(కాకినాడ) : పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తే ఏదైనా సాధ్యమని నిరూపిస్తోంది కాకినాడ దిగుమర్తివారి వీధికి చెందిన కాదా విజయలక్ష్మి. తాజాగా విడుదలైన ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 467 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. అంతేకాదు వివిధ పోటీ పరీక్షలు, జాతీయ, అంతర్జాతీయ గణిత ఒలంపియాడ్‌లో ప్రథమ ర్యాంకులు సాధించింది. రామానుజన్ గణిత పోటీల్లో జిల్లా ప్రథమస్థానం కైవసం చేసుకుంది.
పదో తరగతి ఫలితాల్లోనూ టాపే..
2015 పదోతరగతి పరీక్ష ఫలితాల్లో 9.8 పాయింట్లు సాధించగా, అదేసంవత్సరం ఏపీఆర్‌జేసీ ప్రవేశపరీక్షల్లో రాష్ట్రస్థాయి 13వ ర్యాంక్ సాధించింది. అలాగే పాలిసెట్ 2016 ప్రవేశపరీక్షల్లో 120 మార్కులకు 118 సాధించి రాష్ట్రస్థాయిలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఎటువంటి శిక్షణ కేంద్రాలకు వెళ్లకుండా పాఠశాలస్థాయిలో ఉన్న సిలబస్‌ను ప్రతిరోజూ సమీక్షించుకుంటూ, ప్రత్యేక ప్రణాళికతో పరీక్షలకు సిద్ధం కావడం వల్లే ఈ ర్యాంకులు సాధించానని విజయలక్ష్మి చెబుతోంది. ఇంటర్‌మీడియట్ విద్యను అభ్యసించి జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపి ప్రముఖ ఐఐటీ విద్యాసంస్థలో కంప్యూటర్ సైన్స్ అభ్యసించి సైన్స్ ఇంజనీర్‌గా స్థిరపడాలనేది తన లక్ష్యమంది. తనకు త ల్లిదండ్రులు కుమార్, సుబ్బలక్ష్మిల ప్రోత్సాహం ఎంతో ఉందని ఆమె చెబుతోంది.
విజయలక్ష్మి..
Published Thu, Apr 21 2016 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM
Advertisement
Advertisement