
సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థ రెండో పాలక వర్గ సమావేశంలో బుధవారం గందరగోళం చోటు చేసుకుంది. నగర మేయర్ హరి వెంకటకుమారి అధ్యక్షతన కోవిడ్ నిబంధనల నడుమ ఉదయం కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. 125 ప్రధాన అంశాలు, మరో 11 సప్లిమెంటరీ అంశాలతో కలిపి మొత్తం 136 చర్చనీయాంశాలతో కూడిన భారీ అజెండాను అధికారులు రూపొందించారు. ఈ క్రమంలో నగరాభివృద్ధికి సంబంధించిన అంశాలను చర్చించకుండా టీడీపీ కార్పొరేటర్లు అడ్టుకొని సమావేశంలో గందరగోళం సృష్టించారు. టీడీపీ కార్పొరేటర్ల తీరుపై వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
చదవండి: కులాలకు కేసులకు సంబంధమేంటి?