సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ దగ్గర సందడే సందడి | TRS corporaters to meet at Telangana CM camp office | Sakshi
Sakshi News home page

సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ దగ్గర సందడే సందడి

Published Sat, Feb 6 2016 6:33 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

TRS corporaters to meet at Telangana CM camp office

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో  గెలిచిన టీఆర్ఎస్ కార్పొరేటర్లతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో క్యాంప్ కార్యాలయంలో శనివారం కళకళలాడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ... కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. ఈ నెల 11న మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక నేపథ్యంలో ఈ సమావేశంలో చర్చించారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ రేసులో ఉన్న పలువురు కార్పొరేటర్‌లో ఇప్పటికే తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందరి అభిప్రాయలు తెలుసుకున్న తరువాతే ఈ పదవులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ నెల 9న కార్పొరేటర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి భేటీ కానున్నారు. గ్రేటర్‌లో పార్టీ బలోపేతంపై కేసీఆర్ దృష్టి సారించనున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు ప్రజల నుంచి డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ పథకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. అవినీతి  విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఇప్పటికే కేసీఆర్ కార్పొరేటర్లకు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement