
సాక్షి, అమరావతి: ఏపీలో టెట్ అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఏపీ పాఠశాల విద్యాశాఖ టెట్ దరఖాస్తు తేదీలను పొడగించింది. టెట్ షెడ్యూల్‌లో పలు మార్పులతో సోమవారం సవరించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇక, సవరించిన షెడ్యూల్ ప్రకారం.. అభ్యర్థులు ఆగస్టు మూడో తేదీ వరకు టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక, జూలై రెండో తేదీన టెట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ తాజాగా పరీక్ష తేదీల్లో కూడా మార్పులు చేసింది. పాత నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5వ తేదీ నుంచి 20వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా.. వాటిని అక్టోబర్ 3 నుంచి 20వరకు నిర్వహించాలని నిర్ణయించింది.
కాగా, టెట్ పరీక్షల కోసం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి హాట్ టికెట్స్ డౌన్ లోడ్‌కి అవకాశం ఇచ్చింది. అలాగే, అక్టోబర్ 27వ తేదీన తుది పరీక్షల తుది ‘కీ’ విడుదల కానుంది. నవంబర్ రెండో తేదీన పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి.