Viral: Mermaid Message On Garbage At Indonesia Bali's Kuta Beach | వైరల్‌గా మత్స్యకన్య ‘మెసేజ్‌’- Sakshi
Sakshi News home page

వైరల్‌గా మత్స్యకన్య ‘మెసేజ్‌’

Published Fri, Jan 8 2021 8:17 AM | Last Updated on Fri, Jan 8 2021 12:15 PM

Mermaid Message On Garbage In Sea Coast In Indonesia - Sakshi

ఇండోనేషియాలో భూమధ్య రేఖ మీద ఎనిమిది డిగ్రీల దగ్గర లంబాక్‌ – జావా దీవుల మధ్య కేంద్రీకృతమై ఉంది బాలి ద్వీపం. ప్రపందవాసులంతా ఆనందంగా జనవరి 1, 2021 ఉత్సవాలు జరుపుకుంటుంటే, ఈ తీరవాసులు మాత్రం అందుకు విరుద్ధంగా కొంచెం బాధలో మునిగి ఉన్నారు. బాలిలో ప్రసిద్ధి చెందిన కుటా సముద్ర తీరమంతా టన్నులకొలదీ వ్యర్థాలతో నిండిపోయింది. అందువల్ల తీర ప్రాంత వాసులంతా ఆ ప్లాస్టిక్‌ వ్యర్థాలను పరిశుభ్ర పరచటంలో మునిగిపోయారు. అక్కడ ఒక మహిళ అందరికీ ఆకర్షణగా నిలిచారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో మత్స్యకన్యలా వస్త్రాలు ధరించి, అక్కడే బీచ్‌లో నేలమీద పడుకుని, అందరికి బాధ్యతను గుర్తుచేస్తూ, ఆకర్షిస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్టు చేశారు. ఆ ఫొటోలు బాగా వైరల్‌ అవుతున్నాయి.

డ్రోన్‌ కెమెరాల ద్వారా ఈ చిత్రాలను చిత్రీకరించారు వయాన్‌ సుయాద్న్య అనే ఔత్సాహిక ఫొటోగ్రాఫర్‌. బెల్జియంకి చెందిన లౌరా అనే సముద్ర వకీలు, కుటా బీచ్‌ పరిస్థితులను అందరికీ అర్థమయ్యేలా ఇలా ప్లాస్టిక్‌ వ్యర్థాలను ధరించారు. బాలిలో ఉన్న బెల్జియం వాసి అయిన లౌరాకి ఆ సముద్ర తీరం మనసుకు బాధ కలిగించడంతో, తనే స్వయంగా ఆ ప్రాంతాన్ని శుభ్రపరచాలనుకున్నారు. చెత్తనంతటినీ ఒకచోటికి తీసుకువచ్చారు. ఆ ప్రాంతంలో తీసిన వందలకొలదీ ఫొటోలలో, మత్స్యకన్యలా ఉన్న లౌరా ఫొటోలో... ఆమె చుట్టూ ప్లాసిక్‌ వ్యర్థాలు టిన్నులు చిందరవందరగా పడి ఉండటం అందరిలోనూ చైతన్యం కలిగిస్తోంది. చదవండి: వాషింగ్టన్‌లో 15 రోజులు ఎమర్జెన్సీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement