72 ఏళ్ల విద్యార్థి ఉద్యమం | Chirige Shiva Kumar Writes Story On ABVP 72 Years Journey | Sakshi
Sakshi News home page

72 ఏళ్ల విద్యార్థి ఉద్యమం

Published Thu, Jul 9 2020 1:55 AM | Last Updated on Thu, Jul 9 2020 1:56 AM

Chirige Shiva Kumar Writes Story On  ABVP 72 Years Journey - Sakshi

ఏబీవీపీ అనే నాలుగు అక్షరాలు తెలియని విద్యార్థి కళాశాల క్యాంప స్‌లో ఉండడు. 72 ఏళ్ళుగా విద్యార్థి లోకంతో మమేకమై వారి సమస్యల పరిష్కారంలో ముందుండటమే దీనికి కారణం. 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో ప్రారంభమై, నేడు దేశంలో 33 లక్షల సభ్యత్వం గల అతి పెద్ద విద్యార్థి సంఘం ఇది. 

స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలో వందేమాతర గీతాన్ని జాతీయ గీతంగా చేయాలనీ; వివిధ ప్రాంతాల భాషలను రాజ్యభాషగా, హిందీని అధికార భాషగా గుర్తిం చాలనీ; రాజ్యాంగంలో ఇండియా పేరును భారత్‌గా మార్చా లనీ ఏబీవీపీ ఉద్యమం చేసింది. విద్యార్థులపై పన్ను భారం లేని విద్యను కొనసాగించాలని డిమాండ్‌ చేసింది. కానీ ప్రభుత్వం పన్నును రెండింతలు చేయడంతో దేశం మొత్తం జరిగిన ఆందోళనలకు నేతృత్వం వహించింది. దీనితో 1966లో డి.ఎస్‌. కొఠారిని యూజీసి చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. 1968లో విద్యపై కేంద్రం ఒక విధానాన్ని ప్రకటించింది.
 
1973లో గుజరాత్‌లోని ఎల్‌.డి.ఇంజనీరింగ్‌ కాలేజీ, మోర్వి పాలిటెక్నిక్‌ కాలేజీల మెస్‌ ఉద్యమానికి ఏబీవీపీ మద్దతుగా నిలవడంతో ఉద్యమం ఉధృతమైంది. చిమన్‌భాయ్‌ పటేల్‌ సర్కారు గద్దె దిగక తప్పలేదు. గుజరాత్‌లాగే బిహార్‌లో కూడా ఉద్యమం ప్రారంభమైంది. 1974 మార్చి 19న ఉద్యమానికి నేతృత్వం వహించమని జయప్రకాశ్‌ నారాయణను కోరింది. అసెంబ్లీల ముందు ధర్నాలు, కర్ఫ్యూల నడుమ నడిచిన ఈ ఉద్యమం 1975 జూన్‌ 20న ఇందిరాగాంధి ఎమర్జెన్సీ విధిం చడంతో ప్రజా ఆందోళనగా మారింది. సుమారు 5 వేల మంది ఏబీవీపీ కార్యకర్తలను మీసా చట్టం క్రింద అరెస్టు చేసి జైళ్లలో బంధించారు. ఎమర్జెన్సీ తరువాత అనేక విద్యార్థి సంఘాలు జనతా పార్టీలో కలిసిపోయాయి. ఏబీవీపీ మాత్రం జాతీయ పునఃనిర్మాణంలో ముందుకెళ్ళాలని నిర్ణయిం చుకుంది. 

1990లో ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించి శ్రీనగర్‌ లాల్‌ చౌక్‌లో జాతీయ జెండాను కాల్చి దేశానికి సవాల్‌ విసిరి నప్పుడు, ‘చలో కాశ్మీర్‌’ కార్యక్రమంతో కార్యకర్తలను సమా యత్తం చేసింది. 10 వేల మందితో అదే లాల్‌చౌక్‌లో జాతీయ జెండాను ఎగురవేసి జాతి గౌరవాన్ని నిలిపింది. బంగ్లాదేశ్‌ చొరబాటుదారుల విషయమై 1983 నుండి ‘సేవ్‌ అస్సాం’ పేరుతో ఉద్యమాలు చేసింది. బంగ్లా సరిహద్దును మూసి వేయాలని, అక్రమ చొరబాటు దారులను వారి స్వస్థలాలకు పంపాలని 2008 డిసెంబర్‌ 17న బిహార్‌ సరిహద్దులోని చికెన్‌ నెక్‌ దగ్గర 50 వేల మందితో ఆందోళన నిర్వహించింది.

తెలంగాణలోని బీడుభూములు గోదావరి, కృష్ణా జలా లతో సస్యశ్యామలంగా మారాలని 1997లో ‘తెలంగాణ సస్యశ్యామల యాత్ర’ను బాసర నుండి శ్రీశైలం వరకు నిర్వహించింది. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని 2009లో నిజాం కాలేజీ గ్రౌండ్‌లో లక్ష మంది విద్యార్థులతో ‘విద్యార్థి రణభేరి’ మోగించింది. ‘నా రక్తం నా తెలంగాణ’ పేరుతో ఒకే రోజు 22 వేలమంది విద్యార్థి యువకులు రక్త దానం చేసి చరిత్ర సృష్టించారు. 40 దేశాలల్లో ఏబీవీపీ కార్య క్రమాలను కొనసాగిస్తున్నది. దీని ఆవిర్భావ దినోత్సవాన్ని ‘జాతీయ విద్యార్థి దినోత్సవం’గా దేశమంతటా నిర్వహిం చడం సంతోషకరం.


వ్యాసకర్త: చిరిగె శివకుమార్‌ 
ఏబీవీపీ రాష్ట్ర సహ సంఘటనా కార్యదర్శి, తెలంగాణ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement