సాక్షి, రాజమండ్రి: అమరావతి పాదయాత్రకు నిరసన సెగలు తగులుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ నగరంలోనూ మంగళవారం ‘టీడీపీ బినామీలు గో బ్యాక్’ అంటూ నినాదాలు హోరెత్తాయి. మరోవైపు వికేంద్రీకరణ కోరుతూ రాజమండ్రి వాసులు పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. అయితే అమరావతి పాదయాత్ర ముసుగులో గొడవలు సృష్టించేందుకు చేసిన ప్రయత్నం బట్టబయలైంది.
రాజమండ్రి ఆజాద్ చౌక్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి యాత్ర ముసుగులో టీడీపీ నేతలు కొందరు.. స్థానికులపై చెప్పులు, వాటర్ బాటిళ్లను విసిరేశారు. మీసాలు తిప్పుతూ రెచ్చగొట్టే యత్నం చేశారు. ఆపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న స్థానికులపై రాళ్ల దాడికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ప్లాన్ ప్రకారమే..: ఎంపీ మార్గాని భరత్
అమరావతి పేరిట పాదయాత్ర చేస్తున్న వాళ్లు.. ప్లాన్ ప్రకారమే దాడులకు పాల్పడుతున్నారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లోని దాడులకు ప్లాన్ చేశారని ఆయన మండిపడ్డారు. అమరావతి పాదయాత్రలో బ్లేడ్ బ్యాచ్‌ని పెట్టుకున్నారని, పాదయాత్రలో రౌడీ షీటర్లు ఉన్నారని ఆయన మండిపడ్డారు.
ఇది టీడీపీ యాత్ర..: ఎంపీ సుభాష్
అమరావతి యాత్ర రైతుల యాత్ర కాదని.. టీడీపీ యాత్ర అని వైఎస్సార్ సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. రైతుల ముసుగులో టీడీపీ, జనసేన నేతలు దాడులకు దిగారని ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment