సాక్షి, హైదరాబాద్: హయత్ నగర్ కార్పోరేటర్‌కు స్థానికుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు వరదలో ఉన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాలాల కబ్జాలతో బంజారా కాలనీ, రంగనాయకుల గుట్ట పూర్తిగా మునిగిపోయింది. ఈ నేపథ్యంలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు కార్పోరేటర్ సామా తిరుమల్ రెడ్డి ఆదివారం ఉదయం బంజారా కాలనీకి వెళ్లారు. గతంలో తాము నాలా భూములు కబ్జాకు గురి అవుతున్నాయని అధికారులు, కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలా కబ్జాలే ముంపుకు కారణం అంటూ కోపోద్రిక్తులయ్యారు. ఈ క‍్రమంలో ఓ మహిళ... కార్పోరేటర్ చొక్కా పట్టుకుని నిలదీశారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా కార్పోరేటర్ కంగు తిన్నారు. ఆ తర్వాత స్థానికులకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment