Council meeting
-
మీటింగ్‌కు కమిషనర్ డుమ్మా.. గుంటూరు మేయర్ సంచలన వ్యాఖ్యలు
గుంటూరు, సాక్షి: మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ పులి శ్రీనివాసులు డుమ్మా కొట్టడంపై మేయర్ కావట్టి మనోహర్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరద సహాయం పేరుతో ఖర్చుపెట్టిన నిధులకు లెక్క చెప్పాల్సి వస్తుందని కారణంతోనే కమిషనర్ సమావేశాలకు రావట్లేదని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ..మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు(Puli Srinivasulu) ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు. మేయర్ నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా సమావేశం నిర్వహించాల్సిందే. ఈనెల 4వ తేదీన జరిగిన సమావేశంలో విజయవాడ వరదల సహాయం కింద ఖర్చుపెట్టి అంశం మీద ప్రశ్న లేవనెత్తాం. ఆ సమావేశం నుంచి ఆయన అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అప్పటి నుంచి కమిషనర్ సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నారు. నగర వరద బాధితుల సహాయం పేరుతో కార్పొరేషన్ సొమ్మును9 కోట్ల 24 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఎంతెంత సాయం చేశారన్నదానిపై మంత్రులు, ఎమ్మెల్యేలకే క్లారిటీ లేకుండా పోయింది. మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసరావు 9 కోట్ల 24 లక్షలు దోచేశారు. పైగా ఖర్చులకు సంబంధించిన తప్పుడు నివేదిక అందించారు. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు ఖాతాలో కోటి రూపాయలు జమ చేశారు. కనీసం ఎవరెవరికి ఎంత చెల్లించారో కూడా కమిషనర్ చెప్పటం లేదు. ప్రజల సొమ్మును దోచేసిన కమిషనర్ పై వెంటనే విచారణ చేయాలని ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి లేఖలు రాస్తా. మున్సిపల్ కమిషనర్(Municipal Commissioner) కు ఓపిక, సహనం ఉండాలి. నేనొక ఐఏఎస్‌ని.. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే కుదరదు. ప్రజలకు ఆయన జవాబుదారిగా వ్యవహరించాలి. పది రోజుల క్రితం కౌన్సిల్ జరుగుతుండగా మధ్యలో అర్ధాంతరంగా కమీషనర్ పులి శ్రీనివాస్ వెళ్లిపోవడం మంచి పద్ధతి కాదు. పులి శ్రీనివాస్ కేవలం మేయర్‌ను, కార్పొరేటర్లను మాత్రమే కాదు.. 11 లక్షల మంది జనాల్ని అవమానించారు. ఆయన మేయర్, డిప్యూటీ మేయర్ ఉన్న సిబ్బందిని కూడా ఏకపక్షంగా తొలగించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు.ఇవాళ కౌన్సిల్ సమావేశం నిర్వహించమని ఎనిమిదో తారీకు కమిషనర్ పులి శ్రీనివాసులుకు లెటర్ రాశాను. అయినా ఆయన రాలేదు. ఎక్కడ తాను చేసిన అవినీతి చెప్పాల్సి వస్తుందోనని కమిషనర్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల పేరుతో సమావేశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ప్రజల సొమ్మును దోచేసిన కమిషనర్ సమాధానం చెప్పకుండా తప్పించుకోలేరు.. అని మేయర్ కావట్టి మనోహర్ నాయుడు అన్నారాయన. -
వీఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చ రచ్చ.. వరద సాయంపై మాటల యుద్ధం
సాక్షి, విజయవాడ: వీఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చ రచ్చగా మారింది. టీడీపీ, వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం సాగింది. వరద సాయం అందలేదని కౌన్సిల్ దృష్టికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తీసుకొచ్చారు. దీంతో టీడీపీ కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు. వరద నష్టంపై ప్రశ్నించిన వైఎస్సార్సీపీ మహిళా కార్పొరేటర్ జమల పూర్ణమ్మపై టీడీపీ కార్పొరేటర్ ముమ్మినేని వెంకట ప్రసాద్ నోరుపారేసుకున్నారు.ముమ్మినేని వెంకట ప్రసాద్‌పై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. కౌన్సిల్ నుంచి టీడీపీ కార్పొరేటర్‌ను సస్పెండ్ చేయాలని వైఎస్సార్సీపీ పట్టుబట్టింది. దీంతో ముమ్మినేని వెంకట ప్రసాద్‌ను మేయర్ రాయన భాగ్యలక్ష్మి కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినా బయటికి వెళ్లకుండా మేయర్‌తో టీడీపీ కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు.టీడీపీ కార్పొరేటర్‌ను బయటికి పంపించాలని మార్షల్స్‌ను మేయర్ ఆదేశించగా, మార్షల్స్‌పై కేసులు పెడతామంటూ టీడీపీ కార్పొరేటర్లు బెదిరించారు. టీడీపీ వార్నింగ్‌లతో మార్షల్స్ వెనక్కితగ్గారు. టీడీపీ కార్పొరేటర్ల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కౌన్సిల్‌ను కొద్దిసేపు వాయిదా వేసిన మేయర్.. క్షమాపణ చెబితేనే భోజన విరామం తర్వాత సభలోకి అనుమతిస్తామని టీడీపీ కార్పొరేటర్లను హెచ్చరించారు. -
కూటమి సర్కారువన్నీ బూటకపు హామీలే : త్రిమూర్తులు
-
చంద్రబాబుకి అంత టైమిస్తారా?.. నీతి ఆయోగ్ మీటింగ్ నుంచి మమతా బెనర్జీ వాకౌట్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఉన్నపళంగా బయటకు వచ్చి.. వాకౌట్ చేస్తున్నట్లు మీడియాకు చెబుతూ వెళ్లిపోయారామె.‘‘విపక్షాల నుంచి హాజరైంది నేను మాత్రమే. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడనిచ్చారు. మాట్లాడే టైంలో నా మైక్‌ను కట్ చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు 20 నిమిషాల పాటు మాట్లాడారు. బీజేపీ రాష్ట్రాలకు చాలా టైం ఇచ్చారు. ఇది ప్రాంతీయ పార్టీలను అవమానించడమే. ఇదేం నీతి?. అందుకే నిరసనగా బయటకు వచ్చేశా’’ అని అన్నారామె. అలాగే.. బడ్జెట్లో కేంద్రం వివక్ష చూపిందని, బడ్జెట్ రాజకీయంగా ఉందని అభిప్రాయపడ్డారామె. ‘‘బడ్జెట్ విషయంలో బెంగాల్‌నూ అవమానించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదు. ఈసారి బడ్జెట్ పూర్తి రాజకీయంగా ఉంది’’ అంటూ ఆమె కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక.. నీతి ఆయోగ్‌ను రద్దు చేసి స్థానంలో ప్రణాళిక సంఘాన్ని పునరుద్ధరించాలని పేర్కొంటూ ఆమె డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మీటింగ్ హాజరై ఆమె కేంద్రాన్ని నిలదీస్తానని ఆమె ప్రకటించారు కూడా.ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ప్రధాని నేతృత్వంలో నీతి ఆయోగ్ భేటీ జరుగుతోంది. ‘వికసిత్ భారత్ - 2047’ ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరుగుతోంది. దీనికి కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అయితే.. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం వివక్ష ప్రదర్శించిందని ఆరోపిస్తూ ఇండియా కూటమి తరఫున ముఖ్యమంత్రులు(ఆరుగురు) మాత్రం ఈ భేటీని బహిష్కరించారు. NDA 3.0: Mic Bandh Sarkar!Despite being the sole Opposition voice, Smt. @MamataOfficial was not allowed to raise her concerns at today's Niti Aayog meeting in Delhi. This is yet another example of how the Jomidars of Delhi want to silence Bengal — at every step. As if… pic.twitter.com/bN9PwItEre— All India Trinamool Congress (@AITCofficial) July 27, 2024 -
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస
-
మరికాసేపట్లో జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం
-
నేడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు
-
ప్రభుత్వ ఉద్యోగుల 341 డిమాండ్లు పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారు 461 డిమాండ్లలో 341 డిమాండ్లను పరిష్కరించామని, మిగతా వాటిని కూడా సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.కేఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది. సీఎస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎస్ వివరించారు. ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన డిమాండ్లను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. శాఖల స్థాయిలో ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి, చాలా వరకు పరిష్కరించినట్లు చెప్పారు. ఆరేడు నెలలుగా ఉద్యోగ సంఘాలతో తరచూ మంత్రివర్గ ఉప సంఘం, అధికారులు సమావేశమై చర్చిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత వరకు అన్ని డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబీకులకు కారుణ్య విధానంలో త్వరలోనే 1042 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఉద్యోగుల వేతన సవరణకు మాజీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో 12వ పీఆర్సీని కూడా నియమించినట్లు చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంపై త్వరలో స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. వివిధ శాఖల్లో ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ఆ శాఖల ఉన్నతాధికారులు వివరించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.ప్రవీణ్ కుమార్, అజయ్ జైన్, బి.రాజశేఖర్, ఎం.టి. కృష్ణబాబు, గోపాలకృష్ణ ద్వివేది, ముఖ్య కార్యదర్శులు చిరంజీవి చౌదరి, జయలక్ష్మి, శశిభూషణ్ కుమార్, ప్రవీణ్ ప్రకాశ్, శ్యామల రావు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల నుండి రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రెవెన్యూ సర్వీసెస్ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎస్టీయూ, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఏపీ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు సాయి శ్రీనివాస్, ఎం.కృష్ణయ్య, ఎన్.వెంకటేశ్వర్లు, జి.హృదయరాజు, సీహెచ్ శ్రావణ్ కుమార్, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసరావు, ఏపీజీఈఏ జనరల్ సెక్రటరీ జె.ఆస్కార్ రావు, ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ల అధ్యక్షులు సి.గోపాలకృష్ణ, ఎస్.మల్లేశ్వరరావు, వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం అధ్యక్షుడు వేణుమాధవరావు, ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినేట్ సంఘం అధ్యక్షుడు రజనీష్ బాబు, జూనియర్ వెటర్నరీ అధికారులు, వెటర్నరీ లైవ్‌స్టాక్ అధికారులు సంఘం అధ్యక్షుడు సేవా నాయక్ తదితరులు పాల్గొన్నారు. వేగంగా సమస్యల పరిష్కారం హర్షణీయం: బండి శ్రీనివాసరావు 40 ఏళ్ల చరిత్రలో తొలిసారి చాలా గొప్ప జాయింట్ కౌన్సిల్ సమావేశం జరిగింది. వేగంగా సమస్యల పరిష్కారం హర్షణీయం. 40 రోజుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్నారు. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్స్‌లో 16 శాతం హెచ్ఆర్ఏ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాం. పెన్షనర్ల డిమాండ్లు పరిష్కరించాలని కోరాం. పోలీసులు, ఉద్యోగులకు సరెండర్ లీవుల బకాయిలు రూ. 800 కోట్లు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో క్లియర్ చేస్తామన్నారు. యూరోపియన్ ఏఎన్ఎంలను రెగ్యులరైజేషన్, ఎంపీడీవోల ప్రమోషన్లలో మినిస్టీరియల్ సిబ్బందికి 34 శాతం కోటాపై సానుకూలంగా స్పందించారు. 2004 కు ముందు ఉద్యోగంలో చేరిన వారికి ఓపీఎస్ అమలు చేయమని కోరాం. మన్మోహన్ సింగ్ ను పీఆర్సీ కమిషన్ చైర్మన్‌గా నియమించడం హర్షణీయం. ఓపీఎస్ టు జీపీఎస్ గతంలోకంటే బాగుంది: వెంకట్రామిరెడ్డి కాంట్రాక్టు ఉద్యోగులందరి క్రమబద్ధీకరణకు ఒకే జీవో ఇస్తామన్నారు. వారు పనిచేసే చోట రెగ్యులర్ చేసేంత వరకు నోటిఫికేషన్లు ఇవ్వొద్దని కోరాం. ఓపీఎస్ టు జీపీఎస్ గతంలోకంటే బాగుంది. జీపీఎస్ ఉత్తర్వులు ఇచ్చే ముందు ఉద్యోగ సంఘాలతో చర్చించాలని కోరాం. అందుకు సీఎస్ అంగీకరించారు. జగనన్న లే అవుట్లలో ఇచ్చిన స్థలం కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో ఉద్యోగులకు వంద ఎకరాలు ఇళ్ల స్థలాలకు కేటాయించాలని కోరాం. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్‌కు ప్రభుత్వ పథకాలు ఇవ్వాలని, జీతాలు పెంచాలని కోరగా సీఎస్ అంగీకరించారు. గ్రీవెన్స్ డే నిర్వహించడం సంతోషం: బొప్పరాజు వెంకటేశ్వర్లు ఇకపై నాలుగు నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మొదటిసారిగా గ్రీవెన్స్ డే నిర్వహించడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం హర్షణీయం. 2014 జూన్ 2 నాటికి ఉద్యోగంలో చేరిన కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలి. జీతాలు, పింఛన్లు 1వ తేదీన చెల్లించాలని కోరాం. ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఇవ్వడం సంతోషం. ఆర్టీసీ ఉద్యోగుల అలవెన్సులు కూడా జీతాలతో కలిపి ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను బలోపేతం చేయాలని, తక్షణమే ట్రస్ట్ అకౌంట్లో డబ్బులు జమ చేయాలని కోరాం. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ
-
పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస
-
ప్రధాని మోదీతో లంచ్ లో పాల్గొన్న సీఎం జగన్
-
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరించిన సీఎం జగన్
-
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం
-
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న సీఎం జగన్
-
విభజన తర్వాత ఏపీ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రమైంది: సీఎం జగన్
సాక్షి, ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. ప్రత్యామ్నాయ పంటల సాగు, నూనె, పప్పు పంటల సాగులో స్వయం సమృద్ధి, జాతీయ విద్యా విధానం అమలు, పట్టణాభివృద్ధి, వివిధ రంగాల్లో ఆత్మ నిర్భర్ సాధించేందుకు కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం అయ్యిందన్నారు. 62శాతం మంది జనాభా కేవలం వ్యవసాయ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారని, జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35శాతం పైమాటేనని, వ్యవసాయరంగం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని తాము ఆ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. వ్యవసాయరంగంలో ఉన్న రిస్క్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్, ఉచిత పంటలబీమా పథకం, సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు, 9 గంటలపాటు ఉచితంగా కరెంటు తదితర పథకాలు, కార్యక్రమాలను రైతులను ఆదుకునేందుకు అమలు చేస్తున్నాం. రైతులకు మరింత అండగా నిలవడానికి వారికి భరోసానిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యవసాయ అవసరాలకు ఒన్ స్టాప్ సొల్యూషన్ కింద ఈ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. నాణ్యమైన, ధృవీకరించిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాలద్వారా అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకూ ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలుస్తున్నాం. డిజిటిల్ టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ సీఎంయాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చాం. మొత్తం పంటల కొనుగోలు ప్రక్రియను రోజువారీగా ఆర్బీకేల స్థాయిలో ఈ యాప్‌ద్వారా నిరంతరం పరిశీలన, పర్యవేక్షణ చేస్తున్నాం. అవసరమైన పక్షంలో ప్రభుత్వం తరఫున పంటల కొనుగోళ్లు చేస్తూ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ వారికి అండగా నిలుస్తున్నాం. దీంతోపాటు ఆర్బీకే స్థాయిలోనే ఇ– క్రాప్ బుకింగ్ కూడా చేస్తున్నాం. ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వడ్డీలేని పంట రుణాలు, పంటల కొనుగోలు తదితర వాటిని సమర్థవంతగా అమలు చేయడానికి ఇ–క్రాప్ బుకింగ్ దోహదపడుతోంది. ఆర్బీకేల్లో కియోస్క్‌లను కూడా అందుబాటులో పెట్టాం. రైతులకు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తదితర వాటిని కియోస్క్‌ల ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయవచ్చు. వారి చెంతకే అవన్నీ కూడా చేరవేస్తున్నాం. పంటలకు సంబంధించి రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి, సూచనలు చేయడానికి శాస్త్రవేత్తలతో ఇంటిగ్రేటెడ్ కాల్‌సెంటర్‌నుకూడా ఏర్పాటు చేశాం. అంతేకాకుండా ఆర్బీకేల స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లాల స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లనుకూడా ప్రారంభిస్తున్నాం. పంటల మార్పిడి, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం, క్రమంగా సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులవైపుగా రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఇక విద్యా రంగం విషయానికొస్తే బడికెళ్లడం, చదువుకోవడం అన్నది చిన్నారుల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీన్ని సుస్థిర ప్రగతి లక్ష్యాలతో అనుసంధానం చేశాం. స్కూళ్లుమానేసే విద్యార్థుల శాతాన్ని పూర్తిగా నివారించడంతోపాటు జీఈఆర్ నిష్పత్తిని పెంచేందుకు అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రాథమిక విద్యలో దేశ జీఈఆర్ నిష్పత్తి 99.21 శాతంకాగా, ఏపీలో ఇది 84.48 కావడం విచారకరం. 2018లో కేంద్ర విద్యాశాఖ విడుదలచేసిన గణాంకాల్లో విద్యారంగంలో రాష్ట్రం పనితీరు అత్యంత దారుణంగా ఉందని వెల్లడైంది. అందుకే విద్యారంగంలో కీలక అంశాలపై దృష్టిపెడుతూ సమర్థవంతమైన విధానాలను తీసుకు వచ్చాం. తల్లిదండ్రుల పేదరికం అన్నది పిల్లల చదువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమ్మ ఒడి అనే పథకాన్ని అమలు చేస్తోంది. పిల్లలను బడికి పంపిస్తే చాలు, ఏటా రూ.15వేల రూపాయల చొప్పున పిల్లల తల్లులకు అందిస్తోంది. 75శాతం హాజరు ఉండాలనే నిబంధనను కూడా పరిగణలోకి తీసుకున్నాం. అంతేకాదు పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు తీసుకు వచ్చాం. విద్యాకానుక ద్వారా స్కూలు బ్యాగులు, బై లింగువల్ టెక్ట్స్‌బుక్స్, నోట్ పుస్తకాలు, షూ, 3 జతల యూనిఫారం, ఇంగ్లిషు టు తెలుగు డిక్షనరీలు ఇస్తున్నాం. పిల్లలకు మరింత నాణ్యతతో బోధన అందించడానికి నాణ్యమైన పాఠ్యాంశాలతో ఉన్న బైజూస్ యాప్‌కూడా అందిస్తున్నాం. 8 వ తరగతి విదార్థులకు ట్యాబ్ కూడా ఇవ్వబోతున్నాం. పిల్లలు మంచి వాతావరణంలో విజ్ఞానాన్ని సముపార్జించడానికి మన బడి నాడు – నేడు కింద 55,555 స్కూళ్లలో రూ.17,900 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. నీటి సదుపాయం ఉన్న టాయిలెట్లు, పరిశుభ్రమైన తాగునీరు, పెయింటింగ్, విద్యుద్దీకరణ, ఫ్యాన్లు, ట్యూబులైట్లు, పిల్లలకు, టీచర్లకు ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, ఇంగ్లిషు ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదులు, డిజిటల్ క్లాస్‌రూమ్స్, కావాల్సిన మరమ్మతులు అన్నీ చేపడుతున్నాం. మొత్తం మూడు విడతల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తాం. మొదటి విడత కింద ఇప్పటికే 15,715 స్కూళ్లను తీర్చిదిద్దాం. ఇందులో డిజిటల్ తరగతుల ఏర్పాటు కూడా పూర్తిచేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిషు భాషకున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పిల్లలకు చక్కటి పునాది వేసే కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ప్రపంచస్థాయి పోటీని ఎదుర్కొనేలా పిల్లలను తీర్చిదిద్దడానికి అన్ని స్కూళ్లను మ్యాపింగ్ చేసి సబ్జెక్టు వారీగా టీచర్లను 3వ తరగతి నుంచే అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఉన్నత విద్యా స్థాయిలో కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. కేవలం విద్య ద్వారానే పేదిరికం నుంచి బయటపడతారని గట్టిగా విశ్వసిస్తూ విద్యాదీవెన పథకం ద్వారా 100శాతం ఫీజు రియింబర్స్‌మెంట్ అమలు చేస్తున్నాం. గత మూడేళ్లలో 21.56 లక్షల మంది విద్యార్థులు దీనిద్వారా లబ్ధిపొందారు. విద్యార్థులు భోజనం, హాస్టల్ ఖర్చుకోసం వసతి దీవెన అమలు చేస్తున్నాం. ఇక అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో సంప్రదాయ కోర్సులను ఉద్యోగాలు కల్పించేలా తీర్చిదద్దాం. నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నాం. 1.6 లక్షలమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ముందుకు వచ్చింది. కోవిడ్ కారణంగా తలెత్తిన ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. 2018–19లో క్యాంపస్‌ల ద్వారా 37వేలమందికి ఉద్యోగాలు వస్తే, 2020–21లో 69వేలు వచ్చాయి. పౌరుల గడపవద్దకే సేవలందించే విధానాన్ని అమలు చేస్తూ.. చివరి వరకూ అత్యంత పారదర్శకంగా సేవలను అందిస్తున్నాం. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఇప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ప్రతి 50–100 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను కూడా నియమించాం. దీనివల్ల ఉపాధి కల్పించడమేకాదు, అవినీతి లేకుండా, పారదర్శకంగా సేవలను ప్రజలకు అందిస్తున్నాం. మరింత సమర్థవంతంగా లక్ష్యాలు సాధించడానికి అధికార వికేంద్రీకరణ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టాం. వివక్షకు, అవినీతికి తావులేకుండా అర్హులైన వారి అందరికీ అన్ని అందాలన్నదే లక్ష్యం. దీనికి సంబంధించి ఒక నోట్‌ను కూడా సమర్పించిన సీఎం జగన్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఏపీ వైపు ఐటీ దిగ్గజాల చూపు.. -
ఢిల్లీ చేరుకున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం ఉదయం 09.30 గంటలకు ఆయన రాష్ట్రపతి భవన్ చేరుకొని సాయంత్రం 4.30 గంటల వరకు జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి 7వ సమావేశంలో పాల్గొననున్నారు. ఢిల్లీ చేరుకున్న సీఎంకు ఎయిర్‌పోర్టులో వైఎస్సార్సీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన అధికార నివాసం 1, జనపథ్‌కు చేరుకుని, అక్కడే బస చేశారు. ఇది కూడా చదవండి: 11న బాపట్లకు సీఎం వైఎస్ జగన్ -
వినతి కోసం మహిళ యత్నం.. కాన్వాయ్ ఆపిన సీఎం జగన్
-
GVMC: టీడీపీ కార్పొరేటర్ల గందరగోళం
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థ రెండో పాలక వర్గ సమావేశంలో బుధవారం గందరగోళం చోటు చేసుకుంది. నగర మేయర్ హరి వెంకటకుమారి అధ్యక్షతన కోవిడ్ నిబంధనల నడుమ ఉదయం కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. 125 ప్రధాన అంశాలు, మరో 11 సప్లిమెంటరీ అంశాలతో కలిపి మొత్తం 136 చర్చనీయాంశాలతో కూడిన భారీ అజెండాను అధికారులు రూపొందించారు. ఈ క్రమంలో నగరాభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించకుండా టీడీపీ కార్పొరేటర్లు అడ్టుకొని సమావేశంలో గందరగోళం సృష్టించారు. టీడీపీ కార్పొరేటర్ల తీరుపై వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చదవండి: కులాలకు కేసులకు సంబంధమేంటి? -
హోదా వద్దన్న చరిత్ర టీడీపీది: గుడివాడ అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా జీవీఎంసీ కౌన్సిల్లో మేయర్ హరి వెంకటకుమారి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీనిపై జీవీఎంసీ కౌన్సిల్లో చర్చ జరిగింది. టీడీపీ మాదిరిగా మాది ద్వంద్వ విధానం కాదు.. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్సార్సీపీ వ్యతిరేకమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారని ఆయన తెలిపారు. టీడీపీ మాదిరిగా మాది ద్వంద్వ విధానం కాదన్నారు. ఢిల్లీలో హోదా వద్దన్న చరిత్ర టీడీపీదని ఆయన మండిపడ్డారు. ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుపడటంతో.. చంద్రబాబు పేరు ఎత్తగానే ఎందుకు ఉలిక్కిపడుతున్నారంటూ గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. చదవండి: ‘టీడీపీ త్వరలో తెరమరుగయ్యే పార్టీ’ ‘కూన’ గణం.. క్రూర గుణం -
టీటీడీ ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్: వైవీ సుబ్బారెడ్డి
-
రూ.2937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు కరోనా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీనిపై ఇవాళ లేదా రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఎంపిక చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లో మార్చి 1 నుంచి వ్యాక్సినేషన్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తిరుమలలో శనివారం టీటీడీ పాలక మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రథ సప్తమి రోజు లక్ష మంది భక్తులకు వాహన సేవలు వీక్షించే భాగ్యం కల్పించామని పేర్కొన్నారు. 2021-22 సంవత్సరానికి రూ.2937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌ను ఆమోదించారు. ఏప్రిల్ 14న ఉగాది నాటి నుంచి భక్తులను శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు అదే విధంగా దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ కళ్యాణ మండపాలల్లో వివాహాలు, దైవ కార్యాలకే వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. టీటీడీ వేదపాఠశాలల పేర్లను ఎస్వీ వేద విజ్ఞాన పీఠంగా పేర్లు మార్చాలని నిర్ణయించారు. తిరుపతిలోని బర్డ్‌లో చిన్న పిల్లల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి రూ.9 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నెయ్యి ధరలు పెరుగుతుండటంతో నిల్వ సామర్థ్యం పెంచాలని సూచించారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ పవర్ వినియోగించాలని పేర్కొన్నారు. తిరుమలలోని రెస్ట్ హౌస్‌లు, సత్రాలు, కాటేజీల్లో విద్యుత్ వృథాను నియంత్రించడానికి ఎనర్జీ మీటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అయోధ్యలో టీటీడీ నిర్మాణాలు చేపట్టి సేవా కార్యాక్రమాలు నిర్వహించడానికి అక్కడి ప్రభుత్వాన్ని భూమి కేటాయించాలని కోరినట్లు పేర్కొన్నారు. కాగా శ్రీవారి మెట్టు మార్గంలో అన్నదానం చేయాలని బోర్డు నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలని బోర్డులో తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామన్నారు. తిరుచానూరు ఆలయ తులాభారం ఏర్పాటుకు నిర్ణయించినట్లు వెల్లడించారు. శ్రీనివాస మంగాపురంలో అన్నప్రసాద కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముంబై, జమ్మూలో శ్రీవారి ఆలయాల నిర్మాణం ప్రారంభిస్తామని అన్నారు. గోవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలని టీటీడీ పాలకమండలి తీర్మానించగా.. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది. చదవండి: ఆలయాల్లోని విగ్రహాలపై దాడులు దురదృష్టకరం పొగమంచు.. గంట నుంచి గాల్లోనే విమానం చక్కర్లు -
ఐపీఎల్ అజెండాగా...
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌లో గత వారమే క్రికెట్ మొదలైంది. ఇక భారత్‌లో ఆటల గంట మోగాల్సివుంది. అందరి కళ్లు ఐపీఎల్ మీదే ఉన్నాయి. కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడిన ఈ ఈవెంట్‌పైనే గత కొన్నాళ్లుగా తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఆసీస్‌లో టి20 ప్రపంచకప్‌కు అవకాశం లేకపోవడంతో ప్రధానంగా ఐపీఎలే అందరి నోటా నానుతోంది. ఇక ఈ నాన్చుడు ధోరణికి ఫుల్స్టాప్ పెట్టాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా నిర్ణయించుకున్నట్లుంది. అందుకే శుక్రవారం జరిగే బోర్డు ఉన్నతస్థాయి సమావేశంలో ఐపీఎల్ అజెండాగా మారింది. ఎక్కడివారక్కడినుంచే పాల్గొనే ఈ ‘వర్చువల్ మీటింగ్’లో మొత్తం 11 అంశాలపై బోర్డు చర్చించనుంది. లీగ్‌తో వేలకోట్ల ఆర్థికాంశాలు ముడిపడి ఉన్నాయి. అందుకే ప్రధానంగా ఐపీఎల్‌పైనే చర్చిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మహమ్మారి బారిన పడి మూలన పడిపోయిన దేశవాళీ క్రికెట్, భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ) తదితర అంశాలపై కూడా చర్చిస్తారని బోర్డు వర్గాలు తెలిపాయి. భారత్ ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్ (2021)కు పన్ను మినహాయింపు, బెంగళూరులోని ఎన్సీఏలో సౌకర్యాల పెంపు, డిజిటల్ కాంట్రాక్టుల పొడిగింపు, బీహార్ సంఘం వ్యవహారం, బీసీసీఐలో సిబ్బంది నియామకం, కొత్త సీఈఓ నియామకం, ఈశాన్య క్రికెట్ సంఘాలకు చెల్లింపులు, భారత జట్ల దుస్తుల టెండర్లపై ఈ ఉన్నత స్థాయి సమావేశంలో చర్చిస్తారు. ఇటీవల బోర్డు అధ్యక్షుడు గంగూలీ మాట్లాడుతూ ఐపీఎల్‌ను భారత్‌లోనే నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని, విధిలేని పరిస్థితుల్లోనే శ్రీలంక, యూఏఈ వేదికల్ని పరిశీలిస్తామన్నారు. అయితే బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మీటింగ్‌లో ఏకంగా వేదికనే ఖరారు చేస్తామని భావించడం లేదు. అందుబాటులో ఉన్న అవకాశాలు, నిర్వహణకు సానుకూలతల్ని బేరీజు వేస్తామనే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఐసీసీ... టి20 ప్రపంచకప్‌పై తుది నిర్ణయం ప్రకటించలేదు. ఇలాంటి స్థితిలో ఏకంగా షెడ్యూలునే ఆశించడం ఆత్యాశే అవుతుంది’ అని అన్నారు. వచ్చే సోమవారం జరిగే ఐసీసీ బోర్డు మీటింగ్‌లో మెగా ఈవెంట్‌పై నిర్ణయం వెలువడే అవకాశముంది. -
16 నుంచి ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలు
-
అజెండా దాచిపెట్టి... ఆమోదింపజేశారు..!
సాక్షి, కృష్ణా : మచిలీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లకు అజెండా అందించడంలో అధికార టీడీపీ నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అజెండాలోని అంశాలను ముందుగా తెలియనివ్వడంలేదని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అజెండా ఇవ్వకుండా చివరివరకు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. దీంతో టీడీపీ, వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మున్సిసల్ చైర్మన్ బాబా ప్రసాద్ అజెండాలోని అంశాలపై ఎలాంటి చర్చ జరపకుండానే ఆమోదం తెలిపారు. -
రెచ్చిపోయిన అధికార పార్టీ వైస్ చైర్మన్
సాక్షి, నంద్యాల: అధికార పార్టీకి చెందిన నంద్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ రెచ్చిపోయారు. సోమవారం జరిగిన మున్సిపల్ సమావేశంలో విజయ్ కుమార్ చాలా దురుసుగా ప్రవర్తించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్ పర్సన్ దేశం సులోచనమ్మపై ఆరోపణలు చేయడమే కాకుండా.. ఆమెను ఏకవచనంతో సంభోదిస్తూ ఇబ్బందికరంగా ప్రవర్తించారు. సమావేశం జరుగుతున్న సమయంలో పదే పదే అడ్డు తగులుతూ గందరగోళం సృష్టించారు. తన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటూ వితండ వాదనకు దిగారు. విజయ్ కుమార్ ప్రవర్తనతో సభ సజావుగా సాగకపోవడంతో సులోచనమ్మ సభను వాయిదా వేశారు. అనంతరం బయటకు వెళ్తున్న సులోచనమ్మపై సమాధానం చెప్పకుండా ఎలా వెళ్తారని విజయ్ కుమార్ గట్టిగా కేకలు వేశారు. అడ్డు చెప్పిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్‌పై ఆయన తన చేతిలో మైకును విసిరివేశారు. -
కాంగ్రెస్‌కు దాసోహమంటారా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కూటమిలో భాగంగా కేవలం మూడు సీట్లకే పరిమితమై పోటీచేయడం పార్టీ బలాన్ని ప్రతిబింబించలేదని సోమవారం సీపీఐ కౌన్సిల్ భేటీలో పలువురు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కూటమిలో చేరడం తప్ప గత్యంతరం లేదన్న విధంగా నాయకత్వం తొందరపాటుగా వ్యవహరించడం వల్ల నష్టం జరిగిందని కొందరు నాయకులు అభిప్రాయపడినట్టు తెలిసింది. పొత్తులో మూడుసీట్లకే పరిమితం కాకుండా పార్టీకి బలమున్న 20–25 సీట్లలో సొంతంగా పోటీచేసి ఉంటే పార్టీ విస్తరణకు అవకాశముండేదని అన్నట్టుగా సమాచారం. రాష్ట్ర పార్టీకి నాయకత్వం వహించే కార్యదర్శి ఎన్నికల బరిలో దిగడం, తాను పోటీచేస్తున్న సీటుకే పరిమితం కావడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్‌తో పొత్తు పార్టీకి నష్టం కలిగించినందున భవిష్యత్‌లో సొంత బలం పెంచుకుని, తదనుగుణంగా సొంతంగా పోటీకి సిద్ధం కావాలనే సూచనలొచ్చాయి. స్థానిక ఎన్నికలతోసహా లోక్‌సభ ఎన్నికల వరకు ఇదే వైఖరితో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఆదివారం మొదట రాష్ట్ర కార్యదర్శివర్గ భేటీలో, ఆ తర్వాత రాత్రి పొద్దుపోయేవరకు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నికల్లో ఓటమి, కేవలం మూడుసీట్లలోనే పోటీ, కాంగ్రెస్‌కు దాసోహమన్నట్టుగా నాయకత్వం వ్యవహరించిన తీరుపై కొందరు నాయకులు తీవ్ర విమర్శలు సంధించారు. దీంతో మనస్తాపం చెందిన చాడ వెంకటరెడ్డి తనపదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే సందర్భంలో చాడతోపాటు కూనంనేని, తదితరులు కూడా రాజీనామాకు సిద్ధపడినట్టు సమాచారం. ఆ తర్వాత మొత్తం కార్యవర్గం రాజీనామాలు వద్దంటూ సర్దిచెప్పింది. ఈ రాజీనామాల అంశాన్ని కార్యవర్గ భేటీకే పరిమితం చేసి, రాష్ట్ర సమితి సమావేశాల్లో ఈ అంశం చర్చకు రాకుండా చూడాలని నిర్ణయించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి కూడా ఓటమికి కుంగిపోవద్దని, పార్టీ నిర్మాణం, సొంతబలం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తీర్మానాలు... స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని సీపీఐ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభా లెక్కల వివరాలు అందించకపోవడంవల్ల, కుంటిసాకులతో 34 శాతమున్న రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించడం బీసీలకు అన్యాయం చేయడమేనని పేర్కొంది. బీసీల హక్కులు అణగదొక్కే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో జారీచేసిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్.బాలమల్లేశ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష భేటీలో చర్చించాలని ప్రభుత్వాన్ని సీపీఐ డిమాండ్ చేసింది. స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి: చాడ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. త్వరలోనే జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలు మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ సహకార ఎన్నికలకు పార్టీని క్షేత్రస్థాయిలో సంసిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీచేసిన స్థానాలతో పాటు మిగతా చోట్ల గెలుపోటములకు కారణాలను అన్వేషిస్తూ సమీక్షలు నిర్వహించాలన్నారు. -
గౌరవమూ లేదు.. విలువా లేదు..
తూర్పుగోదావరి, కాకినాడ: ‘‘కార్పొరేటర్లంటే గౌరవం లేదు. ప్రొటోకాల్ కూడా పాటించడం లేదు. అదేమని అడిగితే సమాధానం కూడా లేదు. ఇలాంటప్పుడు కౌన్సిల్ సమావేశంలో ఉండాల్సిన అవసరం ఏముంది?’’ అంటూ కాకినాడ నగరపాలక సంస్థ అధికారుల తీరుపై కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కమిషనర్, అదనపు కమిషనర్ల తీరును నిరసిస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేయడంతో కోరం లేని కారణంగా కౌన్సిల్‌ను వాయిదా వేస్తున్నట్టు మేయర్ సుంకర పావని ప్రకటించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం మేయర్ సుంకర పావని అధ్యక్షతన శుక్రవారం ప్రారంభమైంది. అజెండాలోని తొలి అంశంపై చర్చ సందర్భంగానే అధికారుల తీరుపై సభ్యులు విరుచుకుపడ్డారు. ప్లాస్టిక్ నిషేధం విషయంలో అధికారులు జీవోలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి మండిపడ్డారు. 50 మైక్రాన్ల మందం కలిగిన ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై జీవోకు విరుద్ధంగా అధికారులు తీసుకున్న నిర్ణయం చిన్న వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించేదిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ప్లాస్టిక్‌ను అప్పటికప్పుడు నిషేధించాలన్న నిర్ణయంకన్నా దశలవారీగా అవగాహన కల్పించి అమలు చేయాలని మరో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఎంజీకే కిశోర్, టీడీపీ కార్పొరేటర్ మల్లాడి గంగాధర్ హితవు పలికారు. ప్లాస్టిక్ కవర్ల తయారీదార్లను నియంత్రించకుండా హడావుడిగా ఈ నిర్ణయాలు ఏమిటని ప్రశ్నించారు. పైగా ఈ అంశాన్ని కౌన్సిల్ దృష్టికి తీసుకురాకుండా, ముందుగా నిర్ణయం తీసుకుని, ర్యాటిఫికేషన్‌కు ఎలా తీసుకొస్తారని టీడీపీ కార్పొరేటర్లు చోడిపల్లి ప్రసాద్, మల్లాడి గంగాధర్‌తోపాటు, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు కూడా గట్టిగా నిలదీశారు. ఇదే అంశంపై చర్చ జరుగుతుండగా.. ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తూ ర్యాటిఫికేషన్ చేసిన తరువాత ఇంతవరకూ ఎన్ని దాడులు చేశారో, ఎంత ఫీజు వసూలు చేశారో చెప్పాలని కార్పొరేటర్ కంపర రమేష్ వివరణ కోరారు. దీనికి అదనపు కమిషనర్ సత్యవేణి సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో అధికారులు సరైన సమాచారం లేకుండా కౌన్సిల్ సమావేశాలకు ఎలా వస్తున్నారని కార్పొరేటర్లందరూ నిలదీశారు. వివిధ అంశాల్లో తమపట్ల అధికారుల వ్యవహార శైలిని దుమ్మెత్తిపోశారు. గృహనిర్మాణ డీడీల విషయంలో కూడా ఎన్నో అవకతవకలు జరిగాయని, వీటిపై కూడా అధికారులు సరైన వివరణ ఇవ్వడం లేదని రాగిరెడ్డి చంద్రకళాదీప్తి మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో తాము కౌన్సిల్ సమావేశంలో ఉండలేమంటూ వాకౌట్ చేశారు. దీంతో కోరం లేదని పేర్కొంటూ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశాన్ని మేయర్ వాయిదా వేశారు. అప్పుడు కూడా కార్పొరేటర్లు హాజరు కాకపోవడంతో కౌన్సిల్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్టు ప్రకటించారు. -
‘హైదరాబాద్‌లో ఎక్కడి చెత్త అక్కడే’
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( జీహెచ్ఎంసీ) కౌన్సిల్ మీటింగ్ బుధవారం నిర్వహించింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మెహన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. గ్రేటర్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై ఈ మీటింగ్‌లో చర్చించారు. ఈ సందర్భంగా నగరంలోని పలు సమస్యలపై కార్పొరేటర్లు గళమెత్తారు. హైదరాబాద్‌లో ఎక్కడి చెత్త అక్కడే ఉంటోందని, చెత్తతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొన్నిసార్లు నగరంలో లైట్లు కూడా వెలగడం లేదని పేర్కొన్నారు. నాలాల పూడికలు తీయడం లేదని, వర్షం వస్తే హైదరాబాద్ చెరువులను తలపిస్తోందని తెలిపారు. అంతేకాకుండా మృతదేహాల కోసం వాడిన ఐస్‌ను జ్యూస్ సెంటర్లలో వాడుతున్నారని, ఐస్ ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని సభ్యులు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. -
కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సాక్షి, న్యూఢిల్లీ: భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర కార్మికశాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ అధ్యక్షతన జరిగిన కార్మిక మండలి సమావేశంలో నాయిని పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..11 లక్షల మంది కార్మికులు, 312 ప్రభుత్వ సంస్థలు, 10,012 ప్రైవేటు సంస్థలు భవన, ఇతర నిర్మాణ రంగ కార్మిక మండలిలో నమోదు చేసుకున్నాయని తెలిపారు. ప్రభుత్వం కార్మికులకు వివాహ కానుకలు, మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు ప్రకటించిందన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షల ఆర్థిక సాయం, సహజ మరణం చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.60 వేల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో పలు రాష్ట్రాల కార్మిక శాఖ మంత్రులు పాల్గొన్నారు. -
మేయర్‌కు ముచ్చెమటలు పట్టించిన కార్పొరేటర్లు
సాక్షి, నెల్లూరు సిటీ: కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో మేయర్ అజీజ్‌కు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, సీపీఎం, బీజేపీ కార్పొరేటర్లతో పాటు సొంత పార్టీ కార్పొరేటర్లు నిప్పో అంశంపై వ్యతిరేక గళం వినిపిస్తూ ముచ్చెమటలు పట్టించారు. ప్రజాసాధికార సర్వేను ఆధారం చేసుకుని ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయడంతో లబ్ధిదారులు నష్టపోతున్నారని పలువురు సభ్యులు మండిపడ్డారు. తప్పుల తడకగా సర్వేను చేయడం ద్వారా లబ్ధిదారులకు న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లకార్డులతో నిరసన ప్రజా సమస్యలపై అధికార పార్టీకి చెందిన షేక్ వహిద, వైఎస్సార్సీపీ కార్పొరేటర్ వేలూరు సుధారాణి ఫ్లకార్డులతో కౌన్సిల్లో నిరసన తెలిపారు. సుధారాణి మాట్లాడుతూ లస్సీ సెంటర్లో డ్రైనేజీ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. షేక్ వహిద మాట్లాడుతూ ప్రజాసాధికార సర్వే తప్పుల తడకగా చేయడంతో లబ్ధిదారులు ఇళ్లు, పింఛన్లు కోల్పోతున్నారన్నారు. మళ్లీ సర్వే చేయించాలని కోరారు. డీసీపీని బదిలీ చేయండి కార్పొరేషన్ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నా టౌన్‌ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ విప్ బొబ్బల శ్రీనివాసులుయాదవ్ మండిపడ్డారు. తమ డివిజన్లోని అక్రమ భవనాలపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. టీడీపీ కార్పొరేటర్ నూనె మల్లికార్జున్‌యాదవ్ మాట్లాడుతూ డీమార్ట్ మాల్ వద్ద సొంతంగా రోడ్డును వేసుకుంటున్నారని, ఎవరు అనుమతులు ఇచ్చారని డీసీపీ సూరజ్‌ను ప్రశ్నించారు. డీసీపీ సమాధానం చెప్పలేకపోవడంతో బదిలీ చేయాలని కోరారు. ఇళ్ల మంజూరులో స్పష్టత లేదు హౌస్ ఫర్ ఆల్ పథకం ఇళ్ల మంజూరులో స్పష్టత లేదని వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్‌యాదవ్ పేర్కొన్నారు. 4800 ఇళ్లకు గానూ, 2050 ఇళ్లను మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. మిగిలినవి ఎందుకు తిరస్కరించారో స్పష్టత లేకుండా ఉందన్నారు. నగదు చెల్లించినా తిరస్కరించిన విషయం ఆలస్యంగా అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు నష్టపోయారని తెలిపారు. టీడీపీ కార్పొరేటర్ మామిడాల మధు మాట్లాడుతూ పాలకుల వైఫల్యాలతో ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. 40శాతం ఇంటి దరఖాస్తులు తిరస్కరణ 40శాతం ఇంటి దరఖాస్తులు తిరస్కరణకు గురైంది వాస్తవమే. సాధికార సర్వేలోని కొన్ని అంశాలను ఆధారంగా చేసుకుని ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. సర్వే తప్పుల తడకగా చేసినట్లుగా ఫిర్యాదులు వస్తున్నందున మళ్లీ పూర్తిస్థాయిలో చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – అలీంబాషా, కమిషనర్ -
నిధుల దుర్వినియోగంపై నిగ్గుతేల్చాలి
వైఎస్సార్ సీపీ సభ్యుల డిమాండ్ వాడీవేడీగా రాజమహేంద్రవరం కౌన్సిల్ సమావేశం అధికార–ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం వైఎస్సార్ సీపీ సభ్యులకు అడుగడుగున అడ్డంకులు ప్రజాధనం లూఠీపై షర్మిలారెడ్డి ఆగ్రహం రాజమహేంద్రవరం సిటీ/కోటగుమ్మం : నగర పాలక సంస్థలో నిధుల దుర్వినియోగం వ్యవహారంపై నిగ్గుతేల్చాలని వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నగర మేయర్ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన పాలక మండలి సమావేశం ఆద్యంతం వాడీవేడిగా సాగింది. కేవలం ఐదుగురు వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు సమస్యలను, నగరంలో చోటు చేసుకున్న అవకతవకలను ప్రస్తావిస్తూ... భారీ సంఖ్యలో ఉన్న అధికార పార్టీ సభ్యులకు ముచ్చెమటలు పట్టించారు. అధికార పార్టీ వారు చేసే వాదానికి ప్రతివాదం చేస్తూ మీకు మేమేమీ తీసిపోమంటూ వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి, కార్పొరేటర్ బొంత శ్రీహరి ధ్వజమెత్తారు. షర్మిలారెడ్డి మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న హోర్డింగ్‌ల సంఖ్యకు నగర పాలక సంస్థ అధికారులు ఇస్తున్న లెక్కలకు పొంతన లేకుండా పోతోందని ధ్వజమెత్తారు. నగరంలో ఆర్కే యాడ్ ఏజెన్సీకి చెందిన హోర్డింగ్‌ల సంఖ్యకు చెల్లిస్తున్న ట్యాక్స్‌కు సంబంధం లేకుండా ఉందన్నారు. దీనివల్ల ప్రజాధనం లూఠీ అయిపోతోందని, తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిర్భాగ్యుల కోసం ఏర్పాటు చేసిన నైట్ షల్టర్ ద్వారా జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కల్పించుకుని సమాధానం చెప్పే ప్రయత్నం చేయడంలో షర్మిలారెడ్డి– అప్పారావుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీనిపై సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ నిధుల దుర్వినియోగంపై వివరణ ఇవ్వాలంటూ కమిషనర్‌ను కోరారు. గతంలో ఎందుకు సస్పెండ్ చేశారు? తమను గతంలో ఏ కారణంతో సస్పెండ్ చేశారో వివరణ ఇవ్వాలంటూ వైఎస్సార్ సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. పెరిగిన నగర విస్తీర్ణంతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టేడియం నిర్మాణం ఎక్కడ చేపట్టాలన్న విషయాన్ని మాస్టర్‌ప్లాన్‌లో ప్రస్తావించకపోవడాన్ని తప్పుబట్టారు. నగరపాలక సంస్థకు సంబంధించిన కోర్టు వ్యవహారాలు పరిష్కరించేందుకు ఎంత మంది న్యాయవాదులు ఉన్నార ని ప్రశ్నించారు. న్యాయవాదులు లేకపోవడం వల్లే న్యాయస్థానాల్లో కేసులు మగ్గిపోతున్నాయన్నారు. మాస్టర్‌ప్లాన్ వ్యవహారంలో అందరితో చర్చించిన తరువాతే తీర్మానం ఆమోదించాలని సూచించారు. 16వ డివిజన్లో ఉన్న కబేళాను ఎక్కడికి తరలిస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యుల సమస్యలు వివరించే సమయంలో అధికార పార్టీ సభ్యులు అడ్డుతగిలారు. మున్సిపల్ చట్టం అమలులో వ్యత్యాసమెందుకు? వారానికోసారి నిర్వహించాల్సిన స్టాండింగ్ కమిటీ సమావేశం ఎందుకు నిర్వహించడం లేదంటూ కార్పొరేటర్ బొంత శ్రీహరి ప్రశ్నించారు. మున్సిపల్ చట్టం అమల్లో హైదరాబాద్‌కు రాజమహేంద్రవరం మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోందన్నారు. స్థానిక సమస్యలు తప్ప చట్టాల గురించి మాట్లాడేందుకు వీలు లేదంటూ అధికార పార్టీ సభ్యులు అడ్డు తగలడంతో కొద్ది సేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మేయర్ కల్పించుకుని డివిజన్లో సమస్యలు చెప్పాలని, మిగిలిన విషయాలు అజెండా తరువాత చర్చిద్దామని చెప్పడంతో వాగ్వాదం సద్దుమణిగింది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ రావాల్సిన పుష్కర నిధుల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. కనీసం రూ.50 కోట్లైనా మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. మహానగరం తీర్మానం వాయిదా భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని 20 ఏళ్ల ముందుగా నగరాన్ని వివిధ కోణాల్లో అభివృద్ధి చేసేందుకు రూపొందించిన మహానగరం మాస్టర్ ప్లాన్‌పై చర్చ వాయిదా పడింది. కార్పొరేటర్లకు, నగర ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగిన తరువాతే తీర్మానంపై ఆమోదిద్దామంటూ సభ్యులు సూచించారు. దీంతో మాస్టర్ ప్లాన్ వ్యవహారంపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు ఈ నెల 21కి వాయిదా వేశారు. అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుకుందాం మాస్టర్ ప్లాన్‌ను సమగ్రంగా చర్చించి ఆమోదింప చేసుకుని దేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుకుందామని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. విలీనమవుతున్న గ్రామ పంచాయతీల అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు వచ్చేందుకు కృషి చేయాలన్నారు. వాదాలు చేసుకోకుండా విజన్‌తో ముందుకు వెళ్లాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా... కౌన్సిల్ సమావేశంలోకి నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు యూనిఫాం ధరించి రావడం చర్చనీయాంశమైంది. యూనిఫాంతో రావడం నిషేధమైనప్పటికీ ట్రాఫిక్ డీఎస్పీ జి.శ్రీకాంత్, త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ రామకోటేశ్వరరావు, కానిస్టేబుళ్లు యూనిఫాంతో కౌన్సిల్లో విజిటర్స్ విభాగంలో కూర్చున్నారు. దీన్ని గమనించిన కమిషనర్ విజ యరామరాజు సీసీతో కబురుపెట్టి యూనిఫాంతో సమావేశంలో ఉండరాదని చెప్పడంతో వారంతా బయటకు వెళ్లిపోయారు. నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిర్వహణ విషయమై స మావేశంలో చర్చించేందుకు అజెండాలో పొందుపర్చడంతో సభ్యులకు వివరించేందుకు వారు వచ్చారు. -
తీర్మానంలో తిరకాసు
- ప్రభుత్వ ఉత్తర్వుల్ని రద్దు చేస్తూ తీర్మానం - నాలుగు వేల మంది కార్మికుల జీతాల్లో కోత - నేడు ఆందోళన విజయవాడ సెంట్రల్ : కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా తయారైంది నగరపాకల సంస్థలో ఔట్సోర్సింగ్ కార్మికుల పరిస్థితి. ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి టెండర్ పిలవాలని ఈనెల ఏడో తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీర్మానం పెట్టారు. దీనిపై కార్మికులు కదం తొక్కారు. కౌన్సిల్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ ఆ ప్రతిపాదనను కమిషనర్ పెట్టారని, పాత పద్ధతిలోనే ఔట్సోర్సింగ్ కార్మికుల్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.దీంతో వివాదం సద్దుమణిగింది. ఈ మేరకు కౌన్సిల్లో తీర్మానం చేశారు. యాదృచ్ఛికంగా జరిగిందో, ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందో తెలియదు కానీ కార్మికుల్ని ఆర్థికంగా నష్టపరిచేలా తీర్మానం జరిగింది. ఎలా అంటే 2975 మెమో ప్రకారం ఔట్సోర్సింగ్ కార్మికుల జీతాన్ని రూ.6,700 నుంచి రూ.8,300కు పెంపుదల చేస్తూ 2014లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారమే కార్మికులకు జీతాలు చెల్లిస్తున్నారు. 2975 మెమోను రద్దు చేస్తూ పాత విధానాన్నే (నెలకు రూ.6,700) కొనసాగిస్తూ ఏడాది పాటు కార్మికుల్ని కొనసాగించాలని కౌన్సిల్ తాజా తీర్మానంలో పేర్కొన్నారు. నేడు ధర్నా ప్రజారోగ్య, ఇంజినీరింగ్, పార్కులు తదితర విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న సుమారు నాలుగు వేల మంది కార్మికులు దీనివల్ల నష్టపోయే ప్రమాదం ఉందని మునిసిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు చెప్పారు. పాలకుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం ఉదయం 11 గంటలకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
ద్వారపురెడ్డికి ముచ్చెమటలు పట్టించిన జయబాబు
ద్వారపురెడ్డికి ముచ్చెమటలు పట్టించిన వైస్ చైర్మన్ జయబాబు అజెండాలో ఏకపక్షంగా వేసిన అంశాలపై సభ్యుల వ్యతిరేకత పార్వతీపురం కౌన్సిల్ సమావేశం రచ్చ...రచ్చ...! పార్వతీపురం : పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి అధ్యక్షతన గురువారం జరిగిన కౌన్సిల్ సమా వేశం రచ్చ...రచ్చగా మారింది. స్వపక్షంలోని సభ్యులే కౌన్సిల్ ఏకపక్ష నిర్ణయాలను ముక్తకంఠంతో ఖండించడంతో పాటు ఇన్నాళ్లూ తనదైన శైలిలో కౌన్సిల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న టీ డీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, మున్సిపల్ చైర్పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి హవా కు వైస్ చైర్మన్ బెలగాం జయప్రకాష్ నారాయణతోపాటు పలువురు కౌన్సిలర్లు అడ్డుకట్ట వేశారు. సమావేశం ఆరంభంలోనే మున్సిపల్ వైస్ చైర్మన్ జయబాబు గత అజెండాలోని అంశాల్లో వేటిని ఆమోదించాం...? ఏవి తిరస్కరించా మో...? చూపండంతూ పట్టుబట్టారు. తిరస్క రించిన అంశాలను ఇంటి వద్ద ఆమోదించినట్టు రాస్తున్నారని ఆరోపించారు. షాపింగ్ కాంప్లెక్స్ లీజు విషయమై ఆరా తీశారు. 59 అంశాలతో అజెండా తయారు చేసేట ప్పుడు వైస్ చైర్మన్ అయినా, సీనియర్ సభ్యులైనా గుర్తురాలేదా...? అంటూ అధికారులను నిలదీశారు. కమిషనర్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్పర్సన్ ఆశీల విషయంలో కమిషనర్‌కు వత్తాసు పలకగా, ఆశీల పాట విషయంలో కమిషనర్ వ్యవహార శైలి సరికాదన్నారు. అనంతరం లే-అవుట్లకు సంబంధించిన అంశంపై ఏది ఆశించి పాత జీఓ ను చూపిస్తున్నారని అధికారులను నిలదీశారు. దీనికి కౌన్సిల్ సభ్యులు బార్నాల సీతారాం సమాధానం చెప్పబోగా, జయబాబు అతనిపై విరుసుకు పడ్డారు. వారి ద్దరి కేకలతో సభ దద్దరిల్లింది. దీనిపై ద్వారపురెడ్డి జగదీష్ కలుగజేసుకుంటూ ఈ విషయంలో వైస్ చైర్మన్ అంతగా స్పందించాల్సిన అవసరం లేదని, వద్దంటే ఆ సబ్జెక్టును ఆపేస్తామన్నారు. అనంతరం జరిగిన పలు చర్చల్లో స్వపక్షానికి చెందిన వైస్ చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు కందుకూరి వాసు, చొక్కాపు వెంకటరమణ, మం చిపల్లి సత్యనారాయణ వ్యతిరేక గళాన్ని వినిపించారు. -
వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల వాకౌట్
గుంటూరు: జన్మభూమి సమావేశాలలో అనవసరంగా నిధులు దుర్వినియోగం చేశారని అడిగినందుకు టీడీపీ కౌన్సిలర్లు గొడవకు దిగారు. బాపట్లలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జన్మభూమి సమావేశాలు పెట్టుకునేందుకు రూ.2 వేలు సరిపోతాయి. కానీ రూ.2.5 లక్షలు అనవసరంగా ఎందుకు ఖర్చు చేశారని వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అడిగినందుకు దౌర్జన్యానికి దిగారు. మీ ఇష్టమొచ్చిన చోట చెప్పుకోండని హేళన చేశారు. దీనికి నిరసగా కౌన్సిల్ సమావేశం నుంచి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. (బాపట్ల) -
టీడీపీలో కొనసాగుతున్న అసమ్మతి సెగలు
ప్రొద్దుటూరు టౌన్: తెలుగుదేశం పార్టీలో మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి డుమ్మా కొట్టిన 11 మంది కౌన్సిలర్లు తీవ్ర నిరాసక్తితో ఉన్నారు. కొత్త సంవత్సరం మొదటి రోజు కూడా చైర్మన్‌ను అసమ్మతి కౌన్సిలర్లు ఎవ్వరూ కలవక పోవడం చూస్తుంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఏది మాట్లాడినా రూ.2కోట్లు పెట్టానంటారు... చైర్మన్, ఆయన బావమరిదిల వ్యవహార శైలిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లేల లింగారెడ్డిని అసమ్మతి కౌన్సిలర్లు గురువారం కలిశారు. మున్సిపాలిటీలో బావమరిది పెత్తనంపై ఫిర్యాదు కూడా చేశారు. ఏది మాట్లాడినా నేను రూ.2 కోట్లు పెట్టానని మాట్లాడటం ఏమిటని కౌన్సిలర్లు లింగారెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలలు ఆవుతున్నా ఒక్క పనికి కూడా టెండర్ పిలవలేదని పేర్కొన్నారు. అందరం కలిసి మాట్లాడదామని ఆయన కౌన్సిలర్లకు చెప్పినట్లు సమాచారం. టీడీసీ కౌన్సిలర్ల జాతకాలు తెలుసులే.. కొద్ది రోజుల కిందట చైర్మన్ కౌన్సిలర్లను పిలిపించిన సమయంలో ఆయనతో మాట్లాడుతుండగా బావమరిది కలుగచేసుకున్నారు. మేము డబ్బు ఖర్చుపెట్టామని బావమరిది చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతలో బావమరిది కలుగ చేసుకొని ‘మీ జాతకాలన్నీ మాకు తెలుసు, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోపోండి’అని మాట్లాడటంతో ఇద్దరు కౌన్సిలర్లు ఆగ్రహించినట్లు సమాచారం. ఆ సమయంలో కూడా చైర్మన్ బావమరిదిని వారించలేకపోవడంతో కౌన్సిలర్లు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. మాజీ ఎమ్మెల్యే వద్ద అమీతుమీ... కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వద్ద అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. బావమరుదుల పెత్తనంపై పూర్తి స్థాయిలో కట్టడి చేయాల్సిందేనని ఆయన వద్ద ప్రస్తావించనున్నారు. ప్రస్తుతం ఆయన ఆగ్రాలో ఉండటంతో వచ్చేంత వరకు చైర్మన్ వద్దకు వెళ్లే ప్రసక్తే లేదని కౌన్సిలర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు జిల్లా అధ్యక్షున్ని, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్కుమార్లతోనే అసమ్మతి కౌన్సిలర్లు కలిసి వెళ్లారు. ప్రొద్దుటూరు పరిస్థితులపై వరద ఆరా... ఆగ్రాలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఇక్కడి పరిస్థితులపై గురువారం కొందరి కౌన్సిలర్లకు ఫోన్ చేసి ఆరాతీసినట్లు తెలిసింది. దీంతో కౌన్సిలర్లు జరుగుతున్న విషయాలను ఆయనకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా చైర్మన్, బావమరుదులపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే -
ప్రశ్నిస్తే దాడి చేస్తారా?
హిందూపురం కౌన్సిల్ సమావేశంలో దాడిపై వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల ఆగ్రహం పింఛన్ లబ్ధిదారుల ఆందోళనకు మద్దతు ఇచ్చారని కక్ష సాధింపు దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని రాస్తారోకో.. పోలీసులకు, కమిషనర్‌కు ఫిర్యాదు హిందూపురం అర్బన్ : అధికార టిడీపీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హిందూపురం కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు మహిళా కౌన్సిలర్లపై టీడీపీ కౌన్సిలర్లు దాడి చేయడం వారి దౌర్జన్యపు పాలనకు నిదర్శనమన్నారు. పింఛన్లు అందక ఇక్కట్లు పడుతున్న వృద్ధులు, వికలాంగులకు మద్దతుగా మంగళవారం ఆందోళనలో పాల్గొనడాన్ని తప్పుపడుతూ టీడీపీ కౌన్సిలర్లు బుధవారం కౌన్సిల్ సమావేశంలో వాగ్వాదానికి దిగడం.. తోసివేయడం దారుణం అన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం వారు మీడి యూతో మాట్లాడారు. నాలుగవ వార్డు కౌన్సిలర్ రజిని.. తన వార్డులో పింఛన్లు పంపిణీ చేయడం లేదని సభ దృష్టికి తీసుకు వస్తుండగా టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయూరన్నారు. సమావేశం రసాభాస టీడీపీ కౌన్సిలర్ల నిర్వాకంతో కౌన్సిల్ సమావేశం పక్కదారి పట్టింది. ప్రజా సమస్యలు చర్చకు రాకుండానే సమావేశం అర్ధంతరంగా ముగిసింది. ఓ దశలో తోపులాట, గందరగోళం నెలకొన్న సమయంలో ఎస్.ఐ శేఖర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. మంగళవారం పింఛన్ లబ్ధిదారుల ఆందోళనకు వైఎస్ఆర్సీపీ నేతలు మద్దతు ఇవ్వడాన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ కౌన్సిలర్లు సభలో గందరగోళం సృష్టించారు. ధర్నాలు చేసి బెదిరిస్తారా అంటూ కౌన్సిలర్ రోషన్ అలీతో వాదనకు దిగారు. కౌన్సిలర్లు శివా, ఆసీఫ్‌వుల్లా, జబివుల్లాలను చుట్టుముట్టారు. తోపులాట చోటుచేసుకుంది. ఈ దశలో గొడవ పెద్దదవకుండా చూడటానికి ముందుకు వ చ్చిన కౌన్సిలర్లు రజనీ, జయమ్మలు గాయపడ్డారు. ఇదిలా ఉండగా, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, నేతలు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని కొందరు ఉద్యోగులు మున్సిపల్ చైర్పర్సన్ చాంబర్ ఎదుట బైఠారుుంచి, ఆమెకు ఫిర్యాదు చేశారు. వారికి టీడీపీ కౌన్సిలర్లు మద్దతు పలికారు. -
ప్రశ్నిస్తే దాడి చేస్తారా?
హిందూపురం అర్బన్ : అధికార టిడీపీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హిందూపురం కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు మహిళా కౌన్సిలర్లపై టీడీపీ కౌన్సిలర్లు దాడి చేయడం వారి దౌర్జన్యపు పాలనకు నిదర్శనమన్నారు. పింఛన్లు అందక ఇక్కట్లు పడుతున్న వృద్ధులు, వికలాంగులకు మద్దతుగా మంగళవారం ఆందోళనలో పాల్గొనడాన్ని తప్పుపడుతూ టీడీపీ కౌన్సిలర్లు బుధవారం కౌన్సిల్ సమావేశంలో వాగ్వాదానికి దిగడం.. తోసివేయడం దారుణం అన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం వారు మీడి యూతో మాట్లాడారు. నాలుగవ వార్డు కౌన్సిలర్ రజిని.. తన వార్డులో పింఛన్లు పంపిణీ చేయడం లేదని సభ దృష్టికి తీసుకు వస్తుండగా టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయూరన్నారు. సమావేశం రసాభాస టీడీపీ కౌన్సిలర్ల నిర్వాకంతో కౌన్సిల్ సమావేశం పక్కదారి పట్టింది. ప్రజా సమస్యలు చర్చకు రాకుండానే సమావేశం అర్ధంతరంగా ముగిసింది. ఓ దశలో తోపులాట, గందరగోళం నెలకొన్న సమయంలో ఎస్.ఐ శేఖర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. మంగళవారం పింఛన్ లబ్ధిదారుల ఆందోళనకు వైఎస్ఆర్సీపీ నేతలు మద్దతు ఇవ్వడాన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ కౌన్సిలర్లు సభలో గందరగోళం సృష్టించారు. ధర్నాలు చేసి బెదిరిస్తారా అంటూ కౌన్సిలర్ రోషన్ అలీతో వాదనకు దిగారు. కౌన్సిలర్లు శివా, ఆసీఫ్‌వుల్లా, జబివుల్లాలను చుట్టుముట్టారు. తోపులాట చోటుచేసుకుంది. ఈ దశలో గొడవ పెద్దదవకుండా చూడటానికి ముందుకు వ చ్చిన కౌన్సిలర్లు రజనీ, జయమ్మలు గాయపడ్డారు. ఇదిలా ఉండగా, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, నేతలు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని కొందరు ఉద్యోగులు మున్సిపల్ చైర్పర్సన్ చాంబర్ ఎదుట బైఠారుుంచి, ఆమెకు ఫిర్యాదు చేశారు. వారికి టీడీపీ కౌన్సిలర్లు మద్దతు పలికారు. -
బెల్లంపల్లి మున్సిపల్ సమావేశం రసాభస
-
రసాభాసగా గుడివాడ కౌన్సిల్ సమావేశం
-
కాసేపట్లో నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
-
ప్రజా సమస్యలకు ఏదీ చోటు?
రాజమండ్రి కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ల ఆగ్రహం అజెండాలోని అంశాలు అప్రధానమైనవని నిరసన నగర పాలక సంస్థ అవినీతిమయమైందని ఆరోపణ సాక్షి, రాజమండ్రి :నగర పాలక మండలి (కౌన్సిల్) సాధారణ సమావేశంలో ప్రజా సమస్యలకు పెద్దపీట దక్కలేదని అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అజెండాలోని అంశాలు పాలక మండలి సమావేశంలో చర్చించదగ్గ స్థాయిలో లేవని నిరసించారు. అంతేకాక నగర పాలక సంస్థ పరిపాలన అవినీతిమయంగా మారిందని ధ్వజమెత్తారు. సమూలంగా ప్రక్షాళన చేయాలని ఎలుగెత్తారు.మేయర్ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన శుక్రవారం రాజమండ్రి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం క్రొవ్విడి లింగరాజు కౌన్సిల్ హాలులో జరిగింది. అజెండాలో లేని అంశాలపై వాడిగా వేడిగా చర్చ సాగింది. వివిధ విభాగాల అధికారుల వైఖరిని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో బారికేడ్ల ఏర్పాటులో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. ఇతర మున్సిపాలిటీల్లో రూ.లక్ష వరకూ ఖర్చు చూపిస్తే రాజమండ్రిలో మాత్రం రూ.ఐదు లక్షలకు పైగా ఖర్చు చేసినట్టు చూపుతున్నారన్నారు. 2013 నవంబరు నుంచి ఈ ఏడాది జనవరి వరకూ మున్సిపాలిటీల్లో టెండర్ల ద్వారా జరిగిన రూ.ఐదు కోట్ల పనుల్లో నగరపాలక సంస్థకు భారీగా నష్టం వచ్చిందన్నారు. తక్కువ ధరకు టెండర్లు ఖరారు చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. కౌన్సిల్లో కమిషనర్, ఇతర అధికారులు సభ్యుల ప్రశ్నలకు చెబుతున్న సమాధానాలు హాస్యాస్పదంగా ఉంటున్నాయన్నారు. అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలి మేయర్, డిప్యూటీ మేయర్ చాంబర్లు, కౌన్సిలు హాలు ఆధునికీకరణకు రూ.నాలుగు లక్షలకు పైగా ఖర్చు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన కమిషనర్ రవీంద్రబాబును నిలదీశారు. ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిందే.. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ అధికారులు పనితీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఓ మున్సిపాలిటీ ఉద్యోగిపై లోకాయుక్తలో కేసు నడుస్తుండగా పదోన్నతి ఇచ్చి రిటైరయ్యాక రావాల్సిన డబ్బును కూడా లక్షల్లో ముట్ట చెప్పారన్నారు. కార్పొరేషన్ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అజెండాలోని అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థలో తమ్మయ్యనాయుడు అనే కాంట్రాక్టరు అధికారులను బెదిరించి పనులు చేయించుకుంటున్నా, బిల్లులు రాయించుకుంటున్నా అతడికే అన్ని పనులు కట్టబెట్టడం విచారకరమన్నారు. ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని తీర్మానం ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు పలికారు. తమ్మయ్యనాయుడు దౌర్జన్యానికి దిగుతున్నా అధికారులు అతడిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గోరంట్ల ఇంజనీరింగ్ అధికారులను నిలదీశారు. అలసత్వంతో భూములు అన్యాక్రాంతం.. అధికారుల అలసత్యం కారణంగా కార్పొరేషన్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి ధ్వజమెత్తారు. మూడో డివిజన్లో ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్న విషయం కమిషనర్ దృష్టికి తెచ్చినా పట్టించుకోక పోవడం విచారకరమన్నారు. హోర్డింగుల ద్వారా వచ్చే రాబడి ఐదేళ్లుగా తగ్గుతున్న ప్రస్తావన సమావేశాన్ని వేడెక్కించింది. ఎమ్మెల్సీ ఆదిరెడ్డితోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్లు రాబడి తగ్గడాన్ని సమావేశం దృష్టికి తెచ్చారు. హోర్డింగులకు రుసుమును ఏటా పది శాతం పెంచి వసూలు చేయాలనే నిబంధన ఉన్నా లక్షల్లో ఆదాయం తగ్గడం ఆయా విభాగాల అధికారుల అవినీతికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. పట్టణ ప్రణాళిక, ఆరోగ్య విభాగాల్లో ఇద్దరేసి అధికారులు ఒకే స్థాయి పోస్టుల్లో కొనసాగుతూ అయోమయం సృష్టిస్తున్నారని సభ్యులు ఎత్తిచూపారు. పట్టణ ప్రణాళికా విభాగం అవినీతి ఊబిలో కూరుకు పోయిందని అధికార, ప్రతిపక్ష సభ్యులు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. డిప్యూటీ మేయర్‌కు డఫేదార్‌ను కేటాయించడం, ఇటీవల మున్సిపల్ అధికారులు ఒక వైఎస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్‌తో అనుచితంగా ప్రవర్తించడం తదితర అంశాలపై టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుల మద్య వాగ్వాదం జరిగింది. తూతూ మంత్రంగా తీర్మానాలు.. అజెండాలోని ఉపాధ్యాయుల బదిలీలు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు, కబేళా నిర్మాణం, శిథిలమైన పాఠశాల భవనాలు తదితర అంశాలపై తూతూ మంత్రంగా చర్చించి తీర్మానాలు చేశారు. మొత్తం 19 తీర్మానాలు ప్రవేశ పెట్టగా నాలుగింటిని టేబుల్ ఐటెంలుగా ఉంచారు. మూడింటిని తిరస్కరించారు. రెండింటిని సవరింపులతో, మిగిలిన వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారు. డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, టీడీపీ ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులతో మేయర్ ప్రమాణం చేయించారు. -
షాపింగ్ లాబీయింగ్‌పై దుమారం
వనపర్తిటౌన్: వనపర్తి మునిసిపాలిటీకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా దుకాణాల కే టాయింపుపై సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశం దద్దరిల్లింది. ‘సాక్షి’లో సోమవా రం ‘షాపింగ్’..లాబీయింగ్! శీర్షికన ప్రచురితమైన కథనాన్ని చూపుతూ టీఆర్ఎస్ కౌ న్సిలర్లు గట్టుయాదవ్, ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. పత్రికల్లో కథనాలు వస్తు న్నా.. పట్టించుకోరా? అని నిలదీశారు. సభ్యుల ప్రశ్నల కు సమాధానం చెప్పలేక అధికారులు ఇరకాటంలో పడ్డా రు. 44 షాపింగ్ కాంప్లెక్స్ మాల్ కేటాయింపులో జరిగిన అవినీతిని వెలికితీసేందుకు కమిటీ వేస్తామని రెండునెలల క్రితం ప్రకటించినా ఇంతవరకు ఎందుకు వేయలేదని సభ్యులు నిలదీశారు. మునిసిపల్ చైర్మన్ పలుస రమేష్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎక్స్అఫిషియో సభ్యుడి హోదాలో ఎమ్మెల్యే చిన్నారెడ్డి హాజరయ్యారు. మొదట కాంప్లెక్స్‌ల కేటాయింపులకు సంబంధించిన పత్రాలు, రికార్డులు ఎక్కడున్నాయని చైర్మన్ ఎదుట కౌన్సిలర్లు వాదనకు దిగారు. తాగునీటి బోర్లకు సంబంధించిన వన్హెచ్పీ మోటార్లకు రూ.35 వేలు, రూ.40వేల బిల్లులు ఎలా వచ్చాయని మునిసిపల్ అధికారులు కోటేషన్ తీసుకొచ్చిన షాపుల్లోనే రూ.21వేలకు మించి బిల్లులే వేయడం లేదని కౌన్సిలర్లు సతీష్‌యాదవ్, గట్టుయాదవ్ నిలదీశారు. ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేయడంతో కమిషనర్ గౌస్‌మొహీద్దీన్ క్షమాపణలు కోరారు. అనంతరం షాపింగ్ కాంప్లెక్స్‌లో జరిగిన అవినీతిపై విచారించేందుకు 15 మంది సభ్యులను నియమించారు. సమావేశంలో డీఈ రీయాజోద్దీన్, ఏఈ యూనోస్, ఆర్వో వెంకటేశం, మేనేజర్ నరేశ్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.