సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కార్పొరేటర్ల అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా మరో ముగ్గురు కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, భూ కబ్జాలకు సంబంధించిన కేసులో భాగంగానే వారికి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. కరీంనగర్‌లో కార్పోరేటర్స్ వరుస అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. మరో ముగ్గురు కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 18వ డివిజన్‌కు చెందిన సుధగోని కృష్ణాగౌడ్, 21వ డివిజన్‌కు చెందిన జంగిల్ సాగర్, 41వ డివిజన్‌కు చెందిన భూమాగౌడ్‌ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ఇప్పటికే భూ కబ్జా కేసులో 12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములుతో పాటు, బీఆర్ఎస్ నాయకుడు చీటి రామారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక.. తోట రాములు, చీటీ రామారావును ఇప్పటికే 24 గంటల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. తోట రాముడు, చీటి రామారావుపై హైదరాబాద్ ప్రజాదర్బార్‌లో రాజిరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన రెండు గుంటల భూమిని కబ్జా చేసి, హద్దులు మార్చాలంటూ 2019 నుంచి పోరాటం చేస్తున్నట్టు రాజిరెడ్డి ఫిర్యాదులో తెలిపారు.
రాజిరెడ్డితో సుమారు 120 మంది నుంచి భూ అక్రమ వ్యవహారాలపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో, ప్రభుత్వ ఆదేశాల మేరకు కరీంనగర్ భూ కబ్జాలు, ఫైనాన్షియల్ అఫెన్సెన్‌పై పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి విచారణ చేపట్టారు. మరోవైపు కరీంనగర్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ టూర్ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గాల్లో కార్పోరేటర్స్ వరుస అరెస్టులు ఆందోళన కలిగిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment