
సాక్షి, హైదరాబాద్: జలమండలి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. నాలాల పూడిక తీయడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. నాలాల పూడిక తీయడంలేదని బీజేపీ కార్పొరేటర్లు జలమండలి వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మట్టి తీసుకువచ్చి జలమండలి ఎదుట వేశారు కార్పొరేటర్లు. ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్లు జలమండలి ఆఫీసులోకి దూసుకెళ్లారు. దీంతో.. కార్పొరేటర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: టీఎస్‌పీఎస్సీ చైర్మన్, కార్యదర్శిపై ఈడీ ప్రశ్నలవర్షం
Comments
Please login to add a commentAdd a comment