బార్వాద్‌ టు ముంబై.. వయా వికారాబాద్‌ | Barvad to Mumbai .. Via VICARABAD | Sakshi
Sakshi News home page

బార్వాద్‌ టు ముంబై.. వయా వికారాబాద్‌

Published Tue, Dec 13 2016 2:57 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

బార్వాద్‌ టు ముంబై.. వయా వికారాబాద్‌ - Sakshi

బార్వాద్‌ టు ముంబై.. వయా వికారాబాద్‌

► యథేచ్ఛగా గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్లు
►  రైతులను పావులుగా వాడుకుంటూ సాగు
►  రైల్వే పోలీసుల కళ్లుగప్పి బోగీల్లో తరలింపు
► ముంబై, సూరత్, పుణెల్లో అమ్మకాలు


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: గంజాయి రవాణాకు వికారాబాద్‌ అడ్డాగా మారుతోంది. గుట్టుగా సాగుతున్న ఈ దందా వెనుక బడా ముఠా ఉన్నట్లు తెలుస్తోంది. కోట్‌పల్లి, బంట్వారం మండలంలో వాణిజ్య పంటల మాటున సాగు చేస్తున్న గంజాయి రైలు మార్గాన ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. రైళ్లలో నిఘా, చెక్‌పోస్టులు లేకపోవడంతో మత్తు పదార్థాల రవాణా యథేచ్ఛగా సాగు తోంది. మహారాష్ట్ర లాతూరు కేంద్రంగా పని చేస్తున్న స్మగ్లర్లు ఇక్కడి రైతులను పావులుగా చేసుకొని ఈ అక్రమ దందాను సాగిస్తున్నట్లు ఇటీవల  అధికారుల దాడిలో బయటపడింది.

నల్లబజారులో గంజాయికి డిమాండ్‌
నిషేధిత మత్తు పదార్థం కావడంతో నల్లబజారులో గంజాయికి భారీ డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే లాతూరుకు చెందిన స్మగ్లర్లు అమాయక రైతాంగానికి ఆశ చూపి.. తమ పొలాల్లో గంజాయి సేద్యం చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఈ క్రమం లోనే కర్ణాటక సరిహద్దులోని కోట్‌పల్లి మం డల పరిధిలోని గ్రామాల్లో గంజాయి పంట సాగవుతోంది. పసుపు, కంది పంటల మధ్య లో ఎకరాకు 25 గంజాయి మొక్కలను పెంచు తారు. ఒక్కో మొక్క నుంచి సుమారు అరకేజీ వరకు గంజాయి ఉత్పత్తి అవుతుంది. ఇలా పండించిన గంజాయిని ఎండపెట్టి ఇంట్లో నిల్వ చేసిన తర్వాత లాతూరుకు చెందిన స్మగ్లర్లు గ్రామాలకు వచ్చి.. కిలోకు రూ.2 వేల చొప్పున ఖరీదు చేస్తారు. నేరుగా మధ్యవర్తు లో.. స్మగ్లర్లో ఇంటికే వచ్చి సేకరిస్తున్నందున ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు రైతులు గంజాయి ఉచ్చులో పడ్డారు. ఇదే అదనుగా గతంలో కేవలం బార్వాద్‌కే పరిమితమైన ఈ దందా ఇతర గ్రామాలకూ పాకింది.

తరలింపు ఇలా..
బార్వాద్‌ నుంచి వికా>రాబాద్‌ రైల్వేస్టేషన్ మార్గమధ్యంలో చెక్‌ పోస్టులు లేకపోవడం స్మగ్లర్లకు అనుకూలంగా మారింది. ఈ ప్రాం తం రాష్ట్ర సరిహద్దులో ఉండడం.. చుట్టూ అటవీ ప్రాంతం ఉండడంతో ఎవరూ పసి గట్టరని భావిస్తున్న అక్రమార్కులు గంజాయి సాగుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు కనిపి స్తోంది.  వికారాబాద్‌ నుంచి రాకపోకలు సాగించే రామేశ్వరం –ఓకా ఎక్స్‌ప్రెస్, విశాఖ పట్నం –ముం బై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్, కాచి గూడ ప్యాసింజర్, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్, గ్రాండ్‌ ట్రంక్‌ ఎక్స్‌ప్రెస్‌ లలో గంజాయిని ముంబై, లాతూరు ప్రాంతాలకు తరలుతున్నట్లు విచారణలో తేలిందని తాండూరు ఎక్సైజ్‌ ఇన్్స క్టర్‌ భరత్‌భూషణ్‌ ‘సాక్షి’కి తెలిపారు.

కనిపెట్టకుండా...
గంజాయి రవాణాలో ముఠా సభ్యులు పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నారు. రైతుల నుంచి సేకరించిన మత్తు పదార్థాన్ని లగేజీ బ్యాగుల్లో భద్ర పరిచి.. దాన్ని ప్రయాణికుల బోగీల సీట్ల కింది భాగంలో దాచిపెడతారు. ఈ సంచు లపై అనుమానం రాకుండా మరో బోగీలో ముఠాసభ్యులు ప్రయాణిస్తారు. ఎవరైనా సంచులను పసిగట్టినా ఏమి మట్టి అంటకుం డా బయటపడాలనే ఆలోచనతోనే ఈ ఎత్తు గడ వేస్తున్నట్లు తెలిసింది. రైల్వే పోలీసులు గుర్తించకపోతే ముంబై, సూరత్, పుణెలకు చేరవేస్తారు. కిలో గంజాయిని రూ.7 వేల వర కు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

గుట్టు వెలుగులోకి వచ్చిందిలా..?
వికారాబాద్‌ జిల్లాలో నెల రోజుల క్రితం తాండూరు ఎక్సైజ్‌ సీఐ భరత్‌భూషణ్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. దాం తో బార్వాద్‌ కేంద్రంగా కొన‘సాగు’ తోన్న గంజాయి గుట్టు రట్టైంది. వ్యవసాయ పొలా ల్లో సాధారణ పంటల మధ్యలో గంజాయి మొక్కల పెంపకం బహిర్గతమైంది. అధికా రులు రైతులుగా భావిస్తున్న లక్ష్మారెడ్డి, వెంక టయ్య, రాచయ్య, శ్రీశైలం, పాండయ్య ఇళ్ల లో తనిఖీలు నిర్వహించగా బ్యాగుల్లో ఉన్న 43 కిలోల ఎండబెట్టిన గంజాయి లభిం చింది. లక్ష్మారెడ్డి, వెంకటయ్య సాగుచేస్తున్న పసుపు, పత్తి పొలాల్లోనూ అధికారులు తని ఖీలు నిర్వహించారు. పత్తి, పసుపు పొలాల మధ్య గంజాయిసాగు చేసినట్టు తనిఖీల్లో తేలింది.

పొలాల్లో 50 కిలోల మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. బార్వాద్‌ నుంచి వికారాబాద్‌ రైల్వేస్టేషన్ వరకు  చెక్‌పోస్టులు లేకపోవడం.. రైళ్లలో కూడా నిఘా తక్కువగా ఉండడంతో గంజాయి రవాణా సులువుగా సాగుతుండడంతో ఈ ప్రాంతం తమకు అనువుగా స్మగ్లర్లు మలుచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement