నకిలీలతో జాగ్రత్త.. మం‍దులు కొనేముందు ‘6 పీ’ సరి చూసుకోండి | Hyderabad :Cp Anjani Kumar Gave Advice Medicine Black Market | Sakshi
Sakshi News home page

నకిలీలతో జాగ్రత్త.. మం‍దులు కొనేముందు ‘6 పీ’ సరి చూసుకోండి

Published Thu, Apr 29 2021 8:15 AM | Last Updated on Thu, Apr 29 2021 12:54 PM

Hyderabad :Cp Anjani Kumar Gave Advice Medicine Black Market - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సెకండ్‌ వేవ్‌లో కరోనా రోజు రోజుకూ పెరుగుతోందని కొత్వాల్‌ అంజనీకుమార్‌ అన్నారు. ఈ నేపథ్యంలోనే రెమిడెసివర్‌ వంటి ఔషధాలకు డిమాండ్‌ పెరగడంతో కొందరు బ్లాక్‌ మార్కెట్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేరం చేస్తున్న 40 మందికి పైగా నిందితుల్ని ఇప్పటి వరకు అరెస్టు చేశామని తెలిపారు. ఈ చీకటి దందాలకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే తక్షణం పోలీసులకు తెలియజేయండని కోరారు.

ఈ పరిస్థితుల్లో నకిలీ మందులు కూడా మార్కెట్‌లోకి వస్తాయన్నారు. వీటి నుంచి తప్పించుకోవడానికి అంతర్జాతీయంగా అమలులో ఉన్న ’6 పీ’ లను తెలుసుకోవాలి... వాటిని అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు. అందులోని వీడియోలో ఆయన పేర్కొన్న అంశాలివి..  ‘ ’
►   పీ1: ప్లేస్‌... దీని ప్రకారం అపరిచిత వెబ్‌సైట్ల నుంచి మందుల్ని ఖరీదు చేయకూడదు.అధీకృత మెడికల్‌ షాపు, ఫార్మాసిస్టు నుంచే ఖరీదు చేయాలి. 
►   పీ2: ప్రిస్క్రిప్షన్‌...రిజిస్టర్డ్‌ డాక్టర్‌ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగానే మందులు కొనండి.  
► పీ3: ప్రామిసెస్‌... కొందరు వైద్యులు, మందుల దుకాణం యజమానులు ఈ మందు చాలా పవర్‌ఫుల్‌ అంటూ హామీలు ఇచ్చేస్తుంటారు. ఆ మాయలో పడకుండా  వాడాల్సిన మందుల్నే ఖరీదు చేయాలి. 
►  పీ4: ప్రైస్‌... ఆయా మందులపై ముద్రించిన ఎమ్మార్పీ మొత్తాన్నే చెల్లించాలి. అంతకు మించి ఎవరైనా డిమాండ్‌ చేస్తుంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి. 
► పీ5: ప్రైవసీ... మీకు ఇంటర్‌నెట్‌లో ఏదైనా ఔషధం తదితరాలు ఖరీదు చేస్తుంటే ఎక్కడా మీ క్రెడిట్‌/డెబిట్‌ కార్డులకు సంబంధించిన రహస్య సమాచారం పొందుపర్చొద్దు. అది సైబర్‌ నేరాలకు దోహదం అవుతుంది.  
► పీ6: ప్రొడక్ట్‌...ఏదైనా వస్తువును ఆన్‌లైన్‌లో ఖరీదు చేసే ముందు మీకు తెలిసిన వారిలో అప్పటికే దాన్ని ఖరీదు చేసిన వాళ్లు ఎవరైనా ఉంటే వారి సలహాలు, సూచనలు తీసుకోండి.   

( చదవండి: స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఆక్సిజన్‌ సిలిండర్ల దందా )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement