రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు భారీగా బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు భారీగా బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా చంద్రలపాడు మండలం బొబిళ్లపాడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బియ్యం అక్రమంగా లోడ్ చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు 365 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.