రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసేందుకు ఇప్పటివరకు 1.28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఈ నెల 31 వరకు దరఖాస్తుకు గడువు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసేందుకు ఇప్పటివరకు 1.28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 15 నుంచి ఫీజు చెల్లింపు, 16వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ పది రోజుల్లోనే 1,28,464 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఫీజు చెల్లించగా, గురువారం నాటికి 1,17,735 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించారు.
మరోవైపు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 31వ తేదీ వరకు ఉంది. ఈ వారం రోజుల్లో మరో 1.50 లక్షలకు పైగా దర ఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈసారి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) చివరి సంవత్సరం చదివే విద్యార్థులకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు.