సాక్షి, విజయవాడ: ఏపీలో రేపటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. మార్చి 6వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. రెండు సెషన్లలో టెట్ పరీక్షల నిర్వహణ ఉంటుందని ఏపీ విద్యాశాఖ ఇదివరకే ప్రకటించింది.
పొద్దున 9గం.30. నుంచి 12గం. దాకా.. అలాగే మధ్యాహ్నాం 2గం.30ని. నుంచి సాయంత్రం 5గం. దాకా మరో సెషన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు అరగంట ముందే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. టెట్ పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఉండనుంది. మొత్తం 2,67,559 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. 120 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేయడం గమనార్హం. తెలంగాణాలో మూడు, కర్ణాటకలో నాలుగు, తమిళనాడులో రెండు, ఒడిశా రాష్ట్రంలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఈ పరీక్షల పర్యవేక్షణకు 26 మంది సీనియర్ అధికారుల్ని నియమించారు. పరీక్షా కేంద్రాల తనిఖీలకి 29 ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశారు. గర్బిణీ అభ్యర్ధులకి సమీప పరీక్షా కేంద్రాలలో హాజరయ్యే వెసులుబాటు కల్పించారు. ఇక.. విద్యాశాఖ ముందస్తుగానే రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం మార్చి 10వ తేదీన ప్రాథమిక కీ.. 14వ తేదీన తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment