ప్రపంచంలో లెక్కకుమించినంతమంది తమ ఉద్యోగాలను అయిష్టంతోనే చేస్తుంటారనే వాదన వినిపిస్తుంటుంది. అయితే వారు తమ హాబీతో ఏమైనా సాధించవచ్చని తపన పడుతుంటారు. అయినా అందుకు తగిన ప్రయత్నాలు చేయరు. కొందరు మాత్రం ఈ ప్రపంచం ఏమనుకున్నా, ఎటుపోయినా తాము అనుకున్నది చేసి చూపిస్తారు. అద్భుతాలు అందిస్తారు. ఇదే కోవలోకి వచ్చే ఒక మహిళ తన హాబీనే తన ఉద్యోగంగా మలచుకుని అత్యధికంగా సంపాదిస్తోంది. ఇందుకోసం ఆమె ఇంతవరకూ చేస్తూ వచ్చిన బోరింగ్ ఉద్యోగాన్ని విడిచిపెట్టేసింది.
మత్స్య కన్యగా మారిన మాస్ గ్రీన్
మాస్ గ్రీన్ అనే యువతి స్కూలులో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేసేది. అయితే ఇప్పుడామె ‘మత్స్య కన్య’గా మారిపోయింది. ఇది వినేందుకు వింతగా అనిపిస్తుంది. ఆమె ఒక ఫుల్‌టైమ్ ‘రియల్ లైఫ్ మత్స్య కన్య’గా మారేందుకు తన ఉద్యోగాన్ని వదిలివేసింది.యూకేలోని ‘మెట్రో’తో మాట్లాడిన ఆమె ‘మత్స్య కన్య’గా ఉండటం తనకు ఎంతో ఇష్టమైన వ్యాపకమని, తన కెరియర్ మార్చుకున్నాక ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది. డెవొన్‌కు చెందిన 33 ఏళ్ల మాస్ గ్రీన్ ఇంగ్లీషు నేర్చుకునేందుకు 2016లో సిసిలీ వెళ్లింది.
మత్స్య కన్యగానే ఎందుకు..
మీడియాతో మాట్లాడిన మాస్ తాను గతంలో ఒక సాగర తీరంలో మత్స్యకన్య మేకప్‌తో ఒక వ్యక్తిని చూశానని, అప్పటి నుంచి తనకు మత్స్యకన్యగా మారాలనే ఆలోచన తరచూ వచ్చేదని తెలిపింది. అయితే అప్పుడు తాను చూసినది ఒక ఇంద్రజాలమని, అయితే తాను నిజంగా మత్స్యకన్యగా మారిపోవాలనుకున్నానని తెలిపింది. ఇది వినేందుకు అందరికీ విచిత్రంగా అనిపిస్తుంది. కానీ దీనిని తాను చేసి చూపించానని మాస్ గర్వంగా తెలిపింది. తనను చూసేందుకు జనం విపరీతంగా రావడం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందని పేర్కొంది.
అభిరుచే ఆదాయమార్గంగా మారి..
‘రియల్ లైఫ్ మత్స్యకన్య’గా మారాక తాను నీటిలో సయ్యాటలాడున్నప్పుడు తన తోక భాగాన్ని చూసి అందరూ ఆనందిస్తారని తెలిపింది. తనకు సముద్రంలో అధిక సమయం గడపడమంటే ఎంతో ఇష్టమని మాస్ తెలిపింది. తాను సముద్రతీర సందర్శనకు వచ్చే పర్యాటకులకు పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేస్తానని పేర్కొంది. మత్స్యకన్యగా మారేందుకు తాను అధిక సమయం ఊపిరి నిలిపివుంచే శిక్షణ పొందానని తెలిపింది. తాను తనకు ఎంతో ఇష్టమైన అభిరుచిని నెరవేర్చుకోవడంతో పాటు మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నానని మాస్ గ్రీన్ ఆనందంగా తెలిపింది.
ఇది కూడా చదవండి: ఉన్నట్టుండి షాపింగ్ మాల్‌లో తుపాకీ కాల్పుల మోత.. టెక్సాస్‌లో ఏం జరిగిందంటే..
Comments
Please login to add a commentAdd a comment