చేసిన తనిఖీల్లోనే ఇంత పెద్దఎత్తున బియ్యం పట్టుబడటం గమనార్హం. ఇక రాష్ట్రంలోని 15 వేలకు పైగా చౌకధరల దుకాణాల్లో పూర్తిస్థాయి తనిఖీలు చేపడితే ఏపాటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనేది ఊహిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. అధికారుల లెక్కల ప్రకారం పట్టుబడిన బియ్యం విలువ బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం సుమారు రూ.4 కోట్లకు పైగా ఉంటుంది. దొరికింది లక్ష లీటర్లు.. కిరోసిన్ సరఫరాలోనూ అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. రేషన్ కార్డు ద్వారా రూ.15కు లీటరు చొప్పున అందిస్తున్న సబ్సిడీ కిరోసిన్‌కు బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్‌కు తరలుతోంది. ముఖ్యంగా ఈ దందా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో నమోదైన కేసులను బట్టి తెలుస్తోంది. జూన్ నుంచి 3 నెలల కాల వ్యవధిలో విజిలెన్స్ అధికారులు చేసిన తనిఖీల్లో 98,540 లీటర్ల కిరోసిన్ పట్టుబడింది. ఇందులో జూన్‌లో 48,447 లీటర్లు, జూలైలో 49,329 లీటర్లు, ఆగస్టులో 1,764 లీటర్లు పట్టుబడినట్లు రికార్డులు చెబుతున్నాయి. సెప్టెంబర్‌లో జరిపిన తనిఖీ ల్లోనూ మరో 10 వేల లీటర్లకు పైగా కిరోసిన్‌ను పట్టుకున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. మార్కెట్లో వీటి విలువ రూ.50 లక్షల వరకు ఉంటుంది. అరకొర తనిఖీల్లోనే పెద్దఎత్తున కిరోసిన్ పట్టుబడుతుంటే, వాస్తవంగా ఏ స్థాయిలో కిరోసిన్ దందా జరుగుతుందో ఊహించవచ్చు. నిఘా పెంచండి.. పీడీఎస్ బియ్యంలో అక్రమాలు, కిరోసిన్ బ్లాక్ మార్కెట్ తరలింపుపై గట్టి నిఘా పెట్టాలని, అక్రమార్కులపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఇటీవల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, పౌర సరఫరాల శాఖలను ఆదేశించింది. బియ్యం గోదాముల నుంచి చౌక ధరల దుకాణాలకు చేరే వరకు ఎక్కడా అక్రమాలు జరగకుండా, అడ్డదారి పట్టకుండా చూడాలని, అవసరమైతే నిల్వ చేసుకున్న మేర స్టాక్ ఉందో లేదో తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సూచించింది. చౌక ధరల దుకాణాలను ఎప్పటికప్పుడు సందర్శించి స్టాక్ రిజిస్టర్లను పరిశీలించాలని, ఏవైనా అక్రమాలు చోటుచేసుకుంటే డీలర్లపై చర్యలకు వెనుకాడరాదని స్పష్టంచేసింది. ఇదే సమయంలో రేషన్ కార్డుల ఏరివేతలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్న మాదిరే రేషన్ సరుకుల సరఫరా, పంపిణీలో జీపీఆర్ఎస్, రేషన్ పోర్టబులిటీ, ఈ-పాస్ వంటి సేవలను విసృ్తతం చేసే చర్యలకు ఉపక్రమించాలని పౌర సరఫరాల శాఖకు సూచించినట్లు తెలిసింది. -
యూరియా బ్లాక్
మిర్యాలగూడ : ఖరీఫ్ సీజన్లో ప్రస్తుతం అత్యవసరమైన యూరియాను వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వాస్తవానికి యూరియా బస్తాను రూ. 284కు విక్రయించాల్సి ఉండగా వ్యాపారులు ప్రస్తుతం నెలకొన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని బస్తాను రూ. 360 రూపాయలకు విక్రయిస్తున్నారు. వర్షాలు కురుస్తుండటం, నాగార్జునసాగర్, ఎమ్మార్పీ కాలువలకు నీటిని విడుదల చేయడంతో జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రైతులు వరిసాగు చేపట్టారు. అయితే అవసరం మేరకు యూరియా రాకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. యూరియా కోసం నెల రోజుల నుంచి దుకాణాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. దిగుమతి అయిన యూరియా 71వేల మెట్రిక్ టన్నులు సెప్టెంబర్ నెలాఖరు వరకు జిల్లాలో 95 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ఇప్పటి వరకు కేవలం 71 వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే వచ్చింది. దిగుమతి చేసుకున్న యూరియాలో 70 శాతం పంపిణీ జరిగింది. మిగతా 30 శాతం యూరియా వ్యాపారుల వద్దే ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలకు ఈ నెలాఖరులోగానే ఇంకా 24వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రాకపోవడంతో వ్యాపారులు తమ వద్ద బ్లాక్ చేసిన యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. పీఏసీఎస్‌లలో... ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనూ యూరియా లభించడం లేదు. మార్క్‌ఫెడ్ వద్ద బఫర్ స్టాక్ లేకపోవడం వల్ల పీఎసీఎస్‌లకు పంపిణీ చేయడం లేదని తెలిసింది. జిల్లాలోని ఏ ఒక్క పీఏసీఎస్‌లో కూడా యూరియా లభిం చడం లేదు. దాంతో రైతులు పూర్తిగా వ్యాపారులపైనే ఆధారపడాల్సి వస్తుంది. పీఏసీఎస్‌లకు యూరియా ఎక్కువ మొత్తంలో కేటాయించాలని డీసీసీబీ అధికారులు, పాలక మండలి కలెక్టర్‌ను కలిసి విన్నవించడం కూడా జరిగింది. మార్కఫెడ్కు 40 శాతమే.. జిల్లాకు చేరుతున్న యూరియాలో అధికారులు వ్యాపారులకే అదనపు కోటా కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. దిగుమతి చేసుకున్న యూరియాలో వ్యాపారులకు 60 శాతం, మార్క్‌ఫెడ్‌కు 40 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. పీఏసీఎస్‌లలో యూరియా బస్తాకు రూ. 284కు లభిస్తున్నందున రైతులు ఎక్కువగా అక్కడే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ, పీఏసీఎస్‌లకు తక్కువ కోటా కేటాయించడం వల్ల రైతులకు సరిపడా యూరియా దొరకడం లేదు. -
‘చౌక’గా సంపాదన
బ్లాక్ మార్కెట్‌కు భారీగా రేషన్ బియ్యం ఎవరి వాటాలు వారికే.. విజిలెన్స్ దాడులు నామమాత్రమే రేషన్‌డీలర్లు, బ్రోకర్లు, మిల్లర్లకు లాభాల పంట మచిలీపట్నం : జిల్లాలోని పేదలకు అందాల్సిన బియ్యానికి రెక్కలొచ్చాయి. కొందరు పెద్దలు గద్దల్లా మారి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మరికొందరు ఇక్కడే ఎఫ్‌సీఐకే మళ్లీ విక్రయిస్తున్నారు. కోట్లాది రూపాయలను అక్రమంగా ఆర్జిస్తున్నారు. ప్రభుత్వానికి తీవ్ర నష్టం వస్తోంది. ఈ అక్రమ తంతు అధికారులకు తెలిసినా మామూళ్లు తీసుకుని నోరుమెదపడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 11,23,934 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు కిలో రూపాయి చొప్పున ప్రతి నెలా 13,452 టన్నుల బియ్యాన్ని రేషన్ షాపులకు పౌరసరఫరాల శాఖ ద్వారా జిల్లాలోని 2,300కు పైగా ఉన్న రేషన్ షాపులకు అందజేస్తున్నారు. డీలరుకు కిలోకు 20 పైసలు కమీషన్ చెల్లిస్తారు. రేషన్ డీలర్లు తమకు వచ్చిన బియ్యాన్ని కార్డుదారులందరికీ పంపిణీ చేసినట్లు రికార్డుల్లో చూపుతున్నారు. ప్రతి నెల 16వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాలి. డీలర్లు నాలుగు రోజులు ముందుగానే బియ్యం అయిపోయాయంటూ బోర్డు తిప్పేస్తున్నారు. ఒక్కో డీలరు వద్ద కనీసం వంద రేషన్‌కార్డులు బోగస్‌వి ఉంటాయని అంచనా. మరికొన్ని కార్డులను తాకట్టు పెట్టుకుని తమ వద్దే ఉంచుకుంటున్నారు. బోగస్ కార్డులు, తాకట్టు పెట్టిన కార్డులకు బియ్యం ఇచ్చినట్లు రికార్డుల్లో రాసేస్తున్నారు. మరికొందరు లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా 4వేల టన్నుల బియ్యం అక్రమంగా తరలిపోతున్నట్లు సమాచారం. కాకినాడ నుంచి ఇతర దేశాలకు.. జిల్లాలో సేకరించిన రేషన్ బియ్యం కాకినాడలోని ఎగుమతిదారులకు విక్రయిస్తారు. కాకినాడ పోర్టు నుంచి థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. విదేశాలకు ఎగుమతయ్యే రేషన్ బియ్యంలో నూక ఉన్నా పెద్దగా పట్టించుకోరని సమాచారం. కాకినాడకు రేషన్ బియ్యాన్ని పంపటంలో ఇబ్బందులు ఎదురైతే మిల్లర్లు లెవీ బియ్యంగా మళ్లీ ఎఫ్‌సీఐకే ఈ బియ్యాన్ని రూ.26 చొప్పున విక్రయిస్తారు. తహశీల్దార్ కార్యాలయానికి మామూళ్లు ఇలా.. ప్రతి డీలరు తనకు వచ్చిన బియ్యం మొత్తం పంపిణీ చేసినట్లు రికార్డులు తయారు చేస్తారు. కానీ, ఎన్ని క్వింటాళ్లు అక్రమంగా తరలించా రనే విషయం తహశీల్దారు కార్యాలయాల్లో పక్కా సమాచారం ఉంటుంది. ఈ మేరకు క్వింటాలుకు రూ.20 చొప్పున మామూళ్లు అందజేస్తారు. దీంతో తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది అన్ని రికార్డులు సరిగానే ఉన్నాయని నిర్ధారిస్తారు. ప్రతి నెలా ఇదే పరిస్థితి నెలకొంది. దాడుల్లో దొరికేది నామమాత్రమే.. గత పది రోజులుగా జిల్లావ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దృష్టి సారించారు. నాలుగు రోజుల క్రితం గూడూరు మండలం తరకటూరులోని ఓ మిల్లులో 191 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున మైలవరం బైపాస్‌రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా నుంచి లారీలో ఈ బియ్యాన్ని తరలిస్తున్నారు. వేలాది టన్నుల బియ్యం అక్రమంగా తరలిపోతున్నా విజిలెన్స్ దాడుల్లో అతి తక్కువ మొత్తంలోనే దొరకటం గమనార్హం. రేషన్‌షాపుల ద్వారా ఈ-పీడీఎస్ పద్ధతిలో సరుకులు కేటాయిస్తున్నా, డీలర్లు, బ్రోకర్లు, మిల్లర్లు యథేచ్ఛగా తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగించటం గమనార్హం. అక్రమాలు ఇలా... పేదలకు పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ ద్వారా మిల్లర్ల నుంచి లెవీ(దాళ్వా) బియ్యాన్ని కిలోకు రూ.26 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తోంది. ఈ విధంగా కొనుగోలు చేసిన బియ్యాన్ని తెల్ల కార్డుదారులకు కిలో రూపాయికి చొప్పున పంపిణీ చేస్తారు. మిగిలిన మొత్తాన్ని ఎఫ్‌సీఐకి ప్రభుత్వం చెల్లిస్తుంది. బహిరంగ మార్కెట్లో లెవీ బియ్యం కిలో రూ.22 ధర పలుకుతోంది. డీలర్లు తమ వద్ద మిగిలిన బియ్యాన్ని కిలో రూ.9 చొప్పున బ్రోకర్లకు విక్రయిస్తారు. బ్రోకర్లు రూ.13 నుంచి రూ.14 చొప్పున రైస్‌మిల్లర్లకు విక్రయిస్తారు. మిల్లరు తాము కొనుగోలు చేసిన లెవీ బియ్యాన్ని కొత్తవిగా మార్చేందుకు పాలిష్ పడతారు. ఈ లెక్కన పది క్వింటాళ్ల బియ్యాన్ని విక్రయిస్తే ఖర్చులన్నీ మినహాయించగా రేషన్ డీలరుకు రూ. 9వేలు, బ్రోకర్‌కు రూ. 3వేలు, మిల్లర్‌కు రూ.14వేలు చొప్పున మిగులుతాయని తెలుస్తోంది. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రతి మండలంలోనూ ఇద్దరు, ముగ్గురు బ్రోకర్లు ఉన్నారు. వీరి కనుసన్నల్లోనే డీలర్ల నుంచి బియ్యం సేకరించటం, వాటిని ఆటోలు మినీ లారీల్లో మిల్లుకు చేర్చటం వంటివి పకడ్బందీగా నిర్వహిస్తారు. -
అక్రమాల పాతరకు యత్నం
ఆత్మకూరు: ఆత్మకూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లో పెద్ద స్థాయిలో అవినీతి రాజ్యమేలుతోంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన పౌష్టికాహారం యథేచ్ఛగా నల్లబజారుకు తరలుతోంది. రెండు నెలలకు సరిపడా ఆహారం, సరుకులు ఈ ప్రాజెక్ట్ గొడౌన్‌కు సరఫరా కాగా అందులో నెల సరుకులనే అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసి మిగిలిన సరుకులను ఓ ప్రైవేటు వ్యాపారికి నిలువునా అమ్మేశారు. ఆత్మకూరు ప్రాజెక్ట్ సరుకులను అన్లోడ్ చేసే సమయంలో గోడౌన్ వద్ద ప్రాజెక్ట్ అధికారులకు బదులు ఈ ప్రైవేటు వ్యక్తి పట్టుబడటంతో వ్యవహారం వెలుగుచూసింది. సరుకుల్లో తేడాను గుర్తించారు. దీనిపై స్పందించిన జిల్లా ప్రాజెక్ట్ అధికారిణి విచారణ ప్రారంభించడంతో అవినీతి భాగోతం బయటపడుతోంది. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు ప్రాజెక్ట్ అధికారులు అడ్డదారులు వెతుకుతున్నారు. తనిఖీలు ఎక్కెడెక్కడంటే..? ప్రాజెక్ట్ పరిధిలోని ఆత్మకూరు, అనంతసాగరం, ఏఎస్‌పేట మండలాల్లో తనిఖీలు జరిపారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధం లేని ఏడు మంది సీడీపీఓలను పంపి అంగన్వాడీ కేంద్రాలను సామూహికంగా తనిఖీ చేయించారు. సరుకులకు సంబంధించిన రికార్డు పరిశీలిస్తే సరఫరాలో చోటు చేసుకున్న సరుకుల కోత బట్టబయలైంది. కారకులెవరు ? అంగన్వాడీ కేంద్రాలకు చేరాల్సిన సరుకులు నల్లబజారుపాలు కావడానికి కారణం ప్రాజెక్ట్‌లోని సూపర్వైజర్గా విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. అంతా తానై షాడో సీడీపీఓగా వ్యవహరించడమేనని అటు తనిఖీ అధికారులు, ఇటు కొందరు సూపర్వైజర్లు బాహాటంగానే వాఖ్యానిస్తున్నారు. ఇప్పుడేం జరుగుతోందంటే....? విచారణలో వెల్లడైన అక్రమాలను కప్పిపుచ్చేందుకు సీడీపీఓ, షాడో సీడీపీఓతో పాటు కొందరు సూపర్వైజర్లు వారికి అనుకూలమైన కార్యకర్తలను పావులుగా వినియోగిస్తున్నారని సమాచారం. వీరిని రకరకాలుగా బెదిరింపులకు గురిచేస్తూ తమకు అనుకూలంగా చెప్పాలని ప్రలోభపెడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. అంగన్వాడీ కార్యకర్తలపై ఒత్తిడి తెచ్చి రెండు నెలల సరుకు కేంద్రాలకు పంపిణీ చేసినట్టు చెప్పాలని కొందరు సూపర్వైజర్ల ద్వారా హుకుం జారీ చేయిస్తున్నారు. ఈ కుంభకోణం నుంచి బయటవేయమని అధికారపార్టీ నేతలను ఆశ్రయించారు. -
బ్లాక్ మార్కెట్లో ‘క్షీరభాగ్య’
తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్న గ్రామస్తులు సాక్షి, బళ్లారి : నగర శివార్లలోని గుగ్గరహట్టి ప్రభుత్వ పాఠశాల నుంచి క్షీరభాగ్య పాల ప్యాకెట్లును బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న వ్యక్తిని గ్రామస్తులు బుధవారం పట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం క్షీర భాగ్య పథకం కింద పాలు పొడి ప్యాకెట్లను సరఫరా చేస్తోంది. అయితే వాటిని కొందరు హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గుగ్గరహట్టిలోని ప్రభుత్వ పాఠశాలలో ఇదే తంతు జరుగుతోంది. ఆ పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయురాలి భర్త బుధవారం 50 కిలోల పాలపొడిని బైక్‌లో తీసుకొని వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. పాఠశాల హెడ్మాస్టర్ ఈ సంచిని తీసుకెళ్లి వేరే చోట పెట్టాలని ఆదేశించడంతో తాను తీసుకెళ్తున్నానని, అందులో ఏముందో తనకు తెలీదని పోలీసులకు ఆయన తెలిపారు. కాగా విషయం తెలుసుకున్న ప్రధానోపాధ్యాయురాలు స్కూల్ నుంచి జారుకున్నారు. నిజానిజాలు తేల్చడానికి బళ్లారి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా పాల పొడిని బ్లాక్ మార్కెట్ తరలిస్తున్న ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక నవ నిర్మాణ వేదిక కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. -
రేషన్ పక్కదారి
సాక్షి, అనంత పురం : చౌక దుకాణాల ద్వారా పేదలకు అందాల్సిన నిత్యావసర సరుకులు పక్కదారి పడుతున్నాయి. పలువురు డీలర్లు పేదల పొట్ట కొడుతూ చౌక బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కిరోసిన్, చక్కెర, కందిపప్పు, పామాయిల్, గోధుమలు, గోధుమపిండి అక్రమంగా అమ్మేసుకుంటున్నారు. అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెడుతుండటంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. చౌక బియ్యాన్ని జిల్లా నుంచి పొరుగునే ఉన్న కర్ణాటకకు తరలిస్తున్నారు. అక్కడ రీసైక్లింగ్ చేస్తూ సన్న బియ్యంగా మారుస్తున్నారు. బియ్యం అక్రమ రవాణాకు ఉరవకొండ కేంద్ర బిందువుగా ఉంది. గుంతకల్లు, అనంతపురం, శింగనమల, గుత్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాలు తర్వాత స్థానంలో ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల నుంచి కూడా అక్రమ రవాణా సాగుతోంది. మూడు నెలల క్రితం ఉరవకొండలోని టీడీపీ నేత గోదాములో దాదాపు మూడు వేల బస్తాల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన పప్పుశనగను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు పట్టుకున్నారు. దీని విలువ దాదాపు రూ.136 కోట్లుగా తేల్చారు. ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ కేసు నుంచి బయట పడటంతో పాటు సరుకును విడిపించుకోవడానికి ఆ నాయకుడు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గ్యాస్‌దీ అదే బాట : సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు కూడా పక్కదారి పడుతున్నాయి. సిలిండర్ల అక్రమ రవాణాకు కదిరి కేంద్ర బిందువుగా మారింది. తనకల్లులో డీలర్‌షిప్పు పొందిన ఓ గ్యాస్ డీలర్ కదిరి కేంద్రంగా వ్యాపారం సాగిస్తున్నాడు. అతను మూడు నెలల క్రితం 20 సిలిండర్లను కదిరిలోని అడపాలవీధిలో తన బంధువుల ఇంట్లో అక్రమంగా నిల్వ చేసివుండగా పౌర సరఫరాల అధికారులు సీజ్ చేశారు. అయితే.. ఓ టీడీపీ నాయకుని ఒత్తిడితో ఆ కేసును నీరుగార్చారు. ఇలాంటి అక్రమాలను ఆ డీలర్ ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. 502 కేసులు నమోదు : జిల్లాలో 2012 నుంచి 2014 మే మాసం వరకు నిత్యావసర సరుకుల అక్రమ రవాణా, నిల్వలపై పౌర సరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించి 502 కేసులు నమోదు చేశారు. 191 కోట్ల 51 లక్షల 84 వేల 381 రూపాయల విలువైన నిత్యావసర సరుకులను, వాటి రవాణాకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు. అయితే.. ఇప్పటి వరకు 200 కేసులను మాత్రమే పరిష్కరించారు. కొన్ని కేసులు రాజకీయ జోక్యంతో నీరుగారిపోయాయి. మరికొన్ని విచారణలో ఉన్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పీడీయాక్ట్ కింద కేసులు పెడతామని గతంలో అధికారులు హెచ్చరించారు. తర్వాత ఆ ఊసే లేదు. 6ఏ కేసులు మాత్రమే నమోదు చేస్తున్నారు. అక్రమార్కులు జరిమానాలతో బయటపడుతున్నారు తప్ప శిక్ష అనుభవించిన దాఖలాలు పెద్దగా లేవు. -
ఆకాశంలో సిగ‘రేట్లు’
బ్లాక్ మార్కెట్లో ప్రత్యక్షం ధరలు పెరుగుతాయనే కారణం కృత్రిమ కొరత సృష్టిస్తున్న మార్కెట్ శక్తులు గుడివాడ : కాదేదీ బ్లాక్ మార్కెట్‌కు అతీతమని మార్కెట్ శక్తులు నిరూపిస్తున్నాయి. వచ్చే నెలలో సిగరెట్ ధరలు పెరుగుతాయనే సంకేతాలందడంతో బ్లాక్‌మార్కెట్ తలుపులు బార్లా తెరుచుకున్నాయి. పెరగనున్న పోగాకు ఉత్పత్తుల ధరలను బూచీగా చూపి మార్కెట్ శక్తులు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇప్పటికే సిగరెట్ ధరలు అడ్డగోలుగా పెంచి వినియోగదారులను దోచుకు తింటున్నారు. కొత్త ఎంఆర్పీ ధరతో ఉత్పత్తులు రాకముందే పాత ఎంఆర్పీ ధర ఉన్న వాటిని బ్లాక్ చేసి ఒక్కో సిగరెట్ ప్యాకెట్‌కు రూ.10నుంచి 15వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో విని యోగదారుని జేబుకు చిల్లు పడుతుంది. ప్రతి బ్రాండ్‌పై ఎంఆర్పీ కన్నా 25నుంచి 35 శాతానికి పైగా అధిక ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అదేమని అడిగితే పొగాకు ఉత్పత్తులపై టాక్సును పెంచుతున్నందున ధరలు పెరగనున్నాయని అందుకే సరుకు దొర కడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. మ ద్యం తరువాత అత్యధిక గిరాకీ ఉన్న పోగాకు ఉత్పత్తుల ద్వారా మార్కెట్ శక్తులు రూ.కోట్లు గడిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. కృత్రిమ కొరత ... సిగరెట్లుపై పెరగనున్న ధరలను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కంపెనీ నుంచి ఎటువంటి కొరత లేదని తెలుస్తుంది. పెంచిన టాక్సులు ఇంకా అమల్లోకి రాని కారణంగా కొత్త ఎంఆర్పీతో సిగరెట్ ఉత్పత్తులు బయటకు రాలేదు. పాత ధరతోనే సరుకు వస్తుండగా పెద్దపెద్ద హోల్‌సేల్ మార్కెట్ శక్తులు ముందుగానే సరుకును కొనేసి బ్లాక్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సిగరెట్ల సరఫరా సాధారణంగానే ఉన్నా పెద్దపెద్ద డిస్ట్రి బ్యూటర్లు, హోల్‌సేల్ వ్యాపారులు వీటిని బ్లాక్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు సరఫరా చేసినా హోల్ సేలర్లు సరుకును బ్లాక్ చేసి అధిక ధరకు అమ్ముతున్నారు. రిటైల్ ధరకాదు.. ఎంఆర్పీ అయితేనే... ఇప్పటి వరకు చిన్నచిన్న చిల్లర దుకాణాల వారికి హోల్‌సేల్ డీలర్లు రిటైల్ ధరకు అమ్ముతారు. ధరలు పెరుగుతాయని సంకేతాలు రావడంతో వారం రోజులుగా ఎంఆర్పీ ధరకే చిన్న దుకాణాల వారికి అమ్ముతున్నారు. ఇదే అదునుగా భావించిన చిన్న చిన్న బడ్డీ కోట్లు వారు ఒక్కో సిగరెట్‌కు ఒక రూపాయి అదనంగా వసూలు చేస్తున్నారు. అంటే పది సిగరెట్లు ఉండే పెట్టికి రూ.10 అదనంగా చెల్లించాల్సి వస్తుంది. పొగాకు ఉత్పత్తుల ధరలు అడ్డగోలుగా వసూలు చేస్తున్నా నియంత్రించాల్సిన తూనికలు కొలతలు శాఖ నిద్రపోతుందని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. -
రేషన్..పరేషాన్..!
ఒంగోలు టూటౌన్ : చౌకదుకాణాలపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. దీంతో డీలర్లు ఎవరూ సమయపాలన పాటించడం లేదు. రేషన్ షాపులను ఎప్పుడు తీస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. కార్డుదారులకు సకాలంలో నిత్యవసర వస్తువులు అందించాలన్న లక్ష్యానికి తూట్లు పొడుస్తుండటంతో వారంతా అవస్థపడుతున్నారు. జిల్లాలో 2,202 చౌకడిపోలు ఉన్నాయి. వాటి పరిధిలో 8,90,587 వరకు రేషన్‌కార్డులున్నాయి. వీటిలో 6,73,999 తెల్లకార్డులుండగా, 52,152 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. మరో 1,032 అన్నపూర్ణ కార్డులున్నాయి. వీరందరికి ప్రభుత్వం ప్రతి నెలా రాయితీపై బియ్యం, నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తోంది. కిలో బియ్యం రూపాయి లెక్కన చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు అందిస్తోంది. దానికోసం 10 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి అన్ని చౌకడిపోలకు చేరతాయి. బియ్యంతో పాటు నీలికిరోసిన్, రాయితీపై ఇస్తున్న తొమ్మిది రకాల వస్తువులైన పంచదార, పామోలిన్ ఆయిల్, కందిపప్పు, గోదుమలు, గోదుమపిండి, కారంపొడి, చింతపండు, పసుపు, అయోడైజ్డ్ ఉప్పు అందిస్తోంది. ఇందుకోసం కోట్లాది రూపాయలను ప్రతి నెలా పేదల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. నిత్యవసర వస్తువుల చట్టం 1955, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రజాపంపిణీ వ్యవస్థ విధానం 2008 ఉత్తర్వులకనుగుణంగా జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ నడుస్తోంది. కానీ, పేదల కోసం కోట్ల రూపాయిల సబ్సిడీతో పంపిణీ చేస్తున్న వస్తువులు బడావ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. భారత ఆహార సంస్థ గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరిన బియ్యం మరుక్షణమే బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. జిల్లాలోని వై.పాలెం, దర్శి, గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లో పెద్దఎత్తున ఈ వ్యాపారం జరుగుతోంది. తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా ఈ అవినీతి వ్యవహారంలో ఎవరి పాత్ర వారు పోషిస్తున్నారు. అందుకుగానూ ఎవరికి చెందాల్సిన ముడుపులు వారికి పక్కాగా అందడంతో పాటు లక్షల లీటర్ల నీలికిరోసిన్, గోదుములు, కందిపప్పు, తదితర నిత్యవసర వస్తువుల సరఫరా అవుతున్నాయి. దుకాణాలు తెరవాల్సింది ఇలా... ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీలోగా బియ్యం, కిరోసిన్, నిత్యవసర వస్తువులను కార్డుదారులకు అందించాలి. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు రేషన్ షాపులు తెరిచి ఉంచాలి. మళ్లీ సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు తెరిచి ఉంచాలి. అమ్మకాలు, నిల్వలకు సంబంధించిన వివరాలను నోటీస్ బోర్డులో ఉంచాలి. రికార్డులు సక్రమంగా నిర్వహించాలి. ఈ విధానాన్ని మూడొంతుల డీలర్లు అమలుచేయడంలేదు. జరుగుతుంది ఇలా... ప్రతి నెలా 20 నుంచి 25వ తేదీలోపు డీలర్లంతా బియ్యం, సరుకులకు డీడీలు తీయాలి. నెలాఖరుకు నిత్యవసర వస్తువులను ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌకధరల దుకాణాలకు స్థానిక రెవెన్యూ అధికారులు చేర్చాలి. సరుకులు పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇలా జరగడం లేదు. డీలర్ల నుంచి ముడుపులు తీసుకుంటున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చౌకధరల దుకాణాలను సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా చౌకధరల దుకాణాల సమయపాలన అస్తవ్యస్తంగా తయారైంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో వెలుగుచూసిన వాస్తవాలు... వారంరోజుల క్రితం కొత్తపట్నం మండలంలో పలు చౌకధరల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అనేక వాస్తవాలు వెలుగుచూశాయి. డీలర్లు ఎవరూ సమయపాలన పాటించడంలేదు. దుకాణాలు తెరిచి ఉంచాల్సిన సమయంలో అన్ని షాపులు మూతపడి ఉండటాన్ని అధికారులు గుర్తించారు. కొన్ని షాపుల తాళాలు పగులగొట్టి తనిఖీలు చేశారు. అక్కడ నిల్వలకు, అమ్మకాలకు సంబంధించిన రికార్డులు లేవు. నిల్వల్లో తేడాలను అధికారులు గుర్తించారు. పాదర్తి గ్రామంలోని 11వ నంబర్ దుకాణంలో 45.5 క్వింటాళ్ల బియ్యం, 25 కిలోల పంచదార, 66 కిలోల ఉప్పు, 40 లీటర్ల కిరోసిన్ నిల్వల్లో వ్యత్యాసంను అధికారులు గుర్తించారు. 10వ నంబర్ దుకాణాంలో 72 క్వింటాళ్ల బియ్యం, 25 కిలోల ఉప్పులో తేడాలున్నాయి. కె.పల్లెపాలెంలోని 7వ నంబర్ దుకాణంలో 27.9 క్వింటాళ్ల బియ్యం, 97 ప్యాకెట్ల ఉప్పులో వ్యత్యాసం ఉంది. 8వ నంబర్ దుకాణంలో 95 బస్తాల బియ్యంలో తేడాలు గుర్తించారు. ఏ దుకాణంలోనూ నిల్వలకు, రికార్డులకు పొంతన లేకుండా ఉండటాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించి ఆయా నిల్వలను స్వాధీనం చేసుకుని స్థానిక వీఆర్వోలకు అప్పగించారు. డీలర్లపై 6ఏ కేసులకు సిఫార్సు చేశారు. ఇదే విధంగా గత నాలుగు నెలలుగా జిల్లాలోని పలుచోట్ల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన దాడుల్లో అనేక అక్రమ నిల్వలు వెలుగుచూశాయి. కొంతమంది డీలర్లు రూపాయి బియ్యాన్ని రూ.10కి వ్యాపారులకు అమ్ముకుని తక్కువ కాలంలోనే లక్షాధికారులవుతున్నారు. అక్రమార్కులకు రెవెన్యూ అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో వారు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా పరిస్థితి తయారైంది. ఫలితంగా రాయితీ సరుకులు పేదల దరిచేరడంలేదు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని చౌకధరల దుకాణాలు సమయపాలన పాటించేలా, పేదలకు సక్రమంగా సరుకులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు. -
ఎరువులు, విత్తనాల అమ్మకాలపై నిఘా
గజ్వేల్ : పట్టణంలో ఎరువులు, విత్తనాల అమ్మకాలపై అధికారులు నిఘా కొనసాగుతోంది. ఈనెల 13న జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ శరత్ పట్టణంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి బ్లాక్‌మార్కెట్ జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మంగళవారం స్థానిక ఏడీఏ శ్రావణ్ కుమార్ పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి ట్రేడర్స్, శ్రీనివాస ట్రేడర్స్‌లలో ఎరువులను బల్క్‌గా విక్రయాలు జరుపుతున్నారని, స్టాక్ రిజిస్టర్‌ను సక్రమంగా నిర్వహించడం లేదని, బిల్ బుక్కుల్లో రైతుల సంతకాలు తీసుకోవడం లేదని గుర్తించి ఆ రెండు దుకాణాల్లో క్రయ విక్రయాలను నిలిపివేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ ఎరువులు, విత్తనాల అమ్మకాల్లో అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. తనిఖీల్లో తప్పిదాలు బయటపడితే క్రిమినల్ కేసులను నమోదు చేయడానికి వెనకాడబోమన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఈ తనిఖీల్లో ఏడీఏ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ సురేష్ ఉన్నారు. -
‘రూపాయి’తో కోటి!
రూపాయికే కిలో బియ్యం ఎంతోమంది పేదోళ్ల కడుపులు నింపుతోంది. కానీ.. అదే బియ్యం పక్కదారి పడితే.. కొంతమంది గద్దలకు కోట్లు సంపాదించి పెడుతోంది. ఆ బియ్యం పేదోళ్లకు చేరితే న్యాయం.. ‘పెద్దోళ్ల’ చేతుల్లో పడితే అక్రమం. జిల్లాలో చాలా వరకు అక్రమం.. అన్యాయమే జరుగుతోంది. రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. జిల్లాలో కొందరు రైస్‌మిల్లర్లు రేషన్‌దుకాణాల ద్వారా బియ్యాన్ని కొనుగోలు చేసి.. రైస్‌మిల్లుల్లోనే రీ సైక్లింగ్ చేసి.. సంచులను మార్చేసి ఎఫ్‌సీఐకి లెవీ రూపంలో తరలిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలకూ చేరవేస్తున్నారు. రూపాయికి కిలో బియ్యాన్ని రూ. 25కు అమ్ముతూ కోట్లు సంపాది స్తున్నారు. ఇందుకు అర్సపల్లి రైస్‌మిల్లులో రూ.28లక్షల విలువ గల రేషన్ బియ్యం పట్టుబడటమే ఉదాహరణ. వీరికి అధికారుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కిలో బియ్యం ధర బహిరంగ మార్కెట్లో రూ.32ల నుంచి రూ.40లకు పైగా ధర పలుకుతోంది. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యం సరఫరా చేస్తుంది. మార్కెట్లో ఆ నాణ్యత ఉన్న బియ్యం ధర రూ.25పైనే పలుకుతోంది. రేషన్ బియ్యం సరఫరాను అడ్డుకోవాల్సిన అధికార వ్యవస్థ చేతులెత్తేయడం అక్రమార్కులకు వరంలా మారింది. రూపాయికి సరఫరా చేసే కిలో బియ్యంతో కోట్లు సంపాదిస్తున్నారు. ఈ అక్రమ దందా జిల్లా అధికారులు సూత్రధారులుగా.. దళారు లు, మిల్లర్లు పాత్రధారులుగా నడుస్తున్నట్లు ఆరోపణలూ వస్తున్నాయి. ప్రతినెలా జిల్లాకు కనీసం 10,720.944 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం కేటాయిస్తారు. ఒక్కోసారి బియ్యం కోటా పెరుగుతుంది. జిల్లాలోని రేషన్ దుకాణాల ద్వారా 7,67,960 కార్డులకు బియ్యాన్ని సరఫరా చేస్తారు. అయితే ఇదివరకే సరఫరా అవుతున్న రేషన్‌బియ్యంలో నాలుగో వంతు ‘నల్లబజారు’కు తరలుతుందన్న ఆరోపణలున్నాయి. బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే లాభాలు భారీ స్థాయిలో వస్తుండటంతో అక్రమాలు పెరిగే ప్రమాదం ఉంది. తాజాగా శనివారం అర్సపల్లిలోని రైస్‌మిల్ గోదాముల్లో సుమారు రూ.28 లక్షల విలువ చేసే రేషన్ బియ్యం నిల్వ చేసి.. రీసైక్లింగ్ చేస్తున్న వ్యవహారం బట్టబయలైంది. దీంతో వ్యాపారులు, రైసుమిల్లర్ల చీకటి బాగోతం బయటపడింది. ఇలా జిల్లావ్యాప్తంగా అక్రమాలు జరుగుతున్నట్లు అనుమానాలున్నా అధికార యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తోంది. ఫిర్యాదులు వచ్చినప్పుడే స్పందిస్తున్నారన్న ఆరోపణలు న్నాయి. ‘బియ్యం’లో అందరికీ వాటాలు..! రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న బాగోతంలో అందరికీ వాటాలు అందుతున్నాయన్న ప్రచారం ఉంది. పౌరసరఫరాల శాఖలోని ‘నిఘా’ అధికారులు కొందరికీ ఇది ‘మామూలే’నన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా నిత్యవసర వస్తువులు నల్లబజారుకు తరలుతున్నాయని బహిరంగంగా చర్చ జరుగుతున్నా సదరు అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిలో బియ్యం రెండు రూపాయలున్న తరుణంలో నాలుగో వంతు నల్లబజారుకు తరలించిన వ్యాపారులకు ఇప్పుడు కిలోపై ఇంకో రూపాయి అదనంగా లభిస్తుంది. సాధారణంగా ప్రభుత్వం లబ్ధిదారుడికి రూపాయికి కిలో బియ్యం ఇస్తుండగా.. లబ్ధిదారుడి పేరుతో స్థానికంగా ఉండే వ్యాపారులు రూ.7 నుంచి రూ.9 కిలో చొప్పున కొంటున్నారు. వ్యాపారులు మధ్యస్థాయి టోకు వ్యాపారికి కిలో రూ.12కు విక్రయిస్తుండగా, మధ్యస్థాయి వ్యాపారి సిండికేట్‌కు రూ.15లకు విక్రయిస్తున్నట్లు సమాచారం. అక్కడ మిల్లర్లు, దళారులు ప్రవేశించి రీమిల్లింగ్, రీ సైక్లింగ్ ప్రక్రియ ద్వారా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)కి పంపిస్తుండటం గమనార్హం. భూమి గుండ్రగా ఉందన్న రీతిలో సాగుతున్న ఈ అక్రమ దందా ద్వారా బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయో.. వివిధ మార్గాల ద్వారా మళ్లీ అక్కడికే వెళ్తున్నాయి. కానీ ఏడాదిలో కోట్ల రూపాయలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి. రే షన్ బియ్యానికి ‘లెవీ’ రంగు జిల్లావ్యాప్తంగా చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న రూపాయికి కిలో బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు తరలించేందుకు వ్యాపారులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. 16 మండల స్థాయి నిల్వ కేంద్రాల(ఎంఎల్ఎస్ పాయింట్లు) ద్వారా 7,67,960 కార్డుల లబ్ధిదారులకు సరఫరా చేసేందకు రేషన్ దుకాణాలకు బియ్యం తరలిస్తారు. బాగా సాన్నిహిత్యం ఉన్న గోదాం ఇన్చార్జి ఉంటే.. గోదాముల స్థాయిలోనే బియ్యం చేతులు మారుతాయి. లేదంటే రేషన్ బియ్యానికి సంబంధించి గోనెసంచులు మార్చడం, పాలిష్ పట్టి తరలిస్తున్నారని తెలిసింది. గోదాముల నుంచి రేషన్ దుకాణానికి తరలించకుండా బియ్యాన్ని అక్రమ వ్యాపారులు ఏజెంట్ల ద్వారా టోకున విక్రయిస్తున్నట్లు తెలిసింది. నెలవారీగా వచ్చే బియ్యం కోటా నుంచి కొందరు డీలర్లు సిండికేట్‌గా ఏర్పడి గోదాము నుంచే నేరుగా లారీ లోడు ద్వారా సమీపంలోని రైస్‌మిల్లులకు తరలిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసిన రైస్‌మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి లెవీ రూపంలో పంపిస్తుండటం విశేషం. అంతేకాకుండా జిల్లాలో వివిధ ప్రాంతాలలో సేకరించిన కొందరు దళారులు రేషన్ బియ్యాన్ని అధిక ధరలకు విక్రయించేందుకు మూమూళ్ల ముట్టజెప్తూ సాలూర, మద్నూరు తదితర చెక్‌పోస్టుల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పేదోడికి చేరాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నా ప్రత్యేక నిఘా కమిటీలు ఏం చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
గ్యాస్ బుకింగ్‌లో మాయ
నెల్లూరు(పొగతోట): వినియోగదారులతో సంబంధం లేకుండా గ్యాస్ సిలిండర్ బుక్ చేసి బ్లాక్ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఆవు పొలంలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే చందంగా గ్యాస్ ఏజెన్సీల పనితీరు మారింది. గ్యాస్ ఏజెన్సీలు, సిబ్బంది కుమ్మక్కై బుకింగ్‌లో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీనగర్‌కు చెందిన సతీష్‌కుమార్ గ్యాస్ సిలిండర్ బుక్ చేసేందుకు ఏజెన్సీ వద్దకెళ్లి ఈ విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. వేదాయపాళేనికి చెందిన మురళీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసేందుకు ఏజెన్సీ వద్దకెళ్లాడు. ‘మీరు పలానా తేదీన గ్యాస్ బుక్ చేశారు. పలానా తేదీన సిలిండర్ సరఫరా చేశారు’ అని ఏజెన్సీ వారు తెలపడంతో అవాక్కయ్యాడు. తమకు తెలియకుండా ఎవరు బుక్ చేశారని వారు ఏజెన్సీ సిబ్బంది ఎదుట ఆవేదన వ్యక్తం చేయడం మినహా ఏమీ చేయలేకపోయారు. రెండురోజుల్లో సిలిండర్ సరఫరా చేస్తామనడంతో వారు ఇంటిముఖం పట్టారు. ఇలాంటివి నిత్యం జరుగుతున్నాయి. వినియోగదారులకు సంబంధం లేకుండా ఏజెన్సీ సిబ్బంది గ్యాస్ బుక్ చేసి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. జిల్లాలో 4.90 లక్షల గ్యాస్ కనెక్షన్లు జిల్లాలో 43 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. 4.90 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 3 లక్షలకు పైగా డబుల్ సిలిండర్లు ఉన్నాయి. మిగిలినవి సింగిల్ సిలిండర్లు. డబుల్ సిలిండర్లకు సంబంధించి 2 లక్షలకు పైగా చిన్న కుటుంబాల వారు ఉన్నారు. చిన్న కుటుంబాల వారు మూడు నెలలకు ఒకసారి సిలిండర్ బుక్ చేస్తారు. ఏడాదికి నాలుగు నుంచి ఐదు సిలిండర్లు వినియోగిస్తారు. రెండు నెలలకు, మూడు నెలలకు సిలిండర్ బుక్ చేసే వారి జాబితా ఏజెన్సీల వద్ద సిద్ధంగా ఉంటుంది. సొమ్ము చేసుకుంటున్న ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్లో సిలిండర్ ధర *1000 నుంచి *1100కు విక్రయిస్తున్నారు. సిబ్బందికి ఒక్కో సిలిండర్‌పై రెండు వందల దాకా మిగిలుతుంది. దీంతో ఈ తతంగం జోరుగా సాగుతోంది. వినియోగదారులు సిలిండర్ బుక్ చేయకపోయినా సిబ్బంది బుక్ చేసి బ్లాక్ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వినియోగదారులు వాదనకు దిగిన సమయంలో సిలిండర్ వెంటనే పంపిస్తామని చెప్పి విషయం పెద్దది కాకుండా జాగ్రత్త పడుతున్నారు. హోటల్స్, క్యాటరింగ్ సెంటర్లు, టిఫిన్ అంగళ్లలో గ్యాస్ వినియోగం అధికంగా ఉంది. వారు ఎంతకైనా సిలిండర్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో బుకింగ్ మాయాజాలం అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది. బ్లాక్‌మార్కెట్ ఇక్కడే ఎక్కువ నెల్లూరు, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్ విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. నెల్లూరులో ముగ్గురాళ్లసందు, పప్పులవీధి, చిన్నబజార్, పెద్దబజార్,వేదాయపాళెం తదితర ప్రాంతాల్లో గ్యాస్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గత వారంలో సివిల్సప్లై అధికారులు దాడులు నిర్వహించి పప్పులవీధి, ముగ్గురాళ్లసందులో దాడులు నిర్వహించి 60 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 20 మందిపై 6ఏ కేసులు నమోదు చేశారు. అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించకపోవడం, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయకపోవడం వల్లే గ్యాస్ అక్రమ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి అక్రమ విక్రయాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. ప్రత్యేక చర్యలు తీసుకుంటాం గ్యాస్ సిలిండర్లను అక్రమంగా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమంగా విక్రయించే స్థావరాలపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు వందకు పైగా సిలిండర్లను స్వాధీనం చేసుకున్నాం. 30 మందిపై 6ఏ కేసులు నమోదు చేశాం. వినియోగదారులతో సంబంధం లేకుండా గ్యాస్ బుక్ చేస్తే ఫిర్యాదు చేస్తే ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటాం. -జె.శాంతకుమారి, డీఎస్ఓ -
బ్లాక్ మార్కెట్
కరీంనగర్ క్రైం/పెద్దపల్లి/జగిత్యాల : ఎరువులు, విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలించి తద్వారా కృత్రిమ కొరత సృష్టించి రైతులను దోచుకునేందుకు వ్యాపారులు రంగం సిద్ధం చేశారు. విషయం తెలుసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రంగంలోకి దిగి శుక్రవారం జగిత్యాల, పెద్దపల్లిలోని పలు దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు చోట్ల పెద్ద ఎత్తున ఎరువులు, విత్తనాల నిల్వలు బయట పడ్డాయి. పెద్దపల్లిలో రూ.35 లక్షలు, జగిత్యాలలో రూ.13 లక్షలు.. మొత్తం రూ.48 లక్షల విలువైన నిల్వలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మూడు బృందాలుగా విడిపోయిన కరీంనగర్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫొర్స్‌మెంట్ అధికారులు జగిత్యాల, పెద్దపల్లితో పాటు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటలో ఎరువుల దుకాణాలపై దాడులు చేశారు. లక్సెట్టిపేటలో సైతం రూ.37 లక్షల విలువైన ఎరువులు, విత్తనాల అక్రమ నిల్వలను పట్టుకున్నారు. మూడు ప్రాంతాల్లో కలిపి రూ.85 లక్షల విలువైన 4,644 బస్తాల ఎరువులు, 1,271 ప్యాకెట్ల విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్టు విజిలెన్స్ సీఐ శశిధర్‌రెడ్డి తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ప్రైవేట్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పెద్ద ఎత్తున ఎరువులు, విత్తనాలు తెప్పించి దాచి ఉంచారు. గతంలో ఎరువులు, విత్తనాల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈసారి కూడా ముందుగానే ఎరువులు, విత్తనాలు బ్లాక్‌మార్కెట్‌కు తరలించి కృత్రిమ కొరత సృష్టించేందుకు వ్యాపారులు రంగం సిద్ధం చేశారు. పెద్దపల్లి, జగిత్యాలలోనే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పలువురు వ్యాపారులు పెద్ద ఎత్తున ఎరువులు, విత్తనాలు తెప్పించి నిల్వలు చేశారని సమాచారం. అక్రమ నిల్వలపై సమాచారం ఉందని, దాడులు కొనసాగించి వాటన్నింటిని బయటపెడుతామని విజిలెన్స్ సీఐ శశిధర్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లిలో.. పట్టణంలోని ఆవునూరి సత్యనారాయణ, సాయిరాం, శ్రీలక్ష్మి, ప్రమీల వేర్ హౌసింగ్ స్టాక్ పాయింట్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు జరిపారు. ఆవునూరి సత్యనారాయణ, సాయిరాం దుకాణాల్లో ఉన్న స్టాక్‌కు, రిజిస్టర్లలో నమోదు చేసిన రికార్డులకు తేడా రావడంతో 148 టన్నుల డీఏపీ బస్తాలను సీజ్ చేశారు. ఈ దాడుల్లో వ్యవసాయ శాఖ అధికారులు అశోక్‌రెడ్డి, ప్రకాశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆవునూరి సత్యనారాయణ షాపులో అధికారులు సోదా చేస్తున్న విషయం తెలుసుకున్న మిగతా వ్యాపారులు షాపులకు తాళాలు వేసి వెళ్లారు. జగిత్యాలలో.. జగిత్యాలలోని రెండు ఎరువుల దుకాణాలపై శుక్రవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. గోపీకృష్ణ, మణిదీప్ ఫర్టిలైజర్స్‌లో ఉన్న ఎరువులకు, రికార్డుల్లోని స్టాక్‌కు పొంతన కుదరకపోవడంతో దుకాణాలను సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ సీఐ బలరాంరెడ్డి, ఎఫ్ఆర్వో విష్ణువర్ధన్, ఏవో రాంచందర్ పాల్గొన్నారు. -
యథేచ్ఛగా అక్రమ రీఫిల్లింగ్ దందా
బ్లాక్ మార్కెట్లో డొమెస్టిక్ సిలిండర్లు వందకు పైగా అక్రమ కేంద్రాలు! పట్టని పౌరసరఫరాల శాఖ దృష్టి సారించిన ఎస్వోటీ పోలీసులు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) అక్రమ రీఫిల్లింగ్ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్వోటీ) పోలీసులు అక్రమ రీఫిల్లింగ్ వ్యవహారాలను బహిర్గతం చేసినప్పటికీ సంబంధిత పౌర సరఫరాల శాఖకు కనువిప్పు కలగడం లేదు. గ్రేటర్ పరిధిలో ఐఏఎస్ హోదాగల ఒక చీఫ్ రేషనింగ్ అధికారి (సీఆర్వో), ఇద్దరు జిల్లా స్థాయి పౌరసరఫరాల అధికారులు, పన్నెండు మంది సహాయ పౌరసరఫరాల అధికారులుతో పాటు ప్రత్యేక విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ సబ్సిడీ వంటగ్యాస్ పక్కదారి పట్టి అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అండదండలతో.. సబ్సిడీ వంట గ్యాస్ కంటే నాన్ సబ్సిడీ, కమర్షియల్ గ్యాస్ ధర రెండింతల నుంచి మూడింతలు అధికంగా ఉండటం అక్రమ వ్యాపారానికి కలిసి వస్తోంది. కొందరు వ్యాపారులు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అండదండలతో అక్రమ రీఫిల్లింగ్‌కు తెరలేపి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్లకు ఆధార్ అనుసంధానం లేకపోవడంతో పాటు ఎడాదికి 12 సబ్సిడీ సిలిండర్ల సరఫరా వెసులుబాటుతో గృహ వినియోగదారులకు పెద్దగా ఆందోళన లేకుండా పోయింది. దీంతో డీలర్లు వ్యాపారులతో కుమ్మక్కై సబ్సిడీ సిలిండర్లను యథేచ్చగా పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా డొమెస్టిక్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగించడమే కాకుండా.. కమర్షియల్ సిలిండర్లలో సైతం గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేయడం పరిపాటిగా మారింది. మరోవైపు వాహనాల్లో, ఐదు కిలోల ప్రయివేటు సిలిండర్లలో సైతం అక్రమ రీఫిల్లింగ్ విస్తృతంగా సాగుతోంది. ఫలితంగా అక్రమ ‘రీఫిల్లింగ్’ వ్యాపారం వుూడు పువ్వులు ఆరు కాయులుగా విరాజిల్లుతోంది. గ్యాస్ పరికరాల దుకాణాల ముసుగులో.. మహానగరానికి ఉద్యోగం, చదువుల రీత్యా వలస వచ్చే బ్యాచిలర్స్, విద్యార్థులు అధికంగా ఐదు కిలోల చిన్న సిలిండర్లు వూత్రమే వినియోగిస్తారు. వీరికి అధికారికంగా గ్యాస్ కనె క్షన్లు లేని కారణంగా బ్లాక్‌లోనే గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేయక తప్పని పరిస్థితి. దీనిని అదనుగా తీసుకున్న కొందరు వ్యాపారులు గ్యాస్ పరికరాల దుకాణాల వుుసుగులో రీఫిల్లింగ్ కేంద్రాలను ఏర్పా టు చేసి అక్రమ దందా కొనసాగిస్తున్నారు. రీఫిల్లింగ్ సందర్భంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సంఘటనలు కూడా లేకపోలేదు.గతంలో కంచన్‌బాగ్‌లోని ఒక రీఫిల్లింగ్ కేంద్రంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ నుం చి చిన్న సిలిండర్‌లో అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తుం డగాప్రమాదం చోటుచేసుకుంది. అయి నా వీరి తీరు మారలేదు. అధికారుల నిఘా పెరగలేదు. రీఫిల్లింగ్ వ్యాపారం జోరు. మహానగరంలో ఎల్పీజీ రీఫిల్లింగ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. సుమారు వందకు పైగానే అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. వంటగ్యాస్ డిమాండ్‌ను ఆసరా చేసుకున్న వ్యాపారులు డొమెస్టిక్ గ్యాస్ కిలో గ్యాస్ ధర రూ.100 నుంచి 120 లు తగ్గకుండా రీఫిల్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అదేవిధంగా 14.2 కిలోల డొమెస్టిక్, 19 కిలోల కమర్షియల్ సిలిండర్లను సైతం రీఫిల్లింగ్ చేస్తూ అధిక ధరకు విక్రయిస్తున్నారు. నగరంలోని ప్రతి కేంద్రంలో నిరంతరం అక్రమ రీఫిల్లింగ్ ప్రకియ కొనసాగుతూనే ఉన్నా పట్టించుకునేవారే కరవయ్యారు. వురోవైపు మూడు, నాలుగు చక్రాల వాహనదారులు సైతం 20 శాతం వరకు గ్యాస్ సిలిండర్లను వినియోగించడంతో రీఫిల్లింగ్ వ్యాపారులకు డిమాండ్ మరింత పెరిగినట్లయింది. నాలుగు చక్రాల వాహనదారులకు రెండు రోజుల కోకసారి సిలిండర్ రీఫిల్లింగ్ అవసరముంటోంది. దీంతో వ్యాపారం మరింత జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మొక్కుబడి దాడులే.... ఫిర్యాదులు వస్తే కానీ పౌరసరఫరాల శాఖాధికారుల్లో కదలిక కనిపించదు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అప్పుడప్పుడు హడావుడిగా దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నా.. అవి కాస్త ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’ చందంగా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున అక్రవు రీఫిల్లింగ్ చే సే కేంద్రాలను వదిలి చిన్న, చిన్న రీఫిల్లింగ్ కేంద్రాలు, చిరు హోటళ్ల పైనే దృష్టి సారించడం అనుమానాలకు తావిస్తోంది. వురికొన్నిప్రాంతాలలో దాడుల కంటే ముందే సమాచారం లీకై అక్రవూర్కులు అప్రమత్తమైపోతున్నారు. వాణిజ్యపరమైన బడా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో బాహటంగా డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్నా పట్టింపు లేకుండా పోయింది. ఇదీ గ్రేటర్లో పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణ తీరు. ఈ అక్రమం అధికారులకు కనబడలేదా..? సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు వారం రోజుల క్రితం నగర శివారులోని నాచారం సింగం చెరువు తండా సమీపంలోని ఒక గృహంపై దాడులు నిర్వహించగా డొమెస్టిక్ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లలో అక్రమంగా గ్యాస్‌ను రీఫిల్లింగ్ చేసే వ్యవహారం బహిర్గతమైంది. సుమారు 63 డొమెస్టిక్, 55 కమర్షియల్ సిలిండర్లను సీజ్ చేయడమే కాకుండా 60 రీఫిల్లింగ్ రాడ్స్, తూనికల యంత్రాలను ఎస్వోటీ పోలీసులు సీజ్ చేశారు. ఇంత జరిగినా వంటగ్యాస్ పంపిణీ వ్యవహారాలను నిరంతరం పర్యవేక్షించాల్సిన ఫౌరసరఫరాల శాఖ మాత్రం కనీసం పట్టనట్లు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది. -
రైతుల విత్తనాలు బ్లాక్ మార్కెట్‌కు..!
దోమ, న్యూస్‌లైన్: ప్రభుత్వం రైతులకు ఉచితంగా పంపిణీ చేయడానికి అందజేసిన శనగ విత్తనాలను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్న సంఘటన మండల పరిధిలోని ఊట్పల్లిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. జాతీయ ఆహార భద్రతా పథకంలో భాగంగా సేంద్రియ ఎరువులతో నాణ్యమైన పంటఉత్పత్తులను సాధించేందుకు వీలుగా ప్రభుత్వం రైతులకు వేరుశగన, శనగ, మొక్కజొన్న తదితర విత్తనాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఆయా పంటలను సాగు చేయడంలో సలహాలు, సూచనలు అందించడం, రైతులు పండించిన ఉత్పత్తులకు తగిన మార్కెట్ సదుపాయం కలిగించడం పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కింద రబీ సీజన్లో శనగ పంట సాగుకు అధికారులు మండల పరిధిలోని ఊట్పల్లి, బొంపల్లి గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో 75 మంది చొప్పున రైతులను ఎంపిక చేశారు. వారికి పంపిణీ చేసేందుకు ఒక్కో గ్రామానికి 75 బస్తాల చొప్పున మొత్తం 150 బస్తాలను రెండు నెలల క్రితం చేరవేశారు. అయితే కొంతకాలం పాటు వాటిని అలాగే ఉంచి తర్వాత అమ్ముకుంటే ఎవరికీ తెలియదని భావించారు ఆదర్శరైతులు. ఈ క్రమంలో ఊట్పల్లిలోని ఓ ఇంట్లో దాచి ఉంచిన శనగ విత్తనాలను గురువారం రాత్రి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎప్పుడూ లేనిది ఊళ్లోకి కార్లు, ఆటోలు హడావుడిగా రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి విషయం ఆరా తీశారు. ఓ గదిలో 32 శనగబస్తాలు దాచి ఉంచారని తెలిసింది. మొత్తం 75 బస్తాలకుగాను 32 మాత్రమే ఉండడంతో స్థానిక ఆదర్శరైతును నిలదీశారు. అతను తనకేం తెలి యదని బుకాయించాడు. గ్రామ సర్పంచ్ పద్మమ్మ తదితరులు గదికి తాళం వేసి విషయాన్ని జేడీఏ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు పరిగి డివిజన్ వ్యవసాయాధికారి నాగేష్ కుమార్, మండల వ్యవసాయాధికారి రేణుకా చక్రవర్తిని శుక్రవారం మధ్యాహ్నం గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. రెండు నెలల క్రితం పంపిణీ చే యాల్సిన విత్తనాలను రబీ సీజన్ ముగుస్తున్నా ఎందుకు పంపిణీ చేయలేదని గ్రామస్తులు అధికారులను నిలదీశారు. ఏడీఏతో పాటు మండల వ్యవసాయాధికారి పొం తనలేని సమాధానాలు చెప్పడం తో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, ఆదర్శరైతులు కుమ్మక్కై విత్తనాలను అమ్ముకుం టున్నారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా బొంపల్లి గ్రామంలోనూ విత్తనాలు పంపిణీ చేయకుండా బ్లాక్‌మార్కెట్‌కు తరలించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
హాస్టల్లో అర్ధాకలితో..
ఎల్లారెడ్డి, న్యూస్‌లైన్: ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో 70 మంది విద్యార్థులున్నారు. అయితే వారి కి సరిపోయేంత భోజనాన్ని మాత్రం వడ్డించడంలేదు. నాలుగు కిలోల రవ్వతో ఉప్మా తయారు చేసి 70 మం ది విద్యార్థులకు వడ్డిస్తున్నారు. నాలుగు లీటర్ల పాల తోనే సరిపెడుతున్నారు. వారానికోసారి మాత్రమే గుడ్డు ఇస్తున్నారు. అన్నం కూడా సరిపోయేంత పెట్టడం లేదు. రాగి జావా, స్నాక్స్, సేమియా, పల్లిపట్టీలు విద్యార్థులకు ఇవ్వడం లేదు. మెనూ ప్రకారం కూరగాయలు కూడా వడ్డించడం లేదు. బియ్యంతో పాటు ఆయిల్ ప్యాకెట్లు, ఇతర వస్తువులను వార్డెన్ పక్కదారి పట్టిస్తున్నారు. ఈ వసతి గృహంలో వైద్య సేవలు కూడా అందడం లేదు. ఏదైనా సమస్య తలెత్తితే ఆస్పత్రికి వెళ్లి చూపించుకుంటున్నారు. సోమవారం రాత్రి విద్యార్థి సంఘాల నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన తహశీల్దార్ మంగళవారం హాస్టల్లో విచారణ చేపట్టారు. ఆయనకు విద్యార్థులు పై విషయాలు తెలిపారు. టీవీకి సంబంధించిన డిష్ బిల్లు కూడా తమతోనే కట్టిస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం బియ్యం బస్తాను తెప్పిం చి, బాత్రూమ్లో వేయించారన్నారు. వార్డెన్ హాస్టల్ లోంచి రోజూ సరుకులను కామారెడ్డికి తీసుకెళ్తారని ఆరోపించారు. స్టోర్ రూమ్ బయట సరుకులు.. తహశీల్దార్ హాస్టల్లోని స్టోర్ రూమ్‌ను తెరిపించి స్టాకు వివరాలు పరిశీలించారు. విద్యార్థుల గదుల్లో 50 కిలోల బియ్యం సంచి కనిపించింది. బాత్రూమ్లోనూ బియ్యం బస్తా లభించింది. వార్డెన్ విజయలక్ష్మిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. నిత్యావసర వస్తువులు సైతం స్టోర్ రూమ్‌లో కాకుండా బయట లభించడంతో వాటిని సీజ్ చేశారు. విచారణ హాస్టల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం వడ్డించడం లేదు. ఈ విషయమై విద్యార్థి సంఘాల నాయకులు సైతం వార్డెన్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఏ విషయం అడిగినా వార్డెన్ సరైన సమాధానం ఇవ్వరని తహశీల్దార్‌తో పేర్కొన్నారు. -
కొత్త జేసీకి సవాళ్లెన్నో
నేడు విధులకు హాజరు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : రెండురోజుల క్రితం బాధ్యతలు స్వీకరించి శుక్రవారం విధులకు హాజరయ్యేందుకు జిల్లాకు వస్తున్న కొత్త జాయింట్ కలెక్టర్ మురళికి అనేక సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో గత కొంతకాలంగా పక్కదారి పట్టిన రెవెన్యూ పాలనను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ఇసుక దొంగ రవాణా యథేచ్ఛగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇసుక మాఫియా ఆగడాలు పెచ్చుమీరుతుండటం, అధికారులపై సైతం దాడులకు తెగబడుతుండటంతో వారి కార్యకలాపాలను అడ్డుకునేందుకు సిబ్బంది భయపడుతున్నారు. కృష్ణానదీతీరంలో ఇసుక దొంగ రవాణాకు చెక్ పెట్టాలి. విజయవాడ రెవెన్యూ డివిజన్లోని పలు గ్రామాల్లో అక్రమంగా తరలించుకుపోతున్న ఇసుక రవాణాను అరికట్టాలి. ఇసుక మాఫియా ఆగడాలను సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంది. మరోపక్క ప్రజాపంపిణీ వ్యవస్థ జిల్లాలో పక్కదారి పట్టింది. రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు యథేచ్ఛగా తరలించేస్తున్నారు. జిల్లాలో కొందరు అధికారులు, డీలర్లతో కుమ్మక్కై ప్రజాపంపిణీ వ్యవస్థ అవకతవకలకు పాల్పడుతున్నట్లు ప్రతీ మండలంలో ఫిర్యాదులు కోకొల్లలుగా ఉన్నాయి. బినామీ డీలర్లను ఏరేసి ఆ స్థానంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగేలా కొత్త డీలర్ల నియామకాలు చేపట్టాల్సి ఉంది. జిల్లాలో తహశీల్దార్ కార్యాలయాల్లో, రెవెన్యూ డివిజన్లలో పెండింగులో ఉన్న పట్టాదార్ పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్ పంపిణీకి చర్యలు తీసుకోవాల్సి ఉంది. కొన్ని మండల కేంద్రాల్లో పట్టాదార్ పాస్‌పుస్తకాల జారీకి భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు పిర్యాదులు ఉన్నాయి. సొమ్ము ఇవ్వలేని బక్కరైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భూవివాదాలు పరిష్కారం కాక అనేకమంది బాధితులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎక్సైజ్, పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, సినిమాహాళ్ల నిర్వహణపై అజమాయిషీ కొరవడింది. ఎంతోకాలంగా వాటిపై తనిఖీలు లేకపోవటంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అన్నింటీకి మించి ఈ జిల్లాలో రాజకీయ పరిస్థితులు పెనుసవాలుగా మారనున్నాయి. -
ప‘రేషన్’
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం కార్డుదారులతో ఆడుకుంటోంది. పేరుకు రేషన్‌కార్డులు ఇచ్చినా వాటికి సకాలంలో నిత్యావసర సరుకులు సరఫరా చేయడం లేదు. ఒకవేళ సరఫరా చేసినా ఎక్కువ మంది డీలర్లు వాటిని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. డీలర్లు నిర్ణీత వేళలు పాటించాలని ఆదేశాలున్నా..ఎక్కడా అమలు కావడం లేదు. దుకాణాల ముందు బోర్డులతో పాటు ధరల పట్టికలు విధిగా ఏర్పాటు చేయాలన్న నిబంధనలూ తుంగలో తొక్కారు. కొన్ని సమయాల్లో దుకాణాలకు తక్కువ సరుకులు కేటాయించినప్పుడు ఆ డీలర్ల పంట పండుతోంది. సరుకులు తక్కువగా విడుదల చేశారని చెప్పి కొంత వరకు సరఫరా చేసి మిగతావి పక్కదారి పట్టిస్తున్నారు. కిలో రూపాయి బియ్యం గురించి చెప్పనవసరం లేదు. ప్రభుత్వం సరఫరా చేసే ఈ బియ్యం నాసిరకంగా ఉంటాయన్నది జగమెరిగిన సత్యం. ఆ బియ్యాన్ని ఆహారంగా వినియోగించే వారి సంఖ్య చాలా తక్కువ. దీనిని కూడా కొంతమంది డీలర్లు చక్కగా సొమ్ము చేసుకుంటున్నారు. యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు తరలించి నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో 2107 చౌకధరల దుకాణాలున్నాయి. వాటి పరిధిలో 8 లక్షల 563 తెల్లకార్డులు, 52 వేల 152 అంత్యోదయ అన్నయోజన కార్డులు, 1032 అన్నపూర్ణ కార్డులు, 56 వేల 946 రచ్చబండ-3 కార్డులు ఉన్నాయి. 9 లక్షల 10 వేల 693 కార్డులకు 10089.343 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం, 1825.355 మెట్రిక్ టన్నుల అన్నపూర్ణ అంత్యోదయ యోజన కింద బియ్యం, 10.340 మెట్రిక్ టన్నులు అన్నపూర్ణ కార్డులకు సంబంధించి బియ్యం కేటాయింపులు జరుగుతుంటాయి. గత ఏడాది మార్చి వరకు పంచదార 426.329 టన్నులు, గోధుమలు 60 వేల టన్నులు, పామాయిల్ నూనె 8 లక్షల 53 వేల 52 లీటర్ల మేర విడుదల చేశారు. ఏప్రిల్ నుంచి అమ్మహస్తం పథకాన్ని అమలు చేయడంతో తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను *185కు విక్రయించేలా రూపకల్పన చేశారు. అయితే అమ్మహస్తంలో అందించే సరుకుల్లో నాణ్యత లోపించడంతో ఎక్కువ మంది రెండు మూడు సరుకులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగిలిన ఆరు వస్తువులను తీసుకునేందుకు వెనుకాడటంతో డీలర్లు కూడా వాటికి సంబంధించి డీడీలు కట్టేందుకు వెనుకడుగు వేస్తున్నారు. అధికారులు మాత్రం అమ్మహస్తంకు సంబంధించిన అన్నిరకాల వస్తువులకు డీడీలు కట్టాలంటూ ఒత్తిడి చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న చౌకధరల దుకాణాలపై శుక్రవారం నిర్వహించిన ‘సమరసాక్షి’ లో కార్డుదారుల కష్టాలు వెలుగు చూశాయి. బియ్యంతోపాటు అమ్మహస్తం సరుకులు ఒకేసారి సరఫరా చేయాల్సి ఉండగా, గోడౌన్ల నుంచి సకాలంలో రాకపోవడంతో ఒకేసారి ఇవ్వడం లేదు. ఒంగోలులో వేళలు లేవు... ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని చౌకధరల దుకాణాల డీలర్లు వేళలు పాటించడం లేదు. ప్రస్తుతం దుకాణాలకు బియ్యం సరఫరా చేసినప్పటికీ, అమ్మహస్తం సరుకులు రాకపోవడంతో బియ్యం నిల్వలు అలాగే ఉంటున్నాయి. ఒంగోలు నగరంతోపాటు ఒంగోలు రూరల్, కొత్తపట్నం మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కందుకూరు బియ్యం నెల్లూరుకు... కందుకూరు నియోజకవర్గ పరిధిలోని రేషన్ బియ్యం యథేచ్ఛగా నెల్లూరు తరలుతోంది. ఇటీవల కాలంలో గుడ్లూరు వద్ద రెండుసార్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆ బియ్యాన్ని పట్టుకున్నారు. అయితే ఎక్కువ భాగం నెల్లూరుకు వెళుతోంది. అక్కడ నుంచి రీ సైక్లింగ్ చేసి ఆ బియ్యాన్నే బయట మార్కెట్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. అమ్మహస్తం సరుకులకు కొరత ఉండటంతో డీడీలు తీసేందుకు డీలర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. సంతనూతలపాడులో బినామీలే ఎక్కువ.. సంతనూతలపాడు నియోజకవర్గంలో బినామీ డీలర్లే ఎక్కువగాా ఉన్నారు. ఒకే వ్యక్తి మూడు నాలుగు దుకాణాలు నిర్వహిస్తుండటంతో వేళలు పాటించడం లేదు. నిత్యావసర సరుకుల కోసం కార్డులు తీసుకొని అక్కడకు వెళితే తాళాలు వేసే ఉంటాయి. పెపైచ్చు కొన్ని దుకాణాలు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో కొంతమంది పనులు మానుకొని నిత్యావసర సరుకులు తెచ్చుకోవలసిన దుస్థితి నెలకొంది. కొండపిలో బియ్యం దొడ్డిదారిన... కొండపి నియోజకవర్గంలో బియ్యం దొడ్డిదారిన వెళుతోంది. వాటి గురించి సమాచారం అందినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు మొక్కుబడి దాడులు కూడా చేయడం లేదు. బియ్యం నిల్వలున్నా స్టాక్ తక్కువగా వచ్చిందన్న సాకును చూపించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. సమయ పాలనకు ఎక్కువ మంది డీలర్లు తిలోదకాలిస్తున్నారు. యర్రగొండపాలెంలో మూడురోజులు దాటితే ఒట్టు.. యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని చౌకధరల దుకాణాలు మూడురోజులకు మించి తెరవడం లేదు. బియ్యంతోపాటు అమ్మహస్తం సరుకులు పూర్తి స్థాయిలో వచ్చినా ఎక్కువ మంది డీలర్లు మూడు రోజులే గడువుగా పెట్టుకుంటున్నారు. మూడు రోజులు దాటిన తరువాత ఎవరైనా కార్డుదారులు వెళితే నో స్టాక్ అని బోర్డులు పెట్టేస్తున్నారు. ఇదేమని అడిగితే తమకు తక్కువ కేటాయింపులు వచ్చాయని తాపీగా సమాధానం చెబుతున్నారు. అద్దంకిలో అమ్మహస్తం లేదు అద్దంకి నియోజకవర్గంలో అమ్మహస్తం సరుకుల్లో కీలకమైనవి రెండు నెలల నుంచి లేవు. చింతపండు, కారం, గోధుమలకు డిమాండ్ ఉన్నప్పటికీ వాటిని అందుబాటులో ఉంచలేదు. చింతపండులో నాణ్యత లేకపోవడంతో ఎక్కువ మంది దానిని పడవేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కూడా బియ్యం పక్కదారి పడుతోంది. దర్శిలో దయనీయం... దర్శి నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో బియ్యం, అమ్మహస్తం సరుకులు వచ్చినప్పటికీ ఎక్కువ మంది డీలర్లు వాటిని కార్డుదారులకు అందించడం లేదు. పెపైచ్చు కొంతమంది డీలర్లు స్టాక్ రాలేదంటూ చెబుతున్నారు. దాంతో వాటి పరిధిలోని కార్డుదారులు దుకాణాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. నియోజకవర్గ పరిధిలో ఇన్చార్జి డీలర్లు ఎక్కువగా ఉండటంతో కొన్నింటికి వేసిన తలుపులు వేసినట్లే ఉంటున్నాయి. పర్చూరులో పట్టుతప్పిన కేంద్రాలు పర్చూరు నియోజకవర్గంలో చౌకధరల దుకాణాలు పట్టు తప్పుతున్నాయి. ఎక్కువ సంఖ్యలో దుకాణదారులు కార్డుదారులకు అందుబాటులో ఉండటం లేదు. దాంతో నిత్యావసర సరుకుల కోసం దుకాణాల చుట్టూ కార్డుదారులు తిరుగుతూ ఉన్నారు. స్టాక్ వివరాలను నోటీసు బోర్డులో ఉంచడం లేదు. దాంతో కొంతమంది దుకాణాలకు రావడమే మానేశారు. ఇది అనేక మంది డీలర్లకు వరంగా మారింది. కార్డుదారులు రాకపోయినా వచ్చినట్లు చూపించి దానిని సొమ్ము చేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్‌కు చీరాల బియ్యం.. చీరాల నియోజకవర్గంలో చౌకధరల దుకాణాలకు సంబంధించిన బియ్యం టూ వీలర్ల ద్వారా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయి. గతంలో ట్రాక్టర్లు, ఆ తరువాత ఆటోల్లో వాటిని తరలిస్తూ ఉండేవారు. అడపా దడపా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి వాటిని పట్టుకున్నారు. దీంతో అక్రమార్కులు బియ్యం తరలించేందుకు టూ వీలర్లను ఎన్నుకొన్నారు. ఇక్కడ నుంచి గుంటూరు జిల్లా కర్లపాలెంకు బియ్యం తరలిపోతున్నాయనేది బహిరంగ రహస్యమే. మార్కాపురంలో వెతుకులాటే.. మార్కాపురంలో నిత్యావసర సరుకులు బ్లాక్‌ల వారీగా విక్రయించాల్సి ఉంటుంది. ఒక్కో నెల ఒక్కో బ్లాక్‌లో డీలర్లు విక్రయిస్తుండటంతో వాటిని కనుగొనడం కార్డుదారులకు కష్టంగా మారుతోంది. ఇదేమని అడిగితే వారి నుంచి సమాధానం ఉండటం లేదు. గిద్దలూరులో అధిక ధరలు గిద్దలూరు నియోజకవర్గంలో నిత్యావసర సరుకులను కొంతమంది డీలర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇదేమని అడిగితే తామింతేనంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. గిద్దలూరు పట్టణంలోని కొన్ని దుకాణాల్లో పంచదార కేజీ *14కు విక్రయించాల్సి ఉండగా అదనంగా రెండు రూపాయలు వసూలు చేస్తున్నారు. పంచదారకు డిమాం డ్ ఎక్కువగా ఉండటంతో కార్డుదారులు వారు చెప్పిన ధరకు కొనుగోలు చేస్తూ నష్టపోతున్నారు. కనిగిరిలో నెలల తరబడి ఎదురుచూపులే.. కనిగిరి నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో కార్డుదారులు నిత్యావసర సరుకుల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. అమ్మహస్తం పథకానికి సంబంధించి చింతపండు, గోధుమలు, ఉప్పు నాలుగు నెలల నుంచి అందడం లేదు. పామాయిల్ రెండు నెలల నుంచి అందించడం లేదు. దుకాణదారులు సమయపాలన పాటించకపోవడంతో ఎక్కువ మంది కార్డుదారులు వాటి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
సరుకులు హుష్..
మంత్రి శైలజానాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న శింగనమల నియోజకవర్గంలోని కల్లూరు అగ్రహారం గ్రామంలో ఆంజనేయులు (డబ్ల్యుఏపీ 1213012001245) కార్డులో నలుగురు కుటుంబ సభ్యులున్నట్లు నమోదు చేశారు. ఒక్కో వ్యక్తికి 4 కేజీల చొప్పున అతని కుటుంబానికి 16 కేజీల బియ్యం ఇవ్వాలి. వాస్తవానికి అతనికి ప్రతి నెలా ఇస్తున్న బియ్యం నాలుగు కేజీలు మాత్రమే. రెండేళ్లుగా అతను నాలుగు కేజీలతో సరిపెట్టుకుంటున్నాడు. 16 కేజీల బియ్యం ఇవ్వమని కోరుతూ రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అయినా అధికారులు పట్టించుకోలేదు. తనకు అన్యాయం జరుగుతోందని సోమవారం అనంతపురంలో నిర్వహించిన గ్రీవెన్స్ (ప్రజావాణి)కు వచ్చి గోడు వెళ్లబోసుకున్నాడు. సాక్షాత్తూ మంత్రి నియోజకవర్గంలోనే రేషన్ పంపిణీ ఇలా జరుగుతుంటే.. ఇక మారుమూల గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అనంతపురం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సరుకులు పూర్తి స్థాయిలో పేదలకు అందడం లేదు. రేషన్‌డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో సరుకుల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. అరకొరగా పంపిణీ చేసి.. మిగతా సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. జిల్లాలో మొత్తం 11,53,713 కార్డులున్నాయి. ఇందులో 1,19,969 అంత్యోదయ కార్డులు, 8,55,784తెల్ల కార్డులు, 10,759 ట్యాప్(టెంపరరీ) కార్డులు, 70,209 రచ్చబండ-1,2 కార్డులు, 96,997 రచ్చబండ-3 కార్డులు ఉన్నాయి. ఇవి కాకుండా 54,529 గులాబి కార్డులు ఉన్నాయి. గులాబీ కార్డులు మినహా మిగిలిన కార్డులకు ప్రతి నెలా జిల్లాలో 2,685 చౌక దుకాణాల ద్వారా 14,745.756 మెట్రిక్ టన్నుల బియ్యం, 10,48,722 లీటర్ల కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. అమృత హస్తం పథకం కింద పసుపు 105.132 టన్నులు, కారంపొడి 262.830 టన్నులు, చింతపండు 525.661 టన్నులు, ఉప్పు 1051 టన్నులు, గోధుమ పిండి 513.600 టన్నులు, గోధుమలు 513.600 టన్నులు, పంచదార 529 టన్నులు, కందిపప్పు 1051 టన్నులు, పామాయిల్ 10,51,000 లీటర్లు జిల్లాకు కేటాయిస్తున్నారు. స్టాక్ పాయింట్లలో బియ్యం బస్తాలకు కన్నం రేషన్ బియ్యాన్ని జిల్లాలోని 24 స్టాక్ పాయింట్ల ద్వారా చౌకదుకాణాలకు సరఫరా చేస్తున్నారు. స్టాక్ పాయింట్లలోనే బియ్యం బస్తాలకు రంధ్రాలు పడుతున్నాయి. దీంతో బస్తాలో నాలుగైదు కేజీల దాకా తక్కువగా ఉంటున్నాయని డీలర్లు వాపోతున్నారు. ఈ నెపంతో పేదలకు ఇచ్చే రేషన్‌లో డీలర్లు కోత వేస్తున్నారు. నెలకు సుమారు 800 క్వింటాళ్ల మేర బియ్యం పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మూడు రోజులే పంపిణీ డీలర్లు సరుకులను పూర్తి స్థాయిలో పంపిణీ చేయకుండానే చేతులెత్తేస్తున్నారు. ప్రతి నెలా 15వ తేదీలోపు డీలర్లు డీడీలు తీయాలి. 20 నుంచి వచ్చే నెల ఒకటో తేదీలోగా డీలర్లకు సరుకులు సరఫరా చేయాలి. డీలర్లు సకాలంలో డీడీలు తీయకపోవడం, సకాలంలో డీడీలు తీసినా సరుకులు మాత్రం డీలర్లకు ఆలస్యంగా చేరుతున్నాయి. దీంతో పేదలు రేషన్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఐదు రోజుల పాటు పూర్తి స్థాయిలో కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాలి. అయితే మూడు రోజులు మాత్రమే పంపిణీ చేస్తున్నారని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పూట పంపిణీ చేస్తుండటంతో గ్రామాల్లో రైతులు, కూలీలు పనులకు వెళ్లడం వల్ల సరుకులను తీసుకోలేకపోతున్నారు. అడ్రస్ లేని పామాయిల్.. జిల్లాలో పామాయిల్ కొరత తీవ్రంగా ఉంది. సగం మండలాలకు నెల రోజులుగా పామాయిల్ సరఫరా కాలేదు. శివారు గ్రామాల్లోని కార్డుదారులకు డీలర్లు కిరోసిన్ పంపిణీ చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇక రచ్చబండ-3 కింద కూపన్లు పొందిన వారికి కూడా కిరోసిన్ వేయలేదు. అమ్మహస్తం పథకం కింద పంపిణీ చేసే పసుపు, కారంపొడి, ఉప్పు, గోధుమ పిండి, గోధుమలు, పంచదార, కందిపప్పు, చక్కెర, పామాయిల్‌ను పక్కదారి పట్టిస్తున్నారు. ఇక చింత పండు నిండా పిచ్చలే ఎక్కువగా ఉండటంతో పాటు నల్లగా ఉండడం వల్ల తీసుకోవడానికి కార్డుదారులు ఆసక్తి చూపడం లేదు. అధికారులు ఏం చేస్తున్నట్లు? ప్రజావాణిలో రేషన్ పంపిణీపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డీలర్లు ఇంతగా పేట్రేగిపోతూ సరుకులు కాజేస్తున్నా పట్టించుకోవడం లేదంటే ఆ పాపంలో అధికారులకూ భాగం ఉందని జనం ఆరోపిస్తున్నారు. సక్రమంగా అందేలా చూస్తాం : శాంతకుమారి, డీఎస్ఓ తెల్ల, అంత్యోదయ కార్డుదారులకు కిరోసిన్ ఇంకా పంపిణీ చేయలేదు. వీరికి 10,48,722 లీటర్లు కిరోసిన్ కావాల్సి ఉంది. కోటా తెప్పించి పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం. రచ్చబండ-3 కింద కూపన్లు పొందిన వారికి కూడా కిరోసిన్ పంపిణీ చేస్తాం. సరుకులు అందరికీ అందేలా చూస్తాం. పామాయిల్ కొరత ఉంది : అమ్మ హస్తం పథకం కింద 9 సరుకులను పంపిణీ చేస్తున్నాం. పామాయిల్ మాత్రం పంపిణీ చేయడం లేదు. పామాయిల్ కొరత ఉంది. చింతపండు తీసుకునేందుకు కార్డుదారులు ఆసక్తి చూపడం లేదు. కార్డుదారులు అడిగిన సరుకులన్నీ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. - వెంకటేశం, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల శాఖ -
పౌరసరఫరాలశాఖపై విజిలెన్స్
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలోని పౌరసరఫరాలశాఖపై విజిలెన్స్ దృష్టి సారించింది. పౌరసరఫరాలశాఖ అక్రమాల గుట్టురట్టు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. మూడేళ్లుగా ఆశాఖలో అవినీతి పెరిగిపోయిందన్న ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్‌లో కదలిక వచ్చింది. పౌరసరఫరాలశాఖకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తోంది. ముఖ్యంగా బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయకపోవడం, నీలి కిరోసిన్ బ్లాక్ మార్కెట్‌కు తరలడం, మండల స్టాక్పాయింట్లలో జరుగుతున్న అక్రమాలు, గ్యాస్ రీఫిల్లింగ్, ప్రైవేట్ ఉద్యోగుల పాత్ర వంటి వాటిపై లోతుగా విజిలెన్స్ విచారిస్తున్నట్టు తెలిసింది. చౌక దుకాణాల్లో బినామీల దందా... జిల్లాలో బినామీ రేషన్ డీలర్లు రాజ్యమేలుతున్నారు. వీరికి రాజకీయ, అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో డీలర్ల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. నెల్లూరు నగరంలో సగానికి పైగా బినామీ రేషన్‌డీలర్లు షాపులు నడుపుతున్నట్టు తెలిసింది. దీనికి నెల్లూరు తహశీల్దార్ కార్యాలయం వేదికగా మారింది. రేషన్‌సరుకుల అలాట్మెంట్లో భారీ అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. కేటాయింపు ఇలా... జిల్లాలో మొత్తం 1872 మంది రేషన్‌డీలర్లు ఉన్నారు. వీరికి పౌరసరఫరాలశాఖ కార్యాలయం నుంచి రేషన్ సరుకుల కేటాయింపు తహశీల్దార్ కార్యాలయాలకు పంపుతారు. దీని ప్రకారం డీలర్లు మీ సేవా కేంద్రాల్లో డీడీల రూపంలో డబ్బు చెల్లిస్తారు. తమకు కేటాయించిన ప్రకారం మండల స్టాక్ పాయింట్ల వద్ద సరుకులను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ సక్రమంగా జరగడంలేదు. బినామీ డీలర్లతో తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసే పౌరసరఫరాలశాఖ డిప్యూటీ తహశీల్దార్ కుమ్మక్కై కేటాయింపుల్లో మోసాలకు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా ఏ అధికారి అటువైపు తొంగిచూడకపోవడం గమనార్హం. బినామీల కనుసన్నల్లో.. కొత్తరేషన్ కార్డుల మంజూరు, రేషన్ బియ్యం తరలింపు, ఏ షాపుకు ఎంత అలాట్మెంట్, కోత, ఏ అధికారికి ఎంత సొమ్ము ముట్టజెప్పాలనే విషయాలన్నీ బినామీ డీలర్ల కనుసన్నల్లో జరుగుతాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా ఏ అధికారి బినామీ డీలర్ల జోలికి వెళ్లేందుకు సాహసించరు. అలాగే గిరిజన కులస్తులు (చల్లా యానాదులు)కు సంబంధించిన వైఏపీ కార్డులను సైతం రాబట్టుకొని, కార్డులకు సంబంధించిన కోటాను కాజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద బినామీ డీలర్లు అక్రమాలకు అడ్డుకట్టవేయలేరా? దాడులు నిల్.. కనెక్షన్లు ఫుల్... దాడులు నిల్.. కనెక్షన్లు ఫుల్ అన్న చందంగా పౌరసరఫరాలశాఖ మారింది. జిల్లాలోని పౌరసరఫరాలశాఖలో డీఎస్‌ఓతోపాటు డీఎం, ఐదుగురు ఏఎస్ఓలు, 18 మంది సీఎస్డీటీలు పని చేస్తున్నారు. అయితే ఎక్కడా దాడులు చేసిన దాఖలాలు కనిపించవు. ఒక వేళ ఎక్కడైనా దాడులు జరిపినా వారిపై కేసులు ఉండవు. అందినకాడికి దోచుకొని అక్రమార్కులకు అండగా నిలవడం పరిపాటిగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. -
గ్యాస్ దందా
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఇంట్లో గృహావసరాలకు ఉపయోగించే రాయితీ గ్యాస్ సిలిండర్ల అక్రమ వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. ఆదిలాబాద్ పట్టణంతో పాటు వివిధ పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకు సిలిండర్లు నల్లబజారు నుంచి తరలుతున్నాయి. పౌర సరఫరాల అధికారులు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ పరిధి ప్రాంతాల్లో ఒకేసారి దాడులు నిర్వహించినా తీరు మారడం లేదు. జిల్లాలో అధికారులు గత ఐదు నెలల్లో ఇప్పటి వరకు నాలుగు సార్లు దాడులు నిర్వహించి కేవలం 223 సిలిండర్లను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గ్యాస్ వినియోగిస్తున్న 179 మందిపై కేసులు నమోదు చేశారు. తాజాగా సోమవా రం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి సిలిండర్లు స్వాధీనం చేసుకుని కేసు లు నమోదు చేశారు. గ్యాస్ వినియోగదారులకు ఏడాదికి సరిపడా తొమ్మిది గ్యాస్ సిలిండర్లను మాత్రమే సరఫరా చేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇదే అదునుగా భావించి అక్రమార్కులు రాయితీ గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. పలుచోట్ల గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల అండతో వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. బినామీ పేర్లతో గ్యాస్ కనెక్షన్లు పొందిన వారూ ఉన్నారు. కొత్తగా వచ్చిన నగదు బదిలీ పథకంలో ఆధార్, బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేసిన అధికారులు తనిఖీలు చేసినప్పుడల్లా అక్రమంగా వినియోగిస్తున్న సిలిండర్లు బయటకు వస్తున్నాయి. 75 వేలకుపైగా బోగస్.. జిల్లాలో ప్రస్తుతం 3,30,747 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దీపం కనెక్షన్లు 1,29,600 ఉన్నాయి. ఒక్కో వినియోగదారునికి తొమ్మిది సిలిండర్లు సరఫరా చేసి సిలిండర్ల రాయితీని ప్రభుత్వం నేరుగా గ్యాస్ వినియోగదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. దీని వల్ల రాయితీ సిలిండర్ల అక్రమ వ్యాపారం అరికట్టవచ్చన్నది ప్రభుత్వం ఉద్దేశం. కానీ ప్రభుత్వం ప్రకటించిన విధానంలో లోపాలను వెతికి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జూలై నెలలో చూస్తే జిల్లాలో 4.15 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అప్పటి నుంచి ఆధార్, బ్యాంకు ఖాతా అనుసంధానం చేయడం వల్ల 75 వేలకుపైగా కనెక్షన్లు బోగస్‌గా గుర్తించబడ్డాయి. ఇందులో దీపం కనెక్షన్లు కూడా ఉన్నాయి. గ్రామీణా ప్రాంతాల్లో దీపం పథకం కింద మంజూరు చేయబడిన వారు గృహా అవసరాలకు వినియోగించకుండా వేరే వ్యక్తులకు అమ్ముకున్నారు. దీనికితోడు ఒకరి పేరు మీదా దీపం గ్యాస్ కనెక్షన్ మంజూరైతే సదరు వ్యక్తులకు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. దీంతో ఆ గ్యాస్ కనెక్షన్లు సైతం బోగస్‌గా గుర్తించడం జరిగింది. దాడులు ముమ్మరం చేస్తాం.. - వసంత్‌రావు దేశ్‌పాండే, డీఎస్వో, ఆదిలాబాద్ గృహావసరాలకు వినియోగించే రాయితీ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్‌కు వినియోగించిన వారిపై చర్యలు తీసుకుంటాం. అన్ని ప్రాంతాల్లో అధికారులతో దాడులు నిర్వహిస్తాం. ముమ్మరంగా తనిఖీ చేసి దొరికిన వారిపై కేసులు నమోదు చేస్తాం. హోటళ్లలో, ఇతర వాటికోసం వినియోగిస్తున్న రాయితీ సిలిండర్లు ఇప్పటికే కొన్ని స్వాధీనం చేసుకున్నాం. -
అక్రమార్కులకు ‘ఆహారం’
సాక్షి, కర్నూలు: ప్రజా పంపిణీపై పర్యవేక్షణ కొరవడింది. ఈ అవకాశాన్ని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. పేదల బియ్యం యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు చేరుతోంది. అడపాదడపా దాడులు నిర్వహిస్తున్నా ఇవేవీ అక్రమ రవాణాను నిలువరించలేకపోతున్నాయి. చట్టంలో పస లేకపోవడం.. అధికారుల వైఫల్యం.. నేతల అండదండలతో ఈ దందా నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ నెలలో పక్షం రోజుల్లోనే అధికారుల దాడుల్లో 208 క్వింటాళ్ల బియ్యం పట్టుబడగా.. లోపాలపై ప్రజల నుంచి స్వయంగా కలెక్టర్‌కే ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటం అక్రమ రవాణా ఏ స్థాయిలో సాగుతుందో తెలియజేస్తోంది. అజ్ఞాత వ్యక్తుల సమాచారంతో అధికారులు అప్పుడప్పుడు దాడులు చేశామనిపిస్తున్నా పట్టుబడుతున్న బియ్యం అరకొరే కావడం గమనార్హం. ప్రతి నెలా పేదల బియ్యం పెద్ద ఎత్తున జిల్లా సరిహద్దులు దాటుతున్నా అడ్డుకట్ట వేసే నాథుడే కరువయ్యాడు. గ్రామాల్లో బియ్యం పంపిణీ మొదలైనప్పటి నుంచి అక్రమార్కులు కూలీలను ఏర్పాటు చేసి అధిక ధరతో కొనుగోలు చేస్తున్నారు. ఈ బియ్యాన్ని పాలిష్ చేసి సోనా మసూరి బియ్యంలో కలిపి కొందరు వ్యాపారులు ఎంచక్కా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా వారి ఆగడాలకు అడ్డుకట్ట పడకపోవడానికి చట్టంలోని లొసుగులే కారణంగా తెలుస్తోంది. కోటా బియ్యం, ఇతర కోటా సరుకులు ఎక్కడైనా పట్టుబడితే ప్రజా పంపిణీ వ్యవస్థలోని చట్టం 6ఏ కేసును మాత్రమే అధికారులు నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత కలెక్టర్, జేసీలు విచారించి అపరాధ రుసుం విధించడం, స్వాధీనం చేసుకున్న సరుకులో పూర్తిగా, కొంత ప్రభుత్వ పరం చేసుకునే వెసులుబాటు ఉంది. దీనివల్ల అక్రమార్కులకు పెద్దగా నష్టం లేకపోవడంతో పదేపదే వారు ఇదే తరహా అక్రమాలకు పాల్పడుతున్నారు. -
చౌకబియ్యంపై స్మగ్లర్ల పంజా
నంద్యాల, న్యూస్‌లైన్ : అధికారుల నిఘా వైఫల్యం.. రేషన్ డీలర్ల అత్యాశ.. అధికార పార్టీ నాయకుల అండదండలు వెరసి చౌక బియ్యం రూపంలో స్మగ్లర్ల జేబులు కాసులతో కళకళలాడుతున్నాయి. నంద్యాల కేంద్రంగా సాగుతున్న ఈ రేషన్ బియ్యం తరలింపు యవ్వారంలో ఒక్కో స్మగ్లర్ సగటున నెలకు రూ. 30 లక్షలు ఘడిస్తున్నట్లు సమాచారం. నంద్యాల టెక్కె మార్కెట్ యార్డు సివిల్ సప్లయ్ పాయింట్ నుంచి నంద్యాల పట్టణం, మండలం, గోస్పాడు, బండి ఆత్మకూరు, మహానంది, పాణ్యం, గడివేముల మండలాల్లోని రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా అవుతాయి. స్మగ్లర్లు రెండు, మూడు వర్గాలుగా విడిపోయి సంబంధిత డీలర్ల నుంచి కిలో రూ. 10 నుంచి రూ.15 మధ్యన కొనుగోలు చేస్తున్నారు. అనంతరం కర్ణాటకకు తరలించి కిలో రూ.20నుంచి రూ.30 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మొత్తంగా ఈ యవ్వారంలో కిలో బియ్యంపై స్మగ్లర్‌కు రూ.10, డీలర్‌కు రూ.10, అధికారులకు రూ. 5 తక్కువ కాకుండా అందుతున్నట్లు సమాచారం. ప్రతి నెలా 30 లారీల బియ్యం తరలింపు నంద్యాల సివిల్ సప్లయ్ పాయింట్‌కు వచ్చే బియ్యంలో రోజుకు కనీసం ఒక లారీ బియ్యం సరిహద్దులు దాటిపోతున్నాయి. ఒక్కోసారి ఒక్కో రకమైన వాహనం(టాటా ఏస్, ట్రాక్టర్లు, టిప్పర్లు)లో తరలిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా స్మగ్లర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఇలా పలు ప్రాంతాల నుంచి సేకరించిన బియ్యాన్ని డోన్, ఆదోని మధ్య లారీకి ఎక్కించి రహదారుల వెంట మామూళ్లు ముట్టజెబుతూ కర్ణాటకకు తరలిస్తున్నారు. విస్తృత నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని అధికారుల దాడులకు సంబంధించిన సమాచారం కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దందా సాగిస్తున్నారు. ఒక్కొక్క లారీకి అన్ని ఖర్చులు పోను లక్ష రూపాయలు మిగిలించుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని రైస్ మిల్లులు వీటికే ప్రత్యేకం.. నంద్యాల, పరిసర ప్రాంతాల్లో కొందరు రైస్‌మిల్లు బోర్డులను తగిలించుకొని స్మగ్లర్ల బియ్యాన్ని కొనుగోలు చేసి వాటి ప్యాకింగ్ మార్చడంలో నిమగ్నమయ్యారు. బయటకు ప్రయివేటు వ్యాపారులు అధికారికంగా చేసే ప్యాకింగ్లతో స్మగ్లింగ్ బియ్యం సరఫరా చేస్తున్నారు. -
అధికారుల అండదండలతో..?
బొబ్బిలి, న్యూస్‌లైన్: పేదల బియ్యాన్ని పక్కదారిలో మళ్లించేందుకు పెద్ద రాకెట్టే నడుస్తోంది. రూపాయి బియ్యాన్ని నల్లబజారులో రూ.16 నుంచి రూ.20 వరకూ విక్రయాలు చేయడానికి డీలర్లు పన్నుతున్న మాయాజాలానికి అధికారులు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బొబ్బిలి నుంచి తరలివెళ్తున్న 112 క్వింటాళ్ల పేదల బియ్యం బాడంగి మండలం కోటిపల్లి వద్ద పట్టుబడడంతో అసలు రంగు బయట పడింది. బొబ్బిలి కేంద్రంగా కిలో రూపాయి బియ్యాన్ని అక్రమంగా తరలించడం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇప్పటివరకూ రేషనుడిపోలకు గోదాంల నుంచి బియ్యం చేరిపోయిన తరువాత ఆ బస్తాల రూపం మారిపోయి పక్కదారి పట్టేవి. అయితే ఇప్పుడు డీలర్లు వారి అక్రమాల రూటు మార్చారు. గోదాం నుంచే నేరుగా అక్రమ ప్రదేశాలకు తరలించడానికి సిద్ధమయ్యారు. ఇందుకు బొ బ్బిలిలోని మార్కెట్ కమిటీలో ఉండే గోదాంలనే వేదికగా ఎంపిక చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం బొబ్బిలి ప్రాంతంలో ఉండే డీలర్లలో కొందరు పది డిపోలకు మించి నిర్వహిస్తున్నారు. దాంతో ఒకే సారి లారీలతో సరుకును బయటకు పంపుతుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క డిపోకు సరిపడిన బియ్యాన్ని తీసుకెళ్లకుండా పార్ట్‌లుగా తీసుకెళ్లడం మొదలు పెడుతున్నట్లు సమాచారం. దాంతో మిగిలిన సగాన్ని ఇటు నుంచి ఇటే నల్లబజారుకు తరలించడానికి సులభమవుతుందని తెలుస్తోంది. సాయంత్రం ఐదు గంటల సమయానికి గోదాం నుంచి సరుకులు బయటకు వెళ్తాయి. ఆ తరువాత లారీలు లోపలకు వచ్చినా ఎవరికి ఎటువంటి అనుమానం రాకపోవడంతో వీటిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. నెలకు మూడు నుంచి నాలుగు లారీల వరకూ సరుకుతో బయటకు రాత్రి వేళ వెళ్తున్నట్లు తెలుస్తోంది. వీటికి గోదాం వద్ద విధులు నిర్వహించే ఉద్యోగులు, అధికారుల సంపూర్ణ మద్దతు ఉందనే విమర్శలు ఉన్నాయి. కోటిపల్లి వద్ద 112 క్వింటాళ్ల వరకూ ప్రభుత్వం ముద్రతో ఉండే బస్తాలు దొరికినా అవి ఎక్కడ నుంచి వచ్చాయో రెండు రోజులైనా అధికారులకు తెలియలేదు. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఈ బియ్యం వెళ్లాయని, ఆ ఖాళీలను భర్తీ చేయడానికి రాత్రికి రాత్రే రైసు మిల్లుల నుంచి 112 క్వింటాళ్లను తెచ్చి అధికారుల లెక్కల్లో తేడాలు లేకుండా అందరూ జాగ్రత్త పడ్డారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో డీలరుకు ప్రధాన పాత్ర ఉండడంతో అధికారులపై అధికారపార్టీ ఒత్తిడి కూడా ఎక్కువైనట్లు సమాచారం. అధికార పార్టీ నాయకులు ఇప్పటికే ఈ కేసు విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించమని కోరడంతోనే విచారణ నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది. పట్టుబడిన బియ్యం విషయమై గురువారం బొబ్బిలి వచ్చిన సబ్ కలెక్టరు శ్వేతామహంతిని విలేకరులు ప్రశ్నిస్తే ఇంకా విచారణ చేస్తున్నామని, పక్కదారి పట్టిన బియ్యం దొరికాయి కదా... ఆ సమాచారం ఇచ్చిన వారికి ధన్య వాదా లు అని చెప్పి వెళ్లిపోయారు. ఏకంగా 112 క్వింటాళ్ల బియ్యం బయటకు వచ్చాయంటే అవి ఎక్కడ నుంచి వచ్చాయో ఇప్పటివరకూ తెలుసుకోలేని పరిస్థితిలో అధికారుల విచారణ ఉందని పలువురు బాహాటంగా తప్పుపడుతున్నారు. -
యూరియాకు కృత్రిమ కొరత.. బ్లాక్ మార్కెట్లో విక్రయం
యలమంచిలి, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర బంద్‌లు, నిరసనలతో వ్యాపారులు ఎరువులను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ఆఖరులో ముదురునారుతో ఆలస్యంగా వరినాట్లు పడ్డాయి. కనీసం తిండిగింజలైనా దక్కించుకోవాలనే ఆశతో అన్నదాతలు ఎరువులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ వరి సాధారణ విస్తీర్ణం 92,885 హెక్టార్లు. దాదాపు 30 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదయింది. అదీ సీజన్ ఆఖరులోనే. దీంతో మొత్తంగా 56వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు పడినట్టు వ్యవసాయాధికారులు లెక్కలు తేల్చారు. యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక మండలాల్లో పరి స్థితి దయనీయంగా ఉంది. ఎలాగైనా పంటను దక్కించుకోవాలన్న ఆరాటంలో రైతులు ప్రస్తుతం డీఏపీ, గ్రోమోర్, ఎంవోపీ ఎరువులకంటే యూరియానే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఎరువుల సబ్సిడీపై పోషకాధారిత విధానం ప్రవేశపెట్టిన తర్వాత డీఏపీ, కాంప్లెక్స్‌ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇది యూరియాకు వర్తించకపోవడంతో రైతులు దానివైపే మొగ్గు చూపుతున్నారు. కేటాయింపుల మేరకు కేంద్రం నుంచి తెప్పించడంలో రాష్ట్రం విఫలం కావడంతో యూరియాకు కొరత ఏర్పడుతోంది. దీనిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు రెచ్చిపోతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో దుకాణాలు మూ తపడటం, రవాణాకు ఇబ్బందులను సాకుగా చూపి ఎరువులను ఎక్కువ ధరలకు వ్యాపారులు అమ్ముతున్నారన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. మార్కెట్ ధరకంటే రు.80-100ల వరకు పెంచి విక్రయిస్తున్నారు. ఇక ఎక్కువ డిమాండ్ ఉన్న యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి రైతుల నుంచి ఎక్కువగా గుంజుతున్నారన్న వాదన ఉంది. అధికారులు సమ్మెలో ఉండటంతో వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్టవేసేవారు లేకుండా పోయారు. ప్రైవేట్ వ్యాపారులు, పీఏసీఎస్‌ల్లో 28-28-0 రకం ఎరువును రూ.1150లకు, 20-20-13ను రూ.919లకు, ఎస్ఎస్పీ రూ.352లకు అమ్ముతున్నారు. ఎంవోపీ రూ.915లు, డీఏపీ రూ.1181లు, యూరియా రూ.284 నుంచి రూ.298లకు అమ్ముతున్నారు. దీంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పంటను దక్కించుకోవాలన్న ఆత్రంతో రైతులు తుని, అనకాపల్లి తదితర పట్టణాలకు వెళ్లి ఎంత ధరకైనా అన్నట్టు ఎరువులు కొనుగోలు చేసి ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో తెచ్చుకుంటున్నారు. -
బ్లాక్ మార్కెట్‌కు రైతుబజార్ ఉల్లి
సాక్షి, సిటీబ్యూరో : రైతుబజార్లకు మార్కెటింగ్ శాఖ సరఫరా చేస్తున్న ఉల్లి నేరుగా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోంది. నెల రోజులుగా ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు పసిగట్టలేకపోయారు. ముఖ్యంగా రైతుబజార్ల సిబ్బందిపై నిఘా లేకపోవడంతో వారు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని జేబులు నింపుకొంటున్నారు. ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగి నగరంలోని మహబూబ్‌మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్లో రోజుకు 75-100 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేస్తోంది. వీటిని ఒక్కో రైతు బజార్‌కు 10-15 క్వింటాళ్ల చొప్పున సరఫరా చేసి ‘నో లాస్... నో ప్రాఫిట్’ ప్రాతిపదికన వినియోగదారులకు అందిస్తున్నారు. అంటే హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లి ధర ఎంత ఉంటే... అంతే మొత్తానికి రైతుబజార్లో విక్రయించేలా ఏర్పాట్లు చేశారు. సరుకు సరఫరా చేసిన అధికారులు వాటి విక్రయాలపై నిఘా పెట్టలేదు. దీంతో రైతుబజార్ సిబ్బంది గుట్టుగా చ క్రం తిప్పి ఆ సరుకును బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ఉల్లి సరఫరా చేయగానే కేవలం 2గంటల సేపు విక్రయాలు జరిపి ఆ తర్వాత ‘నో స్టాక్’ బోర్డును వేలాడదీస్తున్నారు. దీంతో సరుకు అయిపోయిందనుకొని వినియోగదారులు వెనుదిరుగుతున్నారు. అవసరమైనవారు కేజీకి రూ.50-60 అధికమొత్తం చెల్లించి రైతుబజార్‌లోని వ్యాపారుల వద్ద ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. నిజానికి రైతుబజార్‌కు వచ్చిన సరుకు వచ్చినంత వేగంగానే బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోతోంది. కొందరు ఆటోల ద్వారా హోటళ్లు, రిటైల్ షాపులకు సరుకు తరలిస్తుండగా, మరికొందరు సంచార రైతుబజార్ల ద్వారా బయటకు తరలించి వివిధ ప్రాంతాల్లో అమ్మేస్తున్నారు. ఈ అక్రమ వ్యవహారం ప్రధానంగా ఎర్రగడ్డ, మెహిదీపట్నం, కూకట్పల్లి, సరూర్‌నగర్, వనస్థలిపురం రైతుబజార్లలో జోరుగా సాగుతోంది. మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా వీరివైపు కన్నెత్తి చూడకపోవడంతో వీరు ఇష్టారీతిన కూరగాయల ధరలు నిర్ణయించడం, అలాగే తక్కువ ధరకు విక్రయించాల్సిన ఉల్లిని బయటకు తరలించి రెండు విధాలుగా దండుకొంటున్నారు. గుట్టుగా స్వాహా మార్కెటింగ్ శాఖ సరఫరా చేస్తున్న ఉల్లి రైతుబజార్లో కేజీ రూ.27.50కి లభిస్తుండగా ఇదే సరుకు రిటైల్ మార్కెట్లో కేజీ రూ.50-60లకు అమ్ముతున్నారు. ఉల్లికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రైతుబజార్ల ఉల్లిని కొనేందుకు హోటళ్లవారు ఎగబడుతున్నారు. నిజానికి రైతుబజార్ కౌంటర్లో ఓ బస్తా (50 కేజీలు) ఉల్లిని తూకం వేసి అమ్మేందుకు 30 నిముషాల సమయం పడుతోంది. ఈ ప్రకారం గంటకు 2బస్తాల ఉల్లిని మాత్రమే అమ్మేందుకు అవకాశం ఉంది. అంటే ఉదయం 2గంటలు సాయంత్రం 2గంటల సేపు విక్రయాలు సాగించినా... రోజుకు ఎనిమిది బస్తాల సరుకు మాత్రమే అమ్మే వీలుంది. అయితే... ఒక్కో రైతుబజార్‌కు రోజుకు 20 బస్తాల ఉల్లిపాయలు సరఫరా అవుతున్నాయి. ఎనిమిది బస్తాల సరుకు అయిపోయినా మిగిలిన పన్నెండు బస్తాల ఉల్లి ఏమౌతుందన్నది సమాధానం లేని ప్రశ్న. స్టాక్ వచ్చిన రెండు గంటల్లోనే నో స్టాక్ బోర్డు వేలాడదీస్తూ వచ్చిన సరుకులో సగానిపైగా బయటకు తరలిస్తున్నారు. అయితే... సరుకు అయిపోయిందంటూ ఎర్రగడ్డ, మెహిదీపట్నం, కూకట్పల్లి, సరూర్‌నగర్, వనస్థలిపురం రైతుబజార్ల నుంచి నిత్యం ఇంటెండ్ ఇస్తుండటం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే ఆయా రైతుబజార్లలో అక్రమాల తీరు ఎలా ఉందో అంచనా వేయవచ్చు. -
బ్లాక్‌లో మండుతున్న సబ్సిడీ గ్యాస్
నక్కపల్లి, న్యూస్‌లైన్: నక్కపల్లి మండలంలో గ్యాస్ కృత్రిమ కొరత ఏర్పడింది. సిలిండర్ ధర సామాన్యుడికి అందనంత ఎత్తుకు ఎగబాకింది. ఫలితంగా గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లో రాజ్యమేలుతున్నాయి. సబ్సిడీపై వినియోగదారులకు ఇవ్వాల్సిన వంట గ్యాస్‌ను కొంతమంది ఏజెన్సీ నిర్వాహకులు అక్రమ వ్యాపారులతో కుమ్మక్కవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అధిక ధరలకు విక్రయించి రెట్టింపు లాభం కోసం తమకు గ్యాస్ అందకుండా చేస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తామని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారని, నెలలు గడుస్తున్నా సిలెండర్ సరఫరా చేయడం లేదని ఆరోపిస్తున్నారు. నక్కపల్లి, కాగిత, పెదతీనార్ల ,చినతీనార్ల, ఉపమాక, తదితర గ్రామాల వినియోగదారులకు అడ్డురోడు, యలమంచిలి తదితర పట్టణాల్లో ఉన్న గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా అవుతోంది. సబ్సిడిపై రూ.450లకు లభించే గ్యాస్ బ్లాక్ మార్కెట్లో రూ.1000 నుంచి 1500లకు విక్రయిస్తున్నారని చెబుతున్నారు. నక్కపల్లి, ఉపమాకలలో సుమారు 15 వరకు బ్లాక్‌లో గ్యాస్ విక్రయించే కేంద్రాలున్నాయి. సబ్సిడీపై గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్లను కాఫీ హోటళ్లు, వెల్డింగ్ షాపులు, నక్కపల్లి పరిసరాల్లోని కంపెనీల క్యాంటీన్లకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. నక్కపల్లిలో ఒక నెలలో 100 మందికి డోర్ డెలివరీ చేయాల్సి ఉండగా గట్టి గా నిలదీసే వారికిచ్చి, మిగిలిన వారికి ఆధార్ కార్డు లేదనో, బ్యాంక్ అకౌంట్ లేదనో సాకులు చూపి బ్లాక్‌లో విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తమకు సబ్సీడీపై దక్కాల్సిన గ్యాస్‌ను బ్లాక్‌లో రెట్టింపు ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. అలాగే ఇటీవల దీపం పథకం కింద ఇబ్బడి ముబ్బడిగా కనెక్షన్లు మంజూరు చేశారు. వీరిలో చాలామంది గ్యాస్ విడిపించుకోవడంలేదు, వారి గ్యాస్‌ను కూడా పక్కదారిపట్టిస్తున్నారు. ప్రభుత్వ శాఖల సిబ్బంది సమైక్య బంద్‌లో ఉండటం వల్ల ఏజెన్సీలు, అక్రమ వ్యాపారుల ఆగడాలు మరీ ఎక్కువయ్యాయి. ఉన్నతాధికారులు అక్రమ గ్యాస్ సిలెండర్ల నిల్వ కేంద్రాలపై దాడులు చేసి సబ్సిడీ గ్యాస్ పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.