సాక్షి, విజయవాడ: చంద్రబాబు విద్యార్థులు, నిరుద్యోగులకు అన్యాయం చేసి.. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ధివిభాగం అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పారిపాలన వికేంద్రీకరణతోనే 13 జిల్లాల అభివృద్ధి సాధ్యమని సీఎం జగన్ ముందడుగు వేశారని ఆయన తెలిపారు. వికేంద్రీకరణ బిల్లు అడ్డుకోవడంతో చంద్రబాబు ఆంధ్ర ప్రజల ద్రోహిగా మిగిలిపోతారని అంజిరెడ్డి మండ్డిపడ్డారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో చంద్రబాబు విధానాలకు నిరసనగా ఈ నెల 30 వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు.
వైఎస్సార్ విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తే.. పెయిడ్ ఆర్టిస్టులు అన్న టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రాహ్మం చౌదరి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బాబు ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను మోసం చేస్తే.. అప్పుడు నువ్వు గాడిదలు కాసావా అని అంజిరెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని బ్రాహ్మం విద్యార్థులను మోసం చేశారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే నిరుద్యోగులకు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రెండు లక్షల ఉద్యోగ ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయని చేతకాని ప్రభుత్వం టీడీపీ అని అంజిరెడ్డి ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే రాష్ట్రం నుంచి బ్రాహ్మం చౌదరిని అతని విద్యార్ధి సంఘాన్ని వెళ్లగొడతామని అంజీరెడ్డి హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment