![visakhapatnam 61 ward corporator dadi surya kumari passed Away - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/22/surya-kumari.jpg.webp?itok=bQ3Epno2)
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖలో విషాదం చోటు చేసుకుంది. 61వ వార్డు కార్పొరేటర్ దాడి సూర్యకుమారి ఆదివారం రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. ఆమె విశాఖ పారిశ్రామిక వాడలో నివాసం ఉంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ నెల 10వ తేదిన జరిగిన గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో దాడి సూర్యకుమారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి 61వ వార్డుకు కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఆమె మృతితో విశాఖ పారిశ్రామిక వాడలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్(జీవీఎంసీ) శ్రీహరిపురం(వార్డు61)కు ఎన్నికైన వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ దాది సూర్యకుమారి ఆకస్మికమృతి సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలియాజేశారు.
చదవండి: విశాఖ ఉక్కును కాపాడుకుంటాం..
Comments
Please login to add a commentAdd a comment