గజ్వేల్ : పట్టణంలో ఎరువులు, విత్తనాల అమ్మకాలపై అధికారులు నిఘా కొనసాగుతోంది. ఈనెల 13న జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ శరత్ పట్టణంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి బ్లాక్‌మార్కెట్ జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మంగళవారం స్థానిక ఏడీఏ శ్రావణ్ కుమార్ పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సాయి ట్రేడర్స్, శ్రీనివాస ట్రేడర్స్‌లలో ఎరువులను బల్క్‌గా విక్రయాలు జరుపుతున్నారని, స్టాక్ రిజిస్టర్‌ను సక్రమంగా నిర్వహించడం లేదని, బిల్ బుక్కుల్లో రైతుల సంతకాలు తీసుకోవడం లేదని గుర్తించి ఆ రెండు దుకాణాల్లో క్రయ విక్రయాలను నిలిపివేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ ఎరువులు, విత్తనాల అమ్మకాల్లో అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. తనిఖీల్లో తప్పిదాలు బయటపడితే క్రిమినల్ కేసులను నమోదు చేయడానికి వెనకాడబోమన్నారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఈ తనిఖీల్లో ఏడీఏ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ సురేష్ ఉన్నారు.
ఎరువులు, విత్తనాల అమ్మకాలపై నిఘా
Published Tue, Jun 17 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM
Advertisement