సాక్షి, న్యూఢిల్లీ: నీతి ఆయోగ్‌పై ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. వెనకబడ్డ జిల్లాల్లో అభివృద్ధిపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడారు. వివిధ అంశాల్లో ప్రగతిపై నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రజంటేషన్ ఇచ్చారు.
చదవండి: ఏపీ ప్రభుత్వానికి సీఐఐ కృతజ్ఞతలు
సీఎం చొరవ అభినందనీయం..
వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ముఖ్యమంత్రి తీసుకున్న చొరవ అభినందనీయం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యువ అధికారులను సుదీర్ఘకాలం నియమించి జిల్లాల అభివృద్ధికి తోడ్పడుతున్నారన్నారు. సెలవు రోజు సైతం ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరుకావడం వారి చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రధాని ప్రశంసించారు. ప్రజల భాగస్వామ్యంతోనే వెనుకబడిన జిల్లాల అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా దేశంలో పలు జిల్లాలో చాలా వెనుకబడి ఉన్నాయన్నారు. ఈ జిల్లాల అభివృద్ధికి ఎదురవుతున్న సమస్యలను తొలగించాలని, సాంకేతికత, సృజనాత్మకతతో అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
క్యాంప్ కార్యాలయం నుంచి సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, అటవీ,పర్యావరణం,సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, ఐ అండ్ పీఆర్ కమిషనర్ టి విజయ్‌కుమార్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment