హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలు బంకులు గురువారం మూతపడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదనుగా భావించిన పలువురు వ్యాపారులు పెట్రోల్ను బ్లాక్ మార్కెట్కు తరలించారు. లీటర్ పెట్రోల్పై అదనంగా రూ. 20 వసూలు చేస్తున్నారు. అలాగే సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా లారీలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దాంతో వ్యాపారులు నిత్యవసరల రేట్లు పెంచేశారు. పప్పులు ధరలు అసలు ధర కంటే రూ. 30 అధికంగా ఆ విక్రయిస్తున్నారు.