ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న విత్తన వేరుశనగను రైతులు అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రైతులపై
పెనుకొండ : ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న విత్తన వేరుశనగను రైతులు అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రైతులపై నిందలు వేయడం తగదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ హితవు పలికారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలీచాలని విత్తనాలతో రైతులు కన్నీరు పెడుతుంటే రైతులు విత్తనాన్ని అమ్ముకుంటున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే అనడం అతని అవివేకానికి నిదర్శనమన్నారు.
టీడీపీ నాయకులే బ్లాక్ మార్కెట్‌కు తరలించి అక్రమంగా సొమ్ము చేసుకుంటుంటే దానిని పట్టించుకోని జేసీ రైతులపై నిందలు వేయడం తగదన్నారు. వెంటనే ఆయన జిల్లా రైతులకు క్షమాపణలు చెప్పాలన్నారు. ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు గురువారం జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ధర్నాకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో సర్పంచులు సుధాకరరెడ్డి, చలపతి, రాజగోపాల్‌రెడ్డి, శ్రీకాంతరెడ్డి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ నాగలూరుబాబు, లాయర్ భాస్కరరెడ్డి, ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, మురళి, ఖాజాపీర్, జాఫర్, దిల్‌దార్, వెంకటరత్నం, ఇర్షాద్, యస్‌బీ శీనా, శ్యాంనాయక్, శ్రీరాములు, మునిమడుగు శ్రీనివాసులు, రాష్ట్ర, జిల్లా నాయకులు రొద్దం నరశింహులు, చంద్రశేఖర్, కొండలరాయుడు, సుబ్బిరెడ్డి, అశ్వర్థమ్మ, నాగభూషణ్‌రెడ్డి, నాయుడు, ఆదినారాయణరెడ్డి, నాయని శ్రీనివాసులు, నారాయణరెడ్డి, ప్రసాద్, పాల్గొన్నారు.