సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఉన్నపళంగా బయటకు వచ్చి.. వాకౌట్ చేస్తున్నట్లు మీడియాకు చెబుతూ వెళ్లిపోయారామె.
‘‘విపక్షాల నుంచి హాజరైంది నేను మాత్రమే. కేవలం ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడనిచ్చారు. మాట్లాడే టైంలో నా మైక్‌ను కట్ చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు 20 నిమిషాల పాటు మాట్లాడారు. బీజేపీ రాష్ట్రాలకు చాలా టైం ఇచ్చారు. ఇది ప్రాంతీయ పార్టీలను అవమానించడమే. ఇదేం నీతి?. అందుకే నిరసనగా బయటకు వచ్చేశా’’ అని అన్నారామె.
అలాగే.. బడ్జెట్‌లో కేంద్రం వివక్ష చూపిందని, బడ్జెట్ రాజకీయంగా ఉందని అభిప్రాయపడ్డారామె. ‘‘బడ్జెట్ విషయంలో బెంగాల్‌నూ అవమానించారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదు. ఈసారి బడ్జెట్ పూర్తి రాజకీయంగా ఉంది’’ అంటూ ఆమె కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక.. నీతి ఆయోగ్‌ను రద్దు చేసి స్థానంలో ప్రణాళిక సంఘాన్ని పునరుద్ధరించాలని పేర్కొంటూ ఆమె డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మీటింగ్ హాజరై ఆమె కేంద్రాన్ని నిలదీస్తానని ఆమె ప్రకటించారు కూడా.
ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో ప్రధాని నేతృత్వంలో నీతి ఆయోగ్ భేటీ జరుగుతోంది. ‘వికసిత్ భారత్ - 2047’ ప్రధాన ఎజెండాగా ఈ భేటీ జరుగుతోంది. దీనికి కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అయితే.. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం వివక్ష ప్రదర్శించిందని ఆరోపిస్తూ ఇండియా కూటమి తరఫున ముఖ్యమంత్రులు(ఆరుగురు) మాత్రం ఈ భేటీని బహిష్కరించారు.
NDA 3.0: Mic Bandh Sarkar!
Despite being the sole Opposition voice, Smt. @MamataOfficial was not allowed to raise her concerns at today's Niti Aayog meeting in Delhi.
This is yet another example of how the Jomidars of Delhi want to silence Bengal — at every step. As if… pic.twitter.com/bN9PwItEre— All India Trinamool Congress (@AITCofficial) July 27, 2024
Comments
Please login to add a commentAdd a comment