
దూద్‌బౌలి: పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి దవాఖానాలో ఒకే కాలుతో జన్మించిన శిశువుకు నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగమణి తెలిపారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేటకు చెందిన సువర్ణ అనే మహిళ ఒకే కాన్పులో ఇద్దరు ఆడ పిల్లలను ప్రసవించింది. మొదట జన్మించిన శిశువు ఆరోగ్యంగా తల్లితో ఉండగా.. ఒకే కాలుతో వింత రూపంలో పుట్టిన మరో ఆడ శిశువును నిలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ శిశువుకు నడుం పైభాగం వరకు బాగానే ఉన్నప్పటికీ.. కిందిభాగం మాత్రం ఒకే కాలుతో ఉందన్నారు.
ఇలా పుట్టడాన్ని వైద్య పరిభాషలో మెరిమైడ్ సిండ్రోంగా వ్యవహరిస్తామని వైద్యులు తెలిపారు. ఇలాంటి శిశువులు చాలా అరుదుగా జన్మిస్తారన్నారు. ఈ శిశువుకు జననేంద్రియాలు లేవని, జీర్ణాశయం సరైన స్థితిలో పని చేయడం లేదని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment