ఇంటర్ ఓకే
నిజామాబాద్ అర్బన్ : ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో జిల్లాకు మెరుగైన ఫలితాలే వచ్చాయి. గత ఏడాది కంటే ఉత్తీర్ణత నాలుగు శాతం పెరిగింది. కానీ, స్థానం మాత్రం తగ్గింది. పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 27,499 మంది విద్యార్థులు పరీక్షలురా యగా, 13,399 మంది ఉత్తీర్ణులయ్యారు. 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది 26,752 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 12,125 మంది విద్యార్థులు ఉత్తీర్ణత (45 శాతం) సాధించారు. ఈసారి బాలికలే పైచేయి సాధించారు.
14,068 మంది బా లికలు పరీక్షలు రాయగా 7,760 మంది ఉత్తీర్ణుల య్యారు. 55 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 13,431 మంది బాలురు పరీక్షలు రాయగా 5,639 మంది ఉత్తీర్ణులయ్యారు. 42 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఒ కేషనల్‌లో 1,753 మంది పరీక్ష రాయగా 617 మంది ఉత్తీర్ణులయ్యారు. 33 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో 520 మంది బాలికలు పరీక్షలు రాయగా 236 మంది (45 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 1,233 మంది పరీక్షలు రాయగా 381 మంది (31 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ కళాశాలలలో కూడా ఉత్తీర్ణత పెరిగింది. రాష్ట్ర స్థాయిలో జిల్లా మూడవ స్థానంలో నిలిచింది. ప్రభుత్వ కళాశాలలలో 5,159 మంది విద్యార్థు లు పరీక్షలు రాయగా 2,743 మంది (53 శాతం) ఉత్తీర్ణులయ్యారు.
రాష్ట్రస్థాయి ర్యాంకులు
ఈ ఏడాది ఎంపీసీ విభాగంలో మూడు రాష్ట్ర స్థాయి ర్యాంకులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని కాకతీయ జూనియర్ కళాశాలకు చెందిన ప్రీతిశర్మ 465/470, ఎస్‌ఆర్ కాలేజీకి చెందిన జి.జి.మానసి 465/470, బోధన్‌లోని విజయసాయి కళాశాలకు చెందిన సా యిదీప్తి 465/470 మార్కులు సాధించారు. ఇదే వి భాగంలో నగరంలోని ఎస్‌ఆర్.కళాశాలకు చెందిన గ్రీష్మ 464/470 , లిఖిత 463/470, ఆక్కినపల్లి శివలహరి 463/470, కేతవత్ కౌసల్య 463/470 మార్కు లు సాధించారు. బీపీసీలో బంటు అంజలి 432/440 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా కళాశాల నిర్వాహకులు గోవర్ధన్‌రెడ్డి విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు.
బోధన్ విజయసాయి కళాశాలలో
బోధన్‌లోని విజయసాయి జూనియర్ కళాశాల వి ద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. ఎంపీసీ లో 470 మార్కులకుగాను 465 మార్కులు సాధిం చి సాయిదీప్తి డివిజన్‌లో టాపర్‌గా నిలిచింది. బైపీసీలో ఎమ్. రవలి 440 మార్కులకుగాను 427 మా ర్కులు సాధించి ప్రతిభను చాటింది. ఎంఈసీలో జి. ప్రవళిక 500 మార్కు లకు గాను 481 మార్కులు సాధించింది. సీఈసీలో టి. రమేష్ 500 మార్కులకు గాను 431 మార్కులు సాధించాడు.
ఎంపీసీలో ఫజీలత్ జోహ్రా 461,మెహారీన్ ఉన్నీ సా 458, పూజా కృష్ణణ్ 457, దిలీప్ 456, నుస్రత్ జబీన్ 456 మార్కులను సాధించారు. బైపీసీలో అనీల్ 424, సు మంత్ రెడ్డి 424 మార్కులు సాధించారు. ఎంఈసీలో సుష్మ 474, సంగీత 474, సీఈసీలో రాజు 421 మార్కులను సాధించారు. ప్రతిభ చాటిన విద్యార్ధులకు విజయసాయి విద్యాసంస్థల డెరైక్టర్ ఆర్. కామశాస్త్రి అభినందించారు.
‘కాకతీయ’కు ర్యాంకుల పంట
జిల్లా కేంద్రంలోని కాకతీయ జూనియర్ కళాశాలకు ర్యాంకుల పంట పండింది. ఎంపీసీలో పది లోపు 19 ర్యాంకులు, బీపీసీలో ఐదు ర్యాంకులు వచ్చాయి. మొత్తం పది లోపు 25 ర్యాంకులు వ చ్చాయి. ఎంపీసీలో ప్రీతిశర్మ 465/470, రాజేశ్ 464/470), సి.హెచ్.మనీష్ 464/470 మార్కు లు సాధించారు. బీపీసీలో నీడామహ్రిన్ 434/ 440 రాష్ట్రస్థాయి 4వ ర్యాంకు, అహిష మహవీన్ 428/440 రాష్ట్రస్థాయి 9వ ర్యాంకు, సంహిత 424/440 మార్కులు సాధించారు.
ఎంఈసీ విభాగంలో ఎ.సంధ్యశ్రీ 487/ 500 రాష్ట్ర స్థాయి 4 వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల యజమాన్యం అభినందించింది. ర్యాంకు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు. కాకతీయ విద్యాసంస్థల డెరైక్టర్ సి.హెచ్.విజయలక్ష్మి మాట్లాడుతూ ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధిస్తామని అన్నారు.
విద్యార్థులకు ప్రణాళికాబద్ధం గా విద్యను అందించడంతో ఈ ఫలితాలు వచ్చాయన్నారు. విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిం చడమే తమ లక్ష్యమని అన్నారు. ఫలితాలు సా ధించిన విద్యార్థులకు, ఇందుకు కృషి చేసిన అ ధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.