రూటుమారిన సబ్సిడీ శనగలు
ఆటోతో సహా పట్టుబడిన వైనం
కురిచేడు: కరువు కాలంలో ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు విడుదల చేసిన సబ్సిడీ శనగ విత్తనాలు రంగుమారి, రూటుమార్చి నల్లబజారుకు తరలి వెళుతుండగా అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పాత్రికేయుల కెమేరాకు దొరికిపోరుున సంఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రం కురిచేడులోని గ్రోమోర్ కేంద్రం సిబ్బంది అధికార పార్టీకి చెందిన ఒక అపరాల వ్యాపారితో కుమ్మకై ్క మంగళవారం సాయంత్రం సబ్సిడీ శనగల బస్తాలు మార్చి బయటకు తరలిస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 19నుంచి ప్రభుత్వం రైతులకు సరఫరా చేసే శనగల ఆన్‌లైన్ నిలుపుదల చేసింది. అంతకు ముందు రైతులు కొనుగోలు చేసిన సబ్సిడీ శనగలు వర్షాలు లేక విత్తకుండా ఇళ్లలోనే నిల్వ చేసుకున్నారు.
ఈ దశలో గ్రోమోర్‌లో మిగిలిన శనగలను స్థానిక అపరాల వ్యాపారితో కు మ్మక్కై గ్రోమోర్ సిబ్బంది పక్కదారి పట్టిం చేందుకు సిద్ధమయ్యారు. వ్యవసాయ శాఖాధికారు లు ఎకరాకు 25 కిలోల ప్రకారం గరిష్టంగా ఐదెకరాలకు 125 కిలోలకు మించకుండా ఆన్‌లైన్ పర్మిట్లు జారీ చేశారు. అరుుతే ఇటీవల నల్లబజారులో శనగల ధరలు అమాంతంగా పెరగడంతో వ్యాపారుల కళ్లు సబ్సిడీ శనగలపై పడ్డారుు. ఆ అపరాల వ్యాపారి తన హవా సాగించి గ్రోమోర్ ప్రతినిధులతో కుమ్మకై ్క ఈ ఉదంతానికి ఒడిగట్టారు. గ్రోమోర్ గోడౌన్‌లోనే సబ్సిడీ శనగల సంచులు తొలగించి సాధారణ గోతాల్లోకి మార్చివేశారు. అక్కడ నుంచి నేరుగా ఆటోల ద్వారా నల్లబజారుకు తరలిస్తుండగా పట్టుబడ్డారు. వ్యవసాయశాఖ సిబ్బంది సరుకుతో సహా ఆటోను స్వాధీన పరచుకున్నారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసి, బాధ్యులపై తగిన కఠిన చర్యలు తీసుకుంటామని దర్శి ఇన్‌చార్జి ఏడీఏ సంగమేశ్వరెడ్డి, కురిచేడు ఏవో జ్యోత్సానాదేవి తెలిపారు