పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి అధ్యక్షతన గురువారం జరిగిన కౌన్సిల్
ద్వారపురెడ్డికి ముచ్చెమటలు
పట్టించిన వైస్ చైర్మన్ జయబాబు
అజెండాలో ఏకపక్షంగా వేసిన
అంశాలపై సభ్యుల వ్యతిరేకత
పార్వతీపురం కౌన్సిల్ సమావేశం
రచ్చ...రచ్చ...!
పార్వతీపురం : పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి అధ్యక్షతన గురువారం జరిగిన కౌన్సిల్ సమా వేశం రచ్చ...రచ్చగా మారింది. స్వపక్షంలోని సభ్యులే కౌన్సిల్ ఏకపక్ష నిర్ణయాలను ముక్తకంఠంతో ఖండించడంతో పాటు ఇన్నాళ్లూ తనదైన శైలిలో కౌన్సిల్‌లో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న టీ డీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, మున్సిపల్ చైర్‌పర్సన్ ద్వారపురెడ్డి శ్రీదేవి హవా కు వైస్ చైర్మన్ బెలగాం జయప్రకాష్ నారాయణతోపాటు పలువురు కౌన్సిలర్లు అడ్డుకట్ట వేశారు. సమావేశం ఆరంభంలోనే మున్సిపల్ వైస్ చైర్మన్ జయబాబు గత అజెండాలోని అంశాల్లో వేటిని ఆమోదించాం...? ఏవి తిరస్కరించా మో...? చూపండంతూ పట్టుబట్టారు. తిరస్క రించిన అంశాలను ఇంటి వద్ద ఆమోదించినట్టు రాస్తున్నారని ఆరోపించారు.
షాపింగ్ కాంప్లెక్స్ లీజు విషయమై ఆరా తీశారు. 59 అంశాలతో అజెండా తయారు చేసేట ప్పుడు వైస్ చైర్మన్ అయినా, సీనియర్ సభ్యులైనా గుర్తురాలేదా...? అంటూ అధికారులను నిలదీశారు. కమిషనర్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్‌పర్సన్ ఆశీల విషయంలో కమిషనర్‌కు వత్తాసు పలకగా, ఆశీల పాట విషయంలో కమిషనర్ వ్యవహార శైలి సరికాదన్నారు. అనంతరం లే-అవుట్లకు సంబంధించిన అంశంపై ఏది ఆశించి పాత జీఓ ను చూపిస్తున్నారని అధికారులను నిలదీశారు.
దీనికి కౌన్సిల్ సభ్యులు బార్నాల సీతారాం సమాధానం చెప్పబోగా, జయబాబు అతనిపై విరుసుకు పడ్డారు. వారి ద్దరి కేకలతో సభ దద్దరిల్లింది. దీనిపై ద్వారపురెడ్డి జగదీష్ కలుగజేసుకుంటూ ఈ విషయంలో వైస్ చైర్మన్ అంతగా స్పందించాల్సిన అవసరం లేదని, వద్దంటే ఆ సబ్జెక్టును ఆపేస్తామన్నారు. అనంతరం జరిగిన పలు చర్చల్లో స్వపక్షానికి చెందిన వైస్ చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు కందుకూరి వాసు, చొక్కాపు వెంకటరమణ, మం చిపల్లి సత్యనారాయణ వ్యతిరేక గళాన్ని వినిపించారు.