సాక్షి, అమరావతి: ఇసుక దొంగతనం కేసులో ఓ వ్యక్తికి కడప కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. ప్రజల ఆస్తికి నష్టం కలిగించినందుకు ప్రజా ఆస్తి విధ్వంస నిరోధక చట్టం (పీఓపీపీడీ) కింద ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా కూడా విధించింది. ఈ రెండు శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కడప జిల్లా రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పి.భానుసాయి రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు.
ఇసుకను అక్రమంగా నిల్వ చేసినా, అక్రమంగా రవాణా చేసినా, బ్లాక్ మార్కెట్‌లో విక్రయించినా, ఒకరి పేరిట కొని, మరొకరికి అమ్మినా రెండేళ్ల జైలు, రూ.2 లక్షల జరిమానా విధించేలా చట్ట సవరణ చేసేందుకు ఈ నెల 13న రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసిన కొద్ది రోజులకే ఈ తీర్పు వెలువడటం విశేషం.
పాపాగ్నిలో అక్రమంగా ఇసుక తవ్వకం
వైఎస్సార్ కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గోపరాజుపల్లికి చెందిన నంద్యాల సుబ్బారాయుడు పాపాగ్ని నదిలో ఇసుకను దొంగిలిస్తున్నారంటూ ఈ ఏడాది జూలై 15న పెండ్లిమర్రి పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు సుబ్బారాయుడు ఇసుక తవ్వుతున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ట్రాక్టర్‌లో ఇసుకను లోడ్ చేస్తూ సుబ్బారాయుడు కనిపించాడు. అతడని పోలీసులు పట్టుకొని విచారణ చేశారు.
ఇసుక దొంగకు మూడేళ్ల జైలు శిక్ష
Published Sat, Nov 23 2019 4:41 AM | Last Updated on Sat, Nov 23 2019 8:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment