సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని అధికారులు బహిష్కరించారు. జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లు, వాటర్ బోర్డు అధికారులు బయటకు వెళ్లిపోయారు. జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే మొదటిసారిగా అధికారులు బాయ్‌కాట్ చేశారు.
వివరాల ప్రకారం.. నగరంలో వర్షాల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర విమర్శలు చేశారు. అలాగే సమావేశాలకు కూడా బీజేపీ కార్పోరేటర్లు వినూత్న వేషధారణతో నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్ల తీరుపై అధికారులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్లు గొడవ చేస్తున్నారంటూ సమావేశాం నుంచి జలమండలి అధికారులు సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో, వారికి మద్దతుగా జీహెచ్‌ఎంసీ అధికారులు నిలిచి సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. అయితే, గతంలో విపక్ష కార్పొరేటర్లు మాత్రమే సమావేశాలను బహిష్కరించేవారు. తాజాగా అధికారులే సమావేశాలను బాయ్‌కాట్ చేశారు. కాగా, జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే అధికారులు బాయ్‌కాట్ చేయడం ఇదే మొదటిసారి.
అనంతరం బీజేపీ కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ.. ప్రశ్నలు అడిగతే అధికారుల పారిపోయారని ఎద్దేవాచేశారు. పిల్లలు చనిపోతున్నారని నిరసన తెలిపితే మాపై కేసులు పెడతారా?. అధికారులు మమ్మల్ని కాదు.. మేయర్‌ను అవమానించారు అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో మేయర్ విజయలక్ష్మీ సీరియస్ అయ్యారు. అధికారులకు సిగ్గులేదా? అని మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఎస్సై, డ్రైవర్ దుర్మరణం..
Comments
Please login to add a commentAdd a comment