హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీల నేతల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో ఆదివారం అన్ని పార్టీలు పోటాపోటీగా ర్యాలీలను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా, మల్కాజ్ గిరిలో తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 'విజయవాడలో కొబ్బరికాయల దుకాణం పెట్టుకో, పర్సనల్ లోన్ ఇప్పిస్తా' అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
అంతకముందు మల్కాజ్గిరిలో తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేవంత్ నిర్వహిస్తున్న ర్యాలీకి ముందస్తు అనుమతి లేదన్న కారణంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. అధికార పార్టీ ఆదేశాల మేరకే పోలీసులు తమ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
కొబ్బరికాయల దుకాణం పెట్టుకో, లోన్ ఇప్పిస్తా: రేవంత్
Published Sun, Jan 31 2016 4:23 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement
Advertisement