మెరిసిన మౌనిక
► ఎంపీసీలో 984 మార్కులు సాధించిన విద్యార్థిని
► ఆర్థిక స్తోమత లేక ఉన్నత చదువులకు బ్రేక్
పాలకుర్తి : కష్టాలు ఎదురైనా.. పేదరికం వెక్కిరించినా.. ఆమె ధైర్యం కోల్పోలేదు. కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి తోటి విద్యార్థుల కు ఆదర్శంగా నిలిచింది. మండల కేంద్రానికి చెందిన పన్నీరు మౌనికది నిరుపేద కుటుంబం. 8వ తరగతిలో ఉండగానే ఆమె తండ్రి అనారోగ్యం తో మృతి చెందాడు. దీంతో తల్లి సరోజన పాలకుర్తి మండల కేంద్రంతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో సంచార గాజుల దుకాణం నిర్వహిస్తూ కూతురుతోపాటు కొడుకును పోషిస్తుంది. అరుుతే మౌనిక రెండేళ్ల క్రితం పదో తరగతి పరీక్షలో మంచి మార్కులు సాధించడంతో వరంగల్‌లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాల నిర్వాహకులు ఆమెకు ఎంపీసీలో ఉచి తంగా సీటు ఇచ్చారు.
దీంతో ఈ ఏడాది జరిగిన ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో ఆమె 984/1000 మార్కులు సాధించి సత్తా చాటుకుంది. అరుుతే ఇంటర్‌లో మంచి మార్కులు సాధించినప్పటికీ పేదరికం కారణం గా మౌనిక చదువుకు స్వస్తి చెప్పి తల్లివెంట గాజులు అమ్మేందుకు వెళ్తుం ది. ప్రభుత్వం తనను ఆదుకుని చదివిస్తే టీచర్ ఉద్యోగం సంపాదిస్తానని చెబుతోంది. ఇదిలా ఉండగా, మౌనిక అన్నయ్య కారు డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు.