సురేఖను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీసులు
సాక్షి, వరంగల్: న్యాయ విద్యార్థినిపై లైంగికదాడి కేసులో అరెస్టయిన వేముల శివకుమార్‌ను శిక్షించాలని కాంగ్రెస్, బీజేపీలు డిమాండ్ చేశాయి. తన పీఏ పోక్సో కేసులో అరెస్టవ్వడానికి నైతిక బాధ్యత వహిస్తూ వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పదవికి రాజీనామా చేయాలని పట్టుబట్టాయి. శివతోపాటు ఆయన వెనుక ఉన్న అధికార పార్టీ వారికి శిక్ష పడేలా పోలీసుల దర్యాప్తు సాగాలని కోరాయి.
అత్యాచారానికి పాల్పడిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఎంజీఎం జంక్షన్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ, వరంగల్ చౌరస్తాలో బీజేపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఆందోళనకు దిగిన మాజీ మంత్రి కొండా సురేఖ, వరంగల్, హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతోపాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. మట్టెవాడ ఠాణాకు తరలించి శివకుమార్‌తో పాటు విజయ్‌కుమార్, హాస్టల్ నిర్వాహకురాలును పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment