
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( జీహెచ్‌ఎంసీ) కౌన్సిల్ మీటింగ్ బుధవారం నిర్వహించింది. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మెహన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. గ్రేటర్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై ఈ మీటింగ్‌లో చర్చించారు. ఈ సందర్భంగా నగరంలోని పలు సమస్యలపై కార్పొరేటర్లు గళమెత్తారు.
హైదరాబాద్‌లో ఎక్కడి చెత్త అక్కడే ఉంటోందని, చెత్తతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొన్నిసార్లు నగరంలో లైట్లు కూడా వెలగడం లేదని పేర్కొన్నారు. నాలాల పూడికలు తీయడం లేదని, వర్షం వస్తే హైదరాబాద్ చెరువులను తలపిస్తోందని తెలిపారు. అంతేకాకుండా మృతదేహాల కోసం వాడిన ఐస్‌ను జ్యూస్ సెంటర్లలో వాడుతున్నారని, ఐస్ ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని సభ్యులు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు.