ఆక్సిజన్‌ సిలిండర్లు సప్లై చేస్తోన్న యువ బృందం | Mission Oxygen- Helping Hospitals Save Lives | Sakshi
Sakshi News home page

చైనా నుంచి 3900 ఆక్సిజన్‌ సిలిండర్లు..

Published Thu, May 6 2021 3:13 PM | Last Updated on Sat, May 15 2021 9:29 AM

Mission Oxygen- Helping Hospitals Save Lives - Sakshi

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రాణవాయువు కోసం పలువురు సోషల్‌ మీడియా వేదికగా విన్నవిస్తున్నారు. ఇలాంటి కష్టతర పరిస్థితుల్లో 250 మంది సభ్యులున్న ఓ యువ బృందం మిషన్‌-ఆక్సిజన్‌ పేరుతో నిధుల సేకరణ చేస్తోంది. అలా సేకరించిన డబ్బులతో దేశ వ్యాపంగా ఉన్న ఆసుపత్రులకు ఆక్సిజన్‌ సిలిండర్లను పంపిణీ చేస్తోంది. ఆస్పత్రుల్లో సరిపడా పడకల్లేక.. ఆక్సీజన్‌ సిలిండర్లు లేక కరోనా బాధితులు పడుతున్న వెతలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి వారికి అండగా నిలబడుతున్న 'మిషన్‌-ఆక్సిజన్‌' గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం.

మేం ఈ మిషన్‌ను ప్రారంభించేనాటికి 100 ఆక్సిజన్‌ సిలిండర్లను పంపిణీ చేయాలనుకున్నాం.  సోషల్‌ మీడియా ద్వారా వెంటనే దానికి నిధులు సేకరించాం. అయితే మేం ఊహించిన దాని కంటే పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మేం ఇది ప్రారంభించిన కొన్ని గంటల్లోనే  ఆక్సిజన్‌ సిలిండర్లు కావాలని కొన్నివేల వినతులు వచ్చాయి. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ట్విట్టర్‌ ఇలా సామాజికి మాధ్యమాలను ఉపగయోగించుకొని ఫండింగ్‌ చేపట్టాం. దాదాపు 3900 సిలిండర్లను తక్షణ సాయం కింద చైనా నుంచి తెప్పిచ్చాం. ఇప్పటికే వివిధ ఆసుపత్రులకు వీటిని పంపిస్తున్నాం. మేం ప్రారంభించిన ఈ మిషన్‌ 100 శాతం లాభాపేక్షలేని, ఓ స్వచ్ఛంద సంస్థ మాత్రమే. ఇప్పటికే సచిన్‌ టెండూల్కర్‌ సహా పలువురు ప్రముఖులు తమ వంతుగా ముందుకు వచ్చి సహాయం చేశారు. ఏప్రిల్‌ 29న ప్రారంభించిన ఈ మిషన్‌ ద్వారా ఇప్పటికే 15కోట్ల నిధులను సేకరించి వాటి ద్వారా ఆక్సిజన్‌ సిలిండర్లను వివిధ ఆసుపత్రులకు అందించగలిగాం. 

ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు మా సేవలు అందిస్తున్నాం. ఇందుకోసం డీజీ, బిఎస్ఎఫ్, మేజర్ జనరల్ (హెచ్‌క్యూ), ఇండియన్ ఆర్మీ, ఛైర్మన్ ఇఎస్‌ఐసి, డైరెక్టర్లు /మెడికల్ సూపరింటెండెంట్లు సహా వివిధ ప్రభుత్వ అధికారులతో మేం నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. నిజంగా అవసరం ఉన్న చోట ప్రభుత్వ అధికారులతోనూ అందుకు తగ్గ వాస్తవాలు తెలుసుకొని పూర్తి పారదర్శకతతో దీన్ని నిర్వహిస్తున్నాం. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో చాలామంది ఆక్సిజన్‌ సిలిండర్లు లేక ప్రాణాలు కోల్పోతున్నారు. వారందరికీ మా మిషన్‌ ద్వారా మీరు సహాయం చేయగలరా? మీరు అందించే చిన్న సహాయం అయినా ఎంతో మంది ప్రాణాలను నిలబెబుతుంది.

గూగుల్‌ పే లేదా ఏదైనా డిజిటల్‌ చెల్లింపుల ద్వారా మీరు మాకు ఫండ్స్‌ పంపొచ్చు. పూర్తి వివరాలు మీ ముందు ఉంచుతున్నాం. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సహా మా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఎప్పటికప్పుడు మీరు నేరుగా అప్‌డేట్స్‌ తెలుసుకోవచ్చు. ఇది పూర్తి పారదర్శకతతో, నిస్వార్థంగా చేస్తోన్న ఓ ఉద్యోమం. ఇందులో మీరు కూడా భాగస్వాములు అవుతారా? ప్రాణ వాయువు కోసం అల్లాడిపోతున్న ప్రాణాలను మీ వంతు సహాయం చేసి రక్షించగలరా? మీరు ఇవ్వాలనుకునే ఫండింగ్‌ను డైరెక్ట్‌ క్యూఆర్‌ స్కాన్‌ ద్వారా మాకు పంపొచ్చు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement