anjireddy
-
పక్కా ప్లాన్‌తోనే.. ఎన్ఆర్ఐ హత్య
హైదరాబాద్: సినీ నిర్మాత, ఎన్నారై అంజిరెడ్డి హత్య కేసులో ఆరుగురు నిందితులను గోపాలపురం పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పద్మారావునగర్‌కు చెందిన ఎన్ఆర్ఐ, సినీ నిర్మాత అంజిరెడ్డి విదేశాల్లో స్థిరపడేందుకు గాను పద్మారావునగర్‌లోని తన ఇంటిని విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. వాట్సాప్ గ్రూపులో వచ్చిన సమాచారంతో ఈ విషయం తెలుసుకున్న ఎస్డీ రోడ్డులోని జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ ఆ ఇంటిని కొట్టేయాలని పథకం పన్నాడు. ఇళ్లు కొనుగోలు చేస్తానని అంజిరెడ్డికి దగ్గరై అతడిని నమ్మించాడు. ఇందులో భాగంగా రూ.3.90 కోట్లకు బేరం కుదుర్చుకున్న అతను రూ.5లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. త్వరలో మిగతా మొత్తాన్ని ఇస్తానని చెబుతూ కాలం వెల్లబుచ్చాడు. అంతేగాక అంజిరెడ్డికి అంబర్‌పేట్‌లో ఉన్న మరో స్థిరాస్తిని కూడా కొనుగోలు చేస్తానని నమ్మించాడు. సెప్టెంబర్ 22న అంజిరెడ్డి దంపతులు ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. అయితే 29న రెండు ఆస్తుల లావాదేవీలు పూర్తి చేసికుందామని రాజేష్ చెప్పడంతో అంజిరెడ్డికి భార్య అమెరికా వెళ్లిపోగా ఆయన ఇక్కడే ఉండిపోయాడు. పథకం ప్రకారమే... ఇంటిని సొంతం చేసేందుకు అంజిరెడ్డిని హత్య చేయాలని నిర్ణయించుకున్న రాజేష్ అందులో భాగంగా తన వద్ద డ్రైవర్‌గా చేసే ప్రభు కుమార్, హౌస్ కీపింగ్ పనిచేసే సచ్చేంద్ర పాశ్వాన్, జయ మంగళ్ కుమార్, వివేక్‌కుమార్, రాజేష్ కుమార్‌లతో రూ.4లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకున్నాడు. గత నెల 29న సాయంత్రం అంజిరెడ్డికి ఫోన్ చేసి డబ్బు ఇస్తానని నమ్మించి ఎస్డీరోడ్డులోని డీమార్ట్ బిల్డింగ్ బేస్మెంట్–3కి రప్పించారు. అప్పటికే రూ.2 కోట్లు చెల్లించినట్లు డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకున్న రాజేష్ ఆయనను సంతకం చేయాలని బెదిరించాడు. అందుకు అంజిరెడ్డి ఒప్పుకోకపోవడంతో లిప్టులోకి తీసుకెళ్లి దాడి చేయడమేగాక ముక్కు నోరు మూసి ఊపిరి ఆడకుండా చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు మృతదేహాన్ని బేస్మెంట్లోనే పడేసి కారు ప్రమాదం జరిగిందని నమ్మించేందుకు కారును ఫిల్లర్లకు గుద్ది సీన్ క్రియేట్ చేశారు. అనంతరం మిగతా నిందితులందరూ అక్కడి నుంచి పారిపోగా రాజేష్ అంజిరెడ్డి కారు ప్రమాదంలో మృతి చెందాడని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. సీసీ కెమెరాలు..డీబీఆర్ల తొలగింపు హత్యకు ముందుకు పథకం ప్రకారం డీ మార్ట్ బిల్డింగ్ బేస్మెంట్లో ఉన్న సీసీ కెమెరాలు, డీబీఆర్‌లను తొలగించారు. వేలి ముద్రలు పడకుండా చేతులకు గ్లౌజులు వేసుకుని హత్య చేశారు. రాజేష్‌పై తుకారంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ ఉండగా ఇప్పుడు చిలకలగూడకు మార్చారు. మేడిపల్లి తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ అతడిపై కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
డాక్టర్ అంజిరెడ్డి తొలి స్మారకోపన్యాసం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) తమ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ కె. అంజిరెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా తొలి స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించింది. ఇందులో నోబెల్ బహుమతి గ్రహీత .. ఇజ్రాయెల్‌కు చెందిన ప్రొఫెసర్ అడా ఇ. యోనత్, భారత ప్రభుత్వ మాజీ ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారు కె. విజయ రాఘవన్, ఇగ్నైట్ లైఫ్ సైన్స్ ఫౌండేషన్ సీఈవో స్వామి సుబ్రమణియన్, కాంటినెంటల్ హాస్పిటల్స్ సీఎండీ గురు ఎన్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఔషధాలను చౌకగా అందుబాటులోకి తేవాలన్నది అంజి రెడ్డి విజన్ అని డాక్టర్ రెడ్డీస్ సహ చైర్మన్ జి.వి. ప్రసాద్ తెలిపారు. శాస్త్రీయ, సామాజిక అంశాలపై పెద్ద స్థాయిలో చర్చలు జరగడం అంజి రెడ్డికి నిజమైన నివాళి కాగలదని కంపెనీ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. తదుపరి తరం యాంటీబయోటిక్స్ రూపకల్పనలో తన పరిశోధనలు ఏ విధంగా తోడ్పడగలవన్నది యోనత్ ఈ సందర్భంగా వివరించారు. -
‘చంద్రబాబు ఆంధ్ర ప్రజల ద్రోహి’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు విద్యార్థులు, నిరుద్యోగులకు అన్యాయం చేసి.. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అదోగతి పాలు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ధివిభాగం అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పారిపాలన వికేంద్రీకరణతోనే 13 జిల్లాల అభివృద్ధి సాధ్యమని సీఎం జగన్ ముందడుగు వేశారని ఆయన తెలిపారు. వికేంద్రీకరణ బిల్లు అడ్డుకోవడంతో చంద్రబాబు ఆంధ్ర ప్రజల ద్రోహిగా మిగిలిపోతారని అంజిరెడ్డి మండ్డిపడ్డారు. వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో చంద్రబాబు విధానాలకు నిరసనగా ఈ నెల 30 వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు. వైఎస్సార్ విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేస్తే.. పెయిడ్ ఆర్టిస్టులు అన్న టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రాహ్మం చౌదరి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బాబు ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను మోసం చేస్తే.. అప్పుడు నువ్వు గాడిదలు కాసావా అని అంజిరెడ్డి ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని బ్రాహ్మం విద్యార్థులను మోసం చేశారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే నిరుద్యోగులకు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రెండు లక్షల ఉద్యోగ ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయని చేతకాని ప్రభుత్వం టీడీపీ అని అంజిరెడ్డి ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే రాష్ట్రం నుంచి బ్రాహ్మం చౌదరిని అతని విద్యార్ధి సంఘాన్ని వెళ్లగొడతామని అంజీరెడ్డి హెచ్చరించారు. -
మెదక్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా జగ్గారెడ్డి
-
మెదక్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా జగ్గారెడ్డి
హైదరాబాద్ : మెదక్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా తూర్పు జయప్రకాష్ రెడ్డిని ఆపార్టీ అధికారికంగా ప్రకటించింది. అంతకు ముందు అంజిరెడ్డి పేరు ఖరారు అయినట్లు వార్తలు వెలువడినా .... స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. తాజాగా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. ఈనేపథ్యంలో ఆయన బుధవారం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జగ్గారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి తెలంగాణ టీడీపీ నేతలు కూడా హాజరు కానున్నారు. గతంలో ఆయన బీజేపీలో పనిచేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ తాను మొదటి నుంచి బీజేపీ వ్యక్తినేనని, ఏబీవీపీ నుంచే క్రియాశీలక కార్యకర్తగా పనిచేసినట్లు తెలిపారు. మరోవైపు జగ్గారెడ్డి పేరు అనూహ్యంగా తెరమీదకు రావటంతో మెదక్ జిల్లాలో బీజేపీ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన ఆయనను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయటంపై నేతలు అసంతృప్తితో ఉన్నారు. -
మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా అంజిరెడ్డి
హైదరాబాద్ :మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా అంజిరెడ్డి. ఆయనకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మారికాసేపట్లో బీఫారమ్ అందచేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం అంజిరెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి బరిలో దిగుతున్నారు. కాగా మెదక్ ఉప ఎన్నికను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించి సత్తా చాటాలని భావిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులంతా ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు మెదక్‌లోనే మకాం పెట్టేలా వ్యూహం సిద్ధం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గానికో మాజీమంత్రి, మండలానికో ఎమ్మెల్యే, గ్రామానికో ప్రజా ప్రతినిధి చొప్పున పార్లమెంట్ పరిధిలో 2 వేల మందికిపైగా నేతలు పాగా వేసేలా ప్రణాళికను రూపొందించింది.