వీఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చ రచ్చ.. వరద సాయంపై మాటల యుద్ధం | VMC Council Meeting: Clashes Between Tdp And Ysrcp Corporators | Sakshi
Sakshi News home page

వీఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చ రచ్చ.. వరద సాయంపై మాటల యుద్ధం

Published Fri, Nov 29 2024 5:02 PM | Last Updated on Fri, Nov 29 2024 6:31 PM

VMC Council Meeting: Clashes Between Tdp And Ysrcp Corporators

సాక్షి, విజయవాడ: వీఎంసీ కౌన్సిల్ సమావేశం రచ్చ రచ్చగా మారింది. టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం సాగింది. వరద సాయం అందలేదని కౌన్సిల్ దృష్టికి వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు తీసుకొచ్చారు. దీంతో టీడీపీ కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు. వరద నష్టంపై ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ మహిళా కార్పొరేటర్ జమల పూర్ణమ్మపై టీడీపీ కార్పొరేటర్‌ ముమ్మినేని వెంకట ప్రసాద్‌ నోరుపారేసుకున్నారు.

ముమ్మినేని వెంకట ప్రసాద్‌పై వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. కౌన్సిల్ నుంచి టీడీపీ కార్పొరేటర్‌ను సస్పెండ్ చేయాలని వైఎస్సార్‌సీపీ పట్టుబట్టింది. దీంతో ముమ్మినేని వెంకట ప్రసాద్‌ను మేయర్ రాయన భాగ్యలక్ష్మి కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేశారు.  సస్పెండ్ చేసినా బయటికి వెళ్లకుండా మేయర్‌తో టీడీపీ కార్పొరేటర్లు వాగ్వాదానికి దిగారు.

టీడీపీ కార్పొరేటర్‌ను బయటికి పంపించాలని మార్షల్స్‌ను మేయర్‌ ఆదేశించగా, మార్షల్స్‌పై కేసులు పెడతామంటూ టీడీపీ కార్పొరేటర్లు బెదిరించారు. టీడీపీ వార్నింగ్‌లతో మార్షల్స్‌ వెనక్కితగ్గారు. టీడీపీ కార్పొరేటర్ల తీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కౌన్సిల్‌ను కొద్దిసేపు వాయిదా వేసిన మేయర్.. క్షమాపణ చెబితేనే భోజన విరామం తర్వాత సభలోకి అనుమతిస్తామని టీడీపీ కార్పొరేటర్లను హెచ్చరించారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement