హిందూపురం అర్బన్ : అధికార టిడీపీ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం హిందూపురం కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు మహిళా కౌన్సిలర్లపై టీడీపీ కౌన్సిలర్లు దాడి చేయడం వారి దౌర్జన్యపు పాలనకు నిదర్శనమన్నారు.
పింఛన్లు అందక ఇక్కట్లు పడుతున్న వృద్ధులు, వికలాంగులకు మద్దతుగా మంగళవారం ఆందోళనలో పాల్గొనడాన్ని తప్పుపడుతూ టీడీపీ కౌన్సిలర్లు బుధవారం కౌన్సిల్ సమావేశంలో వాగ్వాదానికి దిగడం.. తోసివేయడం దారుణం అన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం వారు మీడి యూతో మాట్లాడారు. నాలుగవ వార్డు కౌన్సిలర్ రజిని.. తన వార్డులో పింఛన్లు పంపిణీ చేయడం లేదని సభ దృష్టికి తీసుకు వస్తుండగా టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయూరన్నారు.
సమావేశం రసాభాస
టీడీపీ కౌన్సిలర్ల నిర్వాకంతో కౌన్సిల్ సమావేశం పక్కదారి పట్టింది. ప్రజా సమస్యలు చర్చకు రాకుండానే సమావేశం అర్ధంతరంగా ముగిసింది. ఓ దశలో తోపులాట, గందరగోళం నెలకొన్న సమయంలో ఎస్.ఐ శేఖర్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. మంగళవారం పింఛన్ లబ్ధిదారుల ఆందోళనకు వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మద్దతు ఇవ్వడాన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ కౌన్సిలర్లు సభలో గందరగోళం సృష్టించారు. ధర్నాలు చేసి బెదిరిస్తారా అంటూ కౌన్సిలర్ రోషన్ అలీతో వాదనకు దిగారు.
కౌన్సిలర్లు శివా, ఆసీఫ్‌వుల్లా, జబివుల్లాలను చుట్టుముట్టారు. తోపులాట చోటుచేసుకుంది. ఈ దశలో గొడవ పెద్దదవకుండా చూడటానికి ముందుకు వ చ్చిన కౌన్సిలర్లు రజనీ, జయమ్మలు గాయపడ్డారు. ఇదిలా ఉండగా, వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లు, నేతలు తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని కొందరు ఉద్యోగులు మున్సిపల్ చైర్‌పర్సన్ చాంబర్ ఎదుట బైఠారుుంచి, ఆమెకు ఫిర్యాదు చేశారు. వారికి టీడీపీ కౌన్సిలర్లు మద్దతు పలికారు.
ప్రశ్నిస్తే దాడి చేస్తారా?
Published Thu, Jan 1 2015 5:17 AM | Last Updated on Thu, Mar 28 2019 4:53 PM
Advertisement