mermaids
-
అనగనగా ఓ సాగర కన్య (ఫోటోలు)
-
ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు చూసి సాగకన్యగా ఉద్యోగం
జలకన్య, మత్స్య కన్య అని వినపడగానే ఎక్కడ? ఎక్కడ? అని చూస్తుంటారు చాలామంది. శరీర పైభాగం మనిషిగా, కింది భాగం చేపరూపంలో ఉండే జలకన్యలంటే ఆసక్తి ఉండనిదెవరికి? జలకన్యను చూసేందుకు అందరూ ఆరాటం దగ్గరే ఆగిపోతే, మాస్ గ్రీన్ మాత్రం మత్స్యకన్యపై మరింత మక్కువతో తానే ఓ జలకన్యగా మారి పోయింది. మత్స్యకన్యలా ఈదుతూ... ఈ ఉద్యోగం ఎంత బావుందో అని తెగ సంబరపడిపోతుంది. యూకేలోని టార్క్వే నగరానికి చెందిన ముప్ఫైమూడేళ్ల మాస్గ్రీన్ 2016లో ఇటలీలోని సిసిలీ వెళ్లింది. అక్కడ ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన సమయంలో ఏం చేయాలో తోచక కొత్తగా ఏదైనా చేయాలనుకుంది. అలా ఆలోచిస్తున్న సమయంలో ఇంటికి దగ్గరలో ఉన్న బీచ్‌లో ఒకతను ‘మ్యాజికల్ మెర్మాన్’ డ్రెస్‌లో కనిపించాడు. అది చూసిన మాస్కు చాలా ఆసక్తిగా అనిపించింది. వెంటనే జలకన్య ఎలా ఉంటుందో తెలుసుకుని, తను కూడా అలా తయారవాలనుకుంది. అప్పటి నుంచి జలకన్యగా తయారవడం తనకెంతో ఇష్టమైన హాబీగా మార్చుకుంది. మత్య్సకన్యగా రెడీ అయ్యి తనని తాను చూసుకుంటూ తెగమురిసిపోయేది. ఇన్స్టాగ్రామ్ ఆఫర్‌తో... మత్య్సకన్యగా తయారైన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేస్తుండేది. ఆ ఫొటోలు చూసిన ఓ సంస్థ మత్య్స కన్య ఉద్యోగం ఇస్తాం అని మాస్‌ని పిలిచింది. దీంతో సిసిలీ బీచ్‌కు దగ్గర్లో ఉన్న ‘లాంపేడుసా’ ఐలాండ్‌లో మత్య్సకన్యగా పనిచేస్తోంది. ఊపిరిని బిగపట్టి నీటి అడుగు భాగంలో డైవింగ్ చేయడం, నిజమైన జలకన్యలా అటు ఇటు తిరగడం వంటి విన్యాసాలతో పర్యాటకుల్ని ఆకర్షించడమే ఆమె ఉద్యోగం. బోట్ టూర్స్‌కు గైడెన్స్ ఇస్తూనే, జలచరాలు నీటిలో ఎలా కదులుతాయో చెబుతూ పర్యాటకులకు ఈదడం నేర్పించడం ఈ ఉద్యోగంలో చేయాల్సిన ఇతర ముఖ్యమైన పనులు. వేసవి సమయాల్లో రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయడం కోసం మాస్ వివిధ రకాల చేపల కదలికను గమనించి, ఈదడంలో మెళకువలు నేర్చుకుంది. ఊపిరిని బిగపట్టడాన్ని ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకుని కష్టపడి అభ్యసించింది. ప్రస్తుతం తన వృత్తిలో ఎంతో సంతోషంగా ఉంది మాస్ గ్రీన్.మాస్ గ్రీన్ తన ఆసక్తితో సరికొత్త ఉద్యోగాన్ని సృష్టించి ఎంతో మంది నిరుద్యోగులకు కొత్త దారి చూపించింది. ఇష్టం, చేయాలన్న సంకల్పం ఉంటే ఏదో రకంగా దారి దొరుకుతుందనడానికి ఈ జలకన్య ఉద్యోగమే ఉదాహరణగా నిలుస్తోంది. ఖర్చులకు సరిపోతుంది.. ‘‘టీచర్‌గా పనిచేసేటప్పుడు వచ్చే జీతం కంటే మత్య్సకన్య ఉద్యోగానికి జీతం తక్కువే. అయినా నా ఖర్చులకు తగినంత సంపాదిస్తున్నాను. ఇది చాలు. ఈ ఉద్యోగం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. అమ్మకు.. మత్య్స కన్య హాబీ గురించి తెలిసినప్పుడు.. అసాధారణమైనదిగా భావించారు. కానీ దీనినే కెరీర్‌గా ఎంచుకుంటానని ఆమె అస్సలు అనుకోలేదు. నా సంతోషం చూసి ఇప్పుడు అమ్మే నన్ను∙ప్రోత్సహిస్తున్నారు’’ . – మాస్ గ్రీన్. -
‘మత్స్య కన్య’గా మారిన ఇంగ్లీష్ టీచర్.. చూసేందుకు జనం పరుగులు!
ప్రపంచంలో లెక్కకుమించినంతమంది తమ ఉద్యోగాలను అయిష్టంతోనే చేస్తుంటారనే వాదన వినిపిస్తుంటుంది. అయితే వారు తమ హాబీతో ఏమైనా సాధించవచ్చని తపన పడుతుంటారు. అయినా అందుకు తగిన ప్రయత్నాలు చేయరు. కొందరు మాత్రం ఈ ప్రపంచం ఏమనుకున్నా, ఎటుపోయినా తాము అనుకున్నది చేసి చూపిస్తారు. అద్భుతాలు అందిస్తారు. ఇదే కోవలోకి వచ్చే ఒక మహిళ తన హాబీనే తన ఉద్యోగంగా మలచుకుని అత్యధికంగా సంపాదిస్తోంది. ఇందుకోసం ఆమె ఇంతవరకూ చేస్తూ వచ్చిన బోరింగ్ ఉద్యోగాన్ని విడిచిపెట్టేసింది. మత్స్య కన్యగా మారిన మాస్ గ్రీన్ మాస్ గ్రీన్ అనే యువతి స్కూలులో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేసేది. అయితే ఇప్పుడామె ‘మత్స్య కన్య’గా మారిపోయింది. ఇది వినేందుకు వింతగా అనిపిస్తుంది. ఆమె ఒక ఫుల్‌టైమ్ ‘రియల్ లైఫ్ మత్స్య కన్య’గా మారేందుకు తన ఉద్యోగాన్ని వదిలివేసింది.యూకేలోని ‘మెట్రో’తో మాట్లాడిన ఆమె ‘మత్స్య కన్య’గా ఉండటం తనకు ఎంతో ఇష్టమైన వ్యాపకమని, తన కెరియర్ మార్చుకున్నాక ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది. డెవొన్కు చెందిన 33 ఏళ్ల మాస్ గ్రీన్ ఇంగ్లీషు నేర్చుకునేందుకు 2016లో సిసిలీ వెళ్లింది. మత్స్య కన్యగానే ఎందుకు.. మీడియాతో మాట్లాడిన మాస్ తాను గతంలో ఒక సాగర తీరంలో మత్స్యకన్య మేకప్‌తో ఒక వ్యక్తిని చూశానని, అప్పటి నుంచి తనకు మత్స్యకన్యగా మారాలనే ఆలోచన తరచూ వచ్చేదని తెలిపింది. అయితే అప్పుడు తాను చూసినది ఒక ఇంద్రజాలమని, అయితే తాను నిజంగా మత్స్యకన్యగా మారిపోవాలనుకున్నానని తెలిపింది. ఇది వినేందుకు అందరికీ విచిత్రంగా అనిపిస్తుంది. కానీ దీనిని తాను చేసి చూపించానని మాస్ గర్వంగా తెలిపింది. తనను చూసేందుకు జనం విపరీతంగా రావడం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందని పేర్కొంది. అభిరుచే ఆదాయమార్గంగా మారి.. ‘రియల్ లైఫ్ మత్స్యకన్య’గా మారాక తాను నీటిలో సయ్యాటలాడున్నప్పుడు తన తోక భాగాన్ని చూసి అందరూ ఆనందిస్తారని తెలిపింది. తనకు సముద్రంలో అధిక సమయం గడపడమంటే ఎంతో ఇష్టమని మాస్ తెలిపింది. తాను సముద్రతీర సందర్శనకు వచ్చే పర్యాటకులకు పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేస్తానని పేర్కొంది. మత్స్యకన్యగా మారేందుకు తాను అధిక సమయం ఊపిరి నిలిపివుంచే శిక్షణ పొందానని తెలిపింది. తాను తనకు ఎంతో ఇష్టమైన అభిరుచిని నెరవేర్చుకోవడంతో పాటు మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నానని మాస్ గ్రీన్ ఆనందంగా తెలిపింది. ఇది కూడా చదవండి: ఉన్నట్టుండి షాపింగ్ మాల్లో తుపాకీ కాల్పుల మోత.. టెక్సాస్‌లో ఏం జరిగిందంటే.. -
‘జలకన్య కన్ను’ పేరుతో బురిడీ
సాక్షి, హైదరాబాద్: జలకన్య కన్నుకు అతీంద్రియ శక్తులు ఉంటాయని, దీంతో మీకు అంతా శుభం జరుగుతుందని, కోరుకున్న పని ఇట్లే జరిగిపోతుందని కల్లబొల్లి మాటలు చెప్పి అందినకాడికి దండుకోవాలని భావించిన నిందితుల ఆటకట్టించారు మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు. వరంగల్‌కు చెందిన చందు, యాప్రాల్‌కు చెందిన సాంబశివ ఇద్దరు స్నేహితులు. తీర్థయాత్రల నిమిత్తం షిరిడీకి వెళ్లిన ఇరువురు.. తిరుగు ప్రయాణంలో స్థానికంగా దొరికే రంగు రాయిని కొనుగోలు చేశారు. హైదరాబాద్‌కు తిరిగొచ్చాక ఆ రంగురాయిలో బ్యాటరీ సహాయంతో చిన్నపాటి లైట్‌ను అమర్చారు. లైట్ అమర్చిన రంగురాయికి నీళ్లు తాకగానే దాని కాంతి రెట్టింపు అవుతుంది. దీన్ని గమనించిన చందు, శివలకు దుర్బుద్ధి పుట్టింది. రంగురాయికి శక్తులు ఉన్నాయని నమ్మించి అమాయకులకు విక్రయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో కాప్రాలో పలువురు వ్యాపారులు, స్థానికులకు చూపించి..ఈ రంగురాయి సాగరకన్య నోటిలో నుంచి తీసిన జలకాంతం అని మాయమాటలు చెప్పారు. దీన్ని ఇంట్లో పెట్టుకుంటే శుభం జరుగుతుందని నమ్మించారు. రూ.2 కోట్లకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ రాములు బృందం ఇద్దరు నిందితులు చందు, సాంబశివలను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. (చదవండి: సమరానికి సై.. ఫార్ములా–ఈ పోటీలకు రేసర్లు రెడీ.. ) -
సాగర కన్యలు ఉన్నది నిజమే! ఔను అంటున్న జపాన్ శాస్త్రవేత్తలు
మనం సినిమాల్లో సాగర కన్యలు(మత్స్య కన్య) చూశాం. కానీ నిజంగా అవి ఉన్నాయా? అనేది మాత్రం అందరి మదిలో మెదిలే ప్రశ్నే. డిస్కవరీ ఛానెల్స్‌లో వాటి గురించి చెబుతుంటారు కానీ రియల్‌గా మాత్రం వాటిని ఎవరు చూసి ఉండే అవకాశం లేదు. అయితే జపాన్ శాస్త్రవేత్తలు మాత్రం సాగర కన్యలు ఉన్నాయంటున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలతో సహా వివరిస్తున్నారు. వివరాల్లోకెళ్తే...మానవ ముఖం, తోకతో ఉన్న 300 ఏళ్ల నాటి మత్సకన్య మమ్మీని చూసి శాస్తవేత్తలు ఆశ్చర్యపోయారు. మత్స్య కన్య ఆకారంలో ఉన్న ఈ మమ్మీని జపాన్ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేస్తోంది. 1736 మరియు 1741 మధ్యకాలంలో జపనీస్ ద్వీపం అయిన షికోకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో 12 అంగుళాల మర్మమైన జీవి పట్టుబడిందని చెబుతున్నారు. ఈ మత్స్య కన్య మమ్మీ పసిఫిక్ మహాసముద్రంలో చేపలు పట్టే వలలో చిక్కుకుందని పేర్కొంటూ ఒక లేఖ దొరికిందని కూడా అన్నారు. ఆ తర్వాత ఎండిన మత్స్య కన్యను ఒక కుటుంబం పర్యవేక్షించిందని తదనంతరం అసకుచి నగరంలోని ఒక దేవాలయంలో ఉందని చెప్పారు. ఈ మమ్మీకి దంతాలు, ముఖం రెండు చేతులు, తల, నుదురుపై వెంట్రుకలు ఉన్నాయన్నారు. ఎగువ భాగం మానవ రూపంలోనూ, దిగువ భాగం చేప లక్షణాలను కలిగి ఉందని తెలిపారు. శరీరం దిగువ భాగంలో పొలుసులు, తోక-వంటి టేపర్డ్ ఎండ్ ఉంటుందని చెప్పారు. కురాషికి యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ పరిశోధకులు వీటి గురించి మరింత లోతుగా అధ్యయనం చేయనుంది. జపనీస్ మత్స్యకన్యలకు అమరత్వపు పురాణం(యావో-బికుని) ఉందని, మత్స్యకన్య మాంసం తింటే ఎప్పటికీ చనిపోరు అని ఒకాయమా ఫోక్లోర్ సొసైటీకి చెందిన హిరోషి కినోషిత చెబుతున్నారు. ఈ పురాణం కుడా ఆ మత్య్స కన్య దొరికిన ఆలయంలోనే ఉందని చెప్పారు. ఆ పురాణాన్ని నమ్మే కొందరు మత్య్స కన్య పొలుసులను చెవిలో పెట్టుకుంటారని అన్నారు. ఆ మత్స్య కన్యలు అంటు వ్యాధులను దూరం చేస్తాయని జపాన్ వాసుల ప్రగాఢ నమ్మకం అని కూడా చెప్పారు. (చదవండి: చిన్ని చేతులు చేస్తున్న అద్భుతం!...రష్యా బలగాలు ముట్టడించకుండా చేసేందుకు యత్నం!) -
మైపాడు బీచ్‌లో జలకన్య? అసలు నిజం ఏంటంటే..
సాక్షి, ఇందుకూరుపేట: ప్రముఖ పర్యాటక కేంద్రం మైపాడు బీచ్‌లో జలకన్య కలకలం అని వస్తున్న వార్తలో నిజం లేదని, ఇలాంటి వదంతులను నమ్మవద్దని ఆక్వా కోఆపరేటివ్ మార్కెట్ డైరెక్టర్ పామంజి నరసింహులు స్పష్టం చేశారు. మైపాడు బీచ్‌లో ఓ జలకన్య మత్స్యకారులకు చిక్కినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయిన విషయంపై ఆయన స్పందించారు. చదవండి: ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా గుర్రంపైనే.. ఇందుకూరుపేటలో ఆయన మాట్లాడుతూ, కొందరు ఆకతాయిలు ఓ వీడియోని సృష్టించి.. పది రోజుల కిందట కర్ణాటక రాష్ట్రంలో ఈ సంఘటన జరిగినట్లు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారన్నారు. తాజాగా గత నాలుగైదు రోజుల నుంచి ఇదే వీడియోలను మైపాడు బీచ్‌లో జరిగినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి.. లేనిది ఉన్నట్లు చూపుతున్నారని తెలిపారు. వీటిని పోస్టు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నరసింహులు కోరారు. చదవండి: ఊర్లున్నాయి.. ప్రజలు లేరు! -
వైరల్‌గా మత్స్యకన్య ‘మెసేజ్’
ఇండోనేషియాలో భూమధ్య రేఖ మీద ఎనిమిది డిగ్రీల దగ్గర లంబాక్ – జావా దీవుల మధ్య కేంద్రీకృతమై ఉంది బాలి ద్వీపం. ప్రపందవాసులంతా ఆనందంగా జనవరి 1, 2021 ఉత్సవాలు జరుపుకుంటుంటే, ఈ తీరవాసులు మాత్రం అందుకు విరుద్ధంగా కొంచెం బాధలో మునిగి ఉన్నారు. బాలిలో ప్రసిద్ధి చెందిన కుటా సముద్ర తీరమంతా టన్నులకొలదీ వ్యర్థాలతో నిండిపోయింది. అందువల్ల తీర ప్రాంత వాసులంతా ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను పరిశుభ్ర పరచటంలో మునిగిపోయారు. అక్కడ ఒక మహిళ అందరికీ ఆకర్షణగా నిలిచారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో మత్స్యకన్యలా వస్త్రాలు ధరించి, అక్కడే బీచ్‌లో నేలమీద పడుకుని, అందరికి బాధ్యతను గుర్తుచేస్తూ, ఆకర్షిస్తున్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఆ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. డ్రోన్ కెమెరాల ద్వారా ఈ చిత్రాలను చిత్రీకరించారు వయాన్ సుయాద్న్య అనే ఔత్సాహిక ఫొటోగ్రాఫర్. బెల్జియంకి చెందిన లౌరా అనే సముద్ర వకీలు, కుటా బీచ్ పరిస్థితులను అందరికీ అర్థమయ్యేలా ఇలా ప్లాస్టిక్ వ్యర్థాలను ధరించారు. బాలిలో ఉన్న బెల్జియం వాసి అయిన లౌరాకి ఆ సముద్ర తీరం మనసుకు బాధ కలిగించడంతో, తనే స్వయంగా ఆ ప్రాంతాన్ని శుభ్రపరచాలనుకున్నారు. చెత్తనంతటినీ ఒకచోటికి తీసుకువచ్చారు. ఆ ప్రాంతంలో తీసిన వందలకొలదీ ఫొటోలలో, మత్స్యకన్యలా ఉన్న లౌరా ఫొటోలో... ఆమె చుట్టూ ప్లాసిక్ వ్యర్థాలు టిన్నులు చిందరవందరగా పడి ఉండటం అందరిలోనూ చైతన్యం కలిగిస్తోంది. చదవండి: వాషింగ్టన్లో 15 రోజులు ఎమర్జెన్సీ -
వింత శిశువుకు నిలోఫర్‌లో చికిత్స
దూద్‌బౌలి: పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి దవాఖానాలో ఒకే కాలుతో జన్మించిన శిశువుకు నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగమణి తెలిపారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటకు చెందిన సువర్ణ అనే మహిళ ఒకే కాన్పులో ఇద్దరు ఆడ పిల్లలను ప్రసవించింది. మొదట జన్మించిన శిశువు ఆరోగ్యంగా తల్లితో ఉండగా.. ఒకే కాలుతో వింత రూపంలో పుట్టిన మరో ఆడ శిశువును నిలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ శిశువుకు నడుం పైభాగం వరకు బాగానే ఉన్నప్పటికీ.. కిందిభాగం మాత్రం ఒకే కాలుతో ఉందన్నారు. ఇలా పుట్టడాన్ని వైద్య పరిభాషలో మెరిమైడ్ సిండ్రోంగా వ్యవహరిస్తామని వైద్యులు తెలిపారు. ఇలాంటి శిశువులు చాలా అరుదుగా జన్మిస్తారన్నారు. ఈ శిశువుకు జననేంద్రియాలు లేవని, జీర్ణాశయం సరైన స్థితిలో పని చేయడం లేదని వైద్యులు తెలిపారు. -
బెంగళూరులో జలకన్య.. విస్మయం
నిత్య రద్దీగా ఉండే బెంగళూరు నగర రోడ్లపై ఇప్పుడొక వింత వాహనదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. రోడ్డుపై ఏర్పడిన చిన్నపాటి సరస్సులో జలకన్య కనిపించడం.. బెంగళూరు వాసులను విస్మయపరుస్తోంది. అదే సమయంలో.. ఆ జలకన్యను... దానిని సృష్టించిన ఆర్టిస్/ఆర్ట్ డైరెక్టర్ బాదల్ నంజుందస్వామిని బెంగళూరు వాసులు మెచ్చుకుంటున్నారు. ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు నగరంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. చాలాచోట్ల రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి.. అందులో నీరు చేరి.. చిన్నపాటి నీటి సరస్సులను తలపిస్తున్నాయి. నగరంలోని రోడ్లపై 16వేల పాఠోహోల్స్ (గుంతలు) ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. గత సెప్టెంబర్ నెలలో బెంగళూరులో ఎడతెగని వర్షాలు ముంచెత్తాయి. అక్టోబర్ నెలలోనూ వర్షాలు కొనసాగాయి. ఈ వర్షాలకు నగరం రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ఈ రహదారుల వల్ల వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వాహనదారుల కష్టాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు బాదల్ తన కళతో ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే రద్దీగా ఉండే ఎంజీ రోడ్డుకు సమీపంలో.. పరేడ్ గ్రౌండ్‌కు దగ్గరగా ఉన్న జంక్షన్లో రోడ్డుపై ఏర్పడిన గుంతలో బాదల్ శుక్రవారం ఓ చిన్నపాటి సరస్సును చిత్రించాడు. అంతేకాదు సోను గౌడ అనే మోడల్ జలకన్యగా.. ఆ చిన్నపాటి సరస్సు వద్ద తచ్చాడుతూ కనిపించింది. నిత్యం రద్దీ ట్రాఫిక్ జామ్‌లో ప్రయాణించే వాహనదారులు కొంతసేపు ఆగి.. ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. పలువురు ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. మొత్తానికి రోడ్డుపై ఉన్న ఇలాంటి చిన్నపాటి సరస్సులు, చిరు చెరువులు, గుంతలు, కంతలు వెలుగులోకి తీసుకొచ్చి.. మున్సిపల్ సిబ్బంది వాటిని పట్టించుకొని మరమ్మతు చేసేలా గత కొన్నాళ్లుగా బాదల్ తన కళతో ప్రయత్నిస్తున్నాడు. గత ఏడాది రోడ్డుపై నీటిగుంటలో మొసలి చిత్రించడం ద్వారా ఆయన మీడియా దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. రోడ్డుపై ఉన్న గుంతల్లో ఇలాంటి బొమ్మలు అనేకం చిత్రించడం ద్వారా ఈ సమస్యపై ప్రజల్లో, ప్రభుత్వ యంత్రాంగంలో అవగాహన కలిగించేలా ఆర్టిస్ట్ బాదల్ ప్రశంసనీయమైన కృషి చేస్తున్నాడు. After! #kamarajroad #potholes #nammabengaluru pic.twitter.com/e1m7QRlDJz — baadal nanjundaswamy (@baadalvirus) 13 October 2017 Before! #kamarajroad #potholes #nammabengaluru pic.twitter.com/MrgLTHuXTs — baadal nanjundaswamy (@baadalvirus) 13 October 2017 ☔ #throwback #potholes #nammabengaluru pic.twitter.com/lvTCaAPAa8 — baadal nanjundaswamy (@baadalvirus) 8 October 2017 Thankew everyone! #media #mcc #mysurumemes @DC_Mysuru @BangaloreTimes1 pic.twitter.com/N3W3DGsaGE — baadal nanjundaswamy (@baadalvirus) 4 August 2017 -
చైనాలో హాలీవుడ్ చిత్రాల హవా
బీజింగ్: హాలీవుడ్ సినిమా మార్కెట్లో అమెరికాకన్నా చైనానే ముందుకు దూసుకెళుతోంది. చైనా కొత్త సంవత్సరం సందర్భంగా ఫిబ్రవరి ఏడవ తేదీ నుంచి 14వ తేదీ వరకు చైనాలో టిక్కెట్ల అమ్మకం ద్వారా ఏకంగా 3,820 కోట్ల రూపాయలను హాలీవుడ్ సినిమాలు కొల్లగొట్టాయి. కేవలం పది సినిమాల ద్వారానే ఇంతటి వసూళ్లు వచ్చాయంటే హాలీవుడ్ సినిమాల మార్కెట్ చైనాలో ఎంతగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. 2005 నుంచి 2015 నాటికి హాలీవుడ్ సినిమాలకు చైనా మార్కెట్ 30 శాతం పెరిగిందని చైనా డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు వసూలైన కలెక్షన్లను విశ్లేషిస్తే హాలివుడ్ కామెడీ చిత్రం ‘మెర్మేడ్’ అన్నింటికన్నా ముందున్నది. ఈ సినిమా 1910 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తర్వాత స్థానాల్లో మాన్స్టర్ హంట్, ఫ్యూరియస్, ట్రాన్స్ఫార్మర్స్:ఏజ్ ఆఫ్ ఎక్సిటింక్షన్, మోజిన్: ది లాస్ట్ లెజెండ్, లాస్ట్ ఇన్ హాంకాంగ్, అవెంజర్స్:ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, గుడ్‌బై మిస్టర్ లాసర్, జురాసిక్ వరల్డ్, అవతార్ సినిమాలు ఉన్నాయి. అమెరికాలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ‘స్టార్‌వార్స్:ది ఫోర్స్ అవేకన్స్’ చిత్రం ఈ జాబితాలోకి రాకపోవడం గమనార్హం. చైనాలో హాలీవుడ్ సినిమాల హవా పెరుగుతుండడంతో చైనాకు చెందిన నటీనటులను ఎక్కువగా తీసుకునేందుకు హాలీవుడ్ నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది నటీ నటులు పలు ప్రాజెక్టులకు సంతకాలు చేశారు. అలాగే హాలీవుడ్ సినిమాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు చైనా నిర్మాతలు కూడా ముందుకొస్తున్నారు. హాలీవుడ్ సినిమాల్లో 1740 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు చైనాకు చెందిన ‘పర్ఫెక్ట్ వరల్డ్ పిక్చర్స్’ నిర్మాణ సంస్థ అమెరికాకు చెందిన ‘యూనివర్సల్ స్టూడియో’తో ఫిబ్రవరి 19వ తేదీన ఒప్పందం కుదుర్చుకుంది. చైనా ప్రేక్షకులు ఆదరించిన మొట్టమొదటి హాలీవుడ్ సినిమా హారిసన్ ఫోర్డ్, టామ్మీ లీ జోన్స్ నటించిన ‘ది ఫుజిటివ్’ చిత్రం. ఈ చిత్రం 1993లో విడుదలైంది.