Corporaters
-
నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్.. కారణం ఇది..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కార్పొరేటర్ల అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో ముగ్గురు కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, భూ కబ్జాలకు సంబంధించిన కేసులో భాగంగానే వారికి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. కరీంనగర్లో కార్పోరేటర్స్ వరుస అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. మరో ముగ్గురు కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 18వ డివిజన్‌కు చెందిన సుధగోని కృష్ణాగౌడ్, 21వ డివిజన్‌కు చెందిన జంగిల్ సాగర్, 41వ డివిజన్‌కు చెందిన భూమాగౌడ్‌ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఇప్పటికే భూ కబ్జా కేసులో 12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములుతో పాటు, బీఆర్ఎస్ నాయకుడు చీటి రామారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక.. తోట రాములు, చీటీ రామారావును ఇప్పటికే 24 గంటల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. తోట రాముడు, చీటి రామారావుపై హైదరాబాద్ ప్రజాదర్బార్‌లో రాజిరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన రెండు గుంటల భూమిని కబ్జా చేసి, హద్దులు మార్చాలంటూ 2019 నుంచి పోరాటం చేస్తున్నట్టు రాజిరెడ్డి ఫిర్యాదులో తెలిపారు. రాజిరెడ్డితో సుమారు 120 మంది నుంచి భూ అక్రమ వ్యవహారాలపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో, ప్రభుత్వ ఆదేశాల మేరకు కరీంనగర్ భూ కబ్జాలు, ఫైనాన్షియల్ అఫెన్సెన్‌పై పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి విచారణ చేపట్టారు. మరోవైపు కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ టూర్ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గాల్లో కార్పోరేటర్స్ వరుస అరెస్టులు ఆందోళన కలిగిస్తున్నాయి. -
మాజీ మంత్రి మల్లారెడ్డికి భారీ షాక్!
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ నియోజకవర్గంలోని 19 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం మేడ్చల్‌లోని జవహర్‌నగర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 19 మంది అసమ్మతి కార్పొరేటర్లు అవిశ్వాసం తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. కావ్య ఒంటెద్దు పోకడలకు సొంత పార్టీ అసమ్మతి కార్పొరేటర్లు మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చి వైజాగ్ టూర్‌కు వెళ్లినట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కొత్తగా ఎన్నుకున్న మేయర్‌తో అసమ్మతి కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి మల్లారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిల మధ్య విభేదాలన్న విషయం తెలిసిందే. ఇక.. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టికి మలిపెద్ది సుధీర్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చదవండి: TS: ప్రభుత్వ సలహాదారుల నియామకం -
మేయర్.. 'మీరే మాకు పెద్ద దిక్కు!'
వరంగల్: గ్రేటర్ పరిధిలోని పలువురు కార్పొరేటర్లు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు అంటిముట్టనట్లుగా వ్యవహరించారు. కౌన్సిల్ సమావేశంలో అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షమా? అన్నట్లుగా ప్రశ్నలు సంధించారు. కౌన్సిల్ సమావేశాల్లో మినహా పాలక వర్గం ఏర్పాటైన రెండున్నర ఏళ్లులో మేయర్‌ను ఎన్నడూ నేరుగా కలిసి సమస్యలు విన్నవించిన దాఖలాలు లేవు. కానీ అధికార మార్పిడితో పరిస్థితులు మారిపోయాయి. గతాన్ని వదిలేద్దాం అంటూ ఐక్యతారాగం అందుకున్నారు. ‘మేయర్ మీరే మాకు పెద్ద దిక్కు. మా డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలి’ అంటూ పలువురు అధికార పార్టీ కార్పొరేటర్లు విన్నవించడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణితో వరంగల్ తూ ర్పు, పరకాల నియోజక వర్గాల పరిధిలోని పలువురు కార్పొరేటర్లు భేటి అయ్యారు. డివిజన్లలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కరుగా ఏకరువు పెట్టారు. చాలామేరకు అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చాలాచోట్ల పనులు మొదలు పెట్టలేదని మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణ ప్రగతి పథకం ద్వారా డివిజన్‌కు రూ.50లక్షలు కేటాయించారని, అందులో 20శాతం నిధులు ఎలక్ట్రికల్ పనులకు ఇచ్చారని, ఇప్పటికి పనులు ప్రారంభానికి నోచుకోలేదని పేర్కొన్నారు. ప్రతి డివిజన్‌కు జనరల్ ఫండ్ ద్వారా రూ.50లక్షల చొప్పున నిధులు కేటాయించాలని కోరారు. తాగునీరు, వీధి దీపాల సమస్యలు, పారిశుద్ధ్య లోపం తదితర విషయాలను వివరించారు. దీనిపై మేయర్ గుండు సుధారాణి స్పందించారు. అభివృద్ధి పనులు, ఇతర సమస్యల పరిష్కారం కోసం అధికారులతో చర్చించి, వేగవంతమయ్యే విధంగా చొరవ తీసుకుంటానని స్పష్టం చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు మరుపల్లి రవి, దిడ్డి కుమారస్వామి, గందె కల్పన, కావేటి కవిత, పోశాల పద్మ, గుండు చందన, రామా తేజస్విని, ముష్కమల్ల అరుణ, బైర బోయిన ఉమ, గద్దె బాబు, వస్కుల బాబు, చింతాకుల అనిల్ కుమార్, బస్వ రాజు శిరీష, బస్వరాజు కుమార స్వామి, సోమిషెట్టి ప్రవీణ్, మహ్మద్ ఫుర్కాన్, ఆకుల మనోహర్, బాల్నే సురేష్‌తోపాటు మహిళా కార్పొరేటర్ల భర్తలు తదితరులు ఉన్నారు. ఇవి చదవండి: బదిలీల కలకలం! బీఆర్ఎస్ బ్రాండ్ అధికారులపై వేటు.. -
పేదలనూ పిండుకున్న ‘పసుపు రాబందులు’
విజయవాడ చిట్టినగర్‌కు చెందిన నొక్కొజు మల్లేశ్వరరావు కార్పెంటర్. అతనికి జవహార్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్ఎన్యూఆర్ఎం) పథకంలో ఇల్లు ఇప్పిస్తానని విజయవాడ 47వ డివిజన్ టీడీపీ నాయకుడు మాకిన విజయ్‌కుమార్ నమ్మబలికాడు. ఐదేళ్ల క్రితం మల్లేశ్వరరావు నుంచి రూ.1.60 లక్షలు వసూలు చేశాడు. ఇప్పటికీ ఇల్లు ఇప్పించలేదు. విజయ్‌కుమార్ చుట్టూ పలుమార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో పోలీస్ కమిషనరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. విజయవాడ చిట్టినగర్‌లో బండిపై పూసలు అమ్ముకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే తమ్మన మాధవికి ఇల్లు ఇప్పిస్తానని విజయ్‌కుమార్ రూ. 3.20 లక్షలు వసూలు చేశాడు. ఇల్లు ఇప్పించకపోగా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో విసిగి వేసారిన బాధితురాలు మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్ల పేరిట జరిగిన భారీ మోసంలో చిన్న ఉదాహరణలు. ఇలా మోసపోయిన వారు నగరంలో 2 వేల మంది ఉన్నట్లు అంచానా. 2014 నుంచి 2019 వరకు జరిగిన ఈ దందా బాధితుల ఫిద్యాదులతో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దాదాపు రూ. 70 కోట్లు పేదల నుంచి వసూలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో టీడీపీ నాయకులు మోసం చేశారని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదుల్లో బాధితులు పేర్కొన్నారు.రోడ్లు, కాలువలు విస్తరణలో ఇళ్లు కొల్పోయిన పేదలకు జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో నివాసం కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించాయి. చదవండి: పవన్ ఒక చెప్పు చూపిస్తే.. నేను రెండు చెప్పులు చూపిస్తా: పేర్ని నాని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఈ పథకం పనులు 2014 వరకు నిర్విరామంగా కొనసాగాయి. విజయవాడ నగరంలో ఇళు కోల్పోయిన పేదల కోసం నగరంలోని జక్కంపూడి, ఆర్‌ఆర్‌పేట, సింగ్‌నగర్, కబేలా ప్రాంతాల్లో వంద ఎకరాల్లో 28,152 జీ ఫ్లస్ త్రి గృహాల నిర్మాణం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారం చేపట్టిన టీడీపీ ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేసింది. అయితే అప్పటివరకు నిర్మించిన ఇళ్లను కేటాయించేందుకు నిర్ణయించింది. దీంతో విజయవాడ పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ఈ ఇళ్లను యధేచ్ఛగా అమ్మేశారు. ఆ నియోజకవర్గాలకు అప్పట్లో ఎమ్మెల్యేలుగా ఉన్న టీడీపీ నాయకులు జలీల్‌ఖాన్, బొండా ఉమామహేశ్వరరావు కనుసన్నల్లోనే ఈ బాగోతం జరిగినట్లు తెలుస్తోంది. ఉచితంగా ఇవ్వాల్సిన ఈ ఇళ్లను డివిజన్లలో టీడీపీ నాయకులు ఒక్కొక్కరూ 200 గృహాలు అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. దీంతో పలువురు కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు ఒక్కో ఇంటికి రూ. 1.50 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు వసూలు చేసి వారు రూ. కోట్లు దండుకున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలు జక్కంపూడి, సింగ్‌నగర్, ఆర్‌ఆర్‌పేట, కబేలా ప్రాంతాల్లో జేఎన్ఎన్ఆర్యుఎం ఇళ్ల కేటాయింపు 2018లోనే పూర్తయింది. అయినా, టీడీపీ నాయకులు నకిలీ డాక్యుమెంట్లు, మునిసిపల్, బ్యాంకు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు. ఇళ్లు లేకపోయినా ఉన్నట్లు ప్రచారం చేసి పేదల నుంచి వసూళ్లు చేశారు. పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లోని 41 డివిజన్లలో ఈ తరహా బాధితులు 2 వేల మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరి నుంచి రూ. 60 నుంచి రూ.70 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. చాలా మంది బాధితులు ముందుగా కొత్తపేట (టుటౌన్) పోలీసులను ఆశ్రయిస్తున్నాయి. అక్కడా విజయ్‌కుమార్ మాటే చెల్లుబాటు కావడంతో పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు మాకిన విజయ్‌కుమార్ బాధితులు 35 మంది ఇప్పటివరకు పోలీసులను ఆశ్రయించారు. ఇతనితోపాటు 41వ డివిజన్లోని నాగోతు రామారావు, 57వ డివిజన్లోని ఎడిబోతు రమణ, 58వ డివిజన్లోని సోమేశ్వరరావు, రామారావు, 60వ డివిజన్లోని భువట ఉమా, శ్రీరాములు, 63వ డివిజన్లోని పైడి శ్రీను పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. -
జీహెచ్ఎంసీ చరిత్రలోనే మొదటిసారి.. కౌన్సిల్ సమావేశం రసాభాస
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని అధికారులు బహిష్కరించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు, వాటర్ బోర్డు అధికారులు బయటకు వెళ్లిపోయారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే మొదటిసారిగా అధికారులు బాయ్‌కాట్ చేశారు. వివరాల ప్రకారం.. నగరంలో వర్షాల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై బీజేపీ కార్పొరేటర్లు తీవ్ర విమర్శలు చేశారు. అలాగే సమావేశాలకు కూడా బీజేపీ కార్పోరేటర్లు వినూత్న వేషధారణతో నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్ల తీరుపై అధికారులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్లు గొడవ చేస్తున్నారంటూ సమావేశాం నుంచి జలమండలి అధికారులు సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో, వారికి మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులు నిలిచి సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. అయితే, గతంలో విపక్ష కార్పొరేటర్లు మాత్రమే సమావేశాలను బహిష్కరించేవారు. తాజాగా అధికారులే సమావేశాలను బాయ్‌కాట్ చేశారు. కాగా, జీహెచ్ఎంసీ చరిత్రలోనే అధికారులు బాయ్‌కాట్ చేయడం ఇదే మొదటిసారి. అనంతరం బీజేపీ కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ.. ప్రశ్నలు అడిగతే అధికారుల పారిపోయారని ఎద్దేవాచేశారు. పిల్లలు చనిపోతున్నారని నిరసన తెలిపితే మాపై కేసులు పెడతారా?. అధికారులు మమ్మల్ని కాదు.. మేయర్‌ను అవమానించారు అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో మేయర్ విజయలక్ష్మీ సీరియస్ అయ్యారు. అధికారులకు సిగ్గులేదా? అని మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఎస్సై, డ్రైవర్ దుర్మరణం.. -
HYD: జలమండలి వద్ద ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: జలమండలి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. నాలాల పూడిక తీయడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నాలాల పూడిక తీయడంలేదని బీజేపీ కార్పొరేటర్లు జలమండలి వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మట్టి తీసుకువచ్చి జలమండలి ఎదుట వేశారు కార్పొరేటర్లు. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్లు జలమండలి ఆఫీసులోకి దూసుకెళ్లారు. దీంతో.. కార్పొరేటర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది కూడా చదవండి: టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శిపై ఈడీ ప్రశ్నలవర్షం -
బీఆర్ఎస్లో తిరుగుబావుటా.. మంత్రి మల్లారెడ్డి ఆదేశాలు బేఖాతరు!
అధికార పార్టీ బీఆర్ఎస్లో తిరుగుబాటు జెండా ఎగురుతోంది. నగర పాలక సంస్థ, మున్సిపాలిటీల్లో సొంత పార్టీ మేయర్లు, చైర్మన్ల పైనే అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన నోటీసులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌కు అందజేయడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 13 పురపాలక సంఘాలు ఉండగా, మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు ఆయన ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసులు సమర్పించడంపై బీఆర్ఎస్ కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. సొంత బంధువులు ప్రాతినిధ్యం వహిస్తున్న పురపాలక సంఘాల్లో కూడా కౌన్సిలర్లు మంత్రి మల్లారెడ్డి గీత దాటడంతో పాటు విపక్షాలతో చేతులు కలపడం వంటి విషయాలు రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోనే అత్యధిక పురపాలక సంఘాలు కలిగిన శాసన సభా నియోజకవర్గంగా మేడ్చల్‌కు పేరుంది. ఇక్కడనే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి ఆదేశాలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాటించక పోవడంతో పట్టును కోల్పోతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో వ్యక్త మవుతోంది. అలాగే మేడ్చల్ నియోజకవర్గంలోని పలు పురపాలక సంఘాలకు చెందిన డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా అదే పార్టీకి చెందిన మేయర్లు, చైర్మన్లపై అవిశ్వాసం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన మంత్రి మల్లారెడ్డి వివిధ మార్గాల ద్వారా అసమ్మతి వాదులను బుజ్జగించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. బుధవారం ‘మన ఊరు–మన బడి’ కింద మరమ్మతులు పూర్తయిన ప్రభుత్వ పాఠశాలల భవనాల ప్రారం¿ోత్సవానికి హాజరైన మంత్రి మల్లారెడ్డి పోచారం, పీర్జాదిగూడ, బోడుప్పల్ పురపాలక సంఘాల్లోని అసమ్మతి వాదులతో సమావేశమై.. బుజ్జగింపుల పర్వానికి తెర లేపినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా... మంత్రి మల్లారెడ్డిపై దాదాపు నెల రోజుల కిందట మల్కాజిగిరి ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్ఎస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో సమావేశమైన జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలు ఆరోపణలతో తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలను ఖాతరు చేయకుండా నామినేటెడ్ పదవులను మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం వారికి కట్టబెట్టారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. అలాగే తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు విషయంలో కలెక్టర్‌ను మంత్రి పక్కదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహార శైలిపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యేలు అప్పట్లోనే మీడియా సమావేశంలో ప్రకటించారు. జవహర్‌నగర్ బాటలో మరికొన్ని.. మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్‌నగర్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్యపై 20 మంది కార్పొరేటర్లు ఇటీవల కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ మర్రి దీపికపై 15 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానానికి సంబంధించిన నోటీసు కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 సె క్షన్ 37 అనుసరించి నో కాన్ఫిడెన్స్ మోషన్ పిటిషన్ చైర్మన్‌కు వ్యతిరేకంగా సమర్పిస్తున్నట్లు వారు నోటీసులో పేర్కొన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మరో 4 పురపాలక సంఘాలకు చెందిన అధికార బీఆర్ఎస్కు చెందిన అ మ్మతి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీసులు కలెక్టర్ కు అందజేసేందుకు సిద్ధమవుతున్నారు. -
చర్చ లేదు రచ్చే.. రసాభాసగా జీహెచ్ఎంసీ సమావేశం..
సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఎలాంటి చర్చ లేకుండా రచ్చతోనే అర్ధాంతరంగా ముగిసింది. గందరగోళం.. రసాభాసలతో, సభ్యుల సస్పెన్షన్లు ఉంటాయో, ఉండవో కూడా తెలియని అయోమయంతో అభాసుపాలైంది. జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు సభకు అధ్యక్షత వహించిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రకటించారు. అనంతరం కొద్ది సేపటికి సభనే ముగించారు. శనివారం జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం ఆద్యంతం రచ్చే అయింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి (2023–24)సంబంధించిన బడ్జెట్ ప్రత్యేక సమావేశం, నగర ప్రజల సమస్యలపై చర్చించాల్సిన సాధారణ సమావేశం రెండూ ఒకేరోజు ఏర్పాటు చేశారు. అజెండా మేరకు తొలుత బడ్జెట్ సమావేశంలో భాగంగా మేయర్ బడ్జెట్ ప్రతిలోని వివరాలు చదవడం ప్రారంభించగానే బీజేపీ సభ్యులు అడ్డుకొని పోడియం వైపు దూసుకెళ్లారు. ప్రశ్నోత్తరాలపై పట్టుబట్టడంతో.. ► తొలుత బడ్జెట్ బదులు ప్రజల సమస్యలపై ప్రశ్నోత్తరాలు నిర్వహించాలని పట్టుబట్టారు. గందరగోళంతో మేయర్ సభను పదినిమిషాలు వాయిదా వేశారు. తిరిగి సమావేశమయ్యాక సైతం వారు ఆందోళన కొనసాగిస్తుండగానే మేయర్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపేవారి చేతులెత్తాలని చెప్పి, బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులను పరిగణనలోకి తీసుకొని ఆమోదం పొందినట్లు ప్రకటించారు. దాన్ని అడ్డుకుంటూ బీజేపీ సభ్యులు మేయర్ పోడియం ముందు బైఠాయించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు.గందరగోళం తీవ్రంగా మారడంతో మరోసారి సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి 11.50 గంటలకు సమావేశం ప్రారంభమయ్యాక సైతం అదే సీన్ పునరావృతమైంది. బీజేపీ సభ్యులు పోడియం చుట్టుముట్టారు. బడ్జెట్‌పై చర్చ జరగకుండానే బడ్జెట్‌ను ఎలా ఆమోదిస్తారంటూ పట్టుబట్టారు. ► ఆమోదం పొందాక తిరిగి చర్చ ప్రశ్నే లేదని, ప్రశ్నోత్తరాలు ప్రారంభిస్తానని, తొలుత మీకే అవకాశమిస్తానని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. ప్రశ్నల కోసం పేర్లు పిలవగా ఒకరిద్దరు బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు లేచి మాట్లాడారు. వారు మాట్లాడుతున్నప్పటికీ బీజేపీ ఆందోళన ఆగలేదు. వీధిదీపాలు వెలగడం లేవని ఎంఐఎం.. అభివృద్ధి కార్యక్రమాలకు ఢిల్లీ వారు నగరానికి అవార్డులిస్తున్నా, గల్లీ వారికి కనిపించడం లేవని బీఆర్ఎస్ ప్రస్తావించాయి. బీజేపీ సభ్యులెంతసేపటికీ పోడియం దిగి రాకపోవడం.. గందరగోళ పరిస్థితి సద్దుమణగకపోవడంతో రెండు మూడు పర్యాయాలు సస్పెన్షన్ హెచ్చరికలు చేసిన మేయర్ 12.11 గంటలకు పోడియంవద్ద ఉన్న బీజేపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు, మేయర్, కమిషనర్ తమ సీట్లనుంచి లేచి వెళ్లిపోయారు. తిరిగి 12.44 గంటలకు సీట్లోకి వచి్చన మేయర్ మాట్లాడుతూ ‘మంచిగా చెబుతున్నా కూర్చోండి. చర్చిద్దాం’ అన్నా పోడియంను చుట్టుముట్టిన వారు వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో సమావేశాన్ని ముగిస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. రూ. 6224 కోట్లతో బడ్జెట్ ఆమోదం 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.6224 కోట్ల బడ్జెట్ మెజారిటీ సభ్యులతో సభ ఆమోదం పొందినట్లు మేయర్ ప్రకటించారు. స్టాండింగ్ కమిటీ ఆమోదించిన బడ్జెట్‌ను యథాతథంగా ఆమోదించారు. బీజేపీ, కాంగ్రెస్ ధర్నాలు.. ప్రజా సమస్యలపై చర్చించాలని, అభివృద్ధి పనులి్నచేపట్టాలనే డిమాండ్లతో బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు వేర్వేరుగా ఆందోళనలు, ధర్నాలు చేశారు. కాంగ్రెస్ సభ్యులు మేయర్ చాంబర్ ఎదుట ‘సేవ్ డెమోక్రసీ.. సేవ్ జీహెచ్ఎంసీ’ ప్లకార్డులను ప్రదర్శించారు. బీజేపీ సభ్యులు మేయర్ ప్రవేశ ద్వారం ఎదుట ధర్నా చేశారు. పోలీసులు వారిని అక్కడినుంచి తరలించారు. సస్పెన్షన్ ఉంటుందా.. ? జీహెచ్ఎంసీ నిబంధనల మేరకు సభ్యులను సస్పెండ్ చేసే అధికారం లేనట్లు మునిసిపల్ వ్యవహారాల నిపుణుడొకరు పేర్కొన్నారు. సభను నిర్వహించలేని పరిస్థితులు ఎదురైతే అందుకు కారణమైన వారిని బయటకు పంపించడమో, లేక సభనే ముగించడమో మినహా సభ్యులను సస్పెండ్ చేయడమన్నది ఉండదని, గతంలో సైతం ఎలాంటి సస్పెన్షన్లు లేకపోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మేయర్ తెలిసో, తెలియకో సస్పెండ్ చేస్తున్నానని ప్రకటించాక పునరాలోచనలో పడి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నయాపైసా తెప్పించని కిషన్‌రెడ్డి: మేయర్ విజయలక్ష్మి సమావేశానంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి కేంద్రమంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి జీహెచ్ఎంసీతో పాటు పరిసరాల్లోని మున్సిపాలిటీలకూ ఒక్క పైసా తేలేకపోయారన్నారు. మున్సిపాలిటీలకు వచ్చే నిధులు ఇప్పించలేక పోయారన్నారు. బీజేపీ సభ్యులు బడ్జెట్ గురించి కానీ, ప్రజల సమస్యల గురించి కానీ చర్చించకపోవడంతో వారికి సమస్యలపై పట్టింపు లేదని వెల్లడైందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ఎస్సార్డీపీ, ఎస్ఎన్డీపీ, సీఆర్ఎంపీల ద్వారా జీహెచ్ఎంసీ నిధులతోనే ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. బీజేపీ వారికి మాట్లాడేందుకు విషయం లేనందునే గందరగోళానికి దిగారని ఆరోపించారు. మహిళా మేయర్‌ను అని కూడా చూడకుండా పోడియంను చుట్టిముట్టి అగౌరవంగా ప్రవర్తించారన్నారు. జీహెచ్ఎంసీకి కేంద్ర మంత్రి నిధులిస్తారా? హెచ్ఎంసీలో పాలన గాడి తప్పింది. నిధులెలా వస్తున్నాయో.. ఎలా ఖర్చు చేస్తున్నారో తెలియడం లేదు. ఎక్కడ వసూలైన నిధుల్ని అక్కడ వినియోగించాలి. పాతబస్తీ నుంచి ట్యాక్సుల రూపేణా ఎంత వసూలవుతుందో.. ఎంత ఖర్చు చేస్తున్నారో, అలాగే న్యూసిటీనుంచి ఎంత వసూలవుతుందో, ఎంత వెచి్చస్తున్నారో వెల్లడించాలి. హైటెక్‌సిటీలో హంగులు తప్ప ఇంకెక్కడా ఏమీ లేదు. గోడలకు రంగులేసి విశ్వనగరం చేస్తున్నామని చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఇండిపెండెంట్ బాడీ. ఎలా నడపాలో చేతగాక కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ప్రస్తావిస్తూ నిధులివ్వలేదనడం విడ్డూరంగా ఉంది. – బండ కార్తీకరెడ్డి, మాజీ మేయర్, బీజేపీ నాయకురాలు చదవండి: Roundup 2022: నిషా ముక్త్ షహరే.. డ్రగ్ ఫ్రీ సిటీ దిశగా! -
టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గపోరు.. కన్నీటి పర్యంతమైన కార్పొరేటర్
సాక్షి, మేడ్చల్ జిల్లా: కుషాయిగూడ ధోబీఘాట్ వేదికగా టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ప్రొటోకాల్ అంశంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రాంమోహన్ వర్గాల నడుమ ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నియోజకవర్గంలో రెండు వర్గాలు విడిపోయి తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నాయి. సమయం వచ్చినప్పుడల్లా బలాలను ప్రదర్శించుకుంటూ ఎవరి ఆధిపత్యాన్ని వారు చాటుతున్నారు. ఈ క్రమంలో ఎవరితో ఉండాలో తేల్చుకోలేక నాయకులు, కార్యకర్తలు సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. సోమవారం కుషాయిగూడలో ఆధునిక యాంత్రిక ధోబీఘాట్ ప్రారంభోత్సవం సందర్భంగా తనకు అవమానం జరిగిందని స్థానిక కార్పొరేటర్ మీడియా ముందుకు వచ్చి గోడు వెళ్లబోసుకోగా.. ప్రొటోకాల్ తనకు సంబంధించిన అంశం కాదని అది అధికారుల చూసుకుంటారంటూ ఎమ్మెల్యే చెప్పారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కన్నీటి పర్యంతమైన కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మహిళా కార్పొరేటర్నైన తనను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అడుగడుగునా అవమానపరుస్తున్నారని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరోపించారు. ఒక మహిళనని చూడకుండా గడిచిన మూడేళ్లుగా అనేక అవమానాలకు గురిచేస్తూ వస్తున్నారని ఆవేదన చెందుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఉప్పల్ నియోజకవర్గంలో ఏ డివిజన్లో లేని విధంగా ఎమ్మెల్యే చర్లపల్లి డివిజన్లో కార్పొరేటర్ ప్రమేయం లేకుండానే అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు: ‘బండి సంజయ్ పేరు చెప్పాలని వేధిస్తున్నారు ’ ఈ క్రమంలో అధికారులపై ఒత్తిడి చేస్తూ ప్రొటోకాల్ సమస్యకు తెరలేపుతూ తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అంతటితో ఆగకుండా తనను కులం పేరుతో దూషిస్తూ అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళనైన తనను అంతటా అవమానపరుస్తూనే ఉన్నారని ఆవేదన చెందారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను అధిష్టానానికి అందజేస్తానన్నారు. తాజాగా కుషాయిగూడ ధోబీఘాట్ ప్రారంభోత్సవం సందర్భంగానూ తనను అగౌరవపరిచినట్లు తెలిపారు. ఉదయం 9 నుంచి 10:30 గంటల వరకు ధోబీఘాట్ వద్దే తాను ఉన్నానని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి రావడం మరో అరగంట సమయం ఉందని నిర్వాహకులు చెప్పడంతో పూలే వర్ధంతి సభలో పాల్గొనేందుకు వెళ్లి వచ్చేలోపు మంత్రి, ఎమ్మెల్యే ధోబీఘాట్ యంత్రాన్ని ప్రారంభించి వెళ్లిపోయారని ఆమె చెప్పారు. స్థానిక కార్పొరేటర్ ప్రస్తావన లేకుండా నిమిషాల వ్యవధిలో ప్రారంభించి వెళ్లి తనను అవమానపరిచారని ఆవేదన చెందారు. ఈ విషయంపై ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని వివరణ కోరగా.. కార్పొరేటర్ బొంతు శ్రీదేవి తనపై చేసిన ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. అవి పూర్తి అసత్యాలని కొట్టి పడేశారు. -
Maharashtra: శివసేనకు మరో ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు పార్టీకి నవీముంబైలో మరో గట్టి దెబ్బ ఎదురైంది. థానే మున్సిపల్ కార్పొరేషన్ అనంతరం నవీ ముంబై కార్పొరేషన్‌కు చెందిన 32 మంది మాజీ కార్పొరేటర్లు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలిసి తమ మద్దతును ప్రకటించారు. దీంతో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేనకు భారీ ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవానికి కొంతకాలం ముందు శివసేన పార్టీ నవీ ముంబైలో తన బలం పెంచుకోవడానికి ఇతర పార్టీల నాయకుల్ని చేర్చుకునేందుకు మిషన్ కార్పొరేషన్ ఉద్యమాన్ని చేపట్టింది. ఏక్నాథ్ షిండే ఆ ఉద్యమానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. కానీ రాజకీయంగా పరిస్థితులు మారిపోయిన నేపథ్యంలో ఏక్నాథ్ షిండే స్వయంగా శివసేన పార్టీలో తిరుగుబాటు జరిపి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. దాంతో శివసేన పార్టీ ఖంగుతినడమే కాకుండా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో పడిపోయింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేనుకలిసిన వారిలో మాజీ ప్రతిపక్షనాయకుడు విజయ్ చౌగులే, శివరమ్ పాటిల్తోసహా 32 మంది ఉన్నారు. తామంతా శివసేన పార్టలోనే ఉంటూ ముఖ్యమంత్రి మార్గదర్శనంలో పనిచేస్తామని వారంతా వముక్తకంఠంతో ప్రకటించారు. చదవండి: అప్పుడు మీరంతా ఎక్కడున్నారు.. రెబల్స్‌కు థాక్రే సవాల్ శివసేన ఉపనాయకుడు వాజయ్ నాహటా కూడా తాను ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. శిండే కూటమిలో మాజీ నగరసేవకుల సంఖ్య ఎక్కువగా ఉంది. కాగా ఐరోలి, బేలాపూర్ జిల్లా ప్రముఖులు, ఐరోలి మాజీ కార్పొరేటర్ ఎమ్కే మాడ్వి, సాన్పాడాకు చెందిన సోమవనాత్ వాస్కర్లాంటి వాళ్లు ఉద్ధవ్ ఠాక్రే వెంటే ఉంటారని సమాచారం. -
ఉద్ధవ్‌కు మరో ఎదురుదెబ్బ.. షిండే వర్గంలోకి 66 మంది శివసేన కార్పొరేటర్లు!
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముగిసినప్పటికీ ఉద్దవ్ ఠాక్రేను చిక్కులు వీడటం లేదు. పార్టీ సీనియర్ నాయకుడు ఏక్నాథ్ షిండే తిరుగుబాటు నుంచి మొదలైన తలనొప్పులు ఇంకా ఉద్ధవ్‌ను వెంటాడుతూనే ఉన్నాయి. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి బయటకొచ్చిన ఏక్నాథ్ షిండే.. బీజేపీతో చేతులు కలిపి కొత్త సర్కార్‌ను ఏర్పాటు చేయడం జీర్ణించుకోలేకపోతున్న ఠాక్రేకు మళ్లీ కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. కీలకమైన బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల ముందు శివసేనకు((ఉద్దవ్ వర్గం) మరో షాక్ తగిలింది. థానే మున్సిపల్ కార్పొరేషన్‌లోని శివసేనకు చెందిన 66 మంది కార్పొరేటర్లు ఏక్నాథ్ షిండే వర్గంలో చేరారు. ఇప్పటికే 66 మంది రెబెల్ కార్పొరేటర్లు మహారాష్ట్ర కొత్త సీఎం ఏక్ నాథ్ షిండేను బుధవారం రాత్రి ఆయన నివాసంలో కలిసినట్లు తెలుస్తోంది. అయితే 67 మంది శివసేన కార్పొరేటర్లలో 66 మంది పార్టీ ఫిరాయించడంతో ఉద్ధవ్ ఠాక్రే టీఎంసీపై అధికారాన్ని కోల్పోయారు. ఇక మహారాష్ట్రలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తర్వాత థానే మున్సిపల్ కార్పొరేషన్ అత్యంత ముఖ్యమైన పౌర సంస్థ. చదవండి: ఉద్దవ్ థాక్రేకు కొత్త తలనొప్పి ఇప్పటికే అధికారం కోల్పోయి తలపట్టుకుంటున్న ఉద్దవ్‌కు మరికొందరు సభ్యులు పార్టీకి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివసేనకు ఉన్న18 మంది ఎంపీల్లో 12 మంది త్వరలో షిండే నేతృత్వంలోని వర్గంలో చేరతారని శివసేన రెబల్ ఎమ్మెల్యే గులాబ్రావ్ పాటిల్ ప్రకటించడం కలకలం రేపుతోంది. కాగా మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోషియారీ విశ్వాస పరీక్షకు ఆదేశించడంతో ఉద్ధవ్ ఠాక్రే ముందుగానే సీఎంగ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తదుపరి శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే సీఎంగా, బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. -
రెండు నెలల ఉత్కంఠకు తెర.. ఊహించిందే జరిగింది
సాక్షి, హైదరాబాద్: సాక్షి చెప్పిందే నిజమైంది. గత రెండు నెలలుగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్నుకున్న ప్రజలను అయోమయానికి గురిచేసిన అడిక్‌మెట్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ సి.సుíనితా ప్రకాష్ గౌడ్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం మంత్రి కేటీఆర్ సమక్షంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ముఠా జైసింహలు వెంట రాగా కుమారుడు తరుణ్‌తో కలిసి గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో గత రెండు నెలల ఉత్కంఠకు తెరపడింది. సి.ప్రకాష్‌గౌడ్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకుడిగా ఉంటూ అంచెలంచలుగా ఎదిగి 2002లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అడిక్‌మెట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2009లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో సి.సునిత తెలుగుదేశం అభ్యర్థిపై 2ఓట్ల తేడాతో విజయం సాధించారు. తరువాత 2014లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. అయితే 2015లో టికెట్ ఆశించినప్పటికి ఆయనకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ దక్కలేదు. అప్పటితో అలకబూనిన ప్రకాష్‌గౌడ్ దంపతులు అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి బీజేపీ టికెట్ దక్కించుకొని విజయం సాధించారు. గెలిచిన కొద్దిరోజులకే ప్రకాష్‌గౌడ్ కరోనాతో మృతిచెందారు. ఆ తర్వాత బీజేపీలోని సీనియర్లు కార్పొరేటర్‌కు పెద్దగా సహకరించకపోవడంతో ఒంటరి అయ్యారు. దీనికితోడు ఆమెకు ముగ్గురు పిల్లలున్నారనే కేసును ఓడిపోయిన మాజీ కార్పొరేటర్ కోర్టులో ఫైల్ చేశారు. వాదనలు తుదిదశకు చేరుకున్నాయి. దీనికి తోడు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. పైగా అధికార పార్టీ బీజేపీ కార్పొరేటర్లపై వల విసరడంతో కార్పొరేటర్ సునితా ప్రకాష్‌గౌడ్ అన్ని ఆలోచించి అధికార పార్టీలో చేరాడానికి సంసిద్దులైనట్లు తెలిసింది. దీనికి సంబంధించి టీఆర్ఎస్తో అవగాహనకు వచ్చిన అనంతరం కార్పొరేటర్ కార్యాలయం వైపుకానీ, బీజేపీ కార్యక్రమాలలో పాల్గొనడం కానీ చేయలేదు. ఇక ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా పోయింది. ఫోన్ చేసినా సరైన రెస్పాన్స్ ఇవ్వడం మానేశారు. దీంతో అనేక రకాలుగా కార్పొరేటర్‌పై ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా టీఆర్ఎస్లోకి వెళ్తుందనే ప్రచారం జోరుగా సాగింది. ప్రచారానికి తగ్గట్లుగానే ఆమె గురువారం కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పెదవి విరుస్తున్న కొండపల్లి మాధవ్.. కార్పొరేషన్ ఎన్నికలకు ముందు సునితాప్రకాష్‌గౌడ్ దంపతులకు డాక్టర్ కె.లక్ష్మణ్ బీజేపీ టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన కొండపల్లి మాధవ్ తీవ్ర అలకబూనారు. గత అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన తనను విస్మరించి అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడంపై మనోవేధనకు గురై టీఆర్ఎస్లో చేరారు. అయితే ఇప్పుడు అదే సునితాప్రకాష్‌గౌడ్ మళ్లీ మాధవ్ ఉన్న టీఆర్ఎస్ పార్టీలోకే ఆమెరావడం విస్మయానికి గురిచేసింది. ఈ విషయంపై టీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీ వ్యవహరించిన తీరుగానే టీఆర్ఎస్ కూడా వ్యవహరించిందని ఎమ్మెల్యే కానీ, ఇతర నాయకులు కానీ ఆమెను చేర్చుకునే విషయంలో ఒక్కమాట కూడా సంప్రదించలేదని పెదవి విరుస్తున్నారు. -
‘నాకు, నా భర్తకు ఎమ్మెల్యే మైనంపల్లి నుంచి ప్రాణహాని ఉంది’
సాక్షి, హైదరాబాద్: తనకు, తన భర్తకు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నుంచి ప్రాణహాని ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి బీజేపీ మౌలాలి కార్పొరేటర్ సునీతాశేఖర్ యాదవ్ ఫిర్యాదు చేశారు. ‘నేను కార్పొరేటర్‌గా గెలిచినప్పటి నుంచి మాపై దాడులకు పాల్పడుతున్నారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలకు నాకు సమాచారం ఇవ్వ కుండా ఓడిపోయిన కార్పొరేటర్ భర్తతో ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు చేయిస్తున్నారు. మున్సి పల్ అధికారులు కూడా మాకు సమాచారం ఇవ్వడం లేదు’ అని ఆరోపించారు. తన క్యారెక్టర్‌పై నిందలు మోపుతూ, ఎమ్మెల్యే అనుచరులతో, ఆడవాళ్లతో అసభ్యంగా తిట్టిస్తూ వీడియోలు పెట్టి సోషల్‌మీడియాలో వైరల్ చేయిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను తిట్టిన మహిళలపై విచారణ చేపట్టి ఎమ్మెల్యే హనుమంతరావు, ఆయన అనుచ రులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరా రు. మల్కాజ్గిరి పోలీస్ వ్యవస్థపై తమకు నమ్మకం లేదని అందువల్లే సాటి మహిళగా తనకు న్యాయం చేస్తారని మహిళా కమిషన్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి, ఇతర నేతలతో కలిసి సునీతా శేఖర్ శనివారం వినతిపత్రం అందించారు. దీంతోపాటు తన బెదిరింపులకు సంబంధించిన వీడియోలతో కూడిన పెన్‌డ్రైవ్‌ను కూడా ఇచ్చారు. గతేడా ది ఆగస్టు 15న తన సహచర కార్పొరేటర్ శ్రవణ్‌పై ఎమ్మెల్యే, అనుచరులు భౌతికదాడు లకు పాల్పడిన ఘటనలో తాను ప్రత్యక్ష సాక్షినని సునీతాశేఖర్ పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ: ఆది, సోమవారాల్లో పలుచోట్ల వర్షాలు -
GHMC: రణరంగంగా మారిన మేయర్ చాంబర్..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని, కార్పొరేటర్లకు బడ్జెట్ కేటాయించాలనే డిమాండ్లతో బీజేపీ కార్పొరేటర్లు తమ అనుచరులతో మేయర్ విజయలక్ష్మి కార్యాలయంలోనికి చొచ్చుకుపోవడం రణరంగాన్ని తలపించింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర తోపులాట జరిగింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు కమిషనర్ చాంబర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ గుంపుగా పోగైన వారు జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కాసేపు బైఠాయించారు. అక్కడి నుంచి మేయర్ చాంబర్‌వైపు వెళ్లారు. కార్పొరేటర్లతో పాటు వారి అనుచరులు దాదాపు రెండొందల మంది వరకు గుంపులుగా చేరడాన్ని గుర్తించిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ముందుకు దూసుకువెళ్తూ వరండాలోని పూలకుండీలను ధ్వంసం చేశారు. చదవండి: కుంకుమ పువ్వు సాగుపై కేటీఆర్ ప్రశంస మేయర్ అప్పటికింకా కార్యాలయానికి రాలేదు. ఆమె చాంబర్లోకి వెళ్లి ఫర్నిచర్‌ను, ల్యాంపులు, పూలకుండీలను ధ్వంసం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ల నేమ్‌బోర్డులు పీకిపారేశారు. కేబుల్‌వైర్లు తెంపారు. జీహెచ్ఎంసీ పేరున్న బోర్డుపై నల్లరంగు పూశారు. చాంబర్లో బైఠాయించారు. మేయర్‌కో హటావో.. జీహెచ్ఎంసీ బచావో తదితర నినాదాలతో కూడిన పోస్టర్లను చాంబర్లో అంటించారు. మెరుపు ధర్నాతో కాసేపు ఏం జరుగుతోందో అక్కడున్నవారికి అర్థం కాలేదు. ఈ పరిణామాలతో దాదాపు రెండు గంటల పాటు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చదవండి: ఎంకి పెళ్లి సుబ్చి చావుకొచ్చిందన్నట్టు.. వారికి సంతోషమే.. కానీ.. పగిలిపోయిన పూలకుండీలను ఒకచోటకు చేరుస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది కార్పొరేటర్లుగా ఎన్నికై ఏడాదవుతున్నా ఇంతవరకు సమావేశాలు నిర్వహించలేదని, కార్పొరేటర్లకు బడ్జెట్ కేటాయించలేదని నినాదాలు చేశా రు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ జులుం నశించాలని నినదించారు. సమస్యలు పరిష్కరించకపోతే కేసీఆర్, కేటీఆర్ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. ఒకసారి నిర్వహించిన వర్చువల్ సమావేశంలో తమ వాణి వినిపించలేకపోయామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని, సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజాసమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు బీజేపీ నేతలు, వారి అనుయాయులను అరెస్టు చేశారు. -
మేయర్ ఎన్నికకు హాజరుకాని టీడీపీ కార్పొరేటర్లు
-
సంఘీభావ దీక్షకు టీడీపీ కార్పొరేటర్లు గైర్హాజరు : విశాఖ
-
Karimnagar: బల్దియా కమిషనర్, కార్పొరేటర్ల మధ్య కొత్త వివాదం
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ నగర పాలక సంస్థలో కొత్త వివాదం మొదలైంది. కమిషనర్ వల్లూరి క్రాంతి, అధికార టీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య అంతరం పెరిగింది. తమకు కనీస గౌరవం కూడా ఇవ్వని కమిషనర్ క్రాంతిని బదిలీపై పంపించాలని 32 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు సంతకాలతో మంత్రి గంగుల కమలాకర్‌కు వినతిపత్రం అందజేయడం కొత్త చర్చకు దారితీసింది. కౌన్సిల్లో ఉన్న 40 మంది టీఆర్ఎస్ సభ్యుల్లో సీనియర్లు 8 మంది మినహా 32 మంది కమిషనర్ క్రాంతిని బదిలీపై పంపించాలని మంత్రి కమలాకర్, మేయర్ సునీల్‌రావుకు విన్నవించడం గమనార్హం. తమకు గౌరవం ఇవ్వడం లేదనే సాకుతోనే కార్పొరేటర్లు కమిషనర్ బదిలీకి ఎసరు పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవలే జిల్లా కలెక్టర్ శశాంక బదిలీ కాగా, ఆయన స్థానంలో ఆర్వీ కర్ణన్ బాధ్యతలు స్వీకరించారు. ఉప ఎన్నిక జరుగనున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని పెద్ద కార్పొరేషన్లలో ఒకటైన కరీంనగర్ కమిషనర్‌ను మాత్రం మార్చలేదు. దీంతో అధికార పార్టీ కార్పొరేటర్లు కరీంనగర్ కమిషనర్‌ను కూడా మార్చాలని కోరుతుండడం గమనార్హం. ఐఏఎస్ అధికారి కావడంతో... కరీంనగర్ కార్పొరేషన్‌కు గతంలో గ్రూప్–1 అధికారులు కమిషనర్లుగా వ్యహరించేవారు. మొన్నటి వరకు కలెక్టర్‌గా పనిచేసిన కె.శశాంక తొలి ఐఏఎస్ కమిషనర్‌గా వ్యవహరించారు. ఆయన బదిలీ తరువాత మళ్లీ గ్రూప్–1 అధికారులనే నియమిస్తూ వచ్చినప్పటికీ, ఏడాది క్రితం ఐఏఎస్ అధికారి వల్లూరి క్రాంతి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. కరీంనగర్లో జరుగుతున్న అభివృద్ధి, స్మార్ట్‌సిటీ పనుల విషయంలో కమిషనర్‌గా నిబంధనల మేరకు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే.. క్రాంతి వచ్చినప్పటి నుంచి కరోనా ప్రభావమే ఉండడంతో పనుల్లో వేగం తగ్గింది. కాంట్రాక్టర్లకు బిల్లుల విషయంలోనూ ఆలస్యం జరుగుతోంది. పనుల నాణ్యతను బట్టి బిల్లుల మంజూరీకి ప్రాధాన్యత ఇవ్వడం వంటి చర్యలు చేపట్టడం కార్పొరేటర్లకు నచ్చడం లేదు. మొరం పనులతో మొదలై.. కరీంనగర్లో విలీనమైన శివారు ప్రాంతాల్లో వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు భారీగా వరద చేరి చెరువుల్లా తయారయ్యాయి. నీట మునిగిన ప్రాంతాల్లో మొరం నింపాలని, ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కార్పొరేటర్లు మేయర్, కమిషనర్‌కు విన్నవించారు. అందుకు సమ్మతించిన అధికారులు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. అయితే.. టెండర్ల విధానంలో కాకుండా నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయించాలని కొందరు కార్పొరేటర్లు ప్రతిపాదించి, వెంటనే అనుమతించాలని అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. నామినేషన్ ప్రతిపాదనలను కమిషనర్ పక్కన పెట్టడంతో కొందరు కార్పొరేటర్లు సంతకాల సేకరణకు తెరలేపారని సమాచారం. వీటితోపాటు ఇటీవల పట్టణ ప్రగతిలో చేసిన పలు పనులు నాసిరకంగా ఉండడంతో, సదరు కాంట్రాక్టర్లను మందలించి, పూర్తిస్థాయి బిల్లులు కాకుండా, చేసిన పనులకే చెల్లించారని.. తద్వారా అగ్గి రాజకుందని ప్రచారం జరుగుతోంది. కమిషనర్ నిర్ణయాలను శివారు ప్రాంతాలకు చెందిన కొందరు కార్పొరేటర్లు చాలాసార్లు మంత్రికి, మేయర్‌కు దష్టికి తీసుకుని వెళ్లినా.. సర్దిచెప్పి పంపించారని సమాచారం. ఆయా ప్రాంతాల్లో సాగుతున్న పనులు లోపభూయిష్టంగా ఉండడంతో బిల్లులు మంజూరు కాకుండా కమిషనర్ కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. వీటితోపాటు ఉద్యోగుల్లో సైతం జవాబుదారి తనం పెంచేందునకు చర్యలు తీసుకుంటుండడం కూడా నచ్చడం లేదు. కార్పొరేటర్ భర్తలకు కనీస గౌరవం లేదా..? కరీంనగర్ కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్‌తో కలిపి 60 మంది ప్రజాప్రతినిధులు ఉండగా, వారిలో సగం అంటే 30 మంది మహిళా కార్పొరేటర్లే. మహిళలు కార్పొరేటర్లుగా గెలిచినా.. ఒకరిద్దరు మినహాయించి మిగతా వారిని ముందుండి నడిపించేది వాళ్ల భర్తలే. ఈ క్రమంలో సాధారణంగా 80 శాతం మంది మహిళా కార్పొరేటర్ల భర్తలే ఆయా డివిజన్లలో జరిగే పనులకు కాంట్రాక్టర్లుగా వ్యహరించడం లేక కుటుంబసభ్యుల్లో ఒకరి పేరిట పనులు చేయించడం జరుగుతోంది. అలాగే.. కమిషనర్, ఇతర అధికారులను కార్పొరేటర్ల భర్తలే కలిసి అభివృద్ధి పనులకు నిధులు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో కమిషనర్‌కు ఫోన్ చేస్తే స్పందించడం లేదని, కార్పొరేషన్‌కు వెళ్లినా అపాయింట్మెంట్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని మహిళా కార్పొరేటర్ల భర్తలు ‘ఆవేదన’ చెందుతున్నారు. అత్యవసర పనులకు నామినేషన్ పద్ధతిలో మంజూరు ఇచ్చేది కమిషనరే కావడంతో కరోనా సమయంలో పట్టణంలోని వార్డుల్లో కోట్లాది రూపాయల పనులు ఇదే పద్ధతిలో జరిగాయి. అయితే.. నామినేషన్ మీద జరిగిన పనులను పరిశీలించి బిల్లులు మంజూరు చేయాల్సిన కమిషనర్ అనుకూలంగా స్పందించడం లేదని చెపుతున్నారు. -
కరోనాతో గుడిమల్కాపూర్ కార్పొరేటర్ కుమార్తె మృతి
సాక్షి, గోల్కొండ: గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ కూతురు ఆవుల భవాని (29) కరోనాతో మృతి చెందారు. వారం రోజులుగా ఆమె గచ్చిబౌలిలోని ఓ ప్రైవే టు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆమెకు భర్త కార్తీక్, 15 రోజుల బాబు ఉన్నాడు. కాగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం దేవర కరుణాకర్‌కు పంపిన ఒక సందేశంలో సంతాపం వ్యక్తం చేశారు. ఇటువంటి క్లిష్ట సమయంలో నిబ్బరంగా ఉండాలని ఆయన దేవర కరుణాకర్‌ను కోరారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం ఉదయం బంజారాహిల్స్‌లోని హిందూశ్మశాన వాటికలో జరిగాయి. చదవండి: వరంగల్, ఆదిలాబాద్‌లలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు -
తెలంగాణ భవన్: గన్‌తో టీఆర్ఎస్ నేత హల్చల్
బంజారాహిల్స్: ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడంతో తెలంగాణ భవన్లో నేతలు, కార్యకర్తల అత్యుత్సాహం భయాందోళనకు దారితీసింది. శనివారం ఓ కార్యకర్త సంబరాల్లో భాగంగా బాణసంచా కాలిస్తే ఏకంగా తెలంగాణ భవన్ ముందున్న పచ్చని పందిరి ఆహుతైంది. ఇది జరిగి అరగంట కాకముందే గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ అత్యుత్సాహంతో తన జేబులో ఉన్న గన్ తీసి గాల్లోకి కాల్పులు జరిపేందుకు యత్నించారు. దీంతో అక్కడున్న వారంతా హడలిపోయారు. అనుచరులు వారించడంతో శ్రీనివాస్ యాదవ్ తన గన్ను కొద్దిసేపటి తర్వాత జేబులో పెట్టుకున్నారు. తుపాకీతో తెలంగాణ భవన్ లోపలికి వచ్చినా ఎవరూ గుర్తించలేకపోయారు. కొద్దిసేపు ఆయన గన్ ఊపుతూ హల్చల్ చేశారు. అక్కడున్న వారు వారించకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. చదవండి: కర్ణాటకలో బ్లాయిమెయిల్: 400 సీడీలున్నాయి! -
విశాఖ కార్పొరేటర్ ఆకస్మిక మృతి
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖలో విషాదం చోటు చేసుకుంది. 61వ వార్డు కార్పొరేటర్ దాడి సూర్యకుమారి ఆదివారం రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. ఆమె విశాఖ పారిశ్రామిక వాడలో నివాసం ఉంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 10వ తేదిన జరిగిన గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో దాడి సూర్యకుమారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి 61వ వార్డుకు కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఆమె మృతితో విశాఖ పారిశ్రామిక వాడలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్(జీవీఎంసీ) శ్రీహరిపురం(వార్డు61)కు ఎన్నికైన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ దాది సూర్యకుమారి ఆకస్మికమృతి సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలియాజేశారు. చదవండి: విశాఖ ఉక్కును కాపాడుకుంటాం.. -
మేయర్ ఎన్నిక: వారు అలా.. వీరు ఇలా..
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నో సంశయాలు.. ఊహాగానాలు.. మరెన్నో అంచనాలను పటాపంచలు చేస్తూ జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోటీ జరిగినప్పటికీ.. మేయర్ ఎన్నికకు 4, డిప్యూటీ మేయర్ ఎన్నికకు 4 నిమిషాలు చొప్పున 8 నిమిషాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియ 20 నిమిషాల్లోనే ముగిసింది. గురువారం ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం, అది ముగిశాక 12.30 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఎన్నికలు పూర్తి చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను టీఆర్ఎస్ సునాయాసంగా గెలుచుకుంది. మేయర్‌గా రాజ్యసభ సభ్యుడు కేశవరావు కుమార్తె, బంజారాహిల్స్ డివిజన్ కార్పొరేటర్ గద్వాల విజయలక్షి్మ, డిప్యూటీ మేయర్‌గా టీఆర్ఎస్ నాయకుడు మోతె శోభన్‌రెడ్డి సతీమణి మోతె శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు. ఎంఐఎం సభ్యులు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు. టీఆర్ఎస్కు 32 మంది ఎక్స్అఫీషియో సభ్యులున్నప్పటికీ అందరూ హాజరు కాలేదు. విప్‌కు అనుగుణంగానే అందరూ వ్యవహరించారని విప్ జారీ చేసిన ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్‌రావు తెలిపారు. టీఆర్ఎస్కు తగినంత బలమున్నందున ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విని యోగించుకునేందుకు వీలుగా పారీ్టయే వారిని రావద్దని సూచించినట్లు తెలిపారు. హాజరుకాని వారిలో లోక్‌సభ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బి.లక్ష్మీనారాయణ, ఫరీదుద్దీన్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తదితరులున్నారు. రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్‌కు మాత్రం విప్ జారీ కాలేదని సమాచారం. ఆయన సమావేశానికి హాజరు కాలేదు. మేయర్‌గా ఎన్నికయ్యాక గద్వాల విజయలక్ష్మి సభలోనే ఉన్న తన తండ్రి కేశవరావుకు పాదాభివందనం చేశారు. అనంతరం సభ్యులందరికీ విడివిడిగా ధన్యవాదాలు తెలిపారు. సన్నిహితులను ఆలింగనం చేసుకున్నారు. చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులంతా ఓట్లు వేశారు. బీజేపీ అభ్యర్థులకు కేవలం బీజేపీ సభ్యులు మాత్రమే ఓట్లు వేశారు. జీహెచ్ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లుండగా, లింగోజిగూడ కార్పొరేటర్ మృతి చెందడంతో ప్రస్తుతం 149 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు ఎన్నికలో పాల్గొనలేదు. మిగతా 147 మంది కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఎక్స్అఫిషియో సభ్యులుగా ఓటున్న అయిదుగురు రాజ్యసభ సభ్యుల్లో డి.శ్రీనివాస్, వి.లక్ష్మీకాంతరావు హాజరు కాలేదు.15 మంది ఎమ్మెల్సీల్లో 10 మంది, 21 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది హాజరైనట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఎంపీలు కిషన్‌రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీ సైతం పోలింగ్‌లో పాల్గొనలేదు. ఎమ్మెల్సీ కవిత పలువురికి సూచనలిస్తూ కనిపించారు. మంత్రి తలసాని పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ టీఆర్ఎస్ సభ్యులకు సూచనలిచ్చారు. చదవండి: ‘మమ్మీ కంగ్రాట్చులేషన్, ఐ లవ్యూ’ మేయర్ పదవి ఆశించింది వాస్తవమే: మోతె శ్రీలతారెడ్డి తెలిసినా తగ్గలేదు సాక్షి, సిటీబ్యూరో: మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ తమవద్ద లేదని తెలుసు. అయినా బీజేపీ తమ అభ్యర్థులను మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు బరిలోకి దించింది. అప్పటి వరకు పైకి చూసేందుకు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్న అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష మజ్లిస్‌లు తీరా ఓటింగ్ సమయం ఒక్కటవడంతో ఆ పారీ్టకి ఓటమి తప్పలేదు. ఎన్నికల సమయంలో ఆ రెండు పారీ్టలు పన్నిన కుట్రలను, కొనసాగిస్తూ వస్తున్న అంతర్గత సంబంధాలను బహిర్గతం చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. కౌన్సిల్ వేదికగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష మజ్లిస్ల అపవిత్ర పొత్తులను బహిర్గతం చేసి ఆందోళనకు దిగింది. ఆ రెండు పార్టీలపై తీవ్రంగా మండిపడింది. సంఖ్యాబలం లేదని తెలిసీ.. ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ 48 స్థానాలు, కాంగ్రెస్ 2 స్థానాలు, ఎంఐఎం 44 స్థానాలను కైవసం చేసుకుంది. వీరిలో లింగోజిగూడ కార్పొరేటర్ ఆకుల రమేష్‌గౌడ్ ప్రమాణ స్వీకారాణికి ముందే మృతి చెందారు. దీంతో బీజేపీ సీట్ల సంఖ్య 47కు చేరింది. ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. దీంతో మేయర్ ఎన్నికకు ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. అధికార టీఆర్ఎస్కు ఎక్స్‌అఫిíÙయో ఓట్లు 32 ఉండగా, బీజేపీకి 2, ఎంఐఎంకు 10 ఉన్నాయి. అయితే అధికార టీఆర్ఎస్కు కార్పొరేటర్ సహా ఎక్స్ అఫిషియో ఓట్లు ఎక్కువే. తీరా ఓటింగ్ సమయంలో ఎంఐఎం మ ద్దతు తెలుపడంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను ఆ పార్టీ సునాయాసంగా దక్కించుకుంది. -
హయత్ నగర్ కార్పోరేటర్‌పై దాడి
సాక్షి, హైదరాబాద్: హయత్ నగర్ కార్పోరేటర్‌కు స్థానికుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు వరదలో ఉన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాలాల కబ్జాలతో బంజారా కాలనీ, రంగనాయకుల గుట్ట పూర్తిగా మునిగిపోయింది. ఈ నేపథ్యంలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు కార్పోరేటర్ సామా తిరుమల్ రెడ్డి ఆదివారం ఉదయం బంజారా కాలనీకి వెళ్లారు. గతంలో తాము నాలా భూములు కబ్జాకు గురి అవుతున్నాయని అధికారులు, కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలా కబ్జాలే ముంపుకు కారణం అంటూ కోపోద్రిక్తులయ్యారు. ఈ క్రమంలో ఓ మహిళ... కార్పోరేటర్ చొక్కా పట్టుకుని నిలదీశారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా కార్పోరేటర్ కంగు తిన్నారు. ఆ తర్వాత స్థానికులకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
హయత్ నగర్ కార్పోరేటర్‌పై దాడి
-
ఏం చేశారు.. ఆ ఇద్దరు కార్పొరేటర్లు
బనశంకరి: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన దేవరజీవనహళ్లి, కమ్మగొండనహళ్లి హింసాకాండల కేసులో ఇద్దరు కాంగ్రెస్ కార్పొరేటర్లపై సీసీబీ పోలీసులు దృష్టి సారించారు. డీజే హళ్లి కార్పొరేటర్, మాజీ మేయర్ సంపత్‌రాజ్, పులకేశినగర వార్డు కార్పొరేటర్ అబ్దుల్ రాఖిద్ జాకీర్‌ను సీసీబీ పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు మంగళవారం సీసీబీ డీసీపీ కేసీ.రవికుమార్ తెలిపారు. సీసీబీ జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్‌పాటిల్ నేతృత్వంలో చామరాజపేటే సీసీబీ కార్యాలయంలో వీరి విచారణ సాగింది. (బెంగళూరు అల్లర్లు: ఐదుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలు) మరో 30 మంది అరెస్టు : అల్లర్ల కేసులో రోజురోజుకు అరెస్టులు పెరుగుతున్నాయి. సోమవారం రాత్రి మళ్లీ 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి వివిధ విభాగాల పోలీసులు డీజేహళ్లి, కేజీ హళ్లి పోలీస్స్టేషన్ల పరిధిలో గల్లీ గల్లీలో ఉన్న ఇళ్లపై దాడిచేసి 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారి సంఖ్య 380కి పెరిగింది. గొడవ చోటుచేసుకున్న రోజు ఫోటోలు, సీసీ కెమెరా దృశ్యాలు, నిందితులు చెబుతున్న సమాచారం ప్రకారం ప్రతిరోజూ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. పోలీసులు వెళ్లగానే కొందరు దాక్కోగా ఇల్లిల్లూ గాలించి నిర్బంధించారు. గలాటాల తరువాత వివిధ ప్రాంతాలకు పారిపోయినవారిని పట్టుకునేందుకు పోలీసులు కేరళ, తమిళనాడు తదితర ప్రాంతాలకు వెళ్లారు. అనుమానిత ఉగ్రవాది విచారణ ఆల్హింద్ ఉగ్ర సంస్ధ సభ్యుడు, అనుమానిత ఉగ్రవాది సమీయుద్దీన్‌ను ఏటీసీ విభాగం అధికారులు రహస్య ప్రాంతంలోకి తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు. కేజీ.హళ్లి, డీజే.హళ్లి అల్లర్లకు సంబంధించి డీజే.హళ్లి నివాసి సమీయుద్దీన్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా ఉగ్రసంస్ధ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇతను డీజే.హళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న అల్లర్లలో భాగస్వాములైనట్లు అనుమానం వ్యక్తమైంది. ఘటన సమయంలో నిప్పుపెట్టడానికి చేతులతో సైగ చేసే దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. ఇతడి వాట్సాప్ మెసేజ్ చేయడం, వందలాది ఫోన్లు చేసినట్లు విచారణలో వెలుగుచూసింది. ఆ రోజు ఎక్కడ ఉన్నారు గలాటాలు జరిగిన రోజు మీరు ఎక్కడ ఉన్నారు, ఎవరితో మాట్లాడారు మొదలైన సాధారణ ప్రశ్నల నుంచి లోతుగా ఆరా తీస్తున్నారు. అల్లరిమూకలతో కార్పొరేటర్లకు సంబంధాలు ఉన్నాయా అని విచారణ సాగుతోంది. వారి మొబైల్ఫోన్ల కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. ప్రమేయం లేదని తేలితే వదిలిపెట్టే అవకాశముంది, లేదంటే అరెస్టు చేయవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది. సంపత్‌రాజ్ వ్యక్తిగత సహాయకున్ని కూడా ఖాకీలు ప్రశ్నిస్తున్నారు. -
మున్సి‘పల్టీలు’!
సాక్షి, మేడ్చల్ జిల్లా: గ్రేటర్ హైదరాబాద్ శివారు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గం కొంగొత్త ఆశలతో కొలువుదీరుతున్న వేళ..తమ సమస్యలకు మోక్షం లభించగలదని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు. మున్సిపల్ కొత్త చట్టం ఇందుకు మరింత దోహదం చేయగలదని వారు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా, గ్రేటర్ శివారులో ఏడు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీల్లో పెరుగుతున్న కాలనీలు, జనాభాకు అనుగుణంగా ప్రజలకు మౌలిక వసతులు కల్పించ లేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా మిషన్ భగీరథ పనుల నత్తనడకతో తాగునీరందడం లేదు. అండర్ డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. సామర్ధ్యం లేక పైప్లైన్ల లీకేజీలు, మరమ్మతులు లేక అధ్వాన్నంగా ప్రధాన అంతర్గత రోడ్లు, కబ్జాలకు గురైన చెరువులు, కుంటలకు తోడు, డంపింగ్ యార్డులతో విరజిమ్ముతున్న కాలుష్యం వెరసి భూగర్భ జలాలు విషపూరితంగా మారి జీవకోటికి సవాల్ విసురుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పురపాలక సంఘాలకు మేయర్లుగా, చైర్మన్లు, చైర్పర్సన్లుగా పాలక వర్గాలు బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో ప్రధాన సమస్యలపై సాక్షి ఫోకస్... ♦ పీర్జాదిగూడ కార్పొరేషన్ఈ కార్పొరేషన్‌కు ఏటా రూ.40 కోట్ల ఆదాయం ఉంది. ♦ వర్షాకాలంలో శ్రీరామా ఆర్టీసీ కాలనీ, వినాయకనగర్, శ్రీపాద ఎన్క్లేవ్, గణేష్‌నగర్, విష్ణుపురి, శంంకర్నగర్, బండి గార్డెన్ తదితర ఏరియాల్లో వర్షాకాలంలో వరద సమస్య ఎదురవుతోంది. ♦ పర్వాతాపూర్, కార్పొరేషన్ కార్యాలయం వెనుక కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ♦ మేడిపల్లి సీపీఆర్ఐ నుంచి పర్వాతాపూర్ వరకు, వరంగల్ జాతీయ రహదారిలోని మైసమ్మ గుడి నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అంతర్గత రోడ్లన్నీ గుంతలతో నిండిఉన్నాయి. ♦ కాలుష్యం, పారిశుధ్య సమస్యలతో జనం రోగాలబారిన పడుతున్నారు. ♦ పీర్జాదిగూడలో 80 కాలనీల్లో 30 కాలనీలకు భగీరథ నీరు రావటం లేదు. నాలుగు రోజులు లేదా వారానికి ఒకసారి నల్లా నీరు సరఫరా అవుతున్నది. పీర్జాదిగూడలో 60 పార్కులకుగానూ 40 పార్కులు ఆక్రమణలకు గురయ్యాయి. బోడుప్పల్ .. ♦ ఈ కార్పొరేషన్‌కు ఏటా రూ.60 కోట్లు పన్నుల రూపేణా ఆదాయం ఉంది. ♦ చెంగిచర్ల వెంకటసాయినగర్, శ్రీసాయి రెసిడెన్సీ తదితర ప్రాంతాల్లో మురికి కాలువలు సరిగా లేక వర్షపు నీటితో వరద నీరు కలిసి రోడ్లన్నీ వరదమయంగా మారుతున్నాయి. ♦ 45 కాలనీల్లో మురికి కాలువలు, అంతర్గత రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయి. ♦ బోడుప్పల్‌లోని ‘రా’ చెరువు కాలుష్య కాసారంగా మారింది. వరంగల్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనుల జాప్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ♦ బోడుప్పల్లో 120 కాలనీలకుగానూ 40 కాలనీలకే మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. రెండవ దశ పనులు పూర్తి కాకపోవటం వల్ల వారానికి ఒక సారి నీరు సరఫరా చేస్తున్నారు. లక్ష్మీనగర్ హుడా కాలనీ, ఈస్ట్ బృందావనకాలనీ, అంబేద్కర్ చౌరస్తా, శ్రీనివాస కాలనీ, రాజశేఖర్ కాలనీల్లో, హనుమాన్‌నగర్, ఉదయ్‌నగర్‌లో పైప్లైన్లు పగిలి లీకేజీలవుతున్నాయి. ♦ 270 పార్కులకుగానూ, 150 పార్కులు ఆక్రమణకు గురయ్యాయి. జవహర్‌నగర్ .. ♦ ఈ కార్పొరేషన్లో దాదాపు రెండు లక్షల జనాభా, 40 వేలకు పైగా గృహాలు ఉన్నప్పటికీ పన్నుల ఆదాయం రూ.7 కోట్లు మాత్రమే వస్తోంది. ♦ జవహర్‌నగర్‌లో ప్రధానంగా డంపింగ్ యార్డు కాలుష్యం, దుర్గంధం, ప్రధాన, అంతర్గత రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ, పారిశుధ్ద్య నిర్వహణ సరిగా లేదు. ఖాళీ స్థలాలు, ఇళ్ల క్రమబద్ధీకరణ చేపట్టాల్సి ఉంది. నిజాంపేట్ .. ♦ ప్రజల నుంచి ఏటా ఈ కార్పొరేషన్‌కు పన్నుల రూపంలో రూ.40 కోట్లు వస్తున్నా సమస్యలు తీరడం లేదు. ♦ నిజాంపేట్, ప్రగతి నగర్ మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఉంది. మిషన్ భగీరథ పనుల్లో జాప్యంతో నీటి ఇబ్బందులు తప్పటం లేదు. చెత్త డంపింగ్ యార్డును విస్తరింపజేసి, ఆధునీకరించాల్సి ఉంది. బండ్లగూడ .. ♦ బండ్లగూడకు ఏటా ప్రజల నుంచి వివిధ పన్నుల ద్వారా రూ.30 కోట్లు సమకూరుతున్నది. అనేక కాలనీల్లో తాగు నీటి సమస్య ఉంది. హైదర్‌గూడ పీఅండ్‌టీ కాలనీ మధ్య మూసీపై వంతెన నిర్మించాల్సి ఉంది. పీరం చెరువు కాలుష్యం, డంపింగ్ యార్డుతో భూగర్భజలాలు కాలుష్యం అవుతున్నాయి. బడంగ్పేట్ .. ♦ ఏటా ప్రజల నుంచి పన్నుల ద్వారా ముక్కు పిండి రూ.39 కోట్లు వసూలు చేస్తున్నారు. మురికి నీటి వ్యవస్థకు అవుట్ లేకపోవటంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ప్రధాన, అంతర్గత రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. బస్తీలు, కాలనీల్లో నీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. మీర్పేట్ .. ♦ ఈ కార్పొరేషన్‌కు ఏటా పన్నుల ద్వారా రూ.24 కోట్ల ఆదాయం వస్తుండగా,....ప్రజలు మాత్రం తాగునీరు, తీవ్ర పారిశుధ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చెరువుల్లోకి నేరుగా మురికి నీరు కలిసి కాలుష్యంగా మారుతున్నాయి. ప్రధానంగా 60 కాలనీలకు బస్సు సౌకర్యం లేదు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. మురికినీరు వ్యవస్థ బాగా లేకపోవటంతో రోడ్లపై మురికి నీరు ప్రవహిస్తోంది. 21 మున్సిపాలిటీల్లోనూ అంతే.. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూముకుంట, నాగారం, దమ్మాయిగూడ, ఘట్కేసర్, పోచారం, దుండిగల్, పెద్దఅంబర్‌పేట్, తుక్కుగూడ, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, శంషాబాద్, మణికొండ, తుర్కుయాంజాల్, నార్సింగ్, ఆదిబట్ల, షాద్‌నగర్, ఆమనగల్లు తదితర మున్సిపాలిటీల్లో ఏటా లక్షలాది రూపాలు పన్నులను ప్రజల నుంచి ముక్కిపిండి వసూలు చేస్తున్న అధికారులు, పాలక వర్గం వారికి మౌలిక వసతులు కల్పించలేక పోతున్నది. నాగారం మున్సిపాలిటీలో ఏటా రూ.12 కోట్లు పన్నుల ద్వారా వస్తుండగా, చిన్న మున్సిపాలిటీలు అయిన తుక్కుగూడకు రూ.1.8 కోట్లు, పోచారానికి రూ.3 కోట్లు, గుండ్ల పోచంపల్లికి రూ.5 కోట్లు, మేడ్చల్‌కు రూ.2.3 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా మున్సిపాలిటీల్లో ప్రజలు తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, మురికి కాలువలు, డంపింగ్ యార్డు, చెరువుల, కుంటల కాలుష్యం, అక్రమ కట్టడాలు, పార్కులు, ప్రభుత్వ భూముల కబ్జా సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శశ్మాన వాటికలు, హరితహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంది. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న పురపాలికలు ఈ ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.