హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్‌ఎల్) తమ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ కె. అంజిరెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా తొలి స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించింది. ఇందులో నోబెల్ బహుమతి గ్రహీత .. ఇజ్రాయెల్‌కు చెందిన ప్రొఫెసర్ అడా ఇ. యోనత్, భారత ప్రభుత్వ మాజీ ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహాదారు కె. విజయ రాఘవన్, ఇగ్నైట్ లైఫ్ సైన్స్ ఫౌండేషన్ సీఈవో స్వామి సుబ్రమణియన్, కాంటినెంటల్ హాస్పిటల్స్ సీఎండీ గురు ఎన్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
ఔషధాలను చౌకగా అందుబాటులోకి తేవాలన్నది అంజి రెడ్డి విజన్ అని డాక్టర్ రెడ్డీస్ సహ చైర్మన్ జి.వి. ప్రసాద్ తెలిపారు. శాస్త్రీయ, సామాజిక అంశాలపై పెద్ద స్థాయిలో చర్చలు జరగడం అంజి రెడ్డికి నిజమైన నివాళి కాగలదని కంపెనీ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. తదుపరి తరం యాంటీబయోటిక్స్ రూపకల్పనలో తన పరిశోధనలు ఏ విధంగా తోడ్పడగలవన్నది యోనత్ ఈ సందర్భంగా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment