తెలంగాణలో టెట్‌ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ | Telangana Government Gave Permission To Conduct TET Exam | Sakshi
Sakshi News home page

తెలంగాణలో టెట్‌ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

Published Thu, Mar 14 2024 7:09 PM | Last Updated on Thu, Mar 14 2024 7:33 PM

Telangana Government Gave Permission To Conduct TET Exam - Sakshi

సాక్షి,  హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు తెలంగాణ సర్కార్‌ ఆమోదం తెలిపింది. డీఎస్సీ కంటే ముందే టెట్‌ నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలో టెట్‌ నోటిఫికేషన్‌ వెవువడనుంది.  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే అవకాశం దక్కనుంది.

ఇప్పటికే తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ ప్రకటించింది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ కోటాలో 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది.

మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్‌ అసిస్టెంట్‌, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి.
చదవండి: గ్రూప్-1 దరఖాస్తు గడువు పొడిగింపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement