
ఎమ్మిగనూరు టౌన్: అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేదన్న కోపంతో శ్రీ చైతన్య పాఠశాల ఉపాధ్యాయుడొకరు ఓ విద్యార్థి చేయి విరగ్గొట్టాడు. బాధిత విద్యార్థి తండ్రి కరీం, విద్యార్థి సంఘాల నాయకుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం పట్టణానికి చెందిన అబ్దుల్ కలాం అనే విద్యార్థి ఎమ్మిగనూరు లోని శ్రీ చైతన్య పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.
గురువారం తరగతి గదిలో తానడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదని విద్యార్థి అబ్దుల్‌కలాంను సైన్స్ ఉపాధ్యాయుడు జమీల్ చేయి పట్టుకుని గట్టిగా లాగాడు. దీంతో చేయి విరిగింది. అతన్ని తల్లిదండ్రులు చిన్నతుంబళం గ్రామానికి తీసుకెళ్లి నాటు వైద్యం చేయించారు. శుక్రవారం విద్యార్థి తండ్రితో పాటు విద్యార్థి సంఘాల నాయకులు వీరే‹Ùయాదవ్, ఉసేని, మహేంద్రబాబు పాఠశాల వద్దకు చేరుకుని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇందుకు కారణమైన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చికిత్సతో పాటు చదువుకయ్యే ఖర్చు భరించాలన్నారు. చివరకు చికిత్సకు అయ్యే ఖర్చు భరిస్తామని చెప్పి వారిని శాంతింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment