garbage issue
-
చెత్తతో ‘పవర్’ ఫుల్
సాక్షి, అమరావతి: మున్సిపాలిటీల్లో రోజురోజుకు పెరుగుతున్న చెత్తను.. ఉపయుక్తంగా మార్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం విస్తృతం చేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్రంగా చెత్త ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. రాజమండ్రి కార్పొరేషన్‌తో పాటు సమీపంలోని పట్టణ స్థానిక సంస్థల్లో ఉత్పత్తి అయ్యే చెత్తను.. ప్రాసెస్ చేసేలా విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని సీఎం జగన్ గత నెలలో ఆదేశించారు. ఆ మేరకు ప్లాంట్ సామర్థ్యం, నిర్వహణపై రూపొందించిన నివేదికను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సమర్పించగా.. ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. దీంతో 7.5 మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సిద్ధమైంది. సమీప పట్టణ స్థానిక సంస్థల నుంచి రోజుకు సగటున 400 మెట్రిక్ టన్నుల చెత్తను తరలించి విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 22 పట్టణ స్థానిక సంస్థల నుంచి చెత్త తరలింపు.. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని 22 పట్టణ స్థానిక సంస్థలను క్లస్టర్‌గా ఏర్పాటు చేయనున్నారు. వీటి పరిధిలో రోజూ సుమారు 850 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్టు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అంచనా వేసింది. ఇందులో 400 మెట్రిక్ టన్నులు పొడి వ్యర్థాలు కాగా, మిగిలింది తడి చెత్త. తడి వ్యర్థాలను ముమ్మిడివరం, అమలాపురంలో ఏర్పాటు చేసిన కంపోస్ట్ ప్లాంట్ల ద్వారా ఎరువుగా మారుస్తున్నారు. మిగిలిన చోట్ల ఉన్న ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్ ప్లాంట్లలో ఇనుము, గాజు, ప్లాస్టిక్, రబ్బర్ వంటివి వేరుచేస్తున్నారు. పునర్ వినియోగానికి, బయో ఎరువుగా మార్చేందుకు వీలులేని చెత్తను రాజమండ్రి వద్ద ఏర్పాటు చేసే విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌కు తరలిస్తారు. పర్యావరణానికి హాని కలగకుండా.. దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో తగలబెట్టడం, నదీ జలాల్లో పడేయడం వంటి చర్యలు పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతున్నాయని నీతి ఆయోగ్ తేల్చింది. ఈ నేపథ్యంలో ఘన వ్యర్థాలను ఆధునిక పద్ధతుల్లో విద్యుత్‌గా మార్చే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందుకు అనుగుణంగా రూ.640 కోట్లతో గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో రెండు విద్యుత్ ప్లాంట్లను ఇప్పటికే ఏర్పాటు చేశారు. వీటిలో రోజూ సుమారు 1,600 మెట్రిక్ టన్నుల చెత్త నుంచి దాదాపు 20 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ఆయా ప్లాంట్లకు సమీపంలోని మున్సిపాలిటీల్లో సేకరించిన వ్యర్థాలను ఈ ప్లాంట్లకు తరలిస్తున్నారు. వీటి తరహాలోనే త్వరలో రాజమండ్రి వద్ద కూడా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇదీ చదవండి: ఏపీ, తెలంగాణలో వీ ఫౌండర్ సర్కిల్ పెట్టుబడులు -
వైరల్‌గా మత్స్యకన్య ‘మెసేజ్’
ఇండోనేషియాలో భూమధ్య రేఖ మీద ఎనిమిది డిగ్రీల దగ్గర లంబాక్ – జావా దీవుల మధ్య కేంద్రీకృతమై ఉంది బాలి ద్వీపం. ప్రపందవాసులంతా ఆనందంగా జనవరి 1, 2021 ఉత్సవాలు జరుపుకుంటుంటే, ఈ తీరవాసులు మాత్రం అందుకు విరుద్ధంగా కొంచెం బాధలో మునిగి ఉన్నారు. బాలిలో ప్రసిద్ధి చెందిన కుటా సముద్ర తీరమంతా టన్నులకొలదీ వ్యర్థాలతో నిండిపోయింది. అందువల్ల తీర ప్రాంత వాసులంతా ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను పరిశుభ్ర పరచటంలో మునిగిపోయారు. అక్కడ ఒక మహిళ అందరికీ ఆకర్షణగా నిలిచారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో మత్స్యకన్యలా వస్త్రాలు ధరించి, అక్కడే బీచ్‌లో నేలమీద పడుకుని, అందరికి బాధ్యతను గుర్తుచేస్తూ, ఆకర్షిస్తున్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఆ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. డ్రోన్ కెమెరాల ద్వారా ఈ చిత్రాలను చిత్రీకరించారు వయాన్ సుయాద్న్య అనే ఔత్సాహిక