
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ రోగులకు చికిత్సలో భాగంగా ఇచ్చే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు డిమాండ్ పెరగడంతో కొంతమంది అక్రమార్కులు ఇదే అదునుగా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విజయవాడలో రెమిడెసివర్‌ను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠాను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. కాలం చెల్లిన ఇంజక్షన్లను విక్రయిస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2.10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: ఉత్పత్తికి ఊపిరి: రెండు ఆక్సిజన్ ప్లాంట్లకు జవసత్వాలు
అంతా మా ఇష్టం: అక్కడ అన్నీ ‘వెలగపూడి’ ఫుడ్‌కోర్టులే..
Comments
Please login to add a commentAdd a comment