సాక్షి, అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫలితాలను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరబ్ గౌర్ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 67 శాతం ఉత్తీర్ణత శాతం వచ్చింది.సెకండ్ ఇయర్‌లో 78 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్ ప్లేస్‌లో నిలిచింది. రెండో స్థానం గుంటూరు. మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా నిలిచింది. ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు.
మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇంటర్మీడియట్‌లో 10.53 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4వ తేదీకి పూర్తి అయ్యింది. రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇక, మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను
www.sakshi education.comలో చూడొచ్చు.
ఫస్ట్ ఇయర్..
కృష్ణా జిల్లా-84 శాతం
గుంటూరు- 81 శాతం
ఎన్టీఆర్-79 శాతం
సెకండ్ ఇయర్..
కృష్ణా-90 శాతం
గుంటూరు-87 శాతం
ఇక, ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు రీవాల్యుయేషన్‌కు అవకాశం కల్పించారు.
పరీక్షలకు సంబంధించి వివరాలు ఇలా..
- పరీక్షలకు హాజరైన 10,53,435 మంది విద్యార్థులు
- ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,17,570 మంది విద్యార్థులు
- సెకండియర్ పరీక్షలకు 5.35,865 మంది విద్యార్థులు
- సరికొత్త టెక్నాలజీతో లీకేజ్‌కి అడ్డుకట్ట
- సీరియల్ నంబర్లతో లీకేజ్ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు
- ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్
- ఇంటర్ సెకండియర్‌లోనూ కృష్ణా జిల్లానే టాప్
- రెండో స్థానంలో గుంటూరు జిల్లా
- మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా
- ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 67 శాతం
- సెకండియర్ ఉత్తీర్ణత శాతం 78 శాతం
- ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
- ఒకేషన్ లో 71 శాతం ఉత్తీర్ణత
- పాసయిన విద్యార్థులకు ఇంటర్ బోర్డు అభినందనలు
- ఫెయిలైనా మళ్లీ చదివి పరీక్షలు రాయండి
- ఫెయిల్ అయ్యామని ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు
- ఫెయిలైన విద్యార్థులకు తల్లిదండ్రులు అండగా నిలవాలి
- ఫస్టియర్ ఫలితాల్లో మొదటి స్థానం కృష్ణా జిల్లా 84 శాతం
- రెండో స్థానం గుంటూరు జిల్లా 81 శాతం
- మూడో స్థానం ఎన్టీఆర్ జిల్లా 79 శాతం
- ఇంటర్ సెకండయిర్ ఫలితాల్లోమొదటి స్థానం కృష్ణా జిల్లా 90 శాతం
- రెండో స్థానం గుంటూరు జిల్లా 87 శాతం
- ఈనెల 18 నుంచి 24 వరకు రీవాల్యూయేషన్‌కు అవకాశం
Comments
Please login to add a commentAdd a comment