ఫొటోగ్రాఫర్. బెల్జియంకి చెందిన లౌరా అనే సముద్ర వకీలు, కుటా బీచ్ పరిస్థితులను అందరికీ అర్థమయ్యేలా ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలను ధరించారు. బాలిలో ఉన్న బెల్జియం వాసి అయిన లౌరాకి ఆ సముద్ర తీరం మనసుకు బాధ కలిగించడంతో, తనే స్వయంగా ఆ ప్రాంతాన్ని శుభ్రపరచాలనుకున్నారు. చెత్తనంతటినీ ఒకచోటికి తీసుకువచ్చారు. ఆ ప్రాంతంలో తీసిన వందలకొలదీ ఫొటోలలో, మత్స్యకన్యలా ఉన్న లౌరా ఫొటోలో... ఆమె చుట్టూ ప్లాసిక్ వ్యర్థాలు టిన్నులు చిందరవందరగా పడి ఉండటం అందరిలోనూ చైతన్యం కలిగిస్తోంది. చదవండి: వాషింగ్టన్లో 15 రోజులు ఎమర్జెన్సీ -
ప్రయాణికుడి ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి: ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కొహెడకు వెళ్లే సర్వీస్ రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తులు చెత్తను పడవేశారు. దీనిపై ప్రయాణికుడు తాళ్ల బాలశివుడుగౌడ్ ట్విటర్లో మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశాడు. మంత్రి ఈ విషయాన్ని ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్ సరస్వతి దృష్టికి తీసుకుపోవడంతో కమిషనర్ స్పందించి వెంటనే సిబ్బందితో చెత్తను తొలగించేశారు. అరగంట వ్యవధిలోనే చెత్త క్లీన్ కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. – ఇబ్రహీంపట్నం రూరల్ ఆదిబట్ల మున్సిపాలిటీ బొంగ్లూర్ ఔటర్ సరీ్వస్ రోడ్డు పక్కన చెత్త, తొలగించిన తరువాత ఇలా -
ఓ మనిషీ! తెలుసుకో ఇందులో పరమార్థం
సాక్షి, తూర్పుగోదావరి : సముద్రం తన గర్భంలో ఏదీ ఉంచుకోదు ... ఆలస్యమవొచ్చేమోగానీ అంతా బయటకు తన బలమైన కెరటాలతో విసిరికొట్టేస్తోంది. సముద్రమే కాదు నది, సరస్సు, చిన్న చెరువైనా అంతే చేస్తుంది. ‘ఛీ...ఫో’ అని అంటున్నా అన్ని జలాలూ ఒక్కటై ఛీత్కరిస్తున్నా ... అర్థం చేసుకోకుండా నిస్సిగ్గుగా అన్ని నీటి వనరులనూ తమ శక్తికొలదీ కలుషితం చేయడమే పనిగా పెట్టుకున్నట్టుగా మనుషులు తయారయ్యారు. ఇందుకు ఉదాహరణే అల్లవరం మండలంలోని ఓడలరేడు సముద్ర తీరప్రాంతం. ఇటీవల గోదావరి నదికి భారీ వరదలు వచ్చిన నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వివిధ రకాల వేల టన్నుల వ్యర్థాలు సముద్రంలో కలిశాయి. వీటిని భీకర అలలతో సముద్రుడు తీరంవైపు బలంగా విసిరేయడంతో ఓడలరేవు నదీ సంగమ ప్రాంతం నుంచి కొమరగిరిపట్నం వరకూ సుమారు ఆరు కిలోమీటర్ల పొడవున రాకాసి కొండల్లా పేరుకుపోయాయి. చెత్త, ప్లాస్టిక్ సీసాలు, మద్యం సీసాలు, చెట్లు, చేమలతోపాటు మృత కళేబరాలు నాలుగు అడుగుల ఎత్తులో పేరుకుపోయాయి. ఈ కాలు ష్యం కారణంగా మత్స్య సంపదకు తీరని నష్టం వాటిల్లుతోందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఓ మనిషీ ఇదిగో వ్యర్థం ... తెలుసుకో ఇందులో పరమార్థం’ అని ప్రకృతి పరోక్షంగా హెచ్చరిస్తున్నా మార్పు కనిపించడం లేదని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా... ఈ పరిస్థితి పర్యావరణానికి తీవ్ర నష్టం చేకూర్చి మానవ మనుగడకు ముప్పు తెస్తుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. – అల్లవరం (అమలాపురం) ఫొటో: కట్టా మురళీ కృష్ణ -
పోతూపోతూ.. 2వేల టన్నుల చెత్తను వదిలివెళ్లారు
న్యూఢిల్లీ : మే-జూన్ నెలలో దాదాపు 10లక్షల మంది పర్యాటకులు మనాలిని సందర్శించారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు పోతూ పోతూ.. 2000 టన్నుల చెత్తను వదిలిపెట్టిపోయారట. ఈ చెత్తలోనూ ఎక్కువభాగం ప్లాస్టిక్ వ్యర్థాలే ఉన్నాయని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మనాలిలో ప్రతిరోజు 10 టన్నుల చెత్త మాత్రమే బయటికి వస్తోందని, అయితే పర్యాటకులు అధికంగా వచ్చే సమయంలో మాత్రం రోజకు 35 టన్నుల చెత్త ఉత్పత్తవుతుందని స్థానిక అధికారులు తెలిపారు. రోహతంగ్ పాస్, సోలాంగ్ నుంచి మనాలికి వెళ్లే దారిలో ఉన్న హోటళ్ల నుంచి వెలువడే వ్యర్థాలను దగ్గర్లోని బర్మానా సిమెంట్ ప్లాంట్‌కు తరలించి అక్కడే తగలబెడుతున్నారు. కానీ చెత్త సమస్యకు పరిష్కారం మాత్రం దొరకడం లేదు. 'ఈ సమస్యను పరిష్కరించడానికి అధికారులు ఒకేసారి 100 టన్నుల వ్యర్థాలను తగలబెట్టే సామర్థ్యం గల పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నార'ని మనాలి మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ అధికారి నారాయణ సింగ్ వర్మ పేర్కొన్నారు. ఈ ప్లాంట్ వచ్చే వారంలో ప్రారంభమమ్యే అవకాశం ఉందని, దీని వల్ల సమస్య కొంతమేర తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. అత్యధికంగా వెలువడుతున్నచెత్త వల్ల బియాస్ నది, అలాగే పర్యావరణానికి ఎటువంటి ముప్పు కలగకుండా చూడాలని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) కులు,మనాలి మున్సిపల్ విభాగాలను ఆదేశించింది. అయితే మనాలిలో స్థానిక జనాభా కంటే ఇక్కడికి వచ్చే పర్యాటకులు వేస్తున్న చెత్తే ఎక్కువగా ఉంటుంది. -
పల్లె.. తల్లడిల్లె..!
సాక్షి, మండపేట: పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తామని గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వ్యవహరించింది. జన్మభూమి కమిటీల పేరుతో ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసింది. ప్రజలతో ఎన్నికైన పాలకవర్గాన్ని కాదని, తెలుగు తమ్ముళ్లతో ఏర్పాటు చేసిన కమిటీలకు పెత్తనం అప్పగించింది. మరోపక్క పంచాయతీల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా ప్రజలను ఇబ్బందులు పాల్జేసింది. నిధులున్నా తరచూ ట్రెజరీ ఆంక్షలతో వినియోగించుకోలేని దుస్థితిలోకి పంచాయతీలను నెట్టేసింది. అభివృద్ధి పనులు ముందుకు సాగక, ఉద్యోగులకు జీతాలు చెల్లించక గ్రామ పాలన పడకేసింది. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, పెద్దాపురం, రంపచోడవరం డివిజన్ల పరిధిలో మొత్తం 779 క్లస్టర పరిధిలో 1,069 పంచాయతీలకు గాను గ్రేడ్ –1 పరిధిలో 300 పంచాయతీలు ఉండగా, గ్రేడ్–2 పంచాయతీలు 231, గ్రేడ్ –3 పంచాయతీలు 308, గ్రేడ్–4 పంచాయతీలు 230 ఉన్నాయి. రిజిస్ట్రార్ విలువ ఆధారంగా పన్నుల భారాన్ని భారీగా పెంచిన చంద్రబాబు సర్కారు ఆ స్థాయిలో సదుపాయాల కల్పనను విస్మరించింది. జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) పోస్టు ఖాళీ అయ్యి మూడున్నరేళ్లు కావస్తున్నా ఇన్చార్జి పాలనలో ఉండడం గమనార్హం. కాకినాడ డీఎల్పీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో ఇన్‌చార్జిలే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గ్రామ పాలనలో ప్రధాన భూమిక నిర్వర్తించే కార్యదర్శులకు కొరత సమస్య పట్టిపీడిస్తోంది. ధృవపత్రాల మంజూరు, ఫించన్ల పంపిణీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామ సభల నిర్వహణ, ఉపాధిహామీ సేవలు, స్మార్ట్ గ్రామాలు, తాగునీటి సరఫరా, పన్నుల వసూలు, ఇతర పాలనాపరమైన విధులను వీరు నిర్వర్తిస్తున్నారు. 779 క్లస్టర్లకుగాను 539 క్లస్టర్లకు మాత్రమే కార్యదర్శులు ఉండడంతో 230 క్లస్టర్ల పరిధిలోని పంచాయతీలకు కార్యదర్శుల కొరత వేధిస్తోంది. ఒక్కో కార్యదర్శి రెండు, మూడు పంచాయతీల్లో విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. అధికశాతం పంచాయతీల్లో కీలకమైన పారిశుద్ధ్య నిర్వహణ, రక్షిత నీటి సరఫరా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. ఆయా ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ఏలికలు లేకుండానే పల్లెపాలన పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక దానిని విస్మరించారు. నగర, పురపాలక సంస్థల్లో సమీప గ్రామాలను విలీన ప్రతిపాదనలపై కోర్టు వివాదాలు నేపథ్యంలో 2013లో జిల్లాలోని 42 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోని రాజమహేంద్రవరం కార్పొరేషన్, మండపేట మున్సిపాల్టీల్లో సమీప గ్రామాల విలీన ప్రతిపాదనలతో 27 పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోగా, కాకినాడ డివిజన్లోని కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది పంచాయతీలు, పెద్దాపురం డివిజన్లోని పెద్దాపురం, సామర్లకోట మున్సిపాల్టీల సమీపంలోని ఆరు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. రంగంపేట మండలం జి.దొంతమూరులో ఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించడంతో ప్రత్యేకపాలనలో ఉంది. 2014 ఆగస్టు నాలుగో తేదీతో అనపర్తి పంచాయతీ పదవీకాలం ముగియగా, నాలుగున్నరేళ్లుగా ప్రత్యేక పాలనలో ఉంది. పలువురు సర్పంచుల రాజీనామాలు, మరణాల నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా 15 పంచాయతీల్లో సర్పంచ్ పదువులకు ఎన్నికలు జరపాల్సి ఉన్నా వాటిని పక్కన పెట్టేశారు. సకాలంలో వీటికి ఎన్నికలు జరపకపోవడంతో ప్రత్యేక పాలనలోనే మగ్గాయి. ఎన్నో ఇబ్బందుల్లో ప్రజలు పాలకులు లేకపోవడంతో వెలగని వీధిలైట్లు, డ్రైన్లో పారని మురుగునీరు, పనిచేయని కుళాయిలు, వీధి మలుపులో తొలగని చెత్త, క్షీణించిన పారిశుద్ధ్యంతో వెంటాడుతున్న రోగాలు, అందుబాటులో ఉండని అధికారులు, అడుగుపడని అభివృద్ధి, పాలకవర్గాలు లేక సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితిలో ఎనిమిదేళ్లుగా విలీన ప్రతిపాదిత గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఎప్పుడు వస్తారో తెలియదు. నిధుల వ్యయం, అభివృద్ధి పథకాల అమలు అంతా అయోమయం. పట్టించుకునే వారు లేక గ్రామ ప్రజలకు అవసరమైన సేవలతో పాటు పంచాయతీలకు విడుదలయ్యే నిధుల వినియోగంలోను పారదర్శక లోపించిందన్న ఆరోపణలు ఉన్నాయి. . పాలకులపై పెత్తనం పంచాయతీల్లో ప్రజలతో ఎన్నుకోబడిన పాలకవర్గం పాలన సాగిస్తోంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక, అభివృద్ధి పనుల నిర్వహణలో పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునేవారు. రాజ్యాంగ బద్ధంగా సాగే ఈ ప్రక్రియను తుంగలోకి తొక్కి జన్మభూమి కమిటీల పేరిట అధికారపార్టీ నేతలకు పెత్తనం అప్పగించారు సీఎం చంద్రబాబు. అర్హులందరికీ అందాల్సిన సంక్షేమ ఫలాలను జన్మభూమి కమిటీల ద్వారా తమకు కావాల్సిన వారికి కట్టబెట్టుకున్నారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, గృహనిర్మాణం, కార్పొరేషన్ రుణాలు తదితర ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా కమిటీ సభ్యులను ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి. పథకాల మంజూరులో తెలుగు తమ్ముళ్ల చేతివాటం దాఖలాలు జిల్లా వ్యాప్తంగా అనేకం ఉన్నాయి. సిబ్బందికి జీతాలు అందక.. ట్రెజరీ నిధులపై ప్రభుత్వ ఆంక్షల నేపధ్యంలో పంచాయతీ సిబ్బంది జీతాలు అందకపోవడంతో పాటు, అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది. జిల్లాలో కాంట్రాక్ట్ పద్ధతిలో 5,600 మంది, రెగ్యులర్‌గా 318 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. తరచూ ట్రెజరీ ఆంక్షలతో సకాలంలో జీతాలు అందక సిబ్బంది ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. అభివృద్ధి పనులకు ఆంక్షలు ఆటంకంగా మారాయి. కోట్లాది రూపాయల మేర బిల్లు బకాయిలు పేరుకుపోతుండడంతో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి. బిల్లులు విడుదల కాక ఏం చేయాలో పాలుపోనిస్థితిలో కాంట్రాక్టర్లు కొట్టుమిట్టాడుతున్నారు. పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం జన్మభూమి కమిటీల పేరుతో పంచాయతీల వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికన అధికారపార్టీ నేతలతో ఏర్పాటుచేసిన జన్మభూమి కమిటీలకు అప్పగించడంతో ప్రజలతో ఎన్నుకోబడిన పాలకవర్గం కేవలం ప్రేక్షకపాత్ర పోషించాల్సి వచ్చింది. -చింతా ఈశ్వరరావు, మండల సర్పంచుల సమాఖ్య మాజీ అధ్యక్షుడు, పెదకొత్తూరు, కరప మండలం అధికారులు లేక ఇక్కట్లు పంచాయతీల్లో సిబ్బంది కొరత అధికంగా ఉంది. ఒక్కో కార్యదర్శి రెండు నుంచి ఐదు పంచాయతీల వరకు బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. కార్యదర్శుల కొరతతో ఏ పనీ సకాలంలో జరగక ప్రజలు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. -కసిరెడ్డి ఆంజనేయులు, మాజీ సర్పంచ్, లూతుకుర్రు, మామిడికుదురు మండలం జీతాలు చెల్లించలేని దుస్థితి ట్రెజరీ ఆంక్షలతో సిబ్బందికి జీతాలు చెల్లించలేని దుస్థితికి పంచాయతీలను ప్రభుత్వం తీసుకువచ్చింది. సకాలంలో బిల్లులు విడుదలవ్వక అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. సమస్యలు పరిష్కారమవ్వక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. -పండా రామకృష్ణదొర, పందిరిమామిడి, ఏజెన్సీ డివిజన్ సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు మండలం -
చెత్తను చిత్తు చేశారు!
చెత్త.. ఎక్కడపడితే అక్కడ.. పల్లె, పట్టణం తేడా లేదు.. రోజూ వందల టన్నుల్లో.. గుట్టలు గుట్టలుగా.. ప్రజలకు, ప్రభుత్వానికి నిజంగానే ఇదో పెద్ద ‘చెత్త’ సమస్య! కానీ జబల్పూర్ మున్సిపాలిటీకి మాత్రం కాదు.. ఎందుకంటే.. వాళ్లు దీనికో ‘స్మార్ట్’ పరిష్కారాన్ని కనిపెట్టారు.. పైగా.. దాన్నుంచి విద్యుత్‌ను కూడా తయారుచేస్తూ.. ఆదాయాన్నీ ఆర్జిస్తున్నారు.. అదెలాగో తెలుసుకునే ముందు.. అసలు ఏమిటీ సమస్య.. మన దగ్గర పరిస్థితేంటి అన్నది ముందుగా చూద్దాం.. అసలు రోజూ వందల టన్నుల్లో పోగవుతున్న చెత్తను సేకరించడం ఒక ఎత్తయితే, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయడం, యార్డులకు తరలించడం ప్రభుత్వాలకు సమస్యగా మారుతోంది. ఇళ్లలో డస్ట్బిన్లు చెత్తతో నిండిపోయినా మున్సిపాలిటీ వాళ్లు దాన్ని తీసుకెళ్లకపోవడం, రోడ్ల మీద చెత్తను సరిగా శుభ్రం చేయకపోవడంతో రోగాల ఇబ్బంది ఉండనే ఉంది. చాలాచోట్ల డంపింగ్ యార్డుల ఏర్పాటుకు స్థలాలే దొరకడం లేదు. నగర శివారుల్లో వీటిని ఏర్పాటు చేస్తే పరిసరాల్లో ఉండే వారు అభ్యంతరం చెబుతున్నారు. డంపింగ్ యార్డుల్లో చెత్తను తగులబెట్టడంతో పర్యావరణానికీ ముప్పు వాటిల్లుతోంది. మన దగ్గర చూస్తే.. రోజూ 40 మెట్రిక్ టన్నుల చెత్త పోగయ్యే సంగారెడ్డి మున్సిపాలిటీలో డంపింగ్ యార్డే లేదు. దీంతో చెత్తను రోడ్ల పక్కనే పారబోస్తున్నారు. నిజామాబాద్‌లో డంపింగ్ యార్డు ఉన్నా చెత్తను నామమాత్రంగా రీసైకిలింగ్ చేస్తున్నారు. దీంతో సమస్య అలాగే ఉంది. కరీంనగర్లో డంపింగ్ యార్డు నగరానికి 15 కి.మీ. దూరంలో ఉండటంతో మున్సిపల్ సిబ్బందికి రాకపోకలు ఇబ్బందిగా మారాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 19 మున్సిపాలిటీలు ఉంటే కేవలం 3 నగరాల్లోనే డంపింగ్ యార్డులున్నాయి. దీనికితోడు పారిశుద్ధ్య సిబ్బంది కొరత, శాఖల మధ్య సమన్వయలోపం చెత్త సమస్యను మరింత జటిలం చేస్తోంది. స్వచ్ఛ భారత్ కింద నగరాల్లో చెత్తను తొలగించడం కోసం ప్రభుత్వం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును అమలు చేస్తోంది. చెత్తను తడి, పొడిగా విభజించడం.. తడి చెత్తతో కంపోస్టు తయారు చేయడం, పొడి చెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యాలు. అయితే ఇవి పూర్తి స్థాయిలో, శాస్త్రీయంగా జరగడం లేదు. చాలా చోట్ల మొత్తం చెత్తలో పది, ఇరవై శాతమే రీసైకిలింగ్ అవుతోంది. ఇదండీ పరిస్థితి.. ఇక జబల్పూర్కి వెళ్దాం.. అక్కడేం చేశారో చూద్దాం.. కార్మికులకు ఆర్ఎఫ్ఐడీలు.. మధ్యప్రదేశ్‌లో మూడో పెద్ద నగరం జబల్పూర్. కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీ మిషన్ కింద ఈ నగరం ఎంపికయింది. ఇక్కడ ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే కార్మికులకు ప్రభుత్వం ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) రీడర్లను ఇచ్చింది. నగరంలో ఉన్న అన్ని ఇళ్లకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్లు అమర్చారు. పారిశుద్ధ్య సిబ్బంది ఒక ఇంట్లో డస్ట్‌బిన్‌ను ఖాళీ చేశాక తమ దగ్గరున్న ఆర్‌ఎఫ్‌ఐడీతో ఆ ఇంటిగోడపై అమర్చిన ట్యాగ్‌ను స్కాన్ చేస్తారు. వెంటనే ఆ సమాచారం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుతుంది. ఏ ఒక్క ఇంటి సమాచారం అందకపోయినా కమాండ్ సెంటర్ అధికారులు సంబంధిత పారిశుద్ధ్య సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. దీంతో రోజూ ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ తప్పనిసరిగా జరుగుతుంది. చెత్త కుండీలకు సెన్సార్లు.. ఇళ్ల సంగతి ఇలా ఉంటే, నగరంలోని చాలా చోట్ల కమ్యూనిటీ డస్ట్‌బిన్ (రెండు మూడు వీధులకు కలిపి ఏర్పాటు చేసే చెత్త కుండీ)లు ఉన్నాయి. వీటన్నింటికీ సెన్సార్లు అమర్చారు. ఈ డస్ట్బిన్లు 90 శాతానికిపైగా నిండగానే ఆ సెన్సార్లు కమాండ్ సెం టర్కు, సంబంధిత అధికారులకు చెత్తకుండీని ఖాళీ చేయాల్సిందిగా సందేశం పంపుతాయి. వెంటనే అధికారులు దగ్గర్లో ఉన్న మున్సిపాలిటీ టిప్పర్‌కు సమాచారం అందజేస్తారు. దీంతో ఆ టిప్పర్ వచ్చి చెత్తను తీసుకెళుతుంది. వందల సం ఖ్యలో ఉన్న ఈ టిప్పర్లన్నింటినీ జీపీఎస్‌తో అనుసంధానించారు. దీంతో సమాచారం పంపడమే కాక వాటి రాకపోకలను కూడా నియంత్రించవచ్చు. విద్యుత్ ఉత్పత్తి ఇలా... ఇలా సేకరించిన చెత్త నుంచి తడి, పొడి చెత్తను వేరు చేస్తారు. దాన్ని నగర శివారులో 65 ఎకరాల్లో నెలకొల్పిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్‌కు తరలిస్తారు. ఈ ప్లాంట్‌లో రోజుకు 600 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేసి తద్వారా రోజూ 11.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఆ విద్యుత్ 18 వేల ఇళ్లకు రోజువారీ వినియోగానికి సరిపోతుంది. దేశంలో ఇంత భారీస్థాయిలో సాంకేతిక పరిజ్ఞానంతో చెత్త నిర్వహణ చేపడుతున్న నగరాల్లో జబల్పూరే మొదటిది. చెత్త నిర్వహణకు అవసరమైన స్మార్ట్ పరిజ్ఞానాన్ని టెక్ మహీంద్ర సంస్థ అందిస్తోంది. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను ఎస్సెల్ గ్రూప్ సంస్థ నెలకొల్పింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో దీనిని నిర్వహిస్తున్నారు. రోజూ ఉత్పత్తి చేసే విద్యుత్.. 11.5 మెగావాట్లు. -
‘హైదరాబాద్‌లో ఎక్కడి చెత్త అక్కడే’
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( జీహెచ్ఎంసీ) కౌన్సిల్ మీటింగ్ బుధవారం నిర్వహించింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ బొంతు రామ్మెహన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. గ్రేటర్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై ఈ మీటింగ్‌లో చర్చించారు. ఈ సందర్భంగా నగరంలోని పలు సమస్యలపై కార్పొరేటర్లు గళమెత్తారు. హైదరాబాద్‌లో ఎక్కడి చెత్త అక్కడే ఉంటోందని, చెత్తతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొన్నిసార్లు నగరంలో లైట్లు కూడా వెలగడం లేదని పేర్కొన్నారు. నాలాల పూడికలు తీయడం లేదని, వర్షం వస్తే హైదరాబాద్ చెరువులను తలపిస్తోందని తెలిపారు. అంతేకాకుండా మృతదేహాల కోసం వాడిన ఐస్‌ను జ్యూస్ సెంటర్లలో వాడుతున్నారని, ఐస్ ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోవాలని సభ్యులు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. -
ధర్మ పోరాట దీక్ష ఫలితం
విజయవాడ స్పోర్ట్స్ : అడుగడుగునా ఖాళీ మంచినీళ్ల ప్యాకెట్ల కవర్లు, కరపత్రాలు, చెత్తా చెదారంతో నిండి ఉంది. ఇదేదో డంపింగ్ యార్డు అనుకుంటే పొరపాటే. నిత్యం వందలాది మంది క్రీడాకారులు ప్రాక్టీస్ చేసే ఐజీఎంసీ స్టేడియం దుస్థితి. ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబునాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్షా ఫలితం ఇది. ప్రభుత్వం నాలుగేళ్లుగా క్రీడల కోసం వినియోగించాల్సిన స్టేడియాన్ని క్రీడేతర కార్యక్రమాలకు వినియోగించడంతో గ్రౌండ్ అంతా ధ్వంసమై క్రీడాకారుల ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎక్కడ చూసినా మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు కన్పిస్తున్నాయి. తాత్కలిక టాయిలెట్లతో స్టేడియంలో ఏర్పాటు చేసిన డ్రైనేజ్ ట్యాంక్ నిండిపోయి తీవ్ర దుర్ఘంధం వ్యాపిస్తోంది. నేలంతా చిత్తడిగా మారింది. లారీలు తిరగడంతో గ్రౌండ్ ధ్వంసమైంది. మరో రెండు రోజుల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ప్రారంభం కానున్న నేపధ్యంలో.. గ్రౌండ్ దుస్థితి క్రీడాకారులను ఆగ్రహానికి గురిచేస్తోంది. పూర్తిగా అందుబాటులోకి రావడానికి మరి కొద్ది పట్టనుంది. దీక్ష కోసం సుమారు నాలుగు లక్షల ప్యాకెట్లు అందుబాటులో పెట్టినట్లు సమాచారం. దీక్షకు వచ్చిన వారు వాటిని సేవించేందుకు ఆసక్తి చూపకపోవడంతో భారీగా మిగిలిపోయాయి. స్థానికులు కొంతమంది వాటర్, మజ్జిగ ప్యాకెట్ల బస్తాలు తీసుకువెళ్లినా ఇంకా చాలా మిగిలాయంటే ప్రజాధనం ఎంతగా వృథా అయిందో అర్థమవుతోంది. -
చెత్త చాలక.. దిగుమతి చేసుకుంటున్నారు!
సాధారణంగా ఏదైనా దేశంలో చెత్త ఎక్కువైపోయి ఇబ్బంది పడతారు. కానీ స్వీడన్ మాత్రం చెత్త చాలక.. దిగుమతి చేసుకుంటానంటోంది. తమ దేశంలో ఉన్న అత్యాధునిక రీసైక్లింగ్ ప్లాంట్లలో ఉన్న చెత్తనంతటినీ రీసైకిల్ చేసేస్తున్నారు. ఆ దేశానికి కావల్సిన విద్యుత్ అవసరాల్లో సగానికి పైగా కేవలం ఈ రీసైకిల్డ్ చెత్త నుంచే వస్తుంది! నిజానికి అక్కడ శిలాజ ఇంధనాలపై 1991 నుంచే భారీగా పన్నులు ఉన్నాయి. ఇక్కడి రీసైక్లింగ్ ప్లాంట్లు ఎంత సమర్థంగా పనిచేస్తాయంటే.. దేశంలో గత సంవత్సరం ఇళ్ల నుంచి వచ్చిన మొత్తం చెత్తలో కేవలం 1 శాతాన్ని మాత్రమే డంపింగ్ యార్డులకు తరలించారట. స్వీడన్లో జాతీయ రీసైక్లింగ్ పాలసీ కూడా ఉంది. దాని వల్ల ప్రైవేటు కంపెనీలు కూడా చెత్తను దిగుమతి చేసుకుని దాన్నుంచి విద్యుత్ తయారుచేస్తున్నాయి. అంతేకాదు, చెత్తను మండించడం ద్వారా పుట్టే వేడిని.. ఒక నెట్వర్క్ ద్వారా ఇళ్లు కూడా సరఫరా చేస్తారు. అక్కడ శీతాకాలంలో ఉష్ణోగ్రతలు చాలా పడిపోతాయి కాబట్టి ప్రత్యేకంగా ఎవరికి వారు రూం హీటర్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ నెట్వర్క్ నుంచి వచ్చే వేడి సరిపోతుంది. కరెంటు, కేబుల్ లాగే వేడిని కూడా పైపుల ద్వారా అందిస్తారన్న మాట. ఇలా అన్ని రకాలుగా చెత్తను ఉపయోగించుకోవడంతో.. దేశంలో ఇళ్ల నుంచి వస్తున్న చెత్త ఏమాత్రం సరిపోవడం లేదట. అందుకోసం స్వీడన్ వాళ్లు బయటి దేశాలనుంచి కూడా దిగుమతి చేసుకుంటామని ఆఫర్లు చేస్తున్నారు. మన దేశంలో చెత్త ఎక్కడపడితే అక్కడ ఉండటంతో 'స్వచ్ఛభారత్' లాంటి నినాదాలు ఇస్తున్నా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుండగా.. అక్కడ మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తున్నాయి. అదే తరహా విధానాలను ఇక్కడ కూడా అమలుచేస్తే ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. యూరోపియన్ దేశాల్లో డంపింగ్ యార్డులలో చెత్తను పారేయడం మీద నిషేధం ఉంది. అందువల్ల భారీ జరిమానాలు కట్టడం కంటే.. ఎవరికి వాళ్లు రీసైక్లింగ్ ప్లాంట్లు పెట్టుకుని దాంతో విద్యుత్ ఉత్పత్తి చేయడం మొదలుపెట్టారు. ప్రతిదేశంలోనూ ఇలాగే చేస్తే కాలుష్యం తగ్గడంతో పాటు బొగ్గు అవసరం కూడా తగ్గి కర్బన ఉద్గారాలు అదుపులోకి వస్తాయని అంటున్నారు. -
చెత్త ఎత్తించండి.. సీఎంకు టాప్ హీరో లేఖ
దేవుడి సొంత దేశంగా పేరున్న కేరళకు అతిపెద్ద ముప్పు చెత్తేనని, దాన్ని శుభ్రం చేయించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు మళయాళ అగ్రనటుడు మోహన్‌లాల్ లేఖ రాశారు. తాను ఒక బాధ్యత గల పౌరుడిగా ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. దాంతో ఇటు నాయకుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ మోహన్‌లాల్‌ను ప్రశంసలలో ముంచెత్తుతున్నారు. చెత్త సమస్యతో పాటు రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రత కూడా ప్రధానాంశాలని పేర్కొన్నారు. చెత్త సమస్య కేరళకు అతిపెద్ద ముప్పు అని, కేరళ ఏ టెర్రరిస్టు గురించి ఎక్కువగా భయపడుతుందని ఎవరైనా అడిగితే చెత్త అనే తాను సమాధానం చెబుతానని అన్నారు. చెత్త వేయడానికి ఎక్కడా స్థలం లేకపోవడంతో కేరళీయులు బహిరంగ స్థలాల్లో వేసేస్తున్నారని చెప్పారు. యుద్ధాల్లో కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువగా మరణిస్తున్నారని, ఈ విషయంలో కఠిన నిబంధనలు అమలులోకి తేవాలని సూచించారు. ఇంతకుముందు కూడా చాలామంది నటీనటులు చాలా అంశాలపై లేఖలు రాసినా.. దీన్ని ప్రజలు, నాయకులు రిసీవ్ చేసుకున్న విధానం అందరికీ నచ్చింది. ఏదో సినిమాలలో డైలాగులు చెప్పడం కాకుండా.. సామాజిక సమస్యలపై స్పందించిన తీరు బాగుందని పలువురు ట్విట్టర్ ద్వారా పలువురు చెప్పారు. ఆయన సెలబ్రిటీ కాబట్టి, ఆయన చర్యలను అందరూ గమనిస్తారు కాబట్టి, ఇలా చేయడం చాలా బాగుందని నఫీద్ గఫూర్ అనే విద్యార్థి అన్నాడు. మోహన్‌లాల్ చెప్పినదాంతో తాను ఏకీభవిస్తున్నానని, ప్రభుత్వం మహిళల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోవాలని అతుల్య అనే ఉద్యోగిని అన్నారు. మోహన్ లాల్ గొప్ప నటుడని, ఆయన చేసిన సూచనలకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తారని సీపీఎం చెప్పింది. ఎల్డీఎఫ్ ప్రభుత్వ ఎజెండాలో ఇది ఇప్పటికే ఉందని, దాన్ని అమలుచేయడానికి ప్రయత్నిస్తామని సీపీఎం ఎమ్మెల్యే ఎంబీ రాజేష్ అన్నారు. మంచి బ్లాగర్‌గా పేరున్న మోహన్‌లాల్.. మూడు దశాబ్దాలలో దాదాపు 300కు పైగా మళయాళం సినిమాలలో నటించారు. నాలుగుసార్లు జాతీయ అవార్డులు పొందారు. తాజాగా ఆయన జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు జనతా గ్యారేజ్ సినిమాలో కూడా స్ట్రెయిట్‌గా తెలుగులో నటిస్తున్నారు.