
మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా అంజిరెడ్డి
హైదరాబాద్ :మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా అంజిరెడ్డి. ఆయనకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మారికాసేపట్లో బీఫారమ్ అందచేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం అంజిరెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి బరిలో దిగుతున్నారు.
కాగా మెదక్ ఉప ఎన్నికను కాంగ్రెస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించి సత్తా చాటాలని భావిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులంతా ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు మెదక్‌లోనే మకాం పెట్టేలా వ్యూహం సిద్ధం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గానికో మాజీమంత్రి, మండలానికో ఎమ్మెల్యే, గ్రామానికో ప్రజా ప్రతినిధి చొప్పున పార్లమెంట్ పరిధిలో 2 వేల మందికిపైగా నేతలు పాగా వేసేలా ప్రణాళికను రూపొందించింది